Home » Kommuri venugopala rao » వ్యక్తిత్వం లేని మనిషి


    మృత్యుంజయరావు అతని మాటల్ని విననట్లు, యీ వ్యవహారంలో తనకేమీ ఆసక్తిలేనట్లు నటించాడు. కాని ఆ సమయంలో అతనికి శేఖరం వ్యక్తిత్వంమీద అపారమైన గౌరవం కలిగింది. అతనికి అన్ని దుర్వ్యసనాలూ వున్నాయి. దానికితోడు ఆమె అతన్ని ఆహ్వానించింది. అయినా కొన్ని సందర్భాలలో అతనెంత స్థిరచిత్తుడు! వ్యభిచారిణులతో గడపటం అతనికిష్టంలేదు. కాబట్టి ఎంతో తేలిగ్గా యీ స్వాగతపత్రాన్ని చించిపారేశాడు. అలా తనకి ఓ ఆడదాన్ని తిరస్కరించాలనిపించింది.
    ఇద్దరూ బయటకు వచ్చి రిక్షా ఎక్కారు. శేఖరం మధ్యదారిలో హోటల్ దగ్గర దిగిపోయాడు.
    మృత్యుంజయరావు యింటికి వచ్చి గదితలుపులు తెరిచి లోపలకు ప్రవేశిస్తూంటే యేదో మృత్యుకూపంలోకి పోతున్నట్లు అనుభూతి పొందాడు. లైటు వెలిగించాడు. తన గది ఓ మృత్యుకూపం, తను ఓ మరణించే మనిషి, లేదా మరణిస్తూన్న మనిషి, లేకపోతే రోగపీడితుడు.
    పనిమనిషి క్యారియర్ వసారాలో పెట్టిపోయింది. అది లోపలకు తెచ్చుకుని కాళ్ళూ, చేతులూ కడుక్కుందామని చుట్టూ తిరిగి, పెరట్లోకి వెళ్ళాడు. ఇంటివాళ్ళింకా రాలేదు. చీకట్లో చెట్లు జీభూతాల్లా నిలబడి, చిరుగాలికి అటూ యిటూ కదుల్తున్నాయి. చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం. ఇంత యింటికి తను ఒక్కడు వున్నాడన్న సంగతి స్ఫురించేసరికి భయంతో అతనివళ్ళు ఝల్లుమంది. కదిలే చెట్లు మరింత భయంకరంగా కనిపించాయి. ఆకాశంలో ఒక్కనక్షత్రంకూడా మినుకు మినుకుమనటంలేదు. మేఘాలు క్రమ్మేసి చీకటి ముసుగును మరింత గట్టిగా బిగించినట్లుంది. గబగబా బావిదగ్గర కాళ్ళు కడుక్కుని ఒక్కవుదుటున గదిలోకి వచ్చిపడ్డాడు. క్యారియర్ విప్పి నాలుగు మెతుకులు తిన్నాడు గాని, అన్నం సయించలేదు. దిగులుగా, బాధగా, తపనగా వుంది. జ్వరం వచ్చినట్లుగా వుంది. దీపం ఆర్పేసి మంచంమీద పడుకున్నాడు. తనంటే జాలేసింది, తనంటే అసహ్యమేసింది. తన మంచాన్నీ, దుప్పటినీ, అక్కడున్న ప్రతివస్తువునూ చీదరించుకున్నాడు. అతన్నేదో దహిస్తోందా రోజు. ఇంద్రియాలన్నీ ఏకమై అతన్ని చిత్తుచేశాయి. వర్షంలో తడుస్తూ తమయింటికి వచ్చిన స్త్రీని తలుచుకున్నాడు. ఒక్కసారికాదు. వందసార్లు, లక్షసార్లు. ఆమె అర్ధంలేకుండా అతనికి గుర్తొస్తోంది, ఏడిపిస్తోంది. తర్వాత సినిమాహల్లో కలిసిన మంజులత అతని దృష్టిపథంలో ప్రవేశించింది. పిచ్చెక్కిస్తోంది. ఆమెను రకరకాలుగా ఊహించుకుంటున్నాడు. ఆమెను మంచంమీద పడుకోపెట్టు కున్నాడు. గట్టిగా కౌగలించుకున్నాడు. ఊపిరాడకుండా పెదాలు చుంబించాడు. తన యినుపకౌగిలిలో ఆమె నలిగిపోతోంది. బరువుగా వస్తోన్నయ్ ఉచ్చ్వాస నిశ్వాసాలు.
    ఒకసారి కాదు, వెయ్యిసార్లుకాదు, లక్షసార్లు ఆమె ఎదురుగా మెదుల్తోంది. నరాలు తోడేస్తున్నాయి. రక్తం వేడెక్కి ఝరీవేగంతో రయ్యిమని ప్రవహిస్తోంది. గిచ్చుకున్నాడు, జుట్టు పీక్కున్నాడు, కాళ్ళు మంచంకేసి బాదుకున్నాడు. పిచ్చివాడిలా అటూ యిటూ దొర్లాడు, బలవంతంగా నిద్రపోదామని ప్రయత్నించాడు. ఆనాడు సంపూర్ణ వ్యక్తిత్వంతో సెక్సు బాధననుభవిస్తున్నాడు. లేచాడు, అటూ యిటూ లైటు వెలిగించి అద్దంలో ముఖం చూసుకున్నాడు. కళ్ళు ఎరుపెక్కి, కైపుగా, ముఖం జేవురించి నిషాగా వున్నాడు. ఇహ లాభంలేదు. ఇవాళ ఏదో ఒకటి చేయాలి. అతన్లో పాతికేళ్ళయవ్వనం పడాలుమని బ్రద్ధలయింది. గదితలుపు తాళంపెట్టి వీధినపడ్డాడు.
    ఒక రిక్షా ఎదురయింది కొంతదూరం పోయాక. చుట్టుప్రక్కల ఎవరూలేరు. "ఏయ్ గాడీ" అని పిలిచాడు గట్టిగా. అతని ధైర్యానికి అతనికే ఆశ్చర్యంగా వుంది.
    చీకట్లో రిక్షా దగ్గరగా వచ్చి ఆగింది. వీధిదీపానికి దూరంగా నిలబడి వున్నందుకు తన తెలివికి అభినందించుకున్నాడు.
    "వస్తావా?" అన్నాడు.
    రిక్షావాడు కొంచెం వయసు మళ్ళినవాడు. "ఎక్కడికి బాబూ?" అని అడిగాడు.
    వెంటనే అతని గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. "ఎక్కడికీ?" ఆలోచిస్తున్నాడు.
    "ఎక్కడికి బాబూ?" అన్నాడు మళ్ళీ రిక్షావాడు.
    అడగవచ్చా? అడగకూడదా? వీడు ఎలాంటివాడో? తనప్రశ్న విని నిద్రపోయేవాళ్ళు లేచేటట్లు గట్టిగా కేకలు పెడితే?
    అతనెంతసేపటికీ మాట్లాడకపోయేసరికి రిక్షావాడే సూచనచేస్తూ అడిగాడు "పాపదగ్గరకు తీసుకుపొమ్మంటారా సార్?"
    వాడలా అనగానే అతనికి బలం కూడదీసుకున్నట్లయింది. "తీసుకెడతావా?" అన్నాడు ఉత్సాహంగా.
    వెంటనే రిక్షావాడు అనేక పేర్లూ, పేటలూ ఏకరువు పెట్టాడు. కాని అందులో తనకు కావలసిన పేరు వినిపించకపోయేసరికి "మజులత తెలుసా నీకు?" అని అడిగాడు.
    "మంజులతా? తెలియకేం బాబూ! ఎప్పుడూ సినిమాలచుట్టూ తిరుగుతూండే ఎర్రటిపిల్ల. పొడుగ్గా, సన్నగా వుండి కోలమొహంతో బలే బాగుంటుంది. బాబుగారి కన్ను దానిమీద పడిందేమిటి? స్టూడెంటు కుర్రాళ్ళంతా దానికోసం పడిచస్తారు. ఎక్కండి తీసుకుపోతాను."
    "నేను రావాలంటావా?" అన్నాడు మృత్యుంజయరావు నీళ్ళు నముల్తూ.
    "అదేంటిబాబూ, మీరు రాకపోతే ఎలాగ? మీరు మాట్లాడొద్దా? బేరవాడుకోవద్దా?"
    "బేరం నువ్వే ఆడేద్దూ, ఎంతయినా ఫర్వాలేదు. మాయిల్లు చూపిస్తాను. తీసుకొచ్చెయ్యి.'
    "అబ్బే, అలావద్దుబాబూ! ప్యాసింజరు రాకుండా ఆ గుంటెక్కడికీ బయలుదేరదు. అయినా ఏ మనిషికి కావాలో, తెలీకుండా వస్తుందేటి? మీరెక్కండి సార్. భయంలేదు. అయిదునిముషాల్లో తీసుకెడతాను. నేను ప్రక్కనుంటాను" అన్నాడు భరోసా యిస్తూ.
    మృత్యుంజయరావు కళ్ళముందు మబ్బుతెరలు క్రమ్మినట్లయింది. "మనిషిని చూడటం, ఆమెకు నచ్చటం యీ తతంగమంతా వుందేమిటి?" అన్నాడు అనుమానంగా.
    "మరి చూడకపోతే ఎలాగసార్? నాలాటి ఏ లేబరేడో కబురుచేసి తెప్పించుకుని దాన్ని పిప్పిచేసి వొదిలిపెడితే? ఎవరు తీసుకురమ్మన్నారో దాఖలా ఏంటి? దానికి మట్టుకు ప్యాసింజరు నచ్చొద్దా? మీరు కూచోండిబాబూ! రయ్యిమని తీసుకుపోతాను. మళ్ళా దాన్నెక్కించుకుని ఝయ్యిమని వచ్చేద్దాం."
    రిక్షావాడు ఎంత ప్రోత్సాహమిస్తున్నా అతని గుండెల్లో పడ్డ రాయి కదలటం లేదు. డబ్బిచ్చి కొనుక్కునేచోటకూడా తను ఓ పరీక్ష నెదుర్కోవాలి. అందులో నెగ్గాలి. 'నువ్వు నాకు నచ్చలేదు' అని ఆమె అంటే?
    అతను తటపటాయించటం చూసి రిక్షావాడు "ఎక్కండి సార్, తొరగా ఎక్స్ ప్రెస్ లా వెళ్ళిపోదాం" అంటూ హడావుడి చేస్తున్నాడు.
    అసలు విషయం ఎలావున్నా వీడిముందు చిన్నతనంకాకుండా వుండటానికి తను వెళ్ళక తప్పదని గ్రహించి, ఇహ సంకోచాన్ని పారద్రోలి రిక్షా ఎక్కి కూర్చున్నాడు. బండి కదిలింది.
    "నేను చేసేపని అవసరమేనా?" అని ప్రశ్నించుకున్నాడు దారిలో.
    "అవసరం లేనట్లు కనిపిస్తుంది" అనిపించింది.
    "మరి ఎందుకు చేస్తున్నాను?"
    అతనికి తెలీదు.
    "మరి యిందాక అంత బాధపడ్డావుగా?"
    అదీ నిజమే.
    "అయినా బయలుదేరాంగా. ఇప్పుడు వెనక్కి తగ్గటమెందుకు? చివరిదాకా చూద్దాం" హమ్మయ్య. సగం వూరట కలిగింది.
    "నీ పేరేమిటోయ్?" అనడిగాడు. 'అలా అడగాలి' అనుకున్నాడు.
    "తోగులు సార్"
    తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. ఊరుకున్నాడు.
    పదినిముషాలు పరిగెత్తాక రిక్షా అనేక సందులూ, గొందులూ దాటి ఓ మారుమూల సందులో చిన్న పెంకుటింటిముందు నిలిచింది. తోగులు "ఇప్పుడే వస్తానుండండి సార్!" అంటూ లోపలికి వెళ్ళాడు. రెండునిముషాలు గడిచాక బయటకు వచ్చి "రండి సార్" అని పిలిచాడు.
    ఇది కొత్త సాహసకృత్యం. మృత్యుంజయరావు దేముడిమీద భారం వేసి క్రిందకు దిగి వడివడిగా కొట్టుకుంటూన్న గుండెతో, తోగులు వెంట లోపలకు నడిచాడు.
    ముందుగదిలో మెర్క్యురీదీపం వెలుగులో ఎర్రని నైలాన్ చీరెలో మెరుస్తూ నిలబడింది మంజులత. "రండి" అంది తియ్యటికంఠంతో.
    ఇప్పుడు ఆమెను పరీక్షగా చూసే అవకాశం వచ్చింది. చాలా చిన్నది వయసులో. పద్దెనిమిదేళ్ళకంటే ఎక్కువ వున్నట్లు కనిపించదు. ఇంటికి వచ్చి మరోసారి అలంకరణ చేసుకోవటంవల్లా, ఎర్రని దుస్తులు ధరించటం వల్లా ఆమెలోని ఆకర్షణ ద్విగుణీకృతమై అతన్ని తిరిగి ఉత్తేజితుడ్ని చేసింది.
    గది నలుమూలలా చూశాడు. గోడలకు రెండుమూడు నిలువుటద్దాలున్నాయి. ఒకమూల డ్రెస్సింగ్ టేబిల్ వుంది. బళ్లమీద అగరొత్తులు సువాసనని వ్యాపింపజేస్తూ కాలుతున్నాయి. గోడలకు ఖాళీలేకుండా క్యాలెండర్లు తగిలించి వున్నాయి సినిమాతారలవీ, రకరకాల విన్యాసాలతో స్త్రీ చిత్రాలూ. ఒకేమంచం వేసివుంది. దానిమీద దుప్పటి చూసేసరికి అతని కడుపులో త్రిప్పింది.
    "కూర్చోండి" అంది.
    అతనా మంచంమీదే విధిలేక కూర్చున్నాడు.
    ఆమె అతని దగ్గరకువచ్చి ముఖంలో ముఖంపెట్టి నవ్వుతూ "ఇందాక మీరు సినిమాకి వచ్చారుకదూ" అంది.
    "అవును" అన్నాడు మృత్యుంజయరావు సిగ్గుపడుతూ.
    "మీ ఫ్రెండ్ రాలేదా?"
    సరిగ్గా యీ ప్రశ్నే ఆమెనుంచి రాకూడదనుకుంటున్నాడతను. తూణీరంలా రానేవచ్చింది. పైకి మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు నటించి "రాలేదు" అన్నాడు.
    ఆమె ఏమనుకుందో మళ్ళీ అతన్ని గురించి అడగలేదు. "ఇక్కడే వుండగూడదూ? మీ యింటికి రాకపోతే ఏం?" అంది జడ భుజంమీదుగా ముందుకు వేసుకుని రిబ్బన్ చేతిలో మెలిత్రిప్పుతూ.
    తోగులు బయటకువెళ్లి నిలబడ్డాడు.
    మృత్యుంజయరావు ఆమె ఎక్కడ గట్టిగా పట్టుపడుతుందోనని భయపడుతూ "మా యింటికే పోదాంలెండి" అన్నాడు మెల్లిగా.
    "సరే మీ యిష్టం" అందామె ఒప్పుకుంటూ. తర్వాత రాత్రి ఎంతసేపటి వరకూ అతని దగ్గర గడపాలో, ఎంత డబ్బుయివ్వాలో వాటిని గురించి సంభాషణ జరిగింది. అక్కడ్నుంచి ఎంత త్వరగా బయటపడదామా అని చూస్తున్న మృత్యుంజయరావు అన్నిటికీ ఊఁ కొట్టాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra