Home » Kommuri venugopala rao » ఈ దేశంలో ఒక భాగమిది

   

      కాసేపటికి మెట్లమీద అడుగుల చప్పుడయినట్లు వినిపించింది.
   
    మరోక్షణం గడిచాక ప్రభావతి గదిలో అడుగుపెట్టింది "ఎవరొచ్చారో చూడండి" అంటూ.
   
    మధ్యాహ్నంపూట ఈ కొత్తగా వచ్చింది ఎవరా అనుకుంటూ అతను గుమ్మంవైపు చూస్తూండగా "కులాసాగా వున్నారా బావగారూ?" అంటూ అతని బావమరిది భాస్కరం నవ్వుముఖంతో లోపలికి అడుగుపెట్టాడు.
   
    హఠాత్తుగా ఇతనిక్కడికి ఊడిపడ్డాడేమిటి అని తర్కంలోపడి బయటకు మాత్రం నవ్వడానికి ప్రయత్నిస్తూ "కూర్చోండి, ఎప్పుడొచ్చారు?" అన్నాడు.
   
    అతని బావమరిదిని అతను కొంతవరకూ స్టడీచేశాడు. అతనిది ఇంచుమించు తన ఈడే. వ్యక్తిత్వం ఉండటమంటే ప్రతి స్వల్ప విషయమూ పట్టించుకుంటే రభస చేయటమనే సిద్దాంతంలో నమ్మకమున్న వాడవటంవల్ల నేమో ప్రతిదానికీ గయ్ మని లేస్తూ వుంటాడు. వ్యక్తిత్వం మెండవటం వల్లనేమో అతను కుమార్ ని "బావగారూ!" అని పిలవడు. పేరు పెట్టే పిలుస్తాడు. పెళ్ళయిన ఈ ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలలోనూ రెండుమూడుసార్లే 'బావగారూ!" అని వరుసపెట్టి పిలిచాడు. అలా పిలిచిన రెండుమూడుసార్లూ కుమార్ తో ఏవో పనులు చేయించుకున్నాడు. ఇప్పుడు తనని పేరుపెట్టి కాకా వరుసబెట్టి పిలిచాడంటే తనతో ఏదో పనివుండి వచ్చాడన్నమాట అనుకున్నాడు కుమార్.
   
    "ఇప్పుడే వస్తున్నానండీ! ఏమిటిది? చిక్కిపోయినట్లున్నారు.....బావగారు చిక్కిపోయారు కదుటే ప్రభా!"
   
    నిజంగా ఏదో గట్టిపనిమీదే వచ్చినట్లున్నాడని నిర్ధారణ చేసుకున్నాడు కుమార్.
   
    "చాలా రోజులయింది కదరా చూసి, అందుకని నీకిలా కనబడుతున్నట్లు న్నార్లే పద, భోంచేద్దువుగానీ, తర్వాత కబుర్లు చెప్పుకోవచ్చులే..."
   
    "అరెరే, ఇంతవరకూ భోజనం చెయ్యలేదా? త్వరగా వెళ్ళి తినేసిరండి. తర్వాత మాట్లాడుకుందాం" అన్నాడు కుమార్.
   
    "అయిదు నిముషాల్లో వచ్చేస్తాను. మీతో చాల మాట్లాడాలి. నిద్రపోకండేం" అని భాస్కరం చెల్లెలివెంట క్రిందికి దిగి వెళ్ళాడు.
   
    క్రిందికి వెళ్ళిపోతున్న ప్రభావతివంక అక్కసుగా చూశాడు కుమార్.
   
    రాణి ఎప్పుడు నిద్రపోయిందోగానీ ప్రక్కమీద పడుకుని గాఢనిద్రలో వుంది.
   
    అతనికి నిద్ర ముంచుకువచ్చినట్లయింది. ఆలస్యంచేస్తే భాస్కరం పైకి వచ్చేస్తాడేమోనన్న భయంతో మంచంమీద చెరి కళ్ళు మూసుకున్నాడు.
   
    వెనువెంటనే నిద్రకూడా పట్టింది.
   
    అతనికి తిరిగి మెలకువ వచ్చేసరికి మూడు దాటిపోయింది. రాణి ఎప్పుడు లేచి వెళ్ళిపోయిందోగానీ మంచం ఖాళీగా వుంది. కుమార్ లేచి బయటకు వచ్చాడు. ప్రక్కగదిలో భాస్కరం గుర్రుపెట్టి నిద్రపోతూ కనిపించాడు. నేలమీద పెట్టే, బెడ్డింగూ, చిన్న సూట్ కేసూ, ఇంకేవేవో చిన్న చిన్న సంచీలు వగైరాలు కనిపించాయి. ఇదేదో పెద్ద ప్రయత్నంమీదే వచ్చిన బాపతులా కనిపించింది.....క్రిందికెళ్ళాడు.
   
    వంటింట్లో ప్రభావతి గ్యాస్ స్టౌవ్ మీద పాలు వెచ్చబెడుతూ కనిపించింది. వంటింట్లో ఆమె తప్ప ఎవరూలేరు. ఇందాక భోజనంచేశాక చెయ్యి కడుక్కుని వస్తూంటే ప్రభావతి కనిపించగానే రగిలిన కోర్కె జ్ఞాపకం వచ్చింది. అటూఇటూ చూసి ఎవరూ లేరుకదా అని దగ్గరకు వెళ్ళాడు. వెనుకనుంచి ఆమె భుజాల మీద చేతులు వేశాడు.
   
    ప్రభావతి వెనుదిరిగి "ముప్పైఏళ్ళు దాటాక వంటింటి సరసం మొదలు పెట్టారేమిటి?  సిగ్గులేకపోతే సరి!" అన్నది.
   
    "అబద్దమాడకు. నాకింకా ముప్పై దాటలేదు."
   
    "పోనీ సమీపించారుగా, చాలదేమిటి?"
   
    "ఇరవైఏళ్ళప్పుడు బాత్ రూం సరసం, యాభై ఏళ్ళప్పుడు విరసంతో కూడిన సరసం - ఇలా ఏ వయసుకా ముచ్చట వుండాలే చిన్నదానా!" అంటూ ఆమె ముఖం పట్టుకుని తనవైపు త్రిప్పుకోబోయాడు,
   
    "అక్కయ్యగారూ పాలుకాగాయా?" అంటూ విమల గబుక్కున లోపలకు అడుగుపెట్టి ఈ దృశ్యంచూసి సిగ్గుతో కుచించుకుపోయి అక్కడ్నుంచి గబగబ వెళ్ళిపోయింది.
   
    "చంపేశారు పొండి" అని ప్రభావతి విదిలించుకుని నిలబడి ఎర్రబడ్డ ముఖంతో వుండిపోయింది.
   
    కుమార్ కి కూడా తల కొట్టేసినట్లయింది. మాట్లాడకుండా అక్కడ్నుంచి జారుకున్నాడు.
   
    ముందు గదిలో తండ్రి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వచ్చింది ఎవరా అని చూసేసరికి, ఆయన కోదండరామయ్యగారు. తన అమ్మమ్మకి మిగిలిన ఏకైక తమ్ముడు. అతని అమ్మమ్మకి వున్న బంధువర్గమంతా కాలం తెచ్చిన పరిణామంవల్ల నశించి ఆయన ఒక్కడూ మిగిలాడు. ఆయనకు అరవై ఏళ్ళు దాటాయి. ఆయన భార్యకూడా ఈ మధ్యనే గతించింది. ఆయన ఒక్కడూ మిగిలాడు. పిల్లలు లేరు. ఒక్కడూ బిక్కుబిక్కుమంటున్న పెంకుటింట్లో వుంటూ వుంటాడు. అక్కగార్ని చూడటానికి అప్పుడప్పుడూ వస్తూంటాడు. ఆ అక్కా తమ్ముళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు చిత్రంగా వుంటాయి. ఒకరంటే ఒకరికి ఎనలేని ఆపేక్ష. కాసేపు ఆయన చచ్చిపోయిన తన పెళ్ళాన్ని తలచుకుని ఏడుస్తాడు. ఆయన బాధను పరామర్శించి ఆవిడ ఏడుస్తుంది. తర్వాత ఇద్దరూ తమ చిన్ననాటి కబుర్లు ముచ్చటించుకుంటారు. ఆ రోజులు ఇప్పుడు రావంటారు.
   
    అతన్ని చూసి కోదండరామయ్యగారు "రారా, ఇలారా ఇప్పుడే నిద్ర లేచావేమిటి?" అని పలకరించారు.
   
    కుమార్ విధిగా వెళ్ళి వాళ్ళదగ్గర కూర్చున్నాడు.
   
    కాసేపున్నాక ప్రభావతి లోపల్నుండి స్టీలుపళ్ళేలలో పెసరట్టు పెట్టి తీసుకువచ్చింది. ఒకటి మామగారికికిచ్చింది. రెండోపళ్ళెం చాలా బరువుగా వుంది. అది కోదండరామయ్యగారికి ఇచ్చింది. తర్వాత లోపలకు వెళ్ళి మరో పళ్ళెం తీసుకువచ్చి కుమార్ కు ఇచ్చింది.
   
    లోపల్నుండి అమ్మమ్మగారు హాల్లోకి వచ్చింది.
   
    "ఆ ఆరుపెసరట్టు పెట్టిన పళ్ళెం తాతగారికిచ్చావా లేదా?" అని ప్రభావతిని గుచ్చిగుచ్చి అడగటం కుమార్ కి వినిపించింది.
   
    "ఇచ్చానండీ. కావాలంటే వెళ్ళి చూసుకోండి" అంటోంది ప్రభావతి.
   
    తన తమ్ముడు ఇంటికి వస్తే అతనికి పలహారం, కాఫీ ఇచ్చేదాకా ఎదుటివాళ్ళ ప్రాణాలు తోడేస్తుంది అమ్మమ్మగారు. నలుగురిలో కూర్చుంటే అందరికన్నా ఆయన పళ్ళెంలో ఎక్కువ ఉంచకపోతే గింజుకుపోతుంది.
   
    కోదండరామయ్యగారు వెళ్ళిపోయాక రంగారావుగారు లోపలకు వచ్చి గట్టిగా ఎగిరాడు "ఆవిడకంత ఆపేక్షగా వుంటే లోపలకు పిలిచి ఆరుకాదు పది పెసరట్టు పెట్టుకోమను. నలుగురిలో వున్నప్పుడు అలాచేయటం సభ్యత కాదని లక్షసార్లు చెప్పాను. ఇవేళ వున్నది మేమేననుకో పరాయివాళ్ళున్నప్పుడు కూడా అలాచేసింది. అందుకని చెబుతున్నా" అన్నాడు.
   
    అమ్మమ్మగారు లోపల్నుంచి గొణుక్కుంటుంది.
   
    కుమార్ పైకివెళ్ళి ముఖం కడుక్కువచ్చి బట్టలేసుకున్నాడు. అతను డిస్పెన్సరీకి వెళ్ళాల్సిన టైమవుతోంది.
   
    ప్రభావతి ఎందుకో ఆ గదిలోకి వచ్చింది.
   
    ఇందాక చెయ్యలేని పని ఇప్పుడు చెయ్యాలనిపించింది.
   
    "మాట..." అని దగ్గరకు పిలిచాడు.
   
    "ఎందుకు?" అంది.
   
    "చెబుతాను, మాట....."
   
    "నాకు తెలుసులెండి, ఎందుకో."
   
    "అందుకు కాదులే, మాట....."
   
    ప్రభావతి దగ్గరకు వచ్చి నిల్చుంది "అబద్దమయితేనేనా?" అంటూ.
   
    "అబద్దమే" అంటూ ముందుకు వంగబోయాడు.
   
    హఠాత్తుగా తల్లి లోపలకు అడుగుపెట్టింది.
   
    ప్రభావతి చప్పున దూరం జరిగింది.
   
    "ఇక్కడున్నావా? నీకోసం ఎవరో వచ్చార్రా" అన్నారు శారదమ్మగారు.
   
    "వస్తున్నానమ్మా!" అంటూ కుమార్ గబగబ బయటికి నడిచాడు.
   
    వచ్చినతను వెళ్ళిపోయాక అతను లోపలికి వచ్చి తీరని కోరిక గొప్ప అసంతృప్తిని కలిగిస్తుండగా ఆ అసంతృప్తితో డిస్పెన్సరీకి వెళ్ళటం ఇష్టంలేక ప్రభావతికోసం వెదికాడు. ఆమె వంటింట్లో వుంటే వెళ్ళాడు. అక్కడ మరదలు కూడా వుంది. ఆమె పెరట్లోకి వెడితే వెళ్ళాడు. అక్కడ తండ్రి గోడదగ్గర పని మనిషితో ఏదో మరమ్మత్తు చేయిస్తున్నాడు. కాసేపటికి ఆమె ఏదో పనిమీద స్టోర్ రూమ్ లోకి వెళితే వెళ్ళాడు. అక్కడ తల్లి ఏదో పనిలోవుండి కనిపించింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra