Home » Kommuri venugopala rao » వ్యక్తిత్వం లేని మనిషి


    సినిమా మొదలుపెట్టారు... మామూలుగా మాట్లాడుకుంటూనే వున్నారు. ఫెడీ ఫెడీ కొట్టుకుంటున్నారు. మళ్ళీ కలిసి తాగేస్తున్నారు.. హీరో ఏదో అన్నాడు. తనకు కొంచెందూరంలో కూర్చున్న ప్రేక్షకుడు ఫకాల్న నవ్వాడు. అనుకోకుండా తనూ నవ్వేశాడు. తనకి యింగ్లీషు బాగానేవచ్చు. అయినా యీ సినిమా యింగ్లీషు తలకెక్కదు. ప్రక్కవాడికి ఏదో అర్థమయినట్లు నవ్వితే తనూ నవ్వాడు. అలాగే తను మొదట నవ్వితే అతను నవ్వుతాడా? చూద్దాం. కాసేపటికి ఓ రసవత్తర సన్నివేశంలో కథానాయిక ఏదో అన్నది. ఆమె కళ్ళలోని చిలిపితనాన్నిబట్టి అది విట్టనుకుని అతను గట్టిగా నవ్వేశాడు. ప్రక్కవాడు నవ్వలేదు సరికదా అతనివంక విచిత్రంగా చూసి మళ్ళీ తెరవైపు తలత్రిప్పాడు. మృత్యుంజయరావుకు వళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. అయినా తను ఓడిపోకూడదు. అతనికి అర్థంకాని భావాలు తనకు అర్థమవుతున్నాయని స్ఫురింపచేయటానికి తర్వాత సందర్భం చూసుకుని రెండుమూడుసార్లు నవ్వాడు.
    కథ ఇంకా ఓ కొలిక్కిరాలేదు. అయినా అప్పుడే అయిపో వచ్చిందన్నట్లుగా ముందు కూర్చున్నవాళ్ళూ, ముందు తరగతులవాళ్ళూ చెప్పులు చప్పుడువేస్తూ లేవటానికి సన్నాహం చేస్తున్నారు. తనకైతే కథ యింకా చాలా వుందనిపించింది. అయినా కాళ్ళు చెప్పుల్లోదూర్చి అవసరమొస్తే లేచి నిల్చోవటానికి రెడీ అయాడు. కొద్దిక్షణాలు గడిచాక ముందు రెండు తలకాయలు లేచి నిలబడ్డాయి. అనుమానించకుండా అతనూ లేచి నిలబడ్డాడు. "ది ఎండ్" అన్న అక్షరాలు వచ్చాయి తెరమీదకు హఠాత్తుగా. నలుగురితోబాటూ అతనూ దర్జాగా బయటకు నడిచాడు. 
    అద్దం అతని ప్రియమిత్రుడు. అద్దం అతని భయంకర శత్రువు. అద్దంలోకి చూసుకుంటూ తననితాను అసహ్యించుకుంటాడు. అద్దంలో తిలకిస్తూ తననితాను ప్రేమించుకుంటాడు.
    ఏడుపంటే చికాకు. దానికి అతీతంగా వున్నవాళ్ళంటే పడిచస్తాడు. అయినా అతను ఏడుస్తాడు.
    మృత్యుంజయరావు రోడ్డుమీద వంటరిగా నడచిపోతున్నప్పుడు అతనికి చిత్రమైన ఊహలు కలుగుతాయి. "నేను బాగా నడుస్తున్నానా?" అనుకుంటాడు. నడుస్తున్నప్పుడు నా చేతులెలా వూగుతున్నాయి? లయబద్దంగా ఊగుతున్నాయా లేదా? కాళ్ళు ఎలా నడుస్తున్నాయి? కొందరు నడకనిబట్టి మనిషియొక్క ఔచిత్యాన్ని నిర్ణయిస్తారట. తన నడక తన లోపాన్ని పట్టి ప్రదర్శించేస్తోందా?
    ఓసారి ఓ కుర్రాళ్ళగుంపుమీదుగా నడిచిపోతున్నాడు. వాళ్ళు ఆడుకుంటూన్న గోలీకాయ కాలిక్రిందికి దొర్లి అతను తూలి క్రిందపడినంత పనయింది. కుర్రాళ్ళు నవ్వారు. అతనికి కోపం వచ్చింది. అయినా అతని కోపాన్ని ఎవరూ లెక్కచేయరని తెలుసుకాబట్టి చిరునవ్వు నవ్వేసి ముందుకు సాగిపోయాడు. కాని ఆకతాయి కురాళ్ళు అతన్ని వొదిలిపెట్టలేదు. "కొక్కిరాయి" అని అరిచాడు ఓ తుంటరి. "పహిల్వాన్" అన్నాడు యింకొక గడుగ్గాయి. "లొట్టిపిట్ట" అని వెక్కిరించాడింకో రాలుగాయి. "బ్యూటీ కింగ్" అని మరోకంఠం అరిచింది. ఒకడైతే యీల వేశాడు. మృత్యుంజయరావుకు కాళ్ళు తడబడ్డాయి. కళ్ళు చీకట్లు క్రమ్మి, వళ్ళు చెమటలు పట్టింది. అతని అవస్థచూసి ఓ యింటిగుమ్మంలో నిలబడ్డ యువతులు నవ్వాపుకోలేకపోతున్నారు. అతనికి ఉక్రోషం వచ్చింది. ఇదంతా తను లెక్కచేయనట్లు కనిపించాలనుకున్నాడు. అసలిదంతా తననిగురించే కాదన్నట్టు వాళ్లకభిప్రాయం కలిగించాలనుకున్నాడు. ఇంతలో ఓ ఆరేళ్ళ బుడతడు ఎదురుగా వస్తున్నాడు. మృత్యుంజయరావు ముఖమంతా చిరునవ్వు పులుముకుని యెక్కడలేని ఉషారూ తెచ్చుకుని "నీపేరేమిటోయ్ పంతులూ" అన్నాడు. యిలా కుర్రాళ్ళను సరదాగా పలకరించటం తనకు మంచినీళ్ళప్రాయమన్నట్లు. "నీనెత్తి" అన్నాడా కుర్రాడు ఠపీమని. అంతా గొల్లుమన్నారు. కుర్రాళ్ళు, ఆ దృశ్యాన్ని చూసిన పెద్దవాళ్లు, యిందాకటి యువతులు, చుట్టుప్రక్కల యిల్లాళ్ళు అంతా ఫకాలుమన్నారు. అతనికాళ్ళు వణికాయి. నీరసం క్రమ్మివేసింది. ఆ పద్మవ్యూహంలోనుండి బయటపడేసరికి సగం ఆయుర్దాయం తగ్గినట్లయింది.
    మరునాడు ఆ వీధిగుండా పోకూడదనుకున్నాడు. కాని అభిమానం ఎదురు తిరిగింది. ఎవరో కుర్రసన్నాసులు ఏదో అన్నారని తను ఝడిసిపోతాడా? "నాన్సెన్స్! ఐ డోన్ట్ కేర్!" ఆ వీధిలోకి వచ్చాడు. అరుగో కుర్రాళ్ళు...! "పాదాలూ! వణక్కండి- వణక్కండి!" వినలేదు అవి. "ఓ నా బలమైన గుండెకాయా! నెమ్మదిగానే కొట్టుకో. మరేమీ ఫర్వాలేదు." వినిపిస్తేనా దానికి? ఓ... వేగం అందుకుంది. "కనీసం మనసా! అదరకు" ఇంకెక్కడి మను? కుర్రాళ్ళు చూడనే చూశారు. "అడుగో పహిల్వాన్! ఉస్తాద్ పెడ్రో... బ్యూటీ కింగ్... ఒంటెమామ... హెల్త్ మినిష్టర్..." అరుపులు, కేకలు, పెడబొబ్బలు, ఈలలు, నవ్వులు, కేరింతలు...
    ఇహ అతను కోపం ఆపుకోలేకపోయాడు. ఆగి వెనక్కి తిరిగాడు. "మీకేన్నా పిచ్చెక్కిందా?" అని అరిచాడు. కాని అది బయటకు అరుపులా వెలువడలేదు. కీచుగా, పిల్లికూతలా, గాద్గదికంగా ధ్వనించింది.
    "అబ్బో! కోపం వచ్చిందిరోయ్ డ్రిల్లుమేస్టారికి. ఆ మొహం చూడండ్రా ఎలావుందో కోపంతో...?"
    "హె హె కోపం."
    "హా హా కోపం"
    "అరేయి, ముక్కు వంకరగా వుందిరోయి."
    "ప్రభూ! ఈ అస్త్రం... వద్దు యీ శిక్ష... గబగబ కదిలాడు. ఇంచుమించు పారిపోతున్నాడు. వెనకనుంచి కుర్రాళ్ళు రాళ్ళు రువ్వుతున్నారు. కేకలు... కోలాహలం... చుట్టుప్రక్క యింతుల దరహాసాలు...
    ఆ షాక్ నుంచి తట్టుకోవటానికి వారంరోజులు పట్టింది.
                      *    *    *
    ఇదికూడా గతంలో సంగతే. కొన్నాళ్ళక్రితం అతని జీవితంలో అపూర్వమైన అనుభవం కలిగింది. ఎలా ఉపయోగించుకోవాలో అతనికి తేలీలేదుగాని ఒక చక్కని సన్నివేశమే సృష్టించబడింది.
    ఒకానొకరోజు- అది రాత్రి పదిగంటల సమయం. జోరుగా వర్షం కురుస్తున్నది, చలి. మృత్యుంజయరావు ఒక్కడూ గదితలుపులన్నీ మూసేసుకుని దుప్పటి కప్పుకుని కలలుకంటూ నిద్రపోతున్నాడు. ఇంటావిడా, ఇంటాయానా తీర్ధయాత్రలకు వెళ్ళారు.
    అతని నిద్రలో, ఆ కలలో- ఎవరో వానలో బయట గేటుదగ్గర నిలబడి పిలుస్తున్నట్లు వినిపించింది. "జయా" అన్నట్లుకాదు. అంతకంటే మృదువుగా "ఏమండీ" అన్నట్లు.
    ఆ పిలుపు అలా రెండుసార్లు వినబడగా అతను ఉలికిపడి లేచి కూర్చున్నాడు. గేటుదగ్గర బయట అలికిడి అవుతోంది. నిజంగానే ఎవరో పిలుస్తున్నరు. మృదువైన కంఠంతో- "అత్తయ్యా! అత్తయ్యా!" అంటూ.
    మృత్యుంజయరావు లేచి గదితలుపులు తెరిచి, వసారా దిగి గేటు తెరిచాడు. బయట- చీకట్లో వర్షానికి తడుస్తూ- సూట్ కేస్ చేతితో పట్టుకుని ఓ యువతి నిలబడివుంది వానకి ఝడిసి. తలుపు తియ్యగానే సన్నజాజి పందిరిక్రిందికి కాస్త జరిగింది.
    "ఎవరు కావాలండీ?" అన్నాడు మృత్యుంజయరావు కంపితస్వరంతో.
    ఆ సన్నని లైటువెల్తుర్లో ఆమె అతనివంక పరీక్షగా చూసింది. "అత్తయ్య" అంది చిన్నగా.
    "ఎవరూ? చిలకమ్మగారా?"
    ఆమె తల వూపింది.
    "వాళ్ళెవరూ ఊరిలో లేరండీ. భార్యాభర్తలిద్దరూ రామేశ్వరమెళ్ళారు."
    "అయ్యో! చచ్చాను. రిక్షాకూడా పంపించివేశా"నని ఆమె నాలిక కరుచుకుని, చింతిస్తూ నిలబడింది.
    ఆమె అందమైన ముంగురులమీదనుండి నీళ్ళు క్రిందికి జారుతున్నాయి సుతారంగ. తడిసిన దుస్తుల్లో ఆమె చలికి వొణుకుతున్నట్లు కనబడింది. ఆమె అవస్థకి అతనికి జాలివేసింది. "ముందు లోపలకు రండి. తడిసిపోతున్నారు" అన్నాడు సానుభూతిగా.
    ఆమె ధైర్యం, చొరవగల స్త్రీవలెనే వుంది. అతనివెనకే మెట్లు ఎక్కి వసారాలోకి వచ్చి నిలబడింది. గదిలోంచి పడుతూన్న లైటు వెలుగులో ఆమె ఆకారం స్పష్టంగా గోచరించింది. ఇరవయ్యేళ్ళ వయసు, అందమైన ముఖబింబం, తడిసిన దుస్తుల్లోంచి మెరిసే శరీరం. తీర్చిదిద్దినట్లు వున్న రూపురేఖలు...
    "చిలకమ్మగారు మా అత్తయ్య. ఇక్కడ ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. వీళ్ళకసలు యిల్లువదిలి ఎక్కడకూ బయటకు కదిలే అలవాటు లేదుకదూ! అందుకని వుండరేమోనన్న అనుమానంకూడా లేకపోయింది" అని దిగులుగా నవ్వింది.
    వర్షపురాత్రి చలిగాలి, సన్నజాజుల సువాసన, చెంత ఓ కోమలాంగి... ఓహో! ఏం ఛాన్స్ కొట్టావయ్యా మృత్యుంజయరావూ.
    ఈ అదృష్టానికి అతని హృదయం ఉప్పొంగింది. శరీరం పులకరించింది. "మీకేం భయంలేదు. నేనున్నాను" అని చెబుదామనుకున్నాడు. ఎట్లా చెప్పటమా అని సంకోచిస్తున్నాడు.
    "జగన్నాధపురంలో మా దూరపు బంధువులు వున్నారు. ఇహ అక్కడకు పోవాలి" అన్నదామె తనలోతాను అనుకుంటున్నట్లు.
    "అయ్యో! ఇంత రాత్రిలోనా?" అన్నాడు మృత్యుంజయరావు. ఉహుఁ అనలేదు. గుండెనుంచి నాలికదాకా అనుకున్నాడు. "ఇది భావ్యంకాదు సుమండీ" అని కోపగించుకుంటున్నాడు. అబ్బే! కోపగించుకోలా, వెర్రిమొహం వేసి చూస్తూ నిలబడ్డాడు. "ఒక విషయం చెబుతాను వింటారా?" అన్నాడు. ఇదిమాత్రం నిజంగానే అన్నాడు.

    ఆమె విస్మయంగా అతని ముఖంవంక చూసింది.
    ఏం చెప్పాలి? అతని ముఖం పాలిపోయింది. ఏమి చెప్పినా అసహజంగా ధ్వనిస్తుందేమో! అసహ్యంగా తీసుకుంటుందేమో! పరీక్షకెళ్ళేవాడిలా వళ్ళు వేడెక్కింది. చివరకు అవకతవకగా, తప్పులతడికగా అతను వాగిందానికి సరియైన సారాంశమిది. "చాలా చీకటైపోయింది. వర్షం యిప్పుడప్పుడే తగ్గే సూచనలు లేవు. మీరసలే తడిసిపోయి వున్నారు. రాత్రుళ్ళు కాకినాడరోడ్లు నిర్మానుష్యంగా వుంటాయి. అసలు మీరు స్టేషన్ నుంచి యిక్కడకు రావటమే ప్రమాదం. రౌడీలు జాస్తిగా వుంటారు. ఆ రౌడీలు ఎలాంటివారనుకున్నారు? ఎంతటి ఘోరమైనా చేయటానికి వెనుకాడని దుర్మార్గులు. మీరు నాగురించి ఏమీ సంకోచించవలసిన పనిలేదు. (నీ మొహం. నీగురించి భయపడేదెవర్రా మృత్యుంజయరావూ!) మీరాగదిలో విశ్రాంతి తీసుకోవచ్చు. నేనీ వసారాలో గడిపేస్తాను. మీకొచ్చిన భయమేంలేదు. నిజంగా మీకొచ్చిన భయంలేదు. (అలా అంటూంటే నాకు తృప్తిగా వుంటుంది.) 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra