ఈ రెండు నెలల్లో తనకూ, బ్రహ్మానందానికీ మధ్య ఎంతో చనువు వ్యాపించింది. కాని ఇది ఎలాంటి చనువు? ఇందులో వాత్సల్యం, మమకారం ఏమీలేవు. ఛాయామాత్రంగా వున్నాయనుకున్నా అది సమర్ధన. ఇద్దరూ ఒకరిమీద ఒకరు ఎంత స్వాతంత్ర్యమైనా సంపాదించారు. కాని వెలితి ఏదో వుంది. త్రాగిన మైకంలో నిన్న తనను "ఒరేయ్!" అని కూడా సంభోదించాడు. అది తాను పట్టించుకోలేదుకూడా. అందులో ఏమీ ఆశ్చర్యమూ లేదు.  

 

    తాను కాలేజీకి సరిగ్గా వెళ్ళటంలేదు. దానికి ఎక్కువ చింతించటం లేదుకూడా. పుస్తకం పట్టుకుని ఎన్నో రోజులయింది. అది సరే... వీటన్నిటి మధ్య ఇంటికి పోవాలంటే సంకుచితంగా, సమస్యగావుంది.  

 

    అతను కాఫీతాగి ఇంటికి వస్తూంటే ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ఎదురుగా వచ్చారు. వాళ్ళు తనవంక కళ్ళార్పకుండా చూపులు వెదజల్లుతుండేసరికి, సిగ్గుపడి, ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు. ఎంత అందంగా వున్నారు ఆ అమ్మాయిలు! ఎందుకలా తనకేసి కళ్ళు నిల్పి చూశారు? తాను ఓ అమ్మాయి ప్రక్కన నడిచిపోయే దృశ్యాన్ని ఊహించుకున్నాడు. అది ఓ అదృష్టంలాంటిది. సాయిబుగారి కుమార్తె ఇంతకన్న చక్కగా, తళతళలాడుతూ వుంది. కాని ఆమె... అతనికి అసహ్యం కలగలేదు. అందమైనవాళ్ళు ఏంచేసినా సౌందర్యమయంగా వుంటుందా?     

 

    రాత్రి తనకి స్మృతి తప్పలేదు. తెలివితక్కువ మాటలూ మాట్లాడలేదు. నిద్రయితే చాలాసేపుపోయాడు. బ్రహ్మానందం తెలివితప్పాడు. ఏదో అసందర్భంగా, వెకిలిగా మాట్లాడాడు. ఇప్పుడతని ముఖంలో పరిపూర్ణమైన నిద్ర అనుభవించిన కాంతి తాండవమాడుతోంది.

 

    చక్రపాణి గదికి వచ్చాడు. స్నేహితుడు ఇంకా నిద్రలేవలేదు. కిటికీలోంచి పోస్టుమేన్ విసిరేసి వెళ్ళాడుగావును - నేలమీద ఓ కవరు పడివుంది. అతను దాన్ని తీశాడు. రాజారావు దస్తూరీ, అతని చేతులు వణికాయి. రాజారావు తనముందు నిలిచి నిందాగర్భితంగా, నిర్దయగా చూస్తున్నట్లు తోచింది. చేయెత్తి తర్జనతో బెదిరిస్తున్నట్లు అనుభూతిపొందాడు... కవరు బరువుగా, నిండుగా వుంది. ఏంరాశాడు అందులో? తన సమాచారమంతా దివ్యదృష్టితో కనిపెట్టాడా? చివరకు ఎలాగో కవరు చింపాడు.  

 

    "ప్రియపాణీ!"

 

    నీకు ఈ ఉత్తరం ఎప్పుడు వ్రాద్దామా అని చాలా ఉత్సాహంగా వుంది. నా ఈ ఉత్సాహానికి కారణంలేదు. నా భావాలను, భారాలను ఇతరులమీద పడవెయ్యాలనే మనస్తత్వంగల మనిషినిగాను నేను. ఇది ఓ అవ్యాజమైన ప్రేమ! నీకు ఉత్తరం వ్రాస్తుంటే నా ప్రేయసికి రాస్తున్నంత సరదాగా వుంటుంది నాకు. అయినా చూడు, ఏదో ఇబ్బందులవల్ల చాలా రోజులు గడిచిపోయాయి.  

 

    నువ్వు ఊహించలేవు నేను కాలేజీ ఎన్నికలలో నిలబడతానని. కాని నిలబడక తప్పలేదు. అదో కథ. ప్రపంచంలోని రాజకీయాలన్నీ కళాశాల వాతావరణంలోనే వుంటాయన్న సత్యాన్ని నేను గుర్తించాను. వెయ్యి, రెండువేల జనాభాగల కళాశాలల్లోని పదవులకే విద్యార్థులు ఇంత స్వార్థపరులు అవుతున్నప్పుడు ఈ విశాల పృథ్విలో అధికారాలకు ఇంత ప్రాకులాడుతున్నారంటే అందులో తప్పులేదు ఆశ్చర్యమూ లేదు. అసలు వాటికి పునాదికూడా ఇక్కడేనేమో. నేను యూనియన్ ప్రెసిడెంటు పోటీకి నిలబడ్డాను. నన్ను పడగొట్టటానికి నా ప్రత్యర్థి నా మీద సామదాన దండోపాయల్ని ఉపయోగించాడు. నేనూ ఏమీ తక్కువ తినలేదనుకో. అవన్నీ చెపితే నీకు నేనంటే ఏవగింపు కలగొచ్చు. కాని ఎన్నికల సమాచారం వచ్చేసరికి మనిషి తప్పొప్పులు, యుక్తాయుక్త జ్ఞానం మరచిపోతాడు. అది ఓ ఆనందకరమైన ఘట్టంలే. కాని స్టాఫ్ లోనూ, విద్యార్థుల్లోనూ, ఇంకా అమ్మాయిల్లోనూ పలుకుబడి సంపాదించుకోవడానికి ఇది మంచి ఛాన్సు. సౌదామిని అని ఓ గడుగ్గాయి పిల్ల ఇంటర్మీడియట్ లో కొత్తగా చేరింది. చక్కగా మాట్లాడుతుందిలే. నేను ప్రాపగాండాకోసం లేడీస్ దగ్గరకు వెళ్ళేసరికి పిడుగుల వర్షం కురిపించింది. ఎన్నో విషయాల గురించి, జటిల సమస్యలను గురించి ప్రశ్నలు కుమ్మరించింది. నాకు తెలియని విషయాలను గురించి తెలిసినట్లుగా ఆకర్షణగా బుకాయిస్తానని నీకు తెలుసుగా! మొత్తంమీద ముచ్చటగానే జవాబులు ఇచ్చానని తోటివిద్యార్థులు చెప్పారు. కాని అమ్మాయిలతో మాట్లాడటం ఎప్పటికప్పుడు కష్టమైన పనేరా బ్రదర్స్! అంతా స్ట్రెయిన్. మా ప్రత్యర్థి పాపం అక్కడే పప్పులో కాలేశాడు. ఆమె ఇంగ్లీషులో ప్రశ్నలు వేస్తుంటే మనవాడు తెలుగులో మొదలుపెట్టాడు. అతని జవాబులు చూసి ఆడపిల్లలు నవ్వు నాపుకోలేకపోయారు. చివరకు పర్యవసానం యేమిటంటే, ఆమె నా తరపున పూనుకుని ఆడపిల్లల్లో బలే ప్రచారం చేసింది. మరి వాళ్ళ ఓట్లన్నీ నావే.

 

    బాప్ రే! ఎన్ని గొడవలురా! ఒకటి రెండు దెబ్బలాటలుకూడా జరిగాయి. ఓ మనిషి తత్వం ఎలా ఎప్పుడు మారిపోతుందో చెప్పలేం. ఎవడు నిజం మాట్లాడుతున్నాడో తెలియదు. కాలేజీ అంతా ముఠాలు, కుట్రలు పెరిగిపోయినాయి. మాటలు తూచి వాడకపోతే ప్రమాదం వాటిల్లే పరిస్థితి వచ్చింది. చివరకు పోలింగురోజు వచ్చింది. మా గ్రూప్ వాళ్ళు, వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఇటు ఒకటి, అటు ఒకటి మైక్రోఫోన్లు పెట్టారు. ఇహ వాటిలోంచి గొంతులు చించుకుని అరవటం, పదాల్లో వాటిల్లో భావాలు. ఉన్నట్లుండి మా ప్రత్యర్థి అయిదు టాక్సీలు తెప్పించాడు. కుర్రాళ్ళందరినీ ఊళ్ళోనుంచి ట్రిప్పులమీద కాలేజీకి చేరవెయ్యడం మొదలుపెట్టారు. దాంతో మా బృందంవాళ్ళకు గుండెలు బేజారైపోయినాయి. చేతులు ఎత్తామనుకున్నారు. చెప్పొద్దూ, నాక్కూడా భయంవేసింది. ఇంతలో దేవతలా సౌదామిని వచ్చి అడ్డుకొంది. ఆమె చాలా స్పోర్టివ్ గరల్. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ ఆఫీసు వ్యాన్ తెప్పించింది. అది చాలా పెద్దది. అందులో తడవకి చాలామంది ఎక్కవచ్చు. ఇహ కాంపిటీషన్ రగుల్కుంది. ఇరుబృందాలవాళ్ళు ఉత్తేజితులైనారు. సవాళ్ళు చేసుకున్నారు. సౌదామినికూడా తిరిగి తిరిగి అలసిపోయింది. పాపం! ఆమెకు అప్పుడప్పుడు ఫిట్సు వస్తుంటాయట. సరిగ్గా ఒక అరగంటలో పోలింగ్ ముగుస్తుందనగా ఫిట్స్ వచ్చి పడిపోయింది. మితిలేని బాధతో ఆమెకు ఉపచారాలు చేశాను. ఆమె తేరుకున్నాక "నువ్వు ఇంటికి వెళ్ళిపో సౌదామినీ! చాలా హైరానపడ్డావ్" అన్నాను. ఆమె తేలిగ్గా నవ్వి "నా ఓటు వెయ్యకుండానా? నా ఓటు వెయ్యకపోతే నువ్వు గెలవవు అన్నాయ్!" అంది. ఎంత చెప్పినా వినిపించుకోక వెళ్ళి అలాగే ఓటువేసి వచ్చింది.నే గెలిచాను పాణీ! తేడా ఎంతో తెలుసా? ఒక ఓటు మెజారిటీ. నా  ఓటు స్పోర్టివ్ గా వుండటంకోసం మనం అవతలివాడికే వేద్దామా అని అనుకోకపోలేదు ముందు. కాని నాలో స్వార్థం పనిచేసి నా ఓటు నాకే వేసుకున్నాను. ఈ రహస్యం ఎవరికీ తెలియదనుకో. సౌదామినిదీ నాదీ పడకుండావుంటే నేను అవమానం భరించలేక నిన్ను వెతుక్కుంటూ హైద్రాబాద్ పరుగెత్తుకుంటూ రావలసి వచ్చేది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra