Home » Mainanpati bhaskar » Buddijeevi

బాగా వెలుగు వచ్చాక లేచి, నేలంతా పరీక్షగా చూడడం మొదలెట్టాడు అజిత్, నరహరి పాదాల గుర్తుల కోసం.
ఒకవైపు నేలంతా తడి తడిగా కొద్దిగా బురదగా వుంది. దానిలో కనబడ్డాయి నరహరి అడుగుజాడలు. పరిశీలనగా చూశాడు. అవి అంతా మనిషి పాదాల్లాగా ఉన్నాయి. కానీ చాలా పెద్దవి. కుడిపాదం అడుగులు బాగా లోతుగా పడివున్నాయి. ఎడమపాదం గుర్తులు అంత లోతు లేవు. తేలిగ్గా వేసినట్లున్నాయి. అంతేకాదు - ఎడమకాలు కాస్త ఈడుస్తూ వెళ్ళినట్లు కూడా అర్ధమవుతోంది ఆ గుర్తులు చూస్తుంటే.
నిన్నటి పెనుగులాటలో దెబ్బ తగిలి అది కాదు ఈడుస్తూ వెళ్ళి ఉండాలి. అంటే అది ఎంతో దూరం వెళ్ళి ఉండదు. అదే చెప్పాడు అపురూపతో.
గుండెలు గుబగుబ లాడాయి అపురూపకి. అయితే దగ్గరలోనే ఉందా నరహరి?
మైగాడ్! హఠాత్తుగా ఎటువైపు నుంచన్నా చడీ చప్పుడూ లేకుండా వచ్చి మీద పడుతుందా?
అయినా ఈసారి భయంలేదు. అజిత్ పక్కనే ఉన్నాడు. అవును! నిజంగానే భయంలేదు.
అలా తనకి తాను ధైర్యం చెప్పుకుంటూనే ఉన్నా అరచేతుల్లో చెమట పోసింది అపురూపకి భయంతో!
అడుగు జాడలని అనుసరిస్తూ ఒక కిలోమీటరు దూరం వెళ్ళారు.
అక్కడ ఆగిపోయాయి అడుగులు.
మహోధృతంగా ప్రవహిస్తున్న నది కనబడింది అక్కడ.
బహుశా నరహరి ఆ నదిని దాటి వెళ్ళి వుండాలి.
నదిలో అక్కడక్కడ సూదిలా మొనతేలిన బండరాళ్ళు బయటికి పొడుచుకు వచ్చాయి. ఆ బండల మీద ఎండలో బద్ధకంగా నిద్రపోతున్నాయి మొసళ్ళు. నదికి అవతల ఒడ్డున మహాకాయులైన ఇద్దరు రాక్షసులు ద్వారపాలకులలాగా కాపలా కాస్తున్నట్లు రెండు పర్వతాలు వున్నాయి. ఆ రెండు కొండలమధ్యా ఉన్న ఎడం బ్రహ్మాండమైన ద్వారంలా కనబడుతోంది.
ఆ ప్రదేశమంతా కఠిన శిలామయం! చంద్రుడి ఉపరితలాన్ని తలపిస్తోంది నేల. అక్కడక్కడ ముళ్ళపొదలు.
ఏదో దిగులుగా ఉంది అక్కడి వాతావరణం.
"ఆ కొండల అవతల ఏముందో చూడాలి మనం!" అన్నాడు అజిత్.
సన్నటి వణుకు మొదలయింది అపురూపలో. ఆ కొండల అవతల ఏముంటుంది? ఏముంటుంది?
ఎందుకోగానీ, అజిత్ కీ, అపురూపకీ కూడా, తమ ప్రయాణపు చివరి మజిలీ చేరుకున్నామని అనిపించింది. ఆ ప్రదేశం దుష్ట శక్తులన్నింటికీ కేంద్రమేమో అనిపించింది.
"వెనక్కి వెళ్ళి కారు తీసుకుని వద్దాం!" అన్నాడు అజిత్.
తల వూపింది అపురూప నిర్లిప్తంగా.
కారు దగ్గరికి తిరిగి వచ్చారు.
వాళ్ళు ఇందాక గమనించలేదు గానీ కారు ఆగిన చోటికి దగ్గరలోనే చిన్న సరస్సు వుంది. అది చూడగానే అజిత్ మొహంలోకి హుషారు వచ్చింది. "అమ్మయ్య! కొంచెం స్నానంచేసి రిఫ్రెష్ అవ్వచ్చు" అన్నాడు.
నీళ్ళు చల్లగా హాయి గొలిపేలా వున్నాయి. అతను షర్టు విప్పి, ప్యాంటుతోనే సరస్సులోకి దిగి, ఒక పది గజాలు ఈది వచ్చాడు. దానితో అతని స్నానం పూర్తి అయింది.
ఆ తర్వాత అపురూప వెళ్ళి, ఒడ్డుకి దగ్గరగానే కూర్చుని స్నానం చేసింది.
అప్పుడు చూశాడతను ఆ దృశ్యాన్ని! ఆ సరస్సు పక్కనే ఉన్న బండచాటున, రాత్రి అరిచిన తోడేళ్ళన్నీ గుంపుగా చచ్చిపడిపోయి వున్నాయి.
"అపూ! వచ్చెయ్! త్వరగా!" అన్నాడు ఆందోళనగా.
ఉలిక్కిపడి, ఒక్క పరుగులో వచ్చేసింది అపురూప. "ఏమయింది? ఏమయింది?" అంటూ.
తను చూసినది ఆమెకి చెప్పలేదు అజిత్. ఆమె ఇంకా భయపడి పోతుందని.
"ఏమీ లేదు. నువ్వు కార్లో కూర్చో! నేనిప్పుడే వస్తాను" అంటూ ఆ తోడేళ్ళ గుంపుని సమీపించి పరీక్షగా చూశాడు. ఏదో తెగులు తగిలి, హఠాత్తుగా, సామూహికంగా చనిపోయినట్లున్నాయి ఆ తోడేళ్ళు.
ఆలోచిస్తూ వెనక్కి తిరిగివచ్చాడు అజిత్.
కొద్ది క్షణాల తర్వాత కారు స్టార్టయి, మరు నిమిషంలో నదికి అవతల ఉన్న ఆ రాక్షసి కొండమీద దిగింది.
అపురూప గుండె గుబగుబ లాడుతోంది.
ఆ కొండకి అవతలవైపు ఎంత భయంకరమైన దృశ్యం కనబడుతుందో అన్న బెదురుతో, అటువైపుకి చూడడానికే ఆమెకి సాహసం చాలలేదు.
కొండకి అటువైపున ఉన్న లోయలోకి దృష్టి సారించాడు అజిత్.
వెంటనే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. "అపురూపా! చూడు!" అన్నాడు. కళ్ళు తెరిచి, తన కళ్ళని తనే నమ్మలేనట్లు చూసింది అపురూప.
రాబొట్ కేటూ కీచుగొంతుతో ఏవేవో శబ్దాలు చేసింది.
ఆ కొండకి అవతల వాళ్ళు కలలో కూడా ఊహించి ఉండని దృశ్యం!
చుట్టూతా కొండలు. ఆ కొండల మధ్య పచ్చటి లోయ. ఆ లోయకి వడ్డాణంలా వుంది నది.
కనుచూపు మేరవరకూ పచ్చటి చేలు. పిల్లగాలికి తలలూపుతున్నాయి. లోయకి ఒక వైపంతా చిట్టడివి. లోయలో అక్కడక్కడ తోటలు. ఆ తోటల మధ్య ఇళ్ళు.
అవి ఆకాశ హర్మ్యాలు కాదు - మామూలు ఇళ్ళు. బొమ్మరిళ్ళలా కనబడుతున్న చిన్న చిన్న ఇళ్ళు. కొన్ని డాబాలూ, కొన్ని పెంకుటిళ్ళూ, కొన్ని పూరి గుడిసెలూ.
వాటిమధ్య హుషారుగా, నవ్వుతూ, తృళ్ళుతూ, పాటలూ, పదాలూ పాడుకుంటూ పనులు చేసుకుంటున్న జనం.
ఏదో టెక్నికలర్ గా కలలాగా, బహు సుందరంగా వుంది ఆ దృశ్యం.
ఏదో దారుణమైన దృశ్యం కనబడుతుందని వూహిస్తే, దానికి పూర్తి వ్యతిరేకంగా, మనసు పులకించేటట్లు చేసే దృశ్యం కనబడింది. విస్మయంగా ఒకటి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు అజిత్, అపురూపా.
కారుని అక్కడే వదిలేసి, కేటుని దానికి కాపలాగా వుంచి, నెమ్మదిగా కొండ దిగారు.
కొండ దిగగానే చిన్న రోడ్డు కనబడింది. రోడ్డుకి అటూ, ఇటూ పెద్ద సైజు గోడుగుల్లాగా మర్రిచెట్లు, వేపచెట్లు, రావిచెట్లు, కానుగచెట్లూ వున్నాయి. ఆ చెట్లన్నీ ఎండని ఫిల్టర్ చేసి, లేత కాంతిని మాత్రం ప్రసారం చేస్తూ, ఆ రోడ్డు మొత్తానికే సహజమైన ఎయిర్ కండిషన్డ్ ఎఫెక్టుని తెచ్చిపెట్టాయి. చల్లగా వీస్తోంది గాలి. రకరకాల చెట్ల తాలూకు రంగు రంగుల పూలు రాలి, అద్భుతమైన డిజైను వున్న పర్షియన్ తివాచీ పరిచినట్లు కనబడుతోంది రోడ్డు.
ఒకచోట దారి రెండుగా చీలింది. అక్కడ ఇక్ష్వాకుల కాలం నాటిదిలా వున్న ఒక రాతి బోర్డు కనబడుతోంది. ఒక రోడ్డు దాచింపాడుకి వెళుతుందనీ, మరోటి వెనకూరుకి వెళుతుందనీ బాణం గుర్తులు సూచిస్తున్నాయి.
ఒక్కక్షణం ఆలోచించి, దాచింపాడువైపు నడిచారు ఇద్దరూ.
అంతకు ముందురోజే వాన కురిసి వేలిసినట్లుంది అక్కడ. రోడ్డు శుభ్రంగా కడిగినట్లు కనబడుతోంది. తలంటి పోసుకున్నట్లు వున్నాయి చెట్లన్నీ.
'ఎవరీ కొత్త మనుషులు?' అన్నట్లు మొహమాటంగా తలెత్తి చూసింది. ఓ చిన్న నీలిరంగు పువ్వు, బాట పక్కనే వున్న గడ్డిలోనుంచి.
అదే ప్రశ్న అడిగాడు రోడ్డుమీద పోతున్న అపరిచితుడెవరో - అచ్చ తెలుగులో.
"చాలా దూరం నుంచి వస్తున్నట్లున్నారే! మొహాలు వేళ్ళాడిపోయాయి! ఎవరు బాబూ మీరు?" అన్నాడు. అతని గొంతులో కుతూహలంతో బాటు, అభిమానం కూడా వినబడుతోంది.
ఎవరికి వారుగా, ఒంటిపిల్లి రాకాసులుగా బతికేస్తున్న ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఇలాంటి ప్రశ్నా?
"కొండలూ, బండలూ, మొసళ్ళూ, ఇవన్నీ దాటుకుని రావటం సామాన్యమైన పని గాదు! బాగా కష్టపడి వుంటారు పాపం! ఎటునుంచి వచ్చారు? మేకల డొంకవైపు నుంచా? ఆ దారి కొంచెం నయం! ఇంతకీ సుశీలమ్మ పెళ్ళికేనా? ఎవరి తాలూకూ? పెళ్ళికొడుకు తరఫున వచ్చారేమిటి? లేదా మా యావిడ పుట్టింటి..."
ప్రవాహం లాంటి అతని మాటలకు అడ్డుకట్ట వేస్తూ, "మేమొక రాబొట్ ని వెదుక్కుంటూ ఇలా వచ్చాం" అంది అపురూప. వెంటనే ఆమెకి తను ఉన్న స్థితి గుర్తొచ్చింది. చిరిగిపోయి, సగం ఒళ్ళు కనబడుతున్న బట్టలు. ఇబ్బంది పడిపోతూ అజిత్ కి వెనగ్గా నిలబడింది.
అంతవరకూ అజిత్ నే ఎగాదిగా చూస్తూ మాట్లాడుతున్న ఆ ఆసామి, అజిత్ వెనక వెనగ్గానే వస్తున్న అపురూప పరిస్థితి గమనించి, నొచ్చుకుంటూ భుజం మీద ఉన్న కండువా తీసి అందించాడు.
"అయ్యో తల్లీ! ముళ్ళడొంకలు గానీ తగులుకున్నాయా ఏమిటీ ఖర్మ? ఇంటికెళ్ళగానే మీ ఒదిన చీరె కట్టుకుందువుగాన్లే" అని ఏమిటంటావ్ రాబొట్టా? ఈ బ్రహ్మానందం బొబ్బట్టుని చూశాడు. పెసరట్టుని చూశాడు. మినపట్టుని చూశాడు గానీ రాబొట్టుని చూడలేదమ్మోవ్! మీ రాబొట్టు సంగతి నాకు తెలియదు గానీ పెళ్ళికి మాత్రం బొబ్బట్లు చేయిస్తున్నాను. రంజుగా ఉంటుందిలే!" అన్నాడు.
అతను భోలాశంకరుడిలాంటి వాడనీ, కాస్త వాగుడుకాయ అనీ అర్ధమయింది ఇద్దరికీ.
చిత్రంగా ఉంది ఇది!
ఊరి పేరు దాచింపాడు. ఆ పక్కనే వెనకూరు. ఈ ఆసామి పేరు బ్రహ్మానందం. పెళ్ళిళ్ళూ, బంధుమిత్రులు రావడాలూ, బొబ్బట్లలాంటి అచ్చమైన తెలుగు పిండి వంటలూ-
ఫ్లయింగ్ సాసర్ ని వెదుక్కుంటూ ఒక మారుమూల ఉన్న తెలుగు పల్లెటూరు చేరుకున్నారన్న మాట - తెలియకుండానే!
చుట్టూతా కొండలూ, కోసుగా ఉన్న బండలూ, తొండలు కాపురం చేసే రాతి ప్రదేశం, ముళ్ళ డొంకలూ, ఈదడానికీ, తెప్పతో దాటడానికీ సాధ్యంకాని నదీ, దానిలో మొసళ్ళూ - ఇన్ని కారణాల వల్ల ఆ చిన్న లోయకి మిగతా ప్రపంచంతో ఎక్కువ సంబంధం పెరగలేదు. ఇరవయ్యో శతాబ్దపు మొదటి భాగంలోనే ఉండిపోయింది. ఇరవైఒకటో శతాబ్దపు నాగరికత ఇంకా వ్యాపించలేదు అక్కడ.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra