Home » Mainanpati bhaskar » Buddijeevi

"ఇంతకీ చెప్పనేలేదేం చెల్లెమ్మా? నరసయ్య బాబాయి కూతురు ఎక్కడో పట్నవాసంలో ఉంటోంది కదా, కొంపదీసి నువ్వేనేమిటి?"
"కాదు" అంది అపురూప మెల్లిగా.
"సారీ! మేము ఎవరి తాలూకు బంధువులమూ కాము. వేరే పనిమీద వచ్చాం. వెళ్ళొస్తాం. నమస్తే!" అన్నాడు అజిత్.
"బంధువులు కాకపోతే మనుషులు కారేమిటీ? ఇది మరీ బాగుందయ్యా! పదపద!! ఊళ్ళో పెళ్ళి జరుగుతుంటే పప్పన్నం తిని నాలుగక్షింతలు వెయ్యకుండా వెళతారేమిటి? మంచివాడివే! ఉండు. బామ్మ వస్తుంది. ఆ తర్వాత అందరం కలిసి ఊళ్లోకెళదాం" అన్నాడు బ్రహ్మానందం.
నిస్సహాయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు - అజిత్, అపురూపా.
అతను చాలా చాదస్తుడిలా కనబడుతున్నాడు. పెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే తప్ప వదిలేలా లేడు. నిజం చెప్పాలంటే ఇద్దరికీ కరకరా ఆకలేస్తూంది కూడా. అందుకని వాళ్ళు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు.
అక్కడే ఒక చిన్న గుట్ట వుంది. దాని మీదకి చిన్న మట్టిరోడ్డు వుంది.
"ఆ గుట్ట కవతలే పాతూరు. మా బామ్మది ఆ ఊరే! మా బామ్మని మీరు చూశారా?"
చూడలేదని అజిత్ చెప్పిన తర్వాత మొదలెట్టాడు బ్రహ్మానందం. "అబ్బో! శతవృద్దురాలే! అయినా ఇప్పటికీ కర్రపట్టుకుని చకచక నడుస్తుంది" అంటూ కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకుని గుట్టవైపు చూశాడు.
"ఇంకా దిగబడదేం ఈమె! తను లేకపోతే పెళ్ళి పన్లన్నీ ఆగిపోతాయని తీలేదూ? భలే మనిషే!" అని విసుక్కున్నాడు.
అతను మాట పూర్తిచెయ్యకముందే ఆ గుట్ట వెనకాతల నుంచీ ఒక ఆకారం తల కనబడింది. అటునుంచీ గుట్ట ఎక్కి మట్టి రోడ్డుమీదికి వస్తోంది అది. ఏదుపంది ముళ్ళలాంటి జుట్టు! అగ్నిగోళాల లాంటి కళ్ళు! వంకరగా నవ్వుతున్నట్లున్న పెదిమలు!
మరో క్షణంలో రోడ్డు ఎక్కింది అది. దాని భుజం మీద ఒక కుర్చీ. దాన్లో స్పృహతప్పి పడిపోయి వున్న ఒక ముసలమ్మ.
అజిత్, అపురూపా వున్నచోటే స్థంభించిపోయారు.
నరహరి!
"అయ్యో! మా బామ్మ!" బ్రహ్మానందం ఆదుర్దాగా.
అజిత్ తేరుకుని లేసర్ గన్ తీశాడు. ఆ బామ్మగారికి తగలకుండా నరహరిని కాల్చాలి. గురి చూస్తున్నాడు.
"నరహరీ ఏమయింది బామ్మకి?" అంటూ నరహరి వైపు గబగబ వెళ్ళాడు బ్రహ్మానందం.
అది చూస్తూ దిగ్భ్రమ చెందారు అపురూపా, అజిత్.
బ్రహ్మానందానికి నరహరి ముందే తెలుసా? అయినా దాన్ని చూసి అతను కొంచెం కూడా భయపడుతున్నట్లే లేదే!
చిత్రంగా ఉంది ఇది!
"బ్రహ్మానందం గారూ! ఆగండి!" అన్నాడు అజిత్.
"ఆ నరహరి అతి ప్రమాదకరమైన మరమనిషి! దాని దగ్గరికి వెళ్ళకండి" అంది అపురూప గాభరాగా.
అప్పటికే అజిత్ బ్రహ్మానందాన్ని దాటేసి నరహరి ముందుకి వెళ్ళి నిలుచున్నాడు. అతని చేతిలోని లేసర్ గన్ సూటిగా నరహరి కనుబొమల మధ్యకు గురిచేసి ఉంది.
"మళ్ళీ మీరేనా?" అంది నరహరి బొంగురు గొంతుతో, అంటూ భుజం మీద మోస్తున్న కుర్చీని కిందికి దింపింది. దాన్లో కూర్చున్న బామ్మగారు ఇంకా స్పృహలోకి రాలేదు.
ఆమెని కిందికి దింపగానే నరహరిమీదికి దూకాడు అజిత్. దాని కాలికి మెలిక వేసి, కింద పడేశాడు. గుట్టమీద నుంచి కిందకి దొర్లడం మొదలెట్టారు ఇద్దరూ.
"అయ్యో! అయ్యో! అదేమిటయ్యా బాబూ! మా నరహరి మీకేం అపకారం చేశాడు? వదులు తనని! వదలమంటుంటే!" అని కేకలేశాడు బ్రహ్మానందం.
ఈ లోపల కుర్చీలో కూర్చున్న బామ్మగారు కూడా మెల్లిగా కళ్ళు తెరిచింది. కళ్ళపైన చెయ్యి పెట్టుకుని అక్కడ జరుగుతున్న కలకలం గమనించి కోపంగా అరిచింది. "ఎవరదీ మా నరహరితో కలయబడేదీ? ఏమన్నా బుద్ధుందా లేదా? అమాయకుణ్ణి పట్టుకుని అలా వేధిస్తావుటయ్యా! లేలే! లే ముందు!"
"మా నరహరిని వదులు! వదుల్తావా వదలవా?" అని అజిత్ కి అడ్డం వెళ్ళాడు బ్రహ్మానందం.
అయోమయంగా చూస్తూ నరహరిని వదిలేశాడు అజిత్. అతను నరహరిని వదిలి పెట్టెయ్యగానే అది తన మీదకు వస్తుందేమోనని భయపడినట్లు ఒక్క అడుగు వెనక్కి వేసింది అపురూప.
ఏమిటిది? ప్రపంచాన్నంతా గడగడ లాడించేస్తున్న ఈ రాబొట్ ని చూసి వీళ్ళు భయపడిపోకుండా పైపెచ్చు దాన్ని వెనకేసుకొస్తారేమిటి?
"ఏమిటయ్యా, అసలేమిటి నీ ఉద్దేశ్యం? మా నరహరి మీద కలబడతావా? అతను నీకేం ద్రోహం చేశాడూ?" అన్నాడు బ్రహ్మానందం కోపంగా.
"నరహరి మనిషి కాడు! అదొక దుష్టశక్తి! రాబొట్!" అంది అపురూప ఆవేశంగా.
నరహరి నిదానంగా తలెత్తి చూశాడు ఆమెవైపు.
"నేను రాబొట్ ని కాను, మనిషినే!" అన్నాడు కర్ణకఠోరంగా అతి బాధాకరంగా వస్తున్నాయి అతని మాటలు.
సందేహంగా చూస్తూ, లేసర్ గన్ ని జేబులో పెట్టేసుకున్నాడు అజిత్. నమ్మనట్లు చూస్తూ ఉండిపోయింది అపురూప.
నరహరి విషాదంగా నవ్వాడు. నవ్వుతుంటే ఒక పక్కకు తోసుకుపోయాయి పెదవులు, గురకలాంటి శ్వాస.
"ఎవరికీ తెలియకుండా ఈ మారుమూల గ్రామంలో నిశ్చింతగా జీవితం గడిపేద్దామనుకున్నాను. కానీ కుదరటం లేదు" అన్నాడు నరహరి విచారంగా.
అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అతనివైపు.
"నా అసలు పేరు మోహన్" అని మొదలెట్టాడు నరహరి. "ఏం? వినగానే నవ్వొస్తోందా - ఇంత వికృతమైన మొహానికి మోహన్ అన్న పెరేమిటా అని? నేనూ ఒకప్పుడు చాలా అందంగానే ఉండేవాణ్ని ఇదిగో? ఈ కుర్రాడంత హాండ్సమ్ గా ఉండేవాణ్ణి నేను చనిపోకముందు!"
"చనిపోకముందా!"
అందరూ అపనమ్మకంగా చూశారు అతన్ని.
"అవును! నేను మూడు గంటలసేపు చనిపోయి, మళ్ళీ బతికిన వాడిని" అని రెట్టించాడు నరహరి.
"ఏం నరహరీ, పరాచకాలాడుతున్నావా? అవతల పెళ్ళి పనులు ఉంటే?" అన్నాడు బ్రహ్మానందం విసుగ్గా.
"కాదు బ్రహ్మానందం! నిజమే చెబుతున్నాను" అని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు నరహరి. "నేను అమెరికాలో సెటిలయిపోయి హోటల్ వ్యాపారంలో బాగా డబ్బు గడించాను - ఒకప్పుడు! బ్రహ్మాండమైన హోటలూ, కాసినో కట్టాను.
"అప్పుడొకరోజున - ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది హోటల్లో. వందమంది మంటల్లో కాలి చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళలో నేనూ ఉన్నాను. నిజంగానే!
"అదే రోజున నా హోటల్లో ఒక సైన్సు కాన్ఫరెన్సు జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సైంటిస్టులెందరో వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో ఇద్దరు ప్లాస్టిక్ సర్జెన్లూ, ఒక హార్టు స్పెషలిస్టూ, ఒక బ్రెయిన్ సర్జెనూ, ఒక జనరల్ ఫిజీషియనూ, ఒక రాబొటిక్స్ స్పెషలిస్టూ ఉన్నారు. ఈ అరడజను మందీ పగలంతా సీరియస్ డిస్కషన్సులో మునిగిపోయి, రాత్రయ్యాక కాసినోలో కూర్చుని కాసేపు సరదాగా కాలక్షేపం చేశారు. వాళ్ళందరికీ సకల మర్యాదలూ చేశాను ఆ రాత్రి. ఆ తెల్లవారుఝామునే అగ్నిప్రమాదం జరిగింది. ప్రాణాలకు తెగించి, ఆ ఆరుమందినీ కాపాడగలిగాను నేను. కానీ నేను మాత్రం మంటల్లో ఇరుక్కుని చనిపోయాను.
"అప్పుడు మొదలయింది అసలు డ్రామా! తమని రక్షించడం కోసం నేను మరణించడంతో ఆ ఫేమస్ డాక్టర్లు భరించలేకపోయారు. వెంటనే రంగంలోకి దూకారు. హృదయస్పందనా, శ్వాసా ఆగిపోయినంత మాత్రాన మరణం సంభవించినట్లు కాదనీ, మెదడులోని చివరికణం చనిపోయేవరకూ ఆ వ్యక్తి మరణించినట్లు భావించకూడదనీ ఇప్పుడు చావుకి కొత్త నిర్వచనం కదా! వెంటనే కృత్రిమంగా ఉచ్చ్వాసనిశ్వాసాలు జరిపే యంత్రాన్ని నాకు కనెక్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ హార్ట్ ని కనెక్ట్ చేశారు.
"ఆ తర్వాత అపూర్వమైన ప్రయోగం మొదలయింది. కరిగిపోయిన నా కనుపాపల స్థానంలో ప్లాస్టిక్ కనుపాపలు పెట్టారు. విరిగిపోయిన రొమ్ము ఎముకలకి బదులుగా లోహపు ఎముకలు పెట్టారు. ఒక చనిపోయిన మనిషి తాలూకు కాళ్ళూ, మరొక మనిషి చేతులూ, మరో స్త్రీ తాలూకు గుండె నాకు అమర్చారు. జుట్టు ఫైబర్ గ్లాస్ ది. కాలిపోయిన చర్మం స్థానే ఒక మనిషి చర్మం కాస్త తీసి, అది నామీద అంటు కట్టి పెంచారు.
ఆపరేషన్ సమయంలో మెదడుకి సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల నా మెదడులో ఒక ముఖ్యమైన భాగం 'మెడుల్లా అబ్లాంగేటా' దెబ్బ తినిపోయింది. అప్పుడు రాబొటిక్స్ స్పెషలిస్టు డాక్టర్ సంజీవ్ ఆ మెడుల్లా అబ్లాంగేటా స్థానంలో చిన్న మైక్రో కంప్యూటర్ అమర్చారు.
"అద్భుతంగా నేను తిరిగి బతికాను! గుర్తు పెట్టుకోండి! కేవలం ఏ గుండెనో, మూత్రపిండాలో దెబ్బతింటే వేరొక దాతని తీసుకొచ్చి ట్రాన్స్ ప్లాంట్ చెయ్యటం కాదిది! చర్మం, జుట్టుతో సహా కాలిపోయిన నన్ను బతికించి, కొన్ని మానవ శరీరభాగాలతో, కొన్ని లోహపు భాగాలతో, కొంత ప్లాస్టిక్ తో, మరికొంత ఫైబర్ గ్లాస్ తో రిపేరు చేసి, మెదడులోని ఒక భాగానికి బదులుగా మైక్రో కంప్యూటర్ పెట్టి నాకు పునర్జన్మ ఇచ్చారు. అంతగా పెరిగిపోయింది సైన్సు!
"నా కళ్ళు నబూకా అనే నీగ్రోవి. నా గుండె రజియా అనే స్త్రీది. నా చేతులు హారిసన్ అనే వ్యక్తివి. నా శరీరంలోని కొన్ని గ్రంథులు రింకూ అనే చింపాంజీవి. వీళ్ళ పేర్లలోని మొదటి అక్షరాలు కలిపి 'నరహరి' అని సరదాగా పిలిచేవాళ్ళు ఆ డాక్టర్లు నన్ను. 'నబూకా, రజియా, హారిసన్, రింకూ - న. ర. హ. రి.'
"వీళ్ళందరూ నిజానికి చనిపోయినవాళ్ళే అయినా, నా ద్వారా వాళ్ళింకా బతుకుతూనే ఉన్నట్లు లెఖ్ఖ! కానీ నేను? నేను అసలు నేనేనా? చనిపోయిన మోహన్ తాలూకు శరీరమే ఇది అని ధైర్యంగా ఎలా చెప్పగలను - నేను ఇంత గుర్తుపట్టలేనంతగా మారిపోయాక? ఇప్పుడు నా శరీరంలో కొంత భాగం నీగ్రో. కొంత భాగం ముస్లిం. కొంత భాగం అమెరికన్ క్రిస్టియన్. కొంత భాగం జంతువు. కొంత భాగం మెషిను!

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra