Home » Vasireddy seeta devi novels » Rabandulu Ramachilukalu


    ఆమె పాడినంత సేపూ విద్యార్ధులు అల్లరి మర్చిపోయి మంత్ర ముగ్దుల్లా కూర్చున్నారు.

 

    పాట ముగిసింది. కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి. సునంద సభకు వినయంగా నమస్కరించి వేదిక దిగింది.

 

    సునంద జరీ అంచువున్న తెల్లటి ఉప్పాడ నూలు చీరలో నిరాడంబరంగా వుంది. కళ్ళు చెదరగొట్టే అలంకరణలముందు, ఆమె సహజసౌందర్యం అందరికీ రిలీఫ్ గా అనిపించింది. కళ్లకు హాయిగా వున్నట్టనిపించింది.

 

    సునందను ఆ కాలేజీలో చాలామంది కుర్రాళ్లు గౌరవిస్తారు, ఆమెను పని కట్టుకుని అల్లరిచెయ్యాలని వచ్చినవాళ్ళు కూడా ఆ రోజు ఆమెను అల్లరిచెయ్యలేక పోయారు.

 

    మీటింగ్ ప్రారంభమయింది. ఆనాటి సభకు విద్యాశాఖాధికారి అధ్యక్షత వహించాడు. ప్రిన్స్ పాల్ అతిధులను ఆహ్వానించాడు. విద్యాశాఖాధికారి విద్యార్ధుల కర్తవ్యాన్ని గురించీ, వారి బాధ్యతల గురించీ బోధిస్తూ వుంటే, అల్లరి మళ్లీ ప్రారంభమయింది. ఉపన్యాసాలు ముగిశాయి.

 

    కల్చరల్ ప్రోగ్రాం ప్రారంభం అయింది.

 

    కొందరు విద్యార్ధులూ, విద్యార్ధినులూ, లెక్చరర్స్ ను ఇమిటేట్ చేశారు.

 

    కొందరు ఫ్యాన్సీ డ్రెస్సులు కట్టారు.

 

    చివరి కార్యక్రమం రాణీ చేసిన కూచిపూడి నృత్యం, భామాకలాపం అద్భుతంగా చేసింది. జడముందుకు వేసుకుని, రెండు కాలి బొటనవ్రేళ్లు ఒక దాని మీద ఒకటిపెట్టింది. ఒక చేత్తో జడని వయ్యారంగా ఊపుతూ ఒకచేత్తో చీరకుచ్చీళ్ళు పట్టుకుని, బొటనవ్రేళ్ల మీద కదులుతూ ముందుకు నడుస్తుంటే, కరతాళ ధ్వనులతో ఆ వాతావరణం మారుమ్రోగింది.

 

    నృత్యం ముగిసింది.

 

    స్టేజిమీద మళ్లీ బెంచీలు, కుర్చీలు వేశారు. కలెక్టర్ గారి సతీమణి బహుమతి ప్రధానం చేసింది.

 

    ఆ మూడు సంవత్సరాలలో ఆదర్శ విద్యార్ధినిగా బెస్ట్ కాండక్ట్ ప్రైజ్ ముందుగా సునంద అందుకొన్నది. హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ఆ రోజు తన పాటతో మంత్ర ముగ్ధుల్ని చేసిన సునందకు కలెక్టర్ సతీమణి స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నట్టు ఎనౌన్స్ చేసింది.నృత్యం చేసిన రాణీకి, ఫ్యాన్సీ డ్రెస్ లో ఎరుకలసాని వేషం వేసిన రాజేశ్వరికి కూడా స్పెషల్ ప్రైజ్ లు ఇచ్చారు.

 

    ఆటల్లో, డిబేట్ లో ఫస్ట్, సెకండ్ వచ్చినవారికి ప్రైజ్ లు ఇచ్చారు.

 

    జన గణ మనతో సభ ముగిసింది.

 

    సునంద చేతిలో కప్పులు పట్టుకుని వస్తూంటే కారు దగ్గర నిలబడి వున్న రాని పిల్చింది.

 

    "రా! సునందా! మా కారులో డ్రాప్ చేస్తాను" అన్నది రాణి.

 

    "అక్కరలేదులే రాణీ! దగ్గిరేగా! లలితకోసం చూస్తున్నాను. ఇద్దరం కలిసి రిక్షాలో వెళ్తాం" అన్నది సునంద మొహమాటపడుతూ.

 

    "పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తాను. పొద్దు పోయిందిగా? లలితను కూడా పిలువు!" అన్నది రాణి.

 

    లలితను వెతుక్కుంటూ వెళ్ళిన సునంద ఐదు నిముషాల తర్వాత ఒంటరిగా తిరిగి వచ్చింది.

 

    "ఏది? లలిత రాలేదేం?" రాణి అడిగింది. సునంద ఏం చెప్పాలో తోచక తికమక పడింది.

 

    అంతలో లలిత, సుజాత, ప్రభా, మరో ముగ్గురు అబ్బాయిలూ, కలసి నవ్వుతూ, పేలుతూ బయటికి వస్తున్నారు. వాళ్లను చూసి రాణి ముసిముసిగా నవ్వింది.

 

    "అయితే లలిత నీతో రానన్నదన్నమాట!" అన్నది రాణి.

 

    సునంద మాట్లాడలేదు. మౌనంగా వెళ్ళి రాణీ పక్కన కార్లో కూర్చుంది.

 

    హాస్టల్ ముందు కారు ఆగింది.

 

    సునంద దిగి రాణీకి థాంక్స్ చెప్పింది.

 

    "సునందా ఒకసారి మా యింటికి రాకూడదూ?" ఆహ్వానించింది రాణి.

 

    "ఎందుకురాను, వస్తాను" మర్యాదకోసం అన్నట్టు పొడిపొడిగా అన్నది సునంద.

 

    "వస్తానంటే కాదు? ఎప్పుడువస్తావో చెప్పు?"


    
    "ఎప్పుడో ఒకసారి వస్తాగా?"

 

    "అదేం కుదరదు. ఖచ్చితంగా చెప్పాలి. రేపు ఆదివారమేగా? హాస్టల్లో కూర్చుని ఏం చేస్తావ్? నేను సరిగ్గా రెండు గంటలకు వస్తాను. రెడీగా వుండు. మా యింటికి వెళ్దాం! ఆ తర్వాత సాయంకాలం క్లబ్బు కెళదాం!" గబగబా అనేసింది రాణి.

 

    సునంద ఆలోచనలో పడింది.

 

    "ఏమిటంతగా ఆలోచిస్తున్నావ్? మా యింటికి రాకూడదా?" రాణి నిరుత్సాహ పడిపోయింది.

 

    "అబ్బే! అదికాదు....ఎందుకురాను, వస్తాను" అనేసింది సునంద.

 

    "ఓ కే! రేపు రెండు గంటలకు వస్తాను. తయారుగా వుండాలి సుమా!" అన్నది రాణి.

 

    సునంద తల వూపింది.

 

    కారు కదిలింది. రాణి చెయ్యి బయటికి పెట్టి వేవ్ చేసింది. సునంద కూడా చెయ్యి ఆడించింది యాంత్రికంగా.

 

    ఆలోచిస్తూ హాస్టల్లోకి నడిచింది.


                                             10


    మధ్యాహ్నం భోజనం గంట మ్రోగింది. హాస్టల్ గదులకు తాళాలు వేసి ఒక్కొక్కరే డైనింగ్ హాలు చేరుకుంటున్నారు.

 

    లలిత కూడా గంట వినగానే చదువుతున్న నవల పక్కన పడేసి లేచింది.

 

    సునంద పుస్తకం చదువుతున్నది శ్రద్ధగా.

 

    "సునందా! భోజనం బెల్ కొట్టారు" లలిత బయటికి వస్తూ అన్నది.

 

    "వస్తాలే! ఈ రెండు పేజీలూ చదివేసి వస్తాను" అన్నది సునంద పుస్తకం మీదనుంచి కళ్ళు మరల్చకుండానే.

 

    "పుస్తకం పురుగు!" మనసులో అనుకుంది లలిత. పైకి "తాళం వేసి వస్తావుగా?" అన్నది.

 

    "ఆఁ !" అన్నది సునంద.

 

    కూనిరాగం తీస్తూ, చెంగుచెంగున మెట్లుదిగుతున్న లలిత, గేటులోనుంచి లోపలకు వస్తున్న వ్యక్తిని చూసి చివర మెట్టుమీదే నిలబడిపోయింది.

 

    మోకాళ్ళవరకు మడిచికట్టిన నీరుకాని పంచ, కంటెమెడ చొక్కా, తలగుడ్డ, ఒక చేతిలో ఉగ్గంకట్టిన నేతి తపేలా, రెండో చేతిలో పురికొసలు బిగించిన తాటాకులబుట్టా _ ఎండలో చెమట్లు కక్కుతూ నడిచివస్తున్న తండ్రి కన్పించాడు.

 

    లలిత మెట్టుదిగి వరండాలో నిల్చుని గాబరాగా నలువైపులా చూసింది.

 

    దాదాపు అందరూ డైనింగుహాలుకు చేరుకున్నారు. కొందరు కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు.

 

    లలిత తండ్రికి ఎదురు నడిచింది. వయసుకు మించిన వృద్ధాప్యంతో వడలిపోయి, అలసిపోయివున్న అతని ముఖం, కూతుర్ని చూడగానే వికసించింది. కాంతి క్షీణించిన ఆ కళ్ళలో లీలగా వెలుగురేఖ కదిలింది.

 

    "ఏం తల్లీ! బాగున్నావా?" అడిగాడు లలిత తండ్రి, కూతుర్ని ఆప్యాయంగా చూసుకుంటూ.

 

    "ఆఁ ఆఁ బాగానే వున్నాను" అంటూ ఓసారి అటూ ఇటూ చూసి విజిటర్స్ రూంలోకి దారి తీసింది.

 

    విజిటర్స్ రూంలో ప్రవేశించగానే లలిత, తండ్రి చేతుల్లోవున్న సామాను అందుకొని పక్కగా పెట్టింది.

 

    లలిత నిల్చొనేవుంది. తండ్రిని కూడా కూర్చోమనలేదు. ముళ్ళమీద నిల్చున్నట్టుంది లలిత ముఖం.

 

    తండ్రి రొంటిన దాచిన డబ్బు బయటికి తీశాడు. నోట్ల పొత్తి నలిగి చెమటకు తడిసివుంది. మరోసారి లలిత వాకిలికేసి చూసి, కళ్ళు తండ్రి చేతిలోని నోట్లకేసి తిప్పింది.

 

    "రెండువందలు!"అంటూ నోట్లకట్ట కూతురికి అందించాడు.

 

    లలిత మౌనంగా అందుకుంది.

 

    "అమ్మాయ్! ఈ డబ్బు వచ్చే పంటమీద అప్పుతీసుకొచ్చాను. అదీ అతికష్టంమీద పుట్టింది" తండ్రి ఆగి కోతురి ముఖంలోకి చూశాడు.

 

    లలిత మౌనంగా నిల్చుంది.

 

    "పొదుపుగా వాడుకొని పరీక్షలయేదాకా గడుపుకోవాలి తల్లీ అన్నాడు పొడిపొడిగా.

 

    లలిత కళ్ళు వరండా వైపే వున్నాయి.

 

    "సరేలే నాన్నా!" అన్నది హడావిడి పడిపోతూ.

 

    "అమ్మాయ్ కాసిని మంచినీళ్ళివ్వు తల్లీ!" తలగుడ్డతీసి ముఖం తుడుచుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు.

 

    లలిత హడావిడిగా మేడమీదకు పరిగెత్తింది. అప్పుడే తలుపులు మూసి తాళం వేస్తున్న సునందను ఆగమని గ్లాసునిండా మంచినీళ్ళు తీసుకొని పరుగులాంటి నడకతో మళ్ళీ కిందకు వచ్చింది.

 

    సునందకు లలిత ఎందుకంత హడావిడి పడిపోతున్నదో అర్ధం కాలేదు. ఏదో అడగబోయి, లలిత ముఖం చూసి మానేసింది.

 

    కూతురు అందించిన గ్లాసుడు మంచి నీళ్ళూ గటగటా తాగేసి ఖాళీ గ్లాసు కిందపెట్టాడు. కొంత సేదతీరినట్టు అనిపించింది.

 

    "నేనింకా అన్నం తినలేదు. బెల్ కొట్టి చాలాసేపయింది. నాకు బజారు వెళ్ళాల్సిన పని కూడా వుంది నాన్నా!" అన్నది లలిత ఎవరో వెనకనుంచి తరుముకొస్తున్నట్టు గాబరా పడిపోతూ.

 

    ముడతలుపడి, అలసటతో బరువుగా వున్న కనురెప్పల్ని ఎత్తి కూతురి ముఖంలోకి పరిశీలనగా చూశాడు. గాజు కళ్ళలా జీవరహితంగా వున్న ఆ కళ్ళలో లీలగా నీలినీడలు పారాడటం కన్పించింది లలితకు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra