Home » Dr c. ananda ramam » Aathmabali


    "వాళ్ళమ్మ కూడా ఎంతో అందంగా ఉండేది. పాపం బలవన్మరణం పొందింది."
    శోభ ఉలిక్కిపడింది. "బలవన్మరణమా?"
    "మీకు తెలియదా? ఆశ తల్లి ఆత్మహత్య చేసుకుంది."
    "ఆత్మహత్యా?"
    "అవును. ఆమె రూపమే ఆమెకు శత్రువయింది. రావు చాలా అనుమానం మనిషి. ఆమెనెప్పుడూ అనుమానిస్తూనే ఉండేవాడు. ఆ అనుమానం శృతిమించి రాగానపడి ఆమె శీలాన్ని శంకించి నిందించేసరికి ఆ అభిమానవతి ఆత్మహత్య చేసుకుంది."
    శోభ ముఖం తెల్లగా పాలిపోయింది.
    భాస్కరరావు లోలోపల పళ్ళు నూరుకొన్నాడు.
    "ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు మూర్తిగారూ!" వెటకారంగా అన్నాడు.
    "ఆవిడ నాకు కొంత దూరపు బంధువు. అసలాకారణంగానే రావు కుటుంబానికి సన్నిహితుణ్ణి నేను."
    శోభ ఏమీ మాట్లాడలేదు. సరోజిని కాఫీలతో వచ్చింది.
    "అందరూ ఇంత నిశ్శబ్దంగా ఉన్నారేం?" అంది ఆశ్చర్యంగా.
    "ఒక విషాద గాధ విన్నాం. కలవరపడుతున్నాం" నవ్వుతాలుగా అన్నాడు భాస్కరరావు.
    "ఇది 'గాధ' కాదు భాస్కరరావ్! నేను కట్టుకథలు చెప్పేవాడిని కాను. మనమందరం స్నేహితులం గనుక అన్నాను. మీరు నమ్మకండి. మీరు నమ్మాలని నేను చెప్పలేదు. ప్రసక్తి వచ్చింది గనుక చెప్పాను. అంతే!" విసురుగా వెళ్ళిపోయాడు మూర్తి.
    శిలాప్రతిమలా కూర్చున్న శోభను చూసి జాలిపడ్డాడు భాస్కరరావు.
    "శోభాదేవీ! అందరిమాటలూ నమ్మేసి మనసు పాడుచేసుకోవటం ఆరోగ్య లక్షణం కాదు. మూర్తి కారణం లేకుండా బోలెడు అబద్ధాలు చెప్పగలడని నాకు తెలుసు."
    ఆ సంగతి శోభకు తెలుసు. ఏం మాట్లాడకుండా కాఫీ త్రాగి సరోజిని దగ్గిర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.


                                      12


    తను గుమ్మంలోకి రాగానే 'టీచర్' అంటూ చేతిలో గులాబీపూలగుత్తితో ఎదురువచ్చే ఆశ కనపడకపోయేసరికి ఆశ్చర్యంతో లోపలకొచ్చింది శోభ. తల రెండు చేతులతోనూ పట్టుకొని కూర్చున్నాడు రావు.
    శోభ కంగారుగా రావును సమీపించి "ఏవిఁటండీ?" అంది.
    శోభ కంఠస్వరం విని తలెత్తాడు రావు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
    "ఆశకు జ్వరం" అన్నాడు రుద్ధ కంఠంతో. ఆశకు ఏదో చిన్న జ్వరం వచ్చినంత మాత్రాన రావు ఇంత కుమిలిపోవటం శోభ మనసును కలతపెట్టింది. ఈర్ష్యను అణచుకొని "ఎక్కడుందీ?" అంది.
    "లోపల పడుకొంది."
    శోభ ఆశగదిలోకెళ్లి నుదుటిమీద చెయ్యేసి చూసింది. జ్వరం సామాన్యంగా ఉంది. ఇంత స్వల్పమైన జ్వరానికేనా రావు అంతగా తల్లడిల్లిపోతున్నది? పైగా డాక్టర్! అతని హృదయంలో ఆశకింత స్థానమున్నప్పుడు తనెక్కడ నిలుస్తుంది?
    "చూశారు కదూ! నిన్నటినుండే అలా కళ్ళు మూసుకుపడుకుంది." బేలగా అన్నాడు రావు.
    "ఫరవాలేదండీ! జ్వరం తీవ్రంగా లేదు."
    "నీకు తెలియదు శోభా! ఈ జ్వరం సాధారణమైందికాదు. ఆశ తనతల్లికోసం బెంగ పెట్టుకున్నప్పుడల్లా వస్తుంది. సడన్ గా టెంపరేచర్ ఎక్కువయిపోతుంది. "అమ్మ" "అమ్మ" అని కలవరిస్తూ ఉంటుంది. మొదటిసారి ఈ జ్వరం వచ్చినప్పుడు నేనూ సామాన్యమైనదనే అనుకున్నాను. కాని తీవ్రంగా టెంపరేచర్ రావటం, కలవరింతలూ చూసి బెంగ జ్వరమని అర్థం చేసుకున్నాను. ఇంత లేత వయసులోనే అంత సున్నిత హృదయం ఆశది. మనోవ్యధ ఎక్కువయినకొద్దీ జ్వరం తీవ్రమయిపోతుంది. ఏ మందులూ పనిచెయ్యవు. దాని మనసును మరిపించటం ఒకటే మార్గం. క్రిందటిసారి జ్వరం వచ్చినప్పుడు ఆటబొమ్మలను చూపించీ, కథలు చెప్పీ, ఎంతో ప్రయాసమీద ఆశ మనసును తల్లినుండి మరల్చగలిగాను. కాని, మళ్ళీ రెండు నెలల్లోనే జ్వరం వచ్చింది. ఈసారి బొమ్మలూ, కథలూ పనిచెయ్యలేదు. ఈ అయాను తీసుకొచ్చి "అమ్మ పంపించింది ఆశా! నిన్ను అమ్మలాగా చూసుకోమంది అన్నాను. నా అదృష్టవశాన ఆయా కూడా చాలా మంచిది. ఆశను తల్లిలాగే బుజ్జగించింది. లాలించింది. ఆశ కోలుకుంది. తరువాత రెండు సంవత్సరాలనుంచీ ఆశకు జ్వరం రాకపోవటంతో తల్లిని మరిచిపోయిందని ఎంతో మురిసిపోయాను. కానీ మళ్ళీ వచ్చింది. ఈసారి ఆయా బుజ్జగింపులు కూడా పనిచెయ్యటం లేదు. చూడు, మందు తాగలేదు. పళ్ళరసం తాగలేదు."
    పళ్ళరసం నింపిన గ్లాసువంక చూపించాడు రావు.
    ఆశ తల్లిని మరిచిపోలేదు. కాబట్టి రావు భార్యను మరిచిపోలేడు. అతని జీవితంలో అడుగుపెట్టిన తనను కూడా ఆ స్మృతులు నీడలా వెన్నాడుతాయి. తనకు మనశ్శాంతి ఉండదు.
    "శోభా! ఆశ ఆ పళ్ళరసం తాగేలా చూడవూ? నిన్నటినుండీ ఆహారం లేదు."
    ఏం కాకుండానే ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. తన కూతురి సేవల కొరకే తనను పెళ్ళిచేసుకుంటాడా? మనసులో ఆవేశాన్ని అణచుకొంటూ, రసం గ్లాసు అందుకొని "ఆశా! పళ్ళరసం తాగమ్మా!" అంది.
    ఆశ కళ్ళు తెరిచింది. నీలంగా మెరిసే ఆ కళ్ళలో నీళ్ళు నిండుకొన్నాయి. శోభ చెయ్యి గట్టిగా పట్టుకుంది.
    "టీచర్! నాకొద్దండీ! నాకు అమ్మదగ్గరకెళ్ళిపోవాలనుంది."
    "ఆశా!" ఆవేదనగా అన్నాడు రావు.
    "తప్పమ్మా! అలా అనకూడదు!" లాలనగా అంది శోభ.
    "నాకు అమ్మ కావాలి టీచర్!"
    "రసం తాగు."
    "అమ్మ ఎందుకు రాదు? నన్నెందుకు వెళ్ళనివ్వరు? ఏ పుస్తకంలోనూ ఈ సంగతి లేదేం?"
    ఆ పసి మనసు పడే ఆవేదనకు నిర్ఘాంతపోయింది శోభ.
    రావు చేతి రుమాలుతో కళ్ళు తుడుచుకున్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra