Home » Suryadevara rammohan rao » సాహసి


    "శతవర్షాలు బ్రతుకుతానని ఛాలెంజ్ చేసి, బ్రతుకుతున్నవాడిని. నన్ను నడిపించేది ఆశే తల్లీ... ఈ మాత్రం దానికే దిగులు పడిపోకూడదు. కారు చూపించినవాడు, దారిని కూడా చూపించుతాడమ్మా... మానవ ప్రయత్నాన్ని వదిలివేయకూడదు తల్లీ" ధైర్యం చెప్పాడు ముత్యాలు.

    ఆరోజు రాత్రి నిద్రపట్టలేదు ముత్యాలనాయుడికి.

    తెల్లవారుజామునే కోటలోంచి ఒక్కడే బైటపడ్డాడు.

    తను ఎక్కడికి వెళుతున్నాడో, ఎవ్వరికీ చెప్పలేదు ముత్యాలనాయుడు.


                  *    *    *    *


    ఆంజనేయ వ్యాయామశాల.

    విశాఖపట్టణం జాలరి పేటలో వున్న ఆ బోర్డు చూసి లోనికి అడుగుపెట్టాడు ముత్యాలనాయుడు.

    "అప్పలరాజున్నాడా?" అక్కడ బస్కీలు తీస్తున్న ఓ కుర్రాడిని అడిగాడు.

    "మాస్ట్రులేడు... ఊరెళ్లాడు"

    "ఎప్పుడొస్తాడు"

    "రేపు సాయంత్రానికి..."

    చాలా ఆశ పెట్టుకు వచ్చాడు ముత్యాలు. వాడు వుంటే ఎక్కడో దగ్గర యాభైవేలు సర్దేవాడు. వాడికి చాలా ఉపకారం చేశాడు ఒకప్పుడు ముత్యాలు.

    రేపటివరకూ వుంటే? రోజంతా బస్ స్టాండులో తలదాచుకుని వద్దామని, వచ్చిన దారి వెంటే నడవటం మొదలుపెట్టాడు ముత్యాలు.

    సముద్రపుగాలి ఉప్పగా తగులుతోంది.

    ఒకప్పుడు దర్జాగా డాబు, దర్పంతో చేతినిండా డబ్బుతో దొరలా తిరిగిన ప్రదేశాలివి.

    నడిచి... నడిచి-

    అలసిపోయి ఒక టీ బడ్డీ దగ్గర కూలబడ్డాడు.

    "స్ట్రాంగు టీ కలుపుతావా" టీ బడ్డీవాడితో చెప్పి బెంచిమీద కూర్చున్నాడు ముత్యాలు.

    అకస్మాత్తుగా ముత్యాలదృష్టి, కొంచెం దూరంలో ఓ ఇంటిముందు జరుగుతున్న దృశ్యంమీద పడింది.

    ఒక పాత సీసాలవాడికి- ఆ ఇంటి యజమానికి మధ్య సంభాషణ నడుస్తుంది.

    "ఇది పాత సీసానేనయ్యా- కాదన్ను. పాతసీసాలకు ఎంత వాల్యూ వుందో తెలుసా నీకు. ఇదే సీసా బొంబాయిలో అమ్మితే అయిదు వందలు ఇస్తారు"

    "బొంబాయి కాదండీ... బాబు ఇది వాల్తేరు... మా ధర మాది... వంద రూపాయలు చేసుకోండి."

    "నువ్వు... ఎంత కమ్ముతావో నాకు తెలుసుకానీ... రెండు వందలు చేసుకో."

    "ఆఖరు మాట సామీ- నూట యాభై"

    "సరే కానీ"

    గ్లాసులోని టీ ఊదుకొని త్రాగుతున్న ముత్యాలనాయుడికి ఏదో అస్పష్టంగా జ్ఞాపకం వచ్చింది.

    పాత సీసాలు అంత ఖరీదు చేస్తాయని తెలీదు... ముప్పై... నలభై సంవత్సరాల క్రితం సీసాలు దేవులపల్లి కోటలో వుండాలి.  

    ఉండే ఉంటాయి... ఎక్కడకు పోతాయి?

    "తరాలు గడిచే కొలదీ పాతవస్తువులు కళాఖండాలుగా గుర్తింపు పొందుతాయనేది కార్ల విషయంలో కూడా జరగడం మన అదృష్టం" అని కౌశిక భూపతి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.

    అంతే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది.

    గబ గబా టీ త్రాగడం ముగించి, తనముందు నుంచే వెళ్ళిపోతున్న సీసాల వాడిని' పట్టుకుని ఆపాడు ముత్యాలనాయుడు.


                                          *    *    *    *


    సంస్థానాలు అన్నీ సుదృఢంగా సుభిక్షంగా వున్న సమయం...

    ఆంగ్లేయులు పచ్చగా వున్న సంస్థానాధీశులతో చెలిమి చేసుకోవాలని ప్రయత్నిస్తున్న సమయం.

    కౌశిక భూపతి తండ్రిగారు రుద్రభూపతి సహజంగా విలాస పురుషుడు... 'డ్రింక్' అంటే ఆయనకు ఎక్కడ లేని మక్కువ.

    ప్రపంచంలో ఎక్కడైనా... క్రొత్త డ్రింక్ వస్తే, ఆయనకు స్పెషల్ గా వచ్చేది... అలాగే విజయనగర మహారాజువారికి పుస్తకాలు ఇష్టం... ఎప్పటికప్పుడు కొత్త కొత్త పుస్తకాలు లండన్ నుంచి వచ్చేవి.

    గురజాడ అప్పారావు మొదలైనవారికి... ప్రపంచంలో జరిగే మార్పులన్నీ ఎప్పటికప్పుడు తెలియడానికి కారణం అదే.

    అందుకే రుద్రభూపతి స్నేహం కోరి (పార్టీల కోసం) ఇంగ్లీషు దొరలు వచ్చేవారు... పార్టీలు జరిగేవి.

    ఒకప్పుడు యూరోపియన్, సౌందర్య ప్రపంచం దేవులపల్లి కోటలోనే ఉండేది. తనకు బాగా జ్ఞాపకం వుంది. పార్టీల్లో ఖాళీ అయిన ఆ సీసాలన్నింటినీ తీసి గోడౌన్ లో పడేసేవారు. కోట వెనుక ద్వారానికి ఆనుకుని వున్న గోడౌన్ లో ఆ సీసాలు వున్నాయి... ఇప్పటికీ వుండే ఉండాలనే ఆలోహణ ముత్యాలుకు కొండంత బలాన్నిచ్చింది.


                                          *    *    *    *


    మరుసటి రోజు ఉదయం రెండు లారీలను వెంట తీసుకుని వచ్చి కోటలోకి ప్రవేశించాడు. ఆ లారీల్లో ఒక లారీ నుంచి దిగిన ముత్యాలనాయుడుని ఆ ప్రక్కన వున్న వ్యక్తులనూ చూసి కౌశిక భూపతి ఆశ్చర్యపోయాడు.

    అన్నీ పోయాయి. ఇంకేం మిగిలింది అమ్మటానికి? కోటలోకి లారీలు ఏమైనా వచ్చాయంటే... దాని అర్ధం సామాన్లను అమ్మేస్తున్నారని... కోటలోకి లారీలు రావడం అంటే- ఉన్న పరువు మరింత పోవడం... అందుకే బాధగా వుంది కౌశిక భూపతికి.

    కోట వెనుక ద్వారం వైపు నడిచి, గోడౌన్ తలుపులు తెరిచి లోనకు ప్రవేశించాడు ముత్యాలు. తన అంచనా తప్పనందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు కొద్దిక్షణాలసేపు.

    కొన్నివేల సీసాలు అక్కడ వున్నాయి. చిందర వందరగా పడి పరుగు పరుగున వచ్చి లారీల దగ్గర నిలబడి వున్న మనుష్యులను తీసికెళ్ళాడు.

    బయట జరుగుతున్న గందరగోళం చెవినపడటంతో హడావుడిగా బైటకు వచ్చి జరుగుతున్నది తండ్రి ద్వారా తెలుసుకుని దిగ్భ్రాంతికి గురి అయ్యింది ఇందుమతి.

    పామరుడిలా కన్పించే ముత్యాలనాయుడులో ఎంత పట్టుదల? మరెంత సమయస్పూర్తి. పాత సీసాలకు ధర పలుకుతుందని యెలా తెలుసుకున్నాడో?

    కృతజ్ఞతతో ఆమె కళ్ళు చెమర్చాయి.


                  *    *    *    *


    ఆ సీసాలు ఎంత విలువైనవో వాటిని చూడగానే తెలిసిపోయింది. ఏంటిక్స్ బిజినెస్ బ్రోకర్ రతన్ లాల్ కి. అవి ఎప్పటి సీసాలు? కొన్ని దశాబ్దాలు కాదు, శతాబ్దాలు నాటివి... వాటిల్లో కొన్ని 18వ శతాబ్దానికి చెందినవి ఉండటం అద్భుతం.

    పగిలిపోయిన సీసాలు పోగా బాగున్న సీసాలు బయటికి తీయించాడు ముత్యాలు.

    పెద్ద కూజాల్లాంటి సీసాలు. మట్టిపాత్రల్లాంటి సీసాలు... అమ్మాయిల్లా నగిషీలతో వున్న సీసాలు. చిన్న మినీ సూట్ కేసుల్లాంటి తెల్లని సీసాలు... వాటిని చూసిన బ్రోకర్ కి మతిపోయింది.

    "రేటు చెప్పకుండా... లారీల్లోకి ఎక్కించేస్తే ఎలాగయ్యా" ముత్యాలనాయుడు అడిగాడు.

    "లక్ష రూపాయలు ఇస్తాను" అసలు విలువలో నలభయ్యో వంతు రేటు చెప్పాడు రతన్ లాల్?

    "చాలా విలువైన సీసాలు... పూర్వకాలం నాటి సీసాలు ఇప్పుడు కావాలన్నా దొరకవు. ఇంకో పాతిక వేసుకో" అన్నాడు వాటి విలువ తెలీని ముత్యాలనాయుడు.

    హైదరాబాద్ లో కంటే బొంబాయికి డైరెక్టుగా తీసుకెళ్ళి అమ్మితే తనకు ఎంత లాభం వస్తుందా అన్న ఆలోచనల్లో ఉన్నాడు రతన్ లాల్. ఇలాంటి బేరం తనకు ఎప్పుడూ తగల్లేదు. కనీసం నలభై, యాభై లక్షల దాకా రావచ్చు. సూట్ కేస్ లోంచి లక్షా పాతిక వేలు తీసి ముత్యాలనాయుడికి అందివ్వబోయాడు రతన్ లాల్.

    "ఈ కోట నాది కాదు... ఈ సీసాలు నావికావు. ఆ డబ్బు నువ్వు ఇవ్వాల్సింది నాకు కాదు పద" ముందు ముత్యాలనాయుడు నడవగా వెనుక రతన్ లాల్ నడిచాడు కౌశిక భూపతి కాళ్ళ దగ్గర లక్షాపాతికవేలు పెట్టి నమస్కరించి వెనక్కు తిరిగాడు రతన్ లాల్.

    ఇందుమతికి అదింకా నమ్మలేని నిజంగా వుంది. లారీలు కదిలాయి. క్షణాల్లో అవి దుమ్ము రేపుకుంటూ కోట బైటకు వెళ్ళిపోయాయి.

    అచేతనంగా ముత్యాలనాయుడువైపు, డబ్బువైపు, కూతురివైపు చూశాడు కౌశిక భూపతి.

    ఆయన కళ్ళవెంట రెండు కన్నీటి చుక్కలు రాలి నిశ్శబ్దంగా నోట్ల కట్లమీద పడ్డాయి. అంత డబ్బును ఆయన చూసి ఎంత కాలం అయ్యిందో...

    "అమ్మా ఇందూ... ఎన్ని లక్షలు పోస్తే... ఇలాంటి ముత్యాలు మనకు దొరుకుతాడమ్మా" అని లేచి, ముత్యాల నాయుడిని గబుక్కున కౌగిలించుకున్నాడాయన.

    ఎందుకో ముత్యాలనాయుడికి కూడా కళ్ళు చెమర్చాయి.

    తండ్రి వ్యక్తిత్వానికి గర్వపడింది. అబ్బురపడింది ఇందుమతి.

    ముత్యాలనాయుడికి తమ పట్ల, తమ సంస్థానం పట్ల వున్న వాత్సల్యం కూడా మొట్టమొదటిసారిగా పూర్తిగా అర్ధం అయ్యింది.

    డబ్బును తన చేతిలోకి తీసుకుని ఇందుమతి చేతిలో పెట్టబోయాడు ముత్యాలనాయుడు.

    "లేదు ముత్యాలు... నీ దగ్గరే వుంచు. మాకేం కావాలో మాకంటే నీకు ఎక్కువ తెల్సు" అంది కృతజ్ఞతగా.

    ఆ మాటలకు ముత్యాలనాయుడు పొంగిపోయాడు.

    మిగతా పనులు మర్నాడే చకచకా ప్రారంభమయ్యాయి. పాత కారు, విశాఖపట్టణానికి లారీలో వెళ్ళిపోయింది.

    అయిదు రోజుల తర్వాత-

    దేవులపల్లి కోట నుంచి వెళ్ళిన ఇందుమతి, ముత్యాలనాయుడు కారుని చూసి ఆశ్చర్యపడ్డారు.

    మెకానిక్ రాంబాబు, పాతకార్ల (బ్రోకర్ని) తీసుకొచ్చాడు. ఆ కారుకి వాడు మూడు లక్షలు ఇస్తానన్నాడు.  

    ఆ బేరంలో ఏదో మోసం ఉందని అన్పించింది ముత్యాలనాయుడుకి.

    "అసలు ధర కట్టించి చెబుతాను. ప్పుడు బేరమాడదాం" తెలివిగా చెప్పాడు ముత్యాలనాయుడు.

    ఆ వయసులో అంతటి లోకజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్న ముత్యాలనాయుడిని చూసి ఆశ్చర్యపోయింది ఇందుమతి. అదే మాట అంది ముత్యాలుతో.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra