Home » Kommuri venugopala rao » Medalo Needalu


    ఆయన ముఖంలో మళ్ళీ ఆశ్చర్యం ప్రతిఫలించింది. "ఇది టైఫాయిడ్ కాదు" అన్నాడు.

 

    సుందరం హృదయానికి ఊరట కలిగినట్లయింది.

 

    కాని ఇంతలోనే ఆయన పిడుగుపడినట్లుగా "ఇది టి.బి." అన్నాడు.

 

    సుందరానికి నెత్తిమీద ఎవరో మోదినట్లయింది. విద్యుద్ఘాతం తగిలినట్లుగా వణికాడు. డాక్టరువంక జాలిగా చూశాడు.

 

    ఆయన అతని భుజం తట్టి ధైర్యం చెబుతూన్నట్లుగా "భయపడుతున్నావా మైడియర్ యంగ్ మేన్? అలాంటిదేమీ అవసరంలేదు. చాలా ప్రిలిమినరీ స్టేజెస్ లో వుంది. అసలు చెప్పాలంటే గ్లాండ్స్ వాచాయంతే. ఇలాంటి కేసులు నేను ఎన్నో నయంచేశాను. వరుసగా రోజూ నా దగ్గరకు పదిహేనురోజుల పాటు వచ్చావంటే, రోగాన్ని నామరూపాలు లేకుండా చెయ్యగల్ను. డెయిలీ వన్ యింజక్షన్. దట్స్ ఆల్" అని లోపలికి పోయాడు.

 

    సుందరానికి ఆయన మాటలేం వినిపించడంలేదు. టి.బి.! టి.బి.! టి.బి! ఇదివరకు ఎవరికో వచ్చిందని తెలిస్తే అయ్యో అని జాలిపడే సన్నివేశం. చివరకు ఎకాయెకి వచ్చి తననే చుట్టుముట్టినప్పుడు... అతని కళ్ళముందు చీకటిచీలికలు ఏర్పడినాయి.

 

    డాక్టరు లోపలినుండి ఒకచేత్తో పెద్ద కిరసనాయిల్ సీసావంటి సీసాతో గదిలోకి వచ్చాడు. రెండోచేతిలో ఇంజక్షన్ సిరంజి వుంది. ఆ సీసాలో సగానికి పైగా ఎర్రని ద్రావకం వుంది.

 

    సుందరం ఆయనవంక భావశూన్యంగా చూస్తున్నాడు. ఆయన ద్రావకం సీసా మూతివరకూ వచ్చేటట్లు సీసావంచి, అందులో సిరంజి ముంచి లోపలికి ఎక్కిస్తున్నాడు. మందు ఎక్కిస్తూ అన్నాడు. "నీవు వాడి దగ్గరికీ, వీడిదగ్గరకూ పోకుండా నా దగ్గరకు రావటం మంచిపని చేశావు వాళ్లు బ్లెడ్ టెస్టు అనీ, ఈ మందులవీ చెప్పి హడలగొట్టేస్తారు. ఈ మందు నేను కనిపెట్టాను. ఇది వజ్రాయుధంలాంటిది. ఇది తీసుకుంటే ఇంకేమీ వాడనక్కరలేదు. దీన్నిప్పుడు మదనపల్లి శానిటోరియంలో తెగ వాడుతున్నారు. ఇందులో సిరంజి స్టెరిలైజ్ చేయనక్కరలేదు." మందు ఎక్కించటం పూర్తిచేసి ఆయన సుందరం దగ్గరకు వస్తూ "బటల్ మీద యిస్తాను" అన్నాడు.

 

    సుందరానికి యీ వాలకం చూస్తే ఆ అయోమయస్థితిలో కూడా విపరీతమయిన భయం వేసింది. ఏమైనాసరే ఇంజక్షన్ తీసుకోకూడదనుకున్నాడు. ఇదెక్కడి ఇంజక్షన యివ్వటం! కాని తన ఇష్టాఇష్టాలతో ప్రమేయంలేకుండా ఆ విచిత్రమైన డాక్టరు తనపని తను చేసేస్తున్నాడు.

 

    ఇహ చేసేదిలేక "పడుకుంటాను" అన్నాడు సుందరం హీనస్వరంతో.

 

    "నో నో నాట్ నెససరీ. బటల్ మీదనయినా సరే కూర్చోపెట్టి చేసెయ్యటమే నా స్పెషాలిటీ" అంటూనే ఆయన కిసుక్కుమణి పొడిచేశాడు.

 

    సుందరానికి వర్ణించనలవిగాని బాధ కలిగింది. గట్టిగా కళ్ళు మూసుకుని పెదవులు బిగపెట్టాడు.

 

    "ఏమీ నెప్పి వుండదే, ఇప్పుడు లేచి నిల్చో. భయంలేదు" అంటున్నాడు డాక్టరు.

 

    సుందరం కళ్ళు మూసుకునే "చచ్చే నొప్పిగా వుంది. పైగా కళ్ళు తిరుగుతున్నాయి. పడిపోతాను" అన్నాడు బలహీనంగా.

 

    ఆయన అతన్ని బల్లమీద పడుకోబెట్టి "జస్టు నెర్వస్ నెస్. అంతకంటే మరేంకాదు" అంటూ తన చైర్ లోకి వచ్చి కూర్చున్నాడు.

 

    ఓ పావుగంట గడిచాక సుందరం వెళ్ళిపోవటానికి లేచాడు. "రేపు మళ్ళీ రా మైడియర్ యంగ్ మేన్. నా ఇంజక్షన్ ఎంత వండర్ ఫుల్ గా రిలీఫ్ ఇస్తుందో నువ్వే చూస్తావుగా" అని ఆయన లేచి మరోసారి భుజంతట్టి ధైర్యం చెప్పాడు.

 

    సుందరం బ్రతుకుజీవుడా అని బయటపడ్డాడు. అతని మనసంతా అల్లకల్లోలమైపోయింది. ఈ ప్రపంచమంతా చీకటిమయమైపోయినట్లుగా తోచింది. తాను ఏమి నేరం చేశాడు? ఎందుకు తనకు ఈ శిక్ష? తనకేమీ దురలవాటులు లేవు. కనీసం సిగరెట్లు అయినా కాల్చడు. ఎలా సంభవించిందీ విపరీతం?

 

    ఆ రాత్రి హాస్టల్ లో తన మంచంమీద పడుకుని మనసుని కాల్చుకుతినే ఆలోచనలతో, అలుముకుని చిత్రవధ చేసే భయాలతో గడిపాడు. తన భవిష్యత్, ఆశలు అన్నీ విధి అనే కత్తులబోనులోపడి తునాతునకలయిపోయినట్లుగా గోచరించసాగాయి.

 

    ఇంతలో అతనికి మెరుపు మెరిసినట్లు ఓ ఆలోచన సోకింది. అసలు ఈ డాక్టరు వాలకమంతా విచిత్రంగా వుంది. వెర్రివాడేమో. ఏదైనా పెర్వెర్టెడ్ అయివుండవచ్చు.

 

    ఈ యోచన రాగానే అతనికి ఏదో ఆశ కలిగినట్లయ్యింది. ఒకింత శాంతి లభించినట్లయింది. మరునాడు స్పెషలిస్టు దగ్గరకు పోవాలి. పరీక్ష చేయించుకోవాలి అనుకున్నాడు. మానసికంగా అలిసిపోయి ఏ తెల్లవారుజమునో కాస్త నిద్రపోయాడు.

 

    కాని అతని ఆశ నిరాశ అయింది. స్పెషలిస్టు అతి జాగ్రత్తగా పరీక్ష చేసి ఎక్స్ రేలుకూడా తీయించి చూసి చాలా ప్రాధమిక దశలో రోగం వున్నదని నిర్ధారణగా తేల్చాడు. ఒకటి రెండు ఏళ్ళపాటూ చదువు మానేయాలన్నాడు. మంచంమీదనుంచి కాలు క్రింద పెట్టకుండా ఆరేడు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలన్నాడు. మానసికంగా కూడా ఏమాత్రం పరిశ్రమ పనికిరాదన్నాడు. ఇంటికి వెళ్ళిపోయి నీడపట్టున హాయిగా వుండమన్నారు. మంచి టానిక్, ఫుడ్స్ తీసుకుంటే చాలుననీ ఇంజక్షన్ లూ అవి అనవసరమనీ చెప్పాడు.

 

    సుందరం హతాశుడయి ఇంటికి వచ్చాడు. అతని తల దిమ్మెక్కిపోయింది. భయంకరపు వూహలతో. తన చదువు వొదిలిపెట్టి, విద్యార్థి జీవితాన్ని వొదిలిపెట్టి ఇంటికి వెళ్లిపోవటమా? అతను కృంగిపోయాడు. అందరూ అడుగుతారు ఎందుకు వొచ్చేశావని? తన స్థితి తల్లిదండ్రులకు గుండెల్లో గునపం అవుతుంది. వాళ్లు విలపిస్తారు, కృశించిపోతారు. తను మంచంమీద కదలకుండా పడుకుని వుంటాడు. తండ్రి తన ఎదురుగా అటు ఇటూ తిరుగుతూంటే తనకు ఇబ్బందిగా వుంటుంది. ఒకటి రెండు సంవత్సరాలు చదువుకు ఉద్వాసన చెబితే తన సీటు అలా వుంచుతారని నమ్మకం ఏమిటి?"

 

    ఒకటి రెండురోజులు ఆలోచనలతో, పరిష్కారం కోసం సుందరం అతలా కుతలమైపోయాడు.

 

    "అలా వున్నావే"మని అడిగాడు రూంమేట్.

 

    ఏమీలేదని చెప్పి ముభావంగా ఊరుకున్నాడు సుందరం.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra