Home » Chandu harshavardhan » కాంక్రీట్ జంగిల్


    ఆమె వెనుక అడుగులు వేస్తూనే ఒకసారి వెనుతిరిగి జగపతివైపు చూసింది శ్రీప్రియ. తనవైపే తదేక దీక్షతో చూస్తున్న ఆ పెద్దమనిషి ఉలిక్కిపాటుతో చూపు మరల్చుకోవడం గమనించి తనలో తను నవ్వుకున్నది శ్రీప్రియ.


                           *    *    *


    "ఈజిట్ త్రిబుల్ టూ త్రీటూ ఫోర్...."

    "ఎస్...." అవతలివైపు నుంచి రిప్లయ్ వచ్చింది.

    "చక్రవర్తిగారు ఉన్నారండి...."

    అందమయిన లేడీవాయిస్ అడుగుతోంది.

    "నువ్వెవరు బేబీ...."

    "నేను అతనికి కావలసినదానిని...."

    "ఏమిటి....అతనికి కావలసినదానివా....?"

    "ఎస్ మిస్టర్....మాది పర్సనల్ వ్యవహారం కాని ముందు ఆయనను పిలువు...."

    "లుక్ మిస్....నాకు తెలిసి అతనికి కావలసిన వాళ్ళెవరూ లేరే?"

    "నీకు అదంతా చెప్పినా అర్ధంగాదు కానీ....ఇంతకూ ఆయన ఉన్నారా లేదా?"

    "........"

    "ఏమిటి మిస్టర్ మాట్లాడవు...."

    "ముందు అతనితో నీకేం పనో చెప్పు బుజ్జీ...."

    "అదంతా నీకెందుకుగాని బజ్జీ....ముందు చక్రవర్తిగారిని పిలవయ్యా బాబూ"

    "నేనే....చక్రవర్తిని

    "వాట్...."

    "అవును. చక్రవర్తినే మాట్లాడుతున్నాను ఇపుడు చెప్పమ్మా....తమరు ఎవరు?"
 
    "నిజంగా చక్రవర్తిగారేనా మాట్లాడేది?"

    "అవును అంటున్నాను కదా"

    "మీరే చక్రవర్తిగారని నాకు నమ్మకం ఏమిటి?"

    "ఇట్స్ వెరీ సింపుల్__ఫోన్ పెట్టేయడమే"

    "వద్దొద్దు....ఆ పని చేయకండి....ఒక్క ప్రశ్న అడుగుతాను_సమాధానం చెబుతారా?"

    "నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకులేదు. ఫోన్ పెట్టేస్తున్నాను."

    "ప్లీజ్ కొంచెం ఆగండి"

    "సరే చెప్పు"

    "రెండు రోజులక్రితం బుధవారం ఉదయం సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు మీరు ఎక్కడ వున్నారో కొంచెం గుర్తుచేసుకొని చెప్పగలరా?"

    "ఎందుకు....ఏమయినా క్రైం స్టోరీ రాయాలనుకుంటున్నావా?"

    "అదేంకాదుగాని ముందు సమాధానం చెప్పండి"

    "ఒక నగలషాపులో వున్నాను"

    "ఓకే....ఇప్పుడు నమ్ముతున్నాను మీరే చక్రవర్తి అని"

    "ఆ మాట నేను ముందే చెప్పానుగా_ఇంతకూ నాతో నీకేంపని అమ్మడూ...."

    "నా పేరు శ్రీప్రియ....నేను మీకు గుర్తున్నానా?"

    "ఆ పేరుగల వాళ్ళెవరూ నాకు తెలియదు. అసలెందుకు ఫోన్ చేశావు?"

    "మీకు థాంక్స్ చెప్పాలని...."

    "మీరు ఆరోజు శంకర్ దాదా నుంచి నన్ను కాపాడారు కనుక"

    "నేనా....నిన్ను కాపాడటమా?"

    "అవును....ఆ సమయంలో ఆ నగలషాపుకి వచ్చి కాపాడారు కనుక"

    "నేనా....నిన్ను కాపాడటమా?"

    "అవును....ఆ సమయంలో ఆ నగలషాపుకి వచ్చి శంకర్ దాదాతో మీరు తలపడకుండా వుండి వున్నట్టయితే ఆ దాదా కామదాహానికి నేను బలై పోయి వుండేదాన్ని. సమయానికి దేవుడిలా వచ్చి నన్ను కాపాడారు...."

    "సరే, థాంక్స్ చెప్పావుగా....ఫోన్ పెట్టెయ్!"

    "నా మాటలు వింటూ కూడ మీకు ఫోన్ పెట్టేయాలనిపిస్తుందా?"

    "నీ గొంతులో అంత ప్రత్యేకత వుందన్నమాట"

    "కోయిల కంఠంలా లేదూ...."

    "అని నువ్వు అనుకుంటే సరిపోతుందా?"

    "అందుకే మీచేత పొగిడించుకోవాలని...."

    "లుక్ శ్రీప్రియా....నీవు ఏవో ఊహల్లో విహరిస్తున్నట్టున్నావు. ఒక పదిమంది రౌడీలను కొట్టినంత మాత్రాన నేనేమీ హీరోను కాను....నాలాంటి రౌడీతో నీలాంటి ఆడపిల్ల మాట్లాడటమా సభ్యత కాదు....ఫోన్ పెట్టెయ్!"

    "ఒక అందమయిన అమ్మాయి ఫోన్ చేసి థాంక్స్ చెబుతుంటే ఆ అందమయిన మల్లెతీగను అల్లుకుపోదామన్న ఉద్దేశం లేకపోగా మాటిమాటికీ ఫోన్ పెట్టేస్తాను అంటున్న మీరేం మగాళ్ళండీ బాబూ....మీరు అవునన్నా కాదన్నా నేను మిమ్మల్నే ప్రేమిస్తున్నాను....ఐ లవ్ యూ....మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికే నేను ఫోన్ చేసింది...."

    ఆమె నిర్ణయం విన్న చక్రవర్తి అదిరిపడ్డాడు.

    "నా గురించి నీకు తెలియదనుకుంటాను...."

    "ఎందుకు తెలియదు....ఆ రోజు మిమ్మల్ని చూశానుగా"

    "చూడటం కాదు....నేనొక రౌడీని....గూండాను...."

    "అది మీరు పెట్టుకున్న పేరేతప్ప....ఎవరూ పుడుతూనే గూండాలుగా పుట్టరు...."

    "మిస్ శ్రీప్రియా....నువ్వు అనవసరంగా శ్రమపడుతున్నావు. నాతో వాదించినందువల్ల ఎలాంటి ప్రయోజనం వుండదు. ప్రేమించడం నా వృత్తికి విరుద్దం...."

    "తెలుసు....అయినా మిమ్మల్ని వదులుకోలేను....ఎంత శ్రమయినా భరిస్తాను....మీరు నాకు కావాలి...." పట్టుదలగా అందామె.
 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra