Home » Yandamuri veerendranath » రక్త సింధూరం


    "ఆ లెఖ్కన నాకూ ఇరవైమూడు బంగారు పతకాలు రావాలి. ఇంతకన్నా పదునైన ఆయుధంతో నేను ఇరవై ముగ్గురిని చంపాను!"
    "అది వేరు- ఇది వేరు" అన్నాను. "ఇప్పుడు మనం చంపింది ఒక బందిపోటుని. రెండింటికీ సంబంధం లేదు."
    "ఉంది జైలర్, ఉంది" ఆవేశంగా అన్నాడతడు. "ఆఫ్ట్రాల్. ఇది నువ్వు నిర్మించుకున్న జైలు! నీ నాలుగ్గోడల జైలుకే కాస్తంత ప్రమాదం అనేసరికి నువ్వు కంగారుపడ్డావు. నీ చేతుల్తో నీవే స్వయంగా ఆయుధాన్ని నా చేతికిచ్చావు. శత్రువుని చంపమన్నావు. చట్టాన్ని మర్చిపోయావు. "అని క్షణం ఆగాడు"...ఈ గోడల అవతల ప్రపంచం మరింత ప్రమాదంలో వుంది. నువ్వు నిర్మించుకున్న చట్టం ఆ ప్రపంచాన్ని ఏ మాత్రం రక్షించలేదు. అందుకే నేను ఆయుధం పట్టాను. ఇలాటి శత్రువులు బైట చాలామంది వున్నారు. అలాంటి వాళ్ళనే నేను చంపింది."
    "నీది వితండవాదం...నువ్వు ఇలా వాదించటం చట్టవిరుద్ధం."
    "చట్టపు శ్లేష్మంలో పడి కొట్టుకుం...." అతికష్టంమీద వాక్యం పూర్తి చేయకుండా నిగ్రహించుకున్నాడు. అతడిలో అంత ఆవేశమూ కోపమూ నేనెప్పుడూ చూడలేదు. కానీ వెంటనే అతడి మొహం మామూలుగా మారిపోయింది.
    "నువ్వు ఆలోచించగలవనే నమ్మకం నాకుంది. కేవలం ఈ కాకీ బట్టలు నీ ఆలోచనని చంపేస్తున్నాయి. ఓ భారతదేశపు పౌరుడా! ఆలోచించు! చట్టం పరిధిలో ఒక దుర్మార్గుడ్ని చంపినందుకు నీకు బంగారు పతకం... న్యాయ పరిధిలో కొందరు దుర్మార్గుల్ని చంపినందుకు నాకు ఉరిశిక్ష! రెంటిలో ఏది సరియైనది?...ఆలోచించు."
                         8
    తరువాత పనులన్నీ చకచకా జరిగిపోయినయ్. మరుసటిరోజు పేపర్లో ఇది ప్రముఖ వార్త అయింది. జైళ్ళ మంత్రిగారు హుటాహుటీన వచ్చారు. అంతా హడావుడి. ఎక్కడ చూసినా అభినందనలే. అత్యంత ధైర్యసాహసాలు చూపినందుకు ఈ సంవత్సరపు జవరీ అవార్డు రావటం ఖాయమని చాలామంది భవిష్యత్తు చెప్పారు.
    ఇంత సంతోషకరమైన పరిస్థితిలోనూ బాధపెట్టే విషయం శివప్రసాద్ తాలూకు ఆలోచనే! కాస్త ఒంటరిగా ఆఫీసు గదిలో కూర్చుంటే చాలు, నవ్వు మొహంతో శివప్రసాద్ హడావుడిగా లోపలికి వస్తూ "గురూ! అర్జెంటుగా లేడీస్ హాస్టల్ కి వెళ్ళాలి-" అన్నట్టు అనిపించేది. మంగతాయారునైతే పట్టశక్యం కాలేదు. అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని చీలుస్తూ పక్క క్వార్టర్ నుంచి ఆ అమ్మాయి ఏడుపు వినిపించేది. అమ్మలేచి వెళ్ళేది.
    ఇంకొద్ది రోజుల్లో ఆ అమ్మాయి వాళ్ళు క్వార్టరు ఖాళీ చేయాలి. శివప్రసాద్ స్థానాన్ని భర్తీ చేయటానికి ఇంకో మనిషి వస్తున్నాడు. అతడు కొద్దిరోజుల్లో ఛార్జి తీసుకుంటాడు. మంగతాయారుకి తల్లీ తండ్రీ లేరట. స్కాలర్ షిప్ ల మీద హాస్టల్లో వుండి చదువుకుంటూంది. పరీక్షలయిపోయినయ్. ఇప్పుడువెంటనే ఉద్యోగం చూసుకుని చేరిపోవాలి. ఏదో చిన్న గది అద్దెకు తీసుకుని ఒంటరి జీవితం గడపాలి. మొన్నటి వరకూ అంత ఆనందం అనుభవించిన స్త్రీ లేదు! ఈ రోజు అంత దురదృష్ట వంతురాలు లేదు!! 
    ఒక రోజు రాజారాం నా గదికి వచ్చాడు. నేను ఆఫీసులో పని చేసుకుంటున్నాను. ఎదుటి కుర్చీలో చాలాసేపు మాట్లాడకుండా కూర్చుని, ఆ తరువాత అన్నాడు. "మంగతాయారుని నేను వివాహం చేసుకుందామను కుంటున్నాను. ఎలా వుంటుందంటావ్ భాయ్!"
    కొద్దిసేపటివరకూ అతడు చెపుతున్నది నాకు అర్ధంకాలేదు. తరువాత నమ్మశక్యం కాలేదు. అప్పటికి శివప్రసాద్ మరణించి వారంరోజులు కూడా కాలేదు.
    "ఎలా? ఇదెలా సాధ్యం?" అన్నాను.
    "ఎందుకు కాదు భాయీ? ఇంకో నాలుగు రోజుల్లో జార్జి వస్తున్నాడు. ఈమె క్వార్టరు ఖాళీ చేయాలి" అన్నాడు. జార్జి శివప్రసాద్ స్థానంలో వస్తూన్న సబ్- జైలరు. క్వార్టర్స్ విషయంలో మేము చాలా స్ట్రిక్టుగా వుంటాము.
    నేను కటువుగా, "వివాహం అంటే 'క్వార్టర్' లాంటిది కాదు- ఒకరు ఖాళీ చేయగానే ఇంకొకరు వెళ్ళి చేరటానికి" అన్నాను. తరువాత అనిపించింది. అంత కటువుగా మాట్లాడి వుండి కూడదని! దీన్ని జీర్ణం చేసుకోవటానికి నేనే ఇంత కష్టపడుతూ వుంటే మిగతా ప్రపంచం ఎలా తీసుకుంటుంది?
    అతడు లేచి కిటికీ దగ్గిరకి వెళ్ళాడు. బయటకు చూస్తూ అన్నాడు. "ఆమె దగ్గిర వెంటనే వివాహ ప్రసక్తి తీసుకురాను. ముందు నాతో కొంతకాలం ఉంచుకుంటాను. ఆమె 'కాదు - ఒంటరిగా వుండి ఉద్యోగం చేసుకుంటాను' అంటే అలాగే అంటాను. కానీ అలా అనదనే ఆశిద్దాం."
    "ఇది. ఇదంతా కేవలం జాలివల్ల చేస్తున్నావా?"
    "నా ఉద్దేశ్యంతో ప్రేమ అనేది ఎంత సున్నితమైన నిరర్ధకమైన పదమో, జాలికూడా అంత అనవసరమైన పదమే. మనిషీ మనిషీ కలిసి బ్రతకటానికి, వాడిన గులాబి పువ్వుని పదిరోజుల పాటు జేబులో పెట్టుకుని తిరిగేటంత ప్రేమ అనవసరం. ఏదో గొప్ప త్యాగం చేస్తున్నామని అనుకుంటూ జాలి చూపించి జీవించటం కూడా అనవసరమే."
    విప్పారిన కనులతో అతణ్ణి చూస్తూ వుండిపోయాను. ప్రాక్టీకాలిటీ మనిషికి ఇంత సుఖం ఇస్తుందని నాకు ఇంతకుముందు తెలీదు. జీవితం నేర్పిన పాఠాలు నేర్చుకోవటానికి మంగతాయారు మాత్రం కొంచెం కష్టపడవలసి వస్తుంది. అతడన్నట్టు వాడిని పువ్వుని భద్రపరచుకునే స్టేజినుంచి, వాడిన స్త్రీని ఆదరించే భర్తని అభినందించగలిగే స్టేజికి ఆమె రాగలిగితే, ఆమె బ్రతుకు పండినట్టే! కాలమే నిర్ణయించాలి.
    "కంగ్రాట్స్" అన్నాను లేస్తూ. "...అమ్మకి చెపుతాను. దీన్నంతా అమ్మ తొందరగా అర్ధంచేసుకోగలదనే అనుకుంటున్నాను. తను సాయం చేస్తుంది."
    "అవును. అలా అయితే మరింత బావుంటుంది."
    నేను చేయి ముందుకు సాచుతూ, "చాలా మంచిపని చేస్తున్నావు భాయీ నువ్వు. ఎవరు అర్ధం చేసుకున్నా చేసుకోకపోయినా చాలా గొప్పపని" అన్నాను.
    "ఈ ఆలోచన నా అంతట నాకు రాలేదు."
    "మరి-"
    "గండ్రగొడ్డలి ద్వారా వచ్చింది-"
    సాచిన చెయ్యి అలా ఉండిపోయింది. ఆశ్చర్యంతో "గండ్రగొడ్డలా" అన్నాను.
    అతడన్నాడు- "శత్రువుల మీద మనం సాధించిన విజయాన్ని చాలాఘనంగా జరుపుకున్నాం. ప్రభుత్వం, పత్రికలు మనల్ని ఆకాశానికి ఎత్తేసేయి. ఈ విజయోత్సాహంలో మనం మిషన్ గన్ ని ఒక ఖైదీకి ఇచ్చామనీ, జైలుకు ఒకవైపు భద్రత అతడికి అప్పగించానమనీ- ఆ విషయాలన్నీ చీకటిలో నొక్కేసేం."
    తల వంచుకున్నాను.
    "అన్ని విషయాలూ తెలిశాక ఎందుకో గండ్రగొడ్డలిని కలుసుకోవాలని అనిపించింది. అంత కరెక్టుగా ప్లాన్ చేయగలవాడూ, మిషన్ గన్ ఆపరేట్ చేయగలవాడూ ఎవడా అని. కృతజ్ఞతలు చెప్పటం కోసం కలుసుకున్నాను. అతడు అడిగిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా?"
    "ఏమిటి?"
    "చనిపోయిన శివప్రసాద్ కుటుంబం ఏమైందని."
    తృళ్ళి పడ్డట్టూ చూశాను. రాజారాం విషాదంగా నవ్వేడు. "మన ఆనందంలో మనం వున్నాం. ఇంకా శాడిస్ట్ గా చెప్పాలంటే శివప్రసాద్ మరణాన్ని ఒక అద్భుతంగా చిత్రించి, విచారాన్ని దానికి అందంగా 'పులుముతూ' చెప్పుకున్నాం. అతడు మాత్రం వెళ్ళగానే మొదటి ప్రశ్న అది అడిగాడు" అన్నాడు.
    నా మనసు మంచులో పెట్టినట్టు ఉంది. ఏమీ మాట్లాడలేకపోయాను. రాజారాం అన్నాడు-
    "అతడే ఉద్దేశ్యంతో అడిగాడో నాకు తెలీదు. అక్కణ్ణుంచి వచ్చేసేక కూడా ఇదే ప్రశ్న నన్ను వెంటాడసాగింది. ఆ ప్రశ్నలోంచి వచ్చిన జవాబే ఈ నిర్ణయం-" నవ్వేడు.
    "మరిపెళ్ళి చేసుకోబోతూన్నట్టు అతడికి చెప్పావా?"
    రాజారాం మామూలు మూడ్ లోకి వచ్చేసేడు. " 'ఆలూ లేదు, సూలు లేదు' అన్నట్టు అప్పుడే చెప్పటం ఎందుకు భాయ్. ముందసలా పిల్ల ఏమంటుందో కనుక్కొనీ."
    నేను మాట మారుస్తూ "ఈ గండ్రగొడ్డలి ఇరవై మూడు హత్యలు చేశాడంటే చిత్రంగా లేదూ" అన్నాను.
    "చెయ్యటం మాత్రం నిజమే... నేను ఫైలు చదివాను" అన్నాడు. "ఈ దామోదరం ఎమ్మెల్యేగా నిలబడ్డ నియోజకవర్గం పక్కనే వున్న అడవి ఇతడి స్థావరం! ఆ వైపున ఉన్న పల్లెలన్నీ క్రమక్రమంగా ఇతడి పలుకుబడి క్రిందకి రావటంతో దామోదరానికీ ఇతడికీ బద్ధవైరం ఏర్పడింది. ముఖ్యంగా ఆ పల్లె ప్రాంతాల్లో చిదానందం అని ఒక వడ్డీ వ్యాపారి వున్నాడు. ఒక ఛోటా టైపు ఇండస్ట్రియలిస్టు. ఈ గిరిజనులందరికీ వడ్డీకి పైసలిస్తూ వుంటాడు. అతడొకడు సపోర్టు. మొత్తానికి వీళ్ళ గొడవల మధ్య పల్లెలు నగిలిపోయాయి. నీకు తెలియనిదేముంది? ఎలక్షన్ లలో గ్రామ పెద్దల్ని తీసుకెళ్ళి గుళ్ళో రాములోరి ముందు ఒట్టు వేయిస్తారు- తమ పల్లె ఓట్లన్నీ వేయిస్తామని. అలా జరగబోతూంటే గండ్రగొడ్డలి ఎదుర్కొన్నాడట. పెద్ద గొడవ జరిగింది. తిరగబడ్డ పెద్దల మీదికి గూండాల్ని పంపారు వీళ్ళు. వాళ్ళ తలలు నరికాడు అతడు. సరే, మన పేపర్ల సంగతి తెలియనిదేముంది- దానికి రకరకాల రంగులు పులిమాయి. కోర్టులో కూడా అతడు తన నేరాన్ని కాదనలేదు. చట్టం పరిధి మాత్రం పెరగాలన్నాడు. అంతే!"

    "ఈ విప్లవకారుల మాటలూ, స్టేట్ మెంట్ లూ గమ్మత్తుగా వుంటాయి" అన్నాను. "-చట్టం, ఫాసిజం, వెలిగే సూర్యుడు- వగైరా" అంటూ నవ్వేను.
    రాజారాం కూడా నవ్వేడు. అప్పటివరకూ మా మాటల్లో వున్న సీరియస్ నెస్ పోయింది. అతడు వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ "ఆమె వప్పుకునే వరకూ ఆ వివాహ విషయం కాస్త రహస్యంగా వుంచు భాయీ" అన్నాడు.
    "ష్యూర్" అన్నాను.
    అతడు వెళ్ళిపోయాక మళ్ళీ ఆ మాటలు గుర్తు వచ్చాయి.
    చట్టం... ఫాసిజం... వెలిగే సూర్యుడు....
    నాకు నవ్వొచ్చింది.
    చట్టం పరిధి ఇంకా పెరగాలట!
    ఏం చెయ్యాలి? రబ్బరు సాగదీసినట్టు సాగదియ్యాలా?
    ...
    ఏం చెయ్యాలో ఆ నాటికి సరీగ్గా పన్నెండు రోజుల తరువాత అర్ధమైంది.
                                              *    *    *
    సూపర్నెంటెండెంట్ జగన్నాధం- కూ జరిగిన మూడో రోజు వచ్చి హడావుడిగా పనిలో చేరిపోయాడు. అందరినీ అభినందించాడు. నన్నైతే దాదాపు కౌగిలించుకున్నాడు. నూటికి నూరుపాళ్ళూ ప్రమోషన్ నిశ్చయం అన్నట్టు ఆకాశానికి ఎత్తేశాడు. కానీ అతడి కళ్ళలో కనబడుతున్న నిరాశనీ, ఓటమినీ నేను స్పష్టంగా చూడగలిగాను. ముఖ్యంగా భీమరాజు మరణంతో దామోదరం ఇతడిని తలవాచేటట్టూ చీవాట్లు పెట్టాడాన్నది నిర్వివాదాంశం. అతడు ఎంతో పలుకుబడి ఉపయోగించి అతడిని జైలు అధికారిగా వేసింది కేవలం ఈ ఒక్క పనీ నిర్వర్తించటానికే! కానీ ఇందులో రెండుసార్లూ అతడు ఘోరంగా విఫలమయ్యాడు.
    అతడు జాయినయిన రెండోరోజు నేను అతడి గదికి వెళ్ళాను. ఇంకెవరూ లేరు. అతడు ఒంటరిగా 'టీ' తాగుతున్నాడు. నన్ను చూసి, "కూర్చో, ఏమిటిలా వచ్చావ్?" అని అడిగాడు.
    సరాసరి విషయంలోకే వెళ్ళిపోవటం మంచిదనుకున్నాను.
    "భీమరాజు మరణంలో దామోదరం మిమ్మల్ని బాగా తిట్టాడనుకుంటాను- ఇంత కష్టపడి వేసిన ప్లాను ఫెయిల్ అయినందుకు-" తాపీగా అన్నాను.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra