Home » Yandamuri veerendranath » సంపూర్ణ ప్రేమాయణం


    ఇంతలో డాక్టర్ వచ్చాడు. అచ్చు 'ఎ' క్లాస్ బ్రోకర్ లా వున్నాడు. ప్రసాదరావు అతడితో "ప్రారంభిద్దామా ఇక" అన్నాడు. డాక్టర్ "సరే సార్" అని, స్టౌ వెలిగించి గిన్నెలో నీళ్ళుపోసి మరగబెట్టి అందులో బ్లేడ్ పడేశాడు. రేప్రొద్దున సెప్టిక్ అయి ప్రాణాలమీదకి రాకుండా స్టెరిలైజ్ చెయ్యటం కోసం.

    వేణు నిర్లిప్తంగా వారినే చూడసాగేడు. అతడికి ఎందుకో ఇది దారుణం అనిపించింది. ప్రసాదరావు ప్లాన్ చెప్పినప్పుడు ఈ చర్మం కోయటం విషయం చెప్పలేదు. అందుకే బావుందీ ప్లాన్_ అనుకున్నాడు. అఫ్ కోర్స్ పెద్ద గాయమేమీ అవదు కానీ, ఎందుకీ ముసలోడ్ని ఈ వయసులో కష్టపెట్టటం?

    ఇంతలో నీళ్ళు సలసలా మరగటం మొదలుపెట్టాయి. కొంచెంసేపు గడిచాక ఇక చాలన్నట్టు డాక్టర్ తలూపేడు. నీళ్ళలోంచి బ్లేడు బైటకు తీశారు. డాక్టర్ దాన్ని పట్టుకుని పేషెంటు దగ్గరికి వెళ్ళి చొక్కా పైకెత్తి కడుపుమీద గాటు పెట్టబోయాడు.

    అంతలో ఒక చిత్రం జరిగింది.


                                                            *    *    *


    ప్రొద్దున్న ఆరున్నరా ఏడు ప్రాంతాలకల్లా ఇంటికి వచ్చేసే తండ్రి పదకొండయినా రాకపోయేసరికి ప్రేమ కంగారుపడింది. ఇంకో అరగంట గడిచేసరికి ఆ కంగారు ఎక్కువైంది. నౌఖర్లని ప్లేగ్రౌండు దగ్గరికి పంపింది కానీ ఎవరూ ఆయన గురించి చెప్పలేకపోయారు. ఆమె ప్రసాద్ కి ఫోన్ చేసింది.

    పావుగంటలో అతడు వచ్చాడు. ఈ లోపులో నౌఖరు ఒక వార్త తెచ్చాడు. ప్రొద్దున్న ఆరుగంటల ప్రాంతంలో ఒక ముసలాయన రోడ్డు మధ్యలో పడిపోయినట్టు తను చూసేనని ఒక గూర్ఖా చెప్పాడు. అతడు చెప్పిన ఆనవాళ్ళు జగపతిరావు ఆనవాళ్ళకి సరిపోయినాయి.

    ప్రేమ బావురుమంది. ఆమెని అనునయించటం కష్టమైపోయింది. తండ్రంటే ఆమెకి వల్లమాలిన ప్రేమ. చాలాసేపటికిగానీ ఆమె తేరుకోలేదు. ప్రసాద్ ఆమెని ఊరడించాడు. ఇద్దరూ కలిసి ఆ గూర్ఖా దగ్గరికి వెళ్ళారు.

    "రోడ్ పే ఆతే ఆతే గిర్ గయా సాబ్, కోయీకార్ పే లేకే గయా" అన్నాడు వాడు.

    "ఆస్పత్రిలో చేర్చివుంటారు" అన్నాడు ప్రసాద్.

    "అదేగానీ నిజమైతే ఆ చేర్పించినతనికి ఏమిచ్చినా మన ఋణం తీరదు."

    "ఈ దగ్గిరలో వున్న నర్సింగ్ హోమ్ లు, జనరల్ ఆస్పత్రీ_ అన్నీ ఒక్కొక్కటీ వెతకాలి."

    ప్రేమ మాట్లాడలేదు. ఆమె మనసంతా ఏదో నొక్కి పెట్టినట్టు వుంది. ప్రసాద్ ముందు జనరల్ హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ ఇన్ పేషెంట్లలో జగపతిరావు లేడు. ఈ వెతకడానికి మరో గంట పట్టింది. అప్పటికి మిట్టమధ్యాహ్నం కావొస్తూంది. దాదాపు పది నర్సింగ్ హోమ్స్ లో వాకబు చేశారు. జాడ తెలియలేదు. ప్రసాద్ కారుని ఇంటికి తీసుకొచ్చాడు.

    "మనం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేద్దాం. అదీగాక ఇలా ఒక్కొక్క ఆస్పత్రీ ఏం వెతుకుతాం! ఫోన్ ద్వారా ప్రయత్నిద్దాం...." అన్నాడు.

    ప్రేమ సోఫాలో కూలబడి మొహం చేతులలో దాచుకుని నిస్త్రాణగా కళ్ళు మూసుకుంది. ప్రసాద్ ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని, చొరవగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, "ప్రేమా! ఇలాటి సమయాలలోనే ధైర్యంగా వుండాలి మనం. అయినా మేమందరమూ లేమూ నీకెందుకు భయం?" అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతడి చేతుల్లోంచి తన చేతులు తీసుకోలేదు కూడా, ఆ మాత్రం ఆసరా ఆ సమయంలో కావాలన్నట్లు వుండిపోయింది.

    ఆమెనలా అనునయించి ప్రసాద్ మెట్లు దిగి క్రిందికి వచ్చాడు. అయితే అతడు పోలీస్ స్టేషనుకి గానీ, మిగతా నర్సింగ్ హోమ్ లకిగానీ ఫోన్ చెయ్యలేదు. ఇంటికి చేసాడు.

    "హలో!" అటునుంచి దయానందం కంఠం వినిపించింది.

    "నేను ప్రసాద్ ని."

    "చెప్పు" అన్నాడు.

    కొడుకు తండ్రికి చెప్పటం ప్రారంభించాడు.

    "మనం కొద్ది కొద్దిగా వాడబడుతున్న మందు ఇన్నాళ్ళకి పని ప్రారంభించింది."

    ఒక్కసారిగా దయానందం కంఠంలో మార్పొచ్చింది. ఆతృతగా "ఏమైంది? ఏమన్నా జరిగిందా?" అని అడిగాడు.

    "ఆఁ ! ఈ రోజు ప్రొద్దున్న వాకింగ్ నుంచి వస్తూ వస్తూ ఆ ముసలాడు రోడ్డుమీద పడిపోయాడట. తరువాత ఏమయ్యాడో తెలీదు."

    "ఇంక వాడిని ఎవడూ రక్షించలేడు. నాకా మందిచ్చిన వాడు చెప్పాడుగా_ ఈ స్లో పాయిజన్ ఒకసారి పనిచెయ్యటం ప్రారంభించాక, ఇరవై నాలుగు గంటల్లో మరణం సంభవిస్తుందని....గాడ్! ఇన్నాళ్ళకి మనం అనుకున్నది సాధించామన్న మాట. నువ్వక్కడే ఉండి ప్రేమని జాగ్రత్తగా చూసుకో! ఈ పరిస్థితులలో సానుభూతి చూపితేనే తరువాత అది ప్రేమగా మారుతుంది. అందులోనూ తండ్రిలేని పిల్లకాబోతుందామె...." అంటూ ఫోన్ పెట్టేశాడు.

    ప్రసాద్ కూడా ఫోన్ పెట్టేసి, తిరిగి పైకి వెళ్ళాడు.

    ప్రేమ ఇంకా అలానే కూర్చుని వుంది.

    అతడు వెళ్ళి పక్కన కూర్చుంటూ అనునయంగా, "నాకు తెలిసిన డి.యస్సీ.కి చెప్పాను ప్రేమా! డిపార్ట్ మెంట్ లో చాలా పలుకుబడి వున్న మనిషతను. స్వయంగా అతడే వెతకటానికి పూనుకున్నాడు- అన్ని స్టేషన్లలోనూ చెప్పాడు కూడా" అన్నాడు.

    ఆమె అనాసక్తంగా వింటూ కూర్చుంది. రోడ్డు నడుమ నిర్మానుష్యమైన చోట నిస్సహాయంగా పడిపోయిన తండ్రి గురించి తలుచుకొంటున్న కొద్దీ ఆమెకెటూ పాలుపోవటం లేదు.

    ప్రసాద్ ప్రేమ భుజాల చుట్టూ చెయ్యివేసి, "నువ్విలా దిగులుగా వుంటే మాకసలు ఏం చెయ్యాలో తోచదు. మామూలుగా వుండు ఇప్పుడేం జరిగిందనీ?" అన్నాడు. ఆ పరిస్థితులలో ఆ మాత్రం సానుభూతి ఆమెకెంతో ఓదార్పుగా తోచింది. అతడు తనచుట్టూ వేసిన చేతుల్ని తీసేయాలని కూడా ఆమెకి తోచలేదు. ప్రసాద్ కి మాత్రం సంతోషంగా వుంది. అతడు అనుకున్నది అనుకున్నట్టుగా సరిగ్గా జరుగుతోంది.

   
                       *    *    *    *


    సరిగ్గా ఇదే సమయానికి__

    నర్సింగ్ హోమ్ లో డాక్టర్ పరీక్షించటానికి వంగబోతూ వుంటే-

    జగపతిరావు శరీరం మంచం మీద ఎగిరిపడింది. అతడి వళ్ళంతా చెమటపట్టి వణకసాగాడు. ఈ హఠాత్ పరిణామానికి ప్రేక్షకులు ముగ్గురూ విస్తుపోయారు.

    ముందు తేరుకున్నది వేణు. "ఇదేమిటి? మనం వాడిన మందుతో ముందు కడుపునొప్పి వచ్చి, వెంటనే స్పృహ తప్పిపోవాలి. అక్కడితో మందు ప్రభావం పోవాలి. ఆ తరువాత మనం మిగతా మందులు వాడి ఆయన్ని నాల్గు రోజులపాటు సృహ తప్పి వుండేలా చేద్దాం అనుకున్నాం అదీ ప్లాను. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి?" అన్నాడు అతడి మాటలు ఇంకా పూర్తికాలేదు_ జగపతిరావు తల పక్కకి వంచి పెద్దగా దగ్గాడు. ఆ దగ్గుతోపాటు రక్తం పడింది.

    అది చూసి డాక్టరు కూడా కంగారుపడ్డాడు. అతడివైపు తిరిగి, "మీకు బాగా తెలుసా? మనం వాడిన మందుతో కేవలం కాస్త కడుపునొప్పి వచ్చి స్పృహ పోతుంది. అంతే కదా?" అన్నాడు అనుమానంగా.

    డాక్టర్ బిక్కమొహం వేసి, "అవును" అన్నాడు. వేణుకి అతడి మొహం చూస్తే అనుమానం వచ్చి, "నిజంగా చెప్పండి! మీకు కరెక్టుగా తెలుసా?" అని గద్దించాడు.

    "తె__తెలీదు" అన్నాడు డాక్టరు.

    వేణు, ప్రసాదరావు మొహమొహాలు చూసుకున్నారు. వేణు అన్నాడు- "మనం పిచ్చిపిచ్చి నాటకాలు ఆది చివరకి ఆ ముసలోడి ప్రాణాలు తీసేటట్టు వున్నాం."

    "ఇంకొంచెంసేపు చూద్దాం. ఇప్పుడేమొచ్చింది నష్టం?" అన్నాడు ప్రసాదరావు.

    వేణు అతడివైపు అర్ధంకానట్టు చూసి, "ఇంకా కొంచెం సేపా? ఈ లోపులో ఈయన ఛస్తాడు" అన్నాడు.

    "అంత ప్రమాదం లేదని నా ఉద్దేశం" అన్నాడు ప్రసాదరావు. అని డాక్టరువైపు తిరిగి, "ఎం డాక్టరుగారూ- అంతేనా?" అని అడిగాడు.

    "అంతే ఏమిటండీ అంతే! సరిగ్గా చెప్పండి మీకు సరిగ్గా తెలుసా- తెలీదా?"

    "తె__తెలీదు."

    "ఈ హత్యానేరం మనమీదకు రాకుండా, ముందే ఈయన్ని ఏదయినా మంచి ఆస్పత్రికి తీసుకెళ్ళాలి మనం" అన్నాడు వేణు.

    "మరి నా ప్లాను?"

    "మీ ప్లాను తగలెయ్య. ప్రాణం పోతూంటే ప్లానేమిటి?"

    "మరీ అంత కొంపలమీదకి రాలేదని నేను అనుకొంటున్నాను. అసలు నా ఉద్దేశ్యం ఏమిటంటే__"

    "మీ ఉద్దేశ్యాలు మీతోనే అట్టే పెట్టుకోండి. నే నీయన్ని ఇప్పుడే ఇంకో మంచి ఆస్పత్రికి తీసుకెళ్ళబోతున్నాను. ఎవరడ్డువస్తారో చూస్తాను" అంటూ వంగి, ఆయన్ని చేతులమీద లేవదీయబోయాడు.

    "ఆగు" అని అరిచాడు ప్రసాదరావు. "ఇంత ప్లాను వేసింది చివరికి ఇలా ముగియటానికి కాదు. ఇలాటి ఛాన్సు మరొకటి రాదు కూడా."

    వేణు నెమ్మదిగా తలెత్తి, "నన్ను మీరు ఆపుచెయ్యలేరు" అన్నాడు తాపీగా.

    "కానీ నువ్వు నాతో సహకరిస్తానని మాటిచ్చావు. నా దగ్గిర అందుగ్గానూ అడ్వాన్సుకూడా తీసుకున్నావు. ఎటువంటి పరిస్థితిల్లోనూ మాట తప్పనని ప్రమాణం కూడా చేసేవు__"

    "చేసేను, కాని అప్పుడు మీరిలా చచ్చు ప్లాను వేస్తారని అనుకోలేదు."

    ప్రసాదరావు మొహం ఎర్రబడింది. "వేణు! అతను నా మనిషి. అతడిని ఈ ఆస్పత్రి నుంచి బైటకి తీసుకెళ్ళే అధికారం నీకులేదు" అన్నాడు.

    "ఒక మనిషి చావుబ్రతుకుల మధ్య వున్నప్పుడు అధికారాల ప్రసక్తే లేదు__"

    "ఇప్పుడింత ప్రాణాలమీద కొచ్చిందేమీలేదు."

    "అది నిర్ణయించవలసింది మీరుకాదు."

    మాటమీద మాట పెరిగి ఇద్దరూ శతృవుల్లా చూసుకున్నారు. ప్రసాదరావు ఒక నిర్ణయానికి వచ్చినట్టూ, "సరే అయితే__" అన్నాడు.

    "నువ్వు మన మధ్య కుదిరిన అంగీకారాన్ని అతిక్రమిస్తున్నావు కాబట్టి నేనూ ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తాను-"

    "ఏమిటి- నా పెళ్ళి విషయమేనా?"

    "ఆఁ- అదే!"

    "ప్రయోగించండి. ఆనందంగా శిక్ష అనుభవిస్తాను. అంతేకానీ నా మూలంగా ఒక ప్రాణం నిష్కారణంగా పోవటాన్ని మాత్రం వప్పుకోను"

    ప్రసాదరావు వేణుని తినేసేలా చూసేడు. వేణు దాన్ని పట్టించుకోకుండా ఫోన్ లో అప్పటికప్పుడు టాక్సీని పిలిపించి, జగపతిరావుని అందులోకి ఎక్కించాడు. డాక్టరూ, ప్రసాదరావు వరండాలో నిలబడి చూస్తూ వుండగానే టాక్సీ కదిలిపోయింది.

    వేణు భయపడినదంతా అయింది. ఆస్పత్రిలో డాక్టర్లు పేషెంట్ ని పరీక్ష చేసి, కండిషన్ చాలా సీరియస్ గా వుందనీ, వెంటనే ఆపరేషన్ చెయ్యాలని నిర్ణయించారు. అక్కడ ఇవ్వవలసిన అడ్వాన్సూ అదీ ఇచ్చి వేణు ఆస్పత్రినుండి బయటకొచ్చాడు. పబ్లిక్ టెలిఫోన్ బూత్ చేరుకుని అక్కడినుంచి జగపతిరావు ఇంటికి ఫోన్ చేసేడు.

    "హల్లో.... ఎవరు మాట్లాడుతున్నారు?"

    "ప్రేమ- జగపతిరావుగారి అమ్మాయిని."    

    "మీ నాన్నగారి విషయం మాట్లాడుతున్నాను మాడమ్!"

    రిసీవర్ మీద ప్రేమ చెయ్యి బిగుసుకుంది. వణికే కంఠంతో "నాన్నగారు ఎక్కడున్నారో తెలుసా మీకు?" అని దాదాపు అరిచింది.

    "తెలుసు మాడమ్!" అంటూ ఫోన్ లో నర్సింగ్ హోం పేరు చెప్పాడు.

    "మీ నాన్నగారు ప్రొద్దున్నే రోడ్డుమీద పడిపోతే తీసుకెళ్ళి ఆస్పత్రిలో చేర్పించాం."

    "ఎలా వుంది ఆయనకిప్పుడు?"

    వేణు తటపటాయించి, "కొంచెం సీరియస్ గానే వుంది మాడమ్! బహుశా ఆపరేషన్ కూడా చెయ్యవలసి వస్తుందేమో" అన్నాడు.

    ప్రేమ నిటారుగా అయింది. పక్కనుంచి ప్రసాద్.... "ఏం జరిగింది?" అంటున్నాడు.

    "అయినా మీరు కంగారు పడవలసిందేమీ లేదు. ఏర్పాట్లు అన్నీ జరిగినయ్. ఈపాటికి అక్కడ ఆపరేషన్ మొదలయి వుంటుంది."

    "మీరెవరు?" ఆమె ఆత్రుతగా అడిగింది.

    "అది అంత అవసరం అనుకోను మాడమ్...." అని ఫోన్ పెట్టేసేడు వేణు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra