Home » Suryadevara rammohan rao » త్రినేత్రుడు-1


    సుదర్శన్ రావు ఆవేశంతో రొప్పుతున్నాడు. తనింత చేసినా వీడు చలించలేదేమన్న కసి, కోపం అతన్ని ఉన్మత్తుణ్ణి చేసింది.

    ఆ నేలమాళిగలో అప్పుడప్పుడు ఇలాంటి చిత్రహింసలు, బెదిరించటాలు, బ్రెయిన్ వాష్ చేయటాలు మామూలే కనుక ఆశ్చర్యపోలేదు కాని, తిమ్మడి ధైర్యానికి బిత్తరపోయారు అక్కడ కాపున్న సుదర్శన్ రావు సిబ్బంది.

    కొరడా ఇప్పుడు ప్రియాంక చేతిలో వుంది. అది ఆమె నాజూకైన చేతివేళ్ళ మధ్య వుండుండి కదులుతోంది తమాషాగా.

    "తెగేదాకా లాగేది మగాడు- తెగాక నిర్ణయం తీసుకొనేది ఆడది. కాని ఇక్కడ అది తిరగబడింది- తెగేదాకా లాగావు నువ్వు, తెగింది కనుక ఇకిప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నేను..." తిమ్మడి కళ్ళు క్రమంగా ఎర్ర జీరను సంతరించుకుంటున్నాయి.

    "లాగినా, తెగినా, తెగేదాకా లాగినా నువ్వేం చేయగలవు...? నువ్వొక వెధవ్వి... చదువురాని శుంఠవి... పనీపాటా లేక బలాదూర్ తిరిగే బేవార్స్ గాడివి... నిన్ను కోట్లసార్లు అమ్మి మిలియన్ టైమ్స్ కొనగల బిజినెస్ టైకూన్ నా కూతురు. అపార సంపదలకు పారిశ్రామిక సామ్రాజ్యానికి, పలుకుబడికి నా కూతురు వారసురాలు. దాని కాలిగోటికి కాదు- ఖరీదైన ఆ కాలి చెప్పుతో లేచే ధూళి కణానికి నీవు సరిపడవు" అంటూ హేళనగా నవ్వాడు సుదర్శన్ రావు.

    పరాభవం, అవమానం, మోసం, వంచన ఇంత దారుణంగా వుంటుందని, అది మనిషిని ప్రత్యక్షంగా చంపుతుందని తొలిసారి అనుభవంలోకి వచ్చింది తిమ్మడికి.

    పరాభవంలోంచి ఉద్భవించిన కోపంతో తిమ్మడి కండరాలు ఉక్కు ముక్కలయ్యాయి. ఆవేశంతో అతని ముక్కుపుటాలు అదిరిపడుతున్నాయి. కసి, కోపంతో కళ్ళు రక్తవర్ణం దాల్చాయి.

    అడవిలో స్వేచ్చగా తిరిగే రాయల్ బెంగాల్ టైగర్ ని గాయపరచి బోనులో బంధిస్తే ఎలా వుంటుందో అలా వున్నాడు తిమ్మడిప్పుడు. 

    ప్రియాంకవైపు తిరిగాడు తిమ్మడు- "ఒక ఆడదానిలో స్త్రీతనం పోయాక అది మనిషే కాదు- రాక్షసి. నీకు బలం వుంది కనుక నన్ను బంధించావ్. హంగు, ఆర్భాటం వున్నాయి కనుక హింసించావ్. పొగరు, మదం వున్నాయి కనుక పరాభవించావ్. నీ తండ్రి మాటే నీదయినప్పుడు నా మాటలూ విను. ఇంతకింతకు శాస్తి చేస్తాను. చెడ్డదారిన, దొడ్డిదారిన నీ తండ్రి ఎంతో సంపాదించవచ్చు. అందుకు పాతిక ముప్పై సంవత్సరాలు ఖర్చుపెట్టి వుండవచ్చు. నాకంత సమయం అక్కర్లేదు. చెడుదారిన నడవకుండా, ఎవర్నీ మోసం చేయకుండా, ముంచకుండా కేవలం కొన్ని సంవత్సరాలలోనే నీ తండ్రి ఆస్తికి రెండింతలు సంపాదిస్తాను. మంచి, మానవత్వం అంటే తెలియని నీవు, నీ తండ్రి అవి నా దగ్గర నేర్చుకోవాలి. అహంభావంతో విర్రవీగే నీవు నా కాళ్ళ దగ్గరకు వస్తావు. రప్పిస్తాను. డబ్బుతో పొగరెక్కి ఎందరో మంచివాళ్ళకు సయితం కాళ్ళకు బుద్ధిచెప్పే నీ తండ్రి నా కాళ్ళు కడుగుతాడు. ఏమన్నాడు నీ తండ్రి? నాకు చదువు లేదు- పైసా ఆస్తిలేదు- కోటిసార్లు కొని మిలియన్ సార్లు అమ్మగలడు- అంతేగదా?

    సంపాదనకు చదువే అక్కర్లేదని రుజువుచేసిన మహానుభావులు చాలామందున్నారు. ఇక చదువు సంస్కారం నేర్పదనడానికి నువ్వే ఉదాహరణ.

    నేను మనిషినే అయితే, నాకు ఆత్మాభిమానం వుంటే, ఇంతకింతకు చేస్తాను. నాకు తెలివితేటలు, పట్టుదల వుంటే అంతకంతకు సంపాదిస్తాను. శ్రమ విలువ తెలిస్తే నా ప్రతి చెమట చుక్క ఒక లక్షగా మారుతుంది.

    దెబ్బ తిన్న పులిలో, పగబట్టిన పాములో వుండే కసికి లక్ష్యశుద్ధి తోడైతే ఎంతటి వేటగాడికైనా దుర్మరణం తప్పదు..." ఒక్కో మాట ఒక్కో బుల్లెట్ లా వచ్చింది తిమ్మడి నోటివెంట.

    తిమ్మడి ఛాలెంజ్ కి, ఆవేశానికి తండ్రి, కూతుర్లు విస్తుపోయినా వెంటనే తేరుకున్నారు.

    "శెభాష్... చేతలో పౌరుషం వుంది. ఒక టీ కప్పుకి ఠికానా లేదు.... కోట్లు సంపాదిస్తావా?

    పొట్టకోస్తే అక్షరం ముక్కలేదు... ప్రతి పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చి, విదేశాలలో సైతం చదవబోయే నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటావా...? పిచ్చివాడా! ఈ సుదర్శనరావును తక్కువ అంచనా వేయవద్దు. సర్వనాశనం అయిపోతావ్" సుదర్శన్ రావుకి ఆవేశంలో మాటలు తడబడుతున్నాయి.

    "చదువు, తెలివితేటలకు సంబంధం లేదు మిస్టర్ సుదర్శన్ రావు! వుంటే ఆ బిల్డింగ్ ప్లాన్ నీ కూతురే చెప్పగలిగేది. నన్ను ప్రాధేయపడక్కర్లేదు. చదువులో గొప్పయితే ఆ చదువునే ఉపయోగించుకోగలరు. చదువు నేర్పేది తక్కువ. నేర్పనివి చాలా ఎక్కువ. ఆ ఎక్కువతో అలాంటి తక్కువల్ని నా గుప్పిట్లోకి తెచ్చుకుంటాను.

    నీవు నాకు చేసిన పరాభవాన్ని మ్రింగను. నాకు నేనేమిటో తెలుసు. ఈ జనం ఏమిటో తెలుసు. ఆ జనం గురించి ఏ చదువు చెప్పదు.

    మీకు... నాకు అనివార్యం యుద్ధం. దమ్ముంటే పందానికి సిద్ధపడు..." తిమ్మడి మాటలతో ఆ నిశ్శబ్దపు నేలమాళిగ ప్రతిధ్వనించిపోతోంది.

    తిమ్మడి మాటలకు సుదర్శన్ రావు తేలిగ్గా నవ్వాడు.

    కాని, ప్రియాంక మాత్రం విస్మయంతో ఆలోచనల్లో పడింది ఒకింతసేపు.

    హిందూ, సైంటిస్ట్, ఇంజనీర్ లయితే ఊహించని ఓ అద్భుతాన్ని, ఆలోచనకే అందని విశ్వరూపాన్ని చూస్తున్నట్లు విభ్రమకు గురయ్యారు.

    ఏమిటితను...? ఏం చూసుకొని ఆ ఆత్మవిశ్వాసం? ఏం వుందని? ఏం చెయ్యగలడని ఆ ఛాలెంజ్?

    ఒక్క సుదర్శనరావు తప్ప, మిగతా అందరూ తిమ్మడిలో వేరే వ్యక్తిని చూస్తున్నారు. తిమ్మడి కళ్ళలో కనిపించే కసి, పట్టుదల, మాటల్లో వినిపించే విశ్వాసం వారి మతుల్ని పోగొట్టాయి.

    ముందుగా తేరుకున్న ప్రియాంక అంది. "నిజంగా నీవా ఎత్తుకే ఎదగ గలిగితే నేనే నీ కాళ్ళ దగ్గరకొస్తాను. లేనినాడు నీవు నీ జీవితాంతం నాకు కట్టుబానిసవు కావాలి. ఛాలెంజ్ కి మేం సిద్ధం. గడువెంత కావాలి...? పదా ఇరవయ్యా... ఎన్ని సంవత్సరాలు? ఎందుకంటే నీకు సామర్ధ్యం లేక గడువెక్కువడిగితే నేనప్పటికి వృద్ధకన్యనవుతాను. అప్పుడు నువ్వు అనుభవించటానికి నా దగ్గరేం వుండవు, ఉడిగిపోతాయి. పరాభవించటానికి ఇప్పటి స్థాయి, అహంభావం మాలో వుండకపోవచ్చు. కమాన్... టెల్ మీ... ఎంత కాలం?" ప్రియాంక ఆ మాటలు నిజంగా అందో, లేక తమాషా కందో తెలియక అందరూ ఖిన్నులైపోయారు.

    అంతమంది అక్కడున్నా, అంతకు ముందే ఎంతో అల్లకల్లోలం అక్కడ జరిగినా, వాటి తాలూకు ఆనవాళ్ళు లేవక్కడ ఇప్పుడు.

    ఆ హాలు నాలుగుగోడల మధ్య పేరుకున్న నిశ్శబ్దం ఒక్కొక్కర్ని ఒక్కో రకంగా ఆలోచింపజేస్తోంది.

    ఆ నిశీధి నిశ్శబ్దాన్ని చీల్చుతూ అన్నాడు తిమ్మడు. "సెభాష్... అదీ పౌరుషం అంటే. నేనీ ఛాలెంజ్ కి సిద్ధం. నీ వయస్సిప్పుడు ఇరవై. నా వయస్సు ఇప్పుడు 24. నీవు ఇప్పటి నా వయస్సు కొచ్చే కాలం చాలు. అంటే అర్ధమయిందా? నాలుగు సంవత్సరాలు. నీవన్నది నిజమే. నిన్ను, నీ అనన్య సామాన్యమైన అందాన్ని అనుభవించటానికి, నీ పొగరు అణచటానికి నాకు ఛాన్స్ మిగలాలంటే నీకు 24, నాకు 28 వుండాలి. కాని పందానికి నిలబడతావన్న నమ్మకం?" అనుమానంగా ప్రశ్నించాడు తిమ్మడు.

    తిమ్మడి ప్రవర్తనలో, మాట తీరులో, చూపుల్లో వచ్చిన మార్పును పసిగట్టింది ప్రియాంక.

    "నమ్మకం ఎలా కలిగించాలి?" ప్రియాంక తమాషాగా చూస్తూ అడిగింది.

    "వాడితో ఈ న్యూసెన్స్ ఏంటి బేబీ? నాలుగు తన్ని పంపించక" సుదర్శనరావు అసహనంగా అన్నాడు.

    "అదంత తేలికే అయినా, నా కట్లు విప్పి చూడు. నాలుగు తంతావో, తన్నించుకుంటావో..." తిమ్మడి మాటలకు ఉగ్రుడయ్యాడు సుదర్శనరావు.

    కోపంగా మీదకు పోబోతున్న తండ్రిని ప్రియాంక కళ్ళతోనే సైగ చేసింది ఆగిపొమ్మని.

    ఇవన్నీ అయ్యేవి కావు... ఒకవేళ అయినా వీడికి నా కూతుర్ని ఇవ్వక పోయినా వీడు చేయగలిగిందేం లేదు. కనుక కూతురు కోసం ఆగిపోవటం బెటర్ అనుకున్నాడు సుదర్శనరావు.

    "మనిషిగా మాట నిలబెట్టుకో- ఆడదానిగా ఆడతనాన్ని మిగుల్చుకో- చాలు" అన్నాడు తిమ్మడు.

    "ఓ.కే" అంది ప్రియాంక.

    "మరీ పందానికి మీ నాన్నకూడా అంగీకరించాలి" కండీషన్ పెట్టాడు తిమ్మడు.

    ప్రియాంక తండ్రివైపు చూసింది ఒప్పుకోమన్నట్లుగా. అప్పటికే ఎగ్రిమెంట్ ని ఎలా ఎవాయిడ్ చేయాలన్నది ఆలోచించాడు గనుక, తిమ్మడివేపు ఒప్పుకున్నట్లుగా తలూపాడు.

    "నీ కూతుర్ని నమ్ముతాను. నిన్ను నమ్మను. కనుక ఒక తెల్లకాగితం మీద రాసి సంతకాలు పెట్టి మార్చుకుందాం" అన్నాడు తిమ్మడు కవ్వింపుగా.

    సర్రున కోపం వచ్చింది సుదర్శనరావుకి, మరలా కూతురి కోసమే ఆగిపోయాడు.

    క్షణాల్లో అందరి కట్లు విప్పదీయబడ్డాయి. ఒకడు పరుగెత్తుకెళ్ళి తెల్ల కాగితాలు తెచ్చాడు.

    తిమ్మడు చటుక్కున ఒక కాగితం తీసుకొని తన బొటనవేలుకి సిరా రాసి ఆ కాగితం క్రింద ముద్ర వేసి ప్రియాంకవేపు నిర్లక్ష్యంగా విసిరాడు. ఇక్కడే మొదలయ్యాయి తిమ్మడి తెలివితేటలు. అప్పుడే తన అహం తెచ్చే చేటుకి అంకురార్పణ జరిగింది సుదర్శనరావు విషయంలో.

    తిమ్మడి కాగితంవేపు హేళనగా చూసి దాన్ని చింపబోయాడు సుదర్శనరావు. ఆ ప్రయత్నాన్ని ప్రియాంక ఆపింది.

    "వీడికి చిల్లిగవ్వ ఆస్థి లేదు. వీసమెత్తు పలుకుబడి లేదు. గడ్డిపూచంత పరువు, ప్రతిష్టలు లేవు. వాడు వేలిముద్రేసిన కాగితం దేనికి పనికొస్తుంది బేబీ?"

    "అదే తెలిసి చేసే పొరపాటు డాడీ..." అంటూ ప్రియాంక ఆ కాగితాన్ని తీసుకొని మడిచి తన దగ్గరుంచుకుంది.

    మరో తెల్లకాగితం మీద సుదర్శనరావు సంతకం చేసి తిమ్మడివైపు విసిరాడు.

    "అలా కాగితం మీద సంతకం చేసి ఇవ్వడం ప్రమాదమేమో డాడీ" అనుమానంగా అంది ప్రియాంక.

    ఆ హాలు ప్రతిధ్వనించేలా నవ్వాడాయన. "నా సంతకం వున్నా వీడేం చేయగలడు బేబీ?" అన్నాడు. అక్కడే తిమ్మడి తక్కువ అంచనా వేశాడు సుదర్శనరావు.

    నేలమాళిగ నుంచి బయటకు వస్తుండగా హిందూ మనసులో అనుకుంది. చంపేస్తాడనుకున్న సుదర్శనరావు- ఏం చేయగలడు అనుకున్న తిమ్మడు- అన్నీ తారుమారయ్యాయి. అలా చేయగలిగాడు తిమ్మడు.

    ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిని ఎంత చాకచక్యంగా మార్చగలిగాడు! ఎంత గొప్ప డ్రామా ఆడాడు! తండ్రి, కూతుర్లను ఎంత తెలివిగా దారిమళ్ళించి ట్రాప్ చేశాడు! తన అంచనాలకు మించిన తెలివితేటలు కలవాడు తిమ్మడు. సాధారణమైనవాడు కాదు.

    చూడాలి ఈ ఛాలెంజ్ ఎక్కడికి దారితీస్తుందో...?

    తండ్రి, కూతుర్లు బయటకు వచ్చారు నేలమాళిగనుంచి.

    తిమ్మడు గెలవకపోయినా ఏదో ఒకటి చేయగలడన్న అనుమానం ప్రియాంకలో లీలగా మెదలాడింది.

    హిందూ, తిమ్మడు, ఇంజనీర్, సైంటిస్ట్ సుదర్శనరావు ఇంటి ముందున్న తోటలోకి వచ్చేసరికి బిలబిలమంటూ పదిమంది పోలీసులు ఎస్.ఐ. రాఘవతో పాటు లోపలకు వస్తూ కనిపించారు.

    వారి వాలకం చూస్తుంటే జరగబోతున్న ప్రమాదాన్ని అడ్డుకునేందుకు వచ్చేవారిలా కనిపిస్తున్నారు. ఈలోపు సుదర్శనరావు, ప్రియాంక దృష్టిలో పడ్డారు పోలీసులు.

    అప్పటికే సుదర్శనరావు పసిగట్టాడు- విషయం పోలీసులకు తెలిసుంటుందని. పోలీసులు, తిమ్మడు గ్రూప్, సుదర్శనరావు, ప్రియాంకలు ఓచోటకు చేరుకుని ఆగిపోయారు.     

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra