Home » Dr c. ananda ramam » గర్ల్ ఫ్రండ్

    జయపాల్ విసుగ్గా "ఈసారి ఎవడికి ఉద్యోగం వేయించమంటావ్? త్వరగా చెప్పు, ఆ సీసాలిలా ఇయ్యి" అన్నాడు.
    ఆమె మనసు చివుక్కుమంది. అతని మాటలలోనూ అబద్ధం లేదు మరి! అతనితో సీసాలకు ముందుగా తను ఇంతవరకూ మాట్లాడిన విషయాలన్నీ ఏదో ఒక సహాయం కోరుతూనే!
    "మీ నీరద్ మా ఇంటికి వచ్చాడు!"
    జయపాల్ విసుగు ఎగిరిపోయింది. నిటారుగా కూచుని "ఎప్పుడు?" అన్నాడు. ఎదుటి మనసుల్నికోసే పదను ఆ కంఠంలో.
    "పదిహేను రోజులవుతుంది!"
    "ఎందుకు? వాడికి నీతో ఏం పని?" ఎలాంటి మనుష్యులకైనా గుండెలదరగొట్టేటంత కాఠిన్యం ఆ ప్రశ్నలో! ఆమె అర్ధం చేసుకుంది. భరించరాని చీదరతో, శరీరమంతా జలదరించింది. ఏనాటికైనా తన విలువ యింతేనా?
    "నన్ను తిట్టడానికి వచ్చాడు, వాళ్ళమ్మను కష్టపెడుతున్నానని."
    "ఓ. అదా!...." పకపక నవ్వాడు జయపాల్. ఎంతో ఉల్లాసం ఆ నవ్వుతో - "వాడికి వాళ్ళమ్మంటే, ఎంతో ఇష్టం" అన్నాడు మురిపెంగా.... "అయినా వాడినిక్కడకు తరచుగా రానియ్యకు-" అన్నాడు హెచ్చరింపుగా.
    పళ్ళు బిగపట్టి అంతా విని, తనను తను నిగ్రహించుకుంటూ "రావద్దనే చెప్పాను. అతను ఇక్కడికి రాకుండా బుద్ధి చెప్పగలిగే శక్తినాకుంది కానీ, అసలు విషయం అదికాదు. అతడు మా చెల్లెలి కాలేజీకి వెళ్ళాడు. బలవంతాన హోటల్ కి తీసికెళ్ళాడు. తన కారులోనే మా యింటి దగ్గర దింపాడు. అందుకే ఆందోళన పడుతున్నాను. ఇకమీదట అతడు మా చెల్లెలి జోలికిరాకుండా చూడండి!" అంది.
    జయపాల్ కనుబొమలు ముడుచుకున్నాయి. కళ్ళు ఎర్రబడ్డాయి.
    "నీ చెల్లెలు వాడి వెనకాల పడుతోందన్నమాట! వాడి వెనకాలపడితే ఏం లాభం? వెధవ క్లబ్బుల్లో తైతక్కలాడటానికి తప్ప ఎందుకూ పనికిరాడు!"
    "మా చెల్లెలు అతని వెనకాల పడలేదు! అతడే...." ఆమె మాటలు పూర్తికాకుండానే విసుగ్గా అడ్డుకున్నాడు అతడు. సీసాలోది గ్లాసులోకి నింపుకుంటూ....
    "నీ చెల్లెలని తెలుసుకదా! ఏదో లొంగకపోతుందా, అని ఆశ పడుతున్నట్టున్నాడు. పాపం! నీ చెల్లెలిని హెచ్చరించు! వాడి వెంట తిరిగితే, ఏమీ లాభంలేదని నచ్చజెప్పు! ఇంకా నాలాంటి వాళ్ళని పట్టుకుంటే ఏదైనా ఫలితముంటుంది."
    "అహహ" అని గట్టిగా నవ్వుతూ గ్లాసులోది నోట్లోకి పంపుకున్నాడు. ఆమె అణువణువూ కుతకుత ఉడికిపోయింది__ఈ దుర్మార్గుడు తనముందే తన చెల్లెలిని గురించి ఇలా మాట్లాడుతున్నాడు! లోకమంతా ఎవరేమనుకున్నా తనకు తానుగా కొన్ని మోరల్స్" కి కట్టుబడి వుంది. ఆ విలువను ఇతడింత నిర్ధాక్షిణ్యంగా కాలితో తన్ని పారేస్తున్నాడు! తను ప్రాణప్రదంగా ప్రేమించిన శ్రీనివాస్ తనను స్వీకరిస్తానని ఎంతగా ప్రాధేయపడినా, ఒక నీతికి కట్టుబడి అతనిని తిరస్కరించింది. ఇదా దానికి ఫలితం.
                              9
    జయపాల్ ఇండస్ట్రీస్ లో జయపాల్ కి పర్సనల్ సెక్రటరీగా చేసి, జయపాల్ కి గరల్ ఫ్రెండ్ గా మారినా, ఆమె మనసులో శ్రీనివాస్ మెదులుతూనే ఉన్నాడు. అతనికి  ఉద్యోగం దొరికిందో, లేదో, తెలుసుకోవాలని ఆమెకి చాలా కుతూహలంగా ఉంది.
    జయపాల్ ఇండస్ట్రీస్ లో సేల్స్ మేనేజర్స్ కావాలని ప్రకటించారు. వచ్చిన దరఖాస్తులలో శ్రీనివాస్ దరఖాస్తుకూడా ఉంది. పాస్ పోర్టుసైజు ఫోటోతో సహా ఆ ఫోటో చూస్తూ చాలాసేపు కూచుంది ఆమె.
    "ఇప్పటికీ ఇంకా ఉద్యోగం దొరకలేదన్నమాట?" అనుకుంది. "ఏం రోజులు?" అని భారంగా నిట్టూర్చింది.
    జయపాల్ ఆమె దగ్గరకి రోజూరాడు. వారానికొకసారి వస్తాడు. ఏదయినా పనులుమీద తిరుగుతోంటే, ఒక్కొక్కసారి నెలవరకు కూడా కనపడడు. అప్పటికి పదిహేను రోజులుగా జయపాల్ ఆమెదగ్గరకి రావటం లేదు. తను అతనిని కలుసుకొనేలోగా మేనేజర్ ఎవరినైనా అపాయింట్ చేస్తారేమోనని ఆరాటం మొదలయింది ఆమెకు. జయపాల్ రాకకోసం ఆ విధంగా ఏనాడూ ఎదురుచూడలేదు ఆమె. ఇరవైరోజుల తర్వాత జయపాల్ ని చూడగానే "వచ్చారా?" అంది ఆనందంతో. ఆ ఆనందం చూసి పొంగిపోయాడు జయపాల్ - ఆమె భుజాలమీద చేతులు వేసి "ఎప్పటికప్పుడు నిన్ను అనుకుంటున్నాను డియర్! ఏం చెయ్యను చెప్పు? పనులు! నాకోసం నువ్వు చూస్తుంటావని తెలుసనుకో! కానీ, అయామ్ హెల్ప్ లెస్!" అన్నాడు.
    ఆమె కొద్దిగా ముడుచుకుపోయింది. సమయం చూసుకుని "మన ఇండస్ట్రీస్ లో సేల్సు మేనేజర్ గా ఎవరిని వేద్దామనుకుంటున్నారు!" అని అడిగింది.
    "ఏం? నీకు కావలసిన వాళ్ళెవరైనా ఉన్నారా?" నవ్వుతూ అడిగాడు.
    "అవును, శ్రీనివాస్ అనీ...."
    చివ్వున తలెత్తాడు జయపాల్ - వంకరనవ్వుతో "ఏమిటి నీకతనిలో ఇంటరెస్ట్!" అన్నాడు.
    ఈ ప్రశ్న ముందుగానే ఊహించుకుని దానికి సమాధానం సిద్ధం చేసుకునే ఉంది ఆమె. అందుకే అతని వంకర నవ్వుకు బెదిరిపోకుండా "నా ప్రాణస్నేహితురాలికి కాబోయే భర్త! అందుకని...." అంది. ఈ సమాధానంతో చాలావరకు ప్రసన్నుడయ్యాడు జయపాల్, "చూస్తాను" అన్నాడు.
    అది గమనించి ఆమె మరింత ప్రాధేయపడుతూ, "నా స్నేహితురాలూ, అతనూ ఎప్పటినుంచో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. అతనికి ఉద్యోగం దొరకక పెళ్ళి చేసుకోలేదు. పాపం, నా స్నేహితురాలి తలిదండ్రులు దాన్ని మరొకరిచ్చి చెయ్యాలనుకుంటున్నారని తెలిసింది. ఎలాగైనా సహాయం చెయ్యండి" అంది.
    "అలాగే!" అన్నాడు జయపాల్.
    అతడలా అంటే పని జరిగిపోనట్టే! శ్రీనివాస్ కి అపాయింట్ మెంట్ ఆర్డర్స్ అందాయి. అతడు డ్యూటీలో జాయినయ్యాడు. ఆ ఆఫీసు మూడంతస్థుల భవనం. ఒక సెక్షన్ కీ మరొక సెక్షన్ కీ సంబంధమే ఉండదు. అదీగాక శ్రీనివాస్ డ్యూటీమీద కాంప్స్ కి వెళ్ళవలసి ఉంటుంది ఇన్ని కారణాలచేత ఉద్యోగంలో చేరిన ఆరునెలల వరకు శ్రీనివాస్ వేదను కలుసుకోనేలేదు. శ్రీనివాస్ ని ఉద్యోగంలో వేసుకున్నాక జయపాల్ రెండు నెలలవరకు ఆమెను జాగ్రత్తగా గమనించాడు. అతడలా గమనిస్తాడని ఆమెకి తెలుసు. శ్రీనివాస్ ని కలుసుకునే ప్రయత్నమేదీ ఆమె చెయ్యకపోవటంతో అతని మనసులో అనుమానం తొలిగిపోయింది. డ్యూటీలో శ్రీనివాస్ సామర్ధ్యం సెక్షన్ హెడ్ ద్వారా తెలుసుకుని చాలా సంతృప్తిపడ్డాడు.
    ఆరోజు జయపాల్ తో ఏదో అర్జంట్ పని ఉండి అతని రూంకి వచ్చాడు శ్రీనివాస్-జయపాల్ ఊళ్ళో లేడని తెలిసింది. అతని పర్సనల్ సెక్రటరీని కలుసుకోవాలని వచ్చి ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు. "వేదా! హౌ లక్కీ!" అంటూ చెయ్యిచాపుతూ దగ్గరకి వచ్చాడు.
    అనుకోకుండా శ్రీనివాస్ ని చూసిన ఆమె ముఖము ఆనందంతో వికసించింది. ఆ ఆనందాన్ని చూస్తూ ఆమె తన చెయ్యి అందుకోలేదనే విషయం పట్టించుకోలేదు అతడు. వేద మోడస్టీ అతనికి తెలుసు!
    "వేదా! నాకు ఉద్యోగం దొరికింది తెలుసా? నేనిక్కడ సేల్స్ మేనేజర్ ని!" సంబరంగా అన్నాడు. వేద కళ్ళెత్తి ఆశ్చర్యం నటిస్తూ, "కంగ్రాట్యులేషన్స్" అంది.
    "నువ్విక్కడ ఏం చేస్తున్నావు?"
    వేద కళ్ళు వాలిపోయాయి.
    "జయపాల్ గారికి పర్సనల్ సెక్రటరీని."
    ఆ మాటలు వినగానే శ్రీనివాస్ ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. తనకంటే వేదది చాలా పెద్ద ఉద్యోగం.... "కంగ్రాట్యులేషన్స్" పొడినవ్వుతో అన్నాడు.
    "థాంక్స్!"
    తరువాత ఏం మాట్లాడాలో తోచని శ్రీనివాస్ కొంచెంసేపు కూర్చుని లేచి వెళ్ళబోయాడు. గుమ్మంవరకు వెళ్ళి వెనక్కు తిరిగాడు. అతడినే చూస్తోంది ఆమె. వెళ్ళబోతున్నవాడు ఆగి మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చాడు.
    "ఆమె! ఇప్పుడు ఇద్దరికీ ఉద్యోగాలొచ్చాయి, ఇద్దరమూ పెళ్ళి చేసుకుందాం!"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra