Home » Suryadevara rammohan rao » Chikkaledu Chinnadani Aachuki


    "ఏంటి మమ్మీ... ఏమైందీ కాలికి?" అడిగాడు ఎంటరవుతూనే శ్రీధర్.

 

    "ఏం చేయను బాబూ...మోకాళ్ళ నొప్పులు. అందరూ వున్నా ఎవ్వరూ లేని ఒంటరిదాన్ని..." అంది ఆయుర్వేదం మందుని మోకాళ్ళకి రాసుకుంటూ.

 

    ఆమె స్థితికి ఒక్కక్షణం బాధపడ్డాడు అతను.

 

    "అవును మమ్మీ ఎప్పుడూ ఏవో మందులు వాడుతుంటావు... ఏమిటా మందులు?" అడిగాడతను.

 

    "ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూల ముత్తమం అని చరకుడు అనే మహానుభావుడు ఎప్పుడో రాశాడు... నువ్వు చదవలేదా."

 

    "ఆయనెవరు? ఎందుకలా రాశాడు? ఏం చేస్తుంటాడాయన? ఇప్పుడెక్కడున్నాడు?" అడిగాడు శ్రీధర్ అమాయకంగా.

 

    ఆ మాటలకు మాథ్యూస్ పడీపడీ నవ్వింది. ఆమె అలా ఎందుకు నవ్వుతోందో అర్థంకాక విస్తుపోయాడు శ్రీధర్.

 

    "ఆంగ్లేయుల దురాక్రమణ ఫలితం నాయనా... అది నీ తప్పు కాదు" అంది నవ్వు నాపుకుంటూ.

 

    దానికి మరింత ఆశ్చర్యపోయాడు శ్రీధర్.

 

    "ఆంగ్లేయులకు, నువ్వు చెప్పిన చరకుడికి ఏమిటి సంబంధం?"

 

    "వరల్డ్ ఫస్ట్ మెడిసిన్ ఇండియన్ మెడిసిన్. ఇండియన్ మెడిసిన్ అంటే ఏమిటో తెలుసా? నీకేం తెలుస్తుంది? ఇండియాలో వుండే ఇండియన్స్ కే తెలియదు. ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత హిందూ నాగరికత. అలాగే ప్రపంచంలోనే మానవ సంబంధమైన వ్యాధులకు మట్టి నుంచి, మానునుంచి మొట్టమొదటిసారి మందులను కనిపెట్టిన ఘనత మనదే, అదే ఆయుర్వేదం. దాన్నే ఇండియన్ మెడిసిన్ అంటారు. తల నొప్పొస్తే అనాసిన్, వళ్ళు నొప్పులొస్తే నవాల్జిన్, కడుపునొప్పివస్తే జిమాల్జిన్ లాంటి అల్లోపతి మందులు వాడి, ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్న మన ఇండియన్స్ ని చూస్తుంటే జాలేస్తుంది... ఆంగ్లేయుల దుష్ప్రభావాల ఫలితంగా మీ వయసు వాళ్ళకి ఏవేవో జబ్బులొచ్చేస్తున్నాయ్..." అంటూ నిట్టూర్చింది మాథ్యూస్.

 

    "ఇంతకీ ఈ ఆయిల్ ఏమిటి?" అడిగాడు శ్రీధర్.

 

    "ధన్వంతరి తైలం. జిల్లేడు, కడజెముడు, వాత నారాయణ, వావిలాకు, విషముష్టి, హిమకర్పూరం, తెల్ల ఆవాలు, సదాపాకు-లాంటి ఆకు రసాలతో తయారైన ఫ్యూర్ ఇండియన్ మెడిసిన్ ఇది!"

 

    ఆమె మాటలు విని ఒక్క క్షణం వ్యాపారపరమైన ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు శ్రీధర్.

 

    'ఏమిటాలోచిస్తున్నావ్?" అడిగిందామె.

 

    "ఏం లేదు...ఏం లేదు..." అంటూ ఆమె చేతిలోని బాటిల్ అందుకుని, ఆ తైలంతో ఆమె మోకాళ్ళను మర్థించసాగాడు.

 

    "ఔను! ఇందాక నేను ఫోన్ చేసినపుడు అపర్ణ అంటూ తెగ ఆరాటపడిపోతున్నావ్, ఎవరా అమ్మాయి?" నవ్వుతూ ఆసక్తిగా అడిగింది మాథ్యూస్.

 

    "అపర్ణను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను మమ్మీ...అమెరికాలో ఎం.బి.ఏ. చదువుతున్నపుడు అపర్ణ నా క్లాస్ మేట్. తను ప్రతిరోజూ రాత్రి ఏడు, ఎనిమిది గంటల మధ్య ఫోన్ చేస్తుంది. నా ప్రేమ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పడంలేదు..."

 

    అంటూ ఆమె నాట్యం గురించి, ఆశయం గురించి, ఇంకా ఆమె వ్యక్తిత్వం గురించి వివరంగా చెప్పాడు అతను.

 

    "ప్రస్తుతం ఆ అమ్మాయి ఎక్కడ ఉంది?" మాథ్యూస్ అడిగింది.

 

    "అమెరికాలో. ప్రస్తుతం ఏ నగరంలో వుందో తెలియదు. ఈ రెండు మూడు రోజుల్నించి అపర్ణ నాకు ఫోన్ చేయడంలేదో, చేసిన టైంకి నా ఫోను ఎంగేజ్ లో వుందో...ఏం అర్థంకావడం లేదు."

 

    "నువ్విక్కడికి కొత్తగా వచ్చావ్. నీకు ఫ్రెండ్స్ కూడా తక్కువగానే వుంటారు కదా... అలాంటపుడు నీ ఫోన్ ఎందుకు ఎంగేజ్ లో వుంటుంది? ఫోన్ ఫాల్ట్ ఏమో కంప్లయింట్ చేయకపోయావా?"

 

    "అదేం లేదు. అదే టైంకి ఎవరో అపరిచితురాలు ఫోన్ చేస్తుంది. ఆ టైంలోనే అపర్ణ ఫోన్ మిస్సవుతుందనుకుంటున్నాను" అన్నాడు బాధపడుతూ శ్రీధర్.

 

    "అపరిచితురాలా?" సందేహంగా చూసింది మాథ్యూస్.

 

    "అవును మమ్మీ! పేరు చెప్పదు. ఊరు చెప్పదు, కనిపించదు. పజిల్ కి ఆన్సర్ చెప్పమంటుంది."

 

    అతను బాధపడుతూ చెప్పుకుపోతుంటే మాథ్యూస్ లోలోపలే నవ్వుకోసాగింది.

 

    "...ఆఫీస్ కెళితే అక్కడున్న మేరీతో మరో బాధ, అక్కడ్నించి తప్పించుకొస్తే ఇక్కడ జయారెడ్డి బ్రెయిన్ తింటుంది. ఏంటో నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు మమ్మీ..." అమాయకపు మొహంతో చెప్పి ఆగాడు శ్రీధర్.

 

    అతని మాటలకి నవ్వాపుకోలేక ఫకాల్న నవ్వేసింది మాథ్యూస్.

 

    "ఏంటి మమ్మీ నవ్వుతారు... నా బాధ మీకు నవ్వుగా వుందా?" అన్నాడు శ్రీధర్.

 

    నవ్వు ఆపుకుని అంది మాథ్యూస్.

 

    "నువ్వు ఒక్క అపర్ణనే కోరుకుంటే - నిన్ను మాత్రం జయారెడ్డి, మేరీ పియర్స్, ఆపైన అపరిచితురాలు- ముగ్గురూ కోరుకుంటున్నారు. మొత్తానికి అదృష్టవంతుడివే. జయారెడ్డి, మేరీ పియర్స్ గురించి పెద్దగా ఆలోచించనక్కర లేదు. నీనుంచి వాళ్ళేం కోరుకుంటున్నారో ఇట్టే అర్థమైపోతుంది. ఇక ఆలోచించ వలసింది అపరిచితురాలు గురించే. ఇకపై నువ్వు బయటికెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు పరిసరాలపై ఒక కన్నేసి వుంచు" అంటూ శ్రీధర్ చేసిన సపర్యలకు మాథ్యూస్ రిలాక్స్ డ్ గా ఫీలై వంటఇంట్లోకెళ్ళి కాఫీ తెచ్చి శ్రీధర్ కిచ్చింది.

 

    అప్పుడు సమయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు.

 

    శ్రీధర్ తన ఫ్లాట్ కెళ్ళిపోవాలని యోచిస్తుండగా సరిగ్గా అప్పుడే మోగింది ఫోన్.

 

    మరెంత మాత్రం ఆలస్యం చేయకుండా రిసీవరు అందుకున్నాడు. అది ఖచ్చితంగా అపర్ణ ఫోన్ అయ్యుంటుందని అతని ఆశ, అపర్ణ పేరు ఉచ్ఛరించడానికి అతని మనసు తహతహలాడుతున్నప్పటికీ, ఈసారి ఆపేరును వెంటనే ఉచ్ఛరించదలుచుకోలేదు.

 

    "హలో....హలో...."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra