Home » Lalladevi » కౌగిట్లో జాబిల్లి

    అతనిలాగా నీటి అడుగున ఎక్కువసేపు వుండగల దమ్ములు ఎవరికీ లేవు. కాని వారు ఒకరి తరువాత ఒకరుగా కార్యక్రమాన్ని పంచుకున్నారు. కనుక తమదే విజయం అనుకున్నారు.

    కొద్దిసేపు అయింతరువాత చుట్టూ వలయంలా నిలిచివున్న వారిలో యువకుడు కెవ్వుమని అరిచాడు.

    జలగ పట్టుకుందో కాలికి నీటిపాము చుట్టుకుందో! అందరూ చెల్లాచెదరు అయారు. వలయం కాస్తా విచ్చిపోయింది.

    అరుపుతో పాటుగా ఆ యువకుడు నీటి మీదికి లేచాడు. మళ్ళీ దబ్బుమని నీటిలోకే పడిపోయాడు. అడుగున ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. అతడు భయంతో ఈదుకుంటూ గట్టువైపు రావడం ప్రారంభించాడు. మరికొంతమంది అనుసరించారు.

    ఎవరెందుకు పోతున్నారో! అంతా కలగాపులగం అయింది. గట్టుమీద కూడా అలజడి చెలరేగింది. ధైర్యం వున్నవారు మరింత ఉత్కంఠగా చూస్తున్నారు. పిరికి గుండెలవాళ్ళు ఏమి చూడాల్సివస్తుందో అని కళ్ళు గట్టిగా మూసుకున్నారు.

    పెద్దవాళ్ళు ఈ అలజడికి పరిణామం, ఫలితాంశం ఏదయినా విషాద వార్త అవుతుందేమో అని భయపడ్డారు.

    అది క్రీడ! అయినామామూలు ఆటకాదు. నీటితో చెలగాటం.

    పొరపాటు జరిగితే ప్రాణాలు కూడా పోవచ్చు.

    కాని అలాంటిది ఏమీ జరగలేదు.

    అందరూ చెల్లాచెదురు అయాక జడపిన్ను చెరువు నీటిమీదికి లేచి కన్పించింది. ఆ వెనుక బలమయిన ఆ చెయ్యి!

    అప్పుడే అందరూ గుర్తించారు అతన్ని వాల్మీకి!

    పైకి లేచాడు! జడపిన్ను ఒక చేత్తో పట్టుకుని ఒంటి చేతిమీద ఈదుకుంటూ చెరువు గట్టుకు వచ్చాడు. ఈసారి కూడా విజయలక్ష్మి అతన్నే వరించడంతో యువకులు గుర్రుమని చూస్తున్నారు.

    యువతులు ప్రశంస నిండిన చూపుల్ని అతని మీద కురిపించారు. నుదురుమీద అంటుకుపోయిన క్రాఫ్! ఆ క్రింద విశాలమయిన కళ్ళు! ఆ కళ్ళు నవ్వుకున్నాయి. కవ్విస్తున్నాయి.

    యువతులకు అతని ముఖంలోని విజియగర్వం చూస్తుంటే మనసుల్లో జిల్ జిల్ మనిపించినట్లుగా వుంది. అందరి దృష్టిలోనూ అతడే హీరోలాగా కన్పించాడు.

    కాని ఈసారి వంతు మాత్రం వేదికమీద నిలబడి విజేత కోసం ఎదురుచూచే గడసరి అమ్మాయిదే!

    చెరువు ఒడ్డుకు వచ్చి చేయి అందుకున్నాడు వాల్మీకి!

    ఈ అమ్మాయిని కూడా గట్టుమీదికి నడిపించి ఇంతకు మునుపు తాను మైత్రి సంపాదించిన అమ్మాయి ప్రక్కనే నిలబెట్టాడు.
    వారు ముగ్గురూ కలిసి మురిపెంగా ముచ్చట్లు ఆడుకుంటున్నారు.

    మిగిలిన యువకుల ముఖాలు నల్లన అయినాయి.

    యువతులతో మరొకామె ముందుకు వస్తోంది.

    స్నేహితులు ఆమెను ఎగతాళి చేశారు.

    నీకు కూడా వాల్మీకి యోగం పట్టింది అని గోళ్ళతో గిచ్చినట్టు చురుక్కుమనిపించే మాటలు విసిరారు. అది విని ఆ అమ్మాయి వెనుక అడుగు వేసింది. మరెవ్వరూ ముందుకు రావడానికి సాహసించలేదు.

    వారిలో వారికి చర్చలు జరుగుతున్నాయి.

    ప్రవహించే నడి హఠాత్తుగా ఆగిపోయినట్లు యువతీ యువకుల ఉత్సాహాన్ని అడ్డుకట్టకట్టింది. కోలాహలం నిలిచిపోయింది.

    "ఇంకెందుకు వెళ్ళిపోదాం పదండి" అన్నది ఒక అమ్మాయి నిరాశగా.

    "మధ్యాహ్నం పన్నెండు గంటలవరకూ సాగవలసిన ఆట మధ్యలో ముగించి ఎందుకు వెళ్ళాలేమిటి?" అంది మరో కొంటెపిల్ల!

    "ఎందుకేమిటి? వాడు వాల్మీకి! చేయి పట్టి తీసుకుపోయి ఆ యిద్దరి ప్రక్కన మూడో శాల్తీగా నిలబెడతాడు! ఇష్టమేనా పిచ్చిదానా?" అని ప్రశ్నించింది మొదటి కోణంగి పిల్ల!

    కొంటెపిల్లకి కోపం వచ్చి కోణంగి పిల్లని ఎదుర్కొంది.

    "పోద్దురూ ఆయనే గెలుస్తాడని ఎక్కడయినా రాసుందా! ఆమాత్రం దమ్ములు అందరికీ వున్నాయి. వారంతా పనికిమానిన వాళ్ళు అనుకోకు! అదృష్టం కలిసివచ్చి రెండుసార్లు గెలిచాడు.

    ఆయన ఒక్కడే హీరో అయినట్లు చెప్పకు! వాంతులొస్తున్నాయి. పొగడ్తలు విని విని" అంది కొంటె!

    "వాంతులెందుకొస్తాయి? అజీర్ణం చేసిందేమో!"

    "కాదులే! నెల తప్పిందనుకుంటా!?"

    "ఎక్కువగా మాటాడారంటే తంతాను! మళ్ళీ ఎలా గెలుస్తాడో చూస్తాను. ఈసారి నాప్ కిన్ లో రాయి చుట్టి నీళ్ళలోకి విసురుతా చూడండి!"

    "వద్దే అలా చేయకు నీళ్ళు చెడిపోతాయి."

    "నువ్వు నోరు మూస్తావా? దాన్లో ఇంత మట్టిసుద్ధ తోయమన్నావా?"

    "వేరే పెట్టటం ఎందుకులేవే! దాని బుర్రలో ఉంది కూడ అదే!"

    ఉబలాటం మాటలు ఎత్తిపోటులు అన్నీ అయిం తరువాత ఆ అమ్మాయి కోణంగి వచ్చి వేదికమీద నిలబడింది. యువకుల ముఖాలు పౌరుషంతో  ఎర్రగా అయ్యాయి. యువతులు నిశ్శబ్ధంగా అయ్యారు.

    ఇద్దరు గెలుచుకున్న స్నేహితులతో సరదా కబుర్లు చెబుతున్న వాల్మీకి ఇటువైపు చూస్తాడా? అంతటితో సరిపెట్టుకుని ఆగిపోతాడా.

    ఆ అమ్మాయి అందరికీ కన్పించేలా ముఖ్యంగా వాల్మీకికి కన్పించేలా నాప్ కిన్ కి రాయి చుట్టి నీటిలోకి విసిరింది. అది బుడుంగున మునిగిపోయింది.

    అలా చేయడంలో ఆ అమ్మాయి ఒక తెలివి ప్రయోగించింది.

    అది పెద్ద వస్తువు. సులభంగా దొరుకుతుంది. వాల్మీకి గట్టున వున్నాడు కాబట్టి అతడు దిగివచ్చేలోగా ఎవరో ఒకరు పట్టేస్తారు.

    అతని గీర ఈ పొగిడేవాళ్ళ గీర తగ్గిపోతుంది అనుకుంది.

    ఎప్పుడయితే ఆమె రాయి విసిరేందుకు సిద్ధపడిందో వాల్మీకి క్షణమయినా జాగు చేయకుండా చెరువు నీటిని ఆనుకుని వున్న ఒక చెట్టుమీదకి ఎక్కాడు. దాని కొమ్మలు చెరువు మీద చాలాదూరం పరుచుకున్నాయి.

    బాగా లోపలకు వెళ్ళిన కొమ్మ అంచుమీదికి వెళ్ళాడు వాల్మీకి.

    దానిని ఊయలలాగా ఊపి అది యిచ్చిన ఊపుతో సరిగా బహుమానం ఎక్కడ పడిందో అక్కడికే దుమికేశాడు.

    అప్పటికి యువకులు ఇంకా ఆ దాపులకు రాలేదు.

    వారు పాయింట్ కి చేరుకునే సమయానికి వాల్మీకి మునిగి నాప్ కిన్ తీసి పైకి చూపడం జరిగిపోయింది.

    ఈసారి అతని సమయస్ఫూర్తికి ప్రేక్షకులుగా వచ్చిన పెద్దలు తెగ ముచ్చట పడిపోయారు! క్రీడలు కాలక్షేపానికి కాదు.

    ప్రతిభాపాటవాలు నిరూపించుకోడానికి!

    కొంటె కోణంగి అమ్మాయి ముఖం అవమానంతో దిగిపోయింది.

    చేయిపట్టి గట్టుమీద మిగిలిన ఇద్దరితో చేర్చాడు వాల్మీకి.

    ఇక పోటీ జరిగే అవకాశాలు పూర్తిగా మూసుకున్నాయి.

    ఈ విషయాన్ని గుండెలమీద ముద్రించుకుని కొందరు యువకులు కూడా గట్టు ఎక్కేసి బట్టలుకూడా కట్టేసుకున్నారు. యువతులు కూడా నిరాశా నిస్పృహలతో కృంగిపోయినట్లుగా అయారు.

    "అతడే హీరో! కాదనగల దమ్ములు ఇంకా ఎవరికున్నాయి" అంది అతని వీరాభిమాని.

    "నేను" అంది ఆమని! అంతసేపూ మౌనంగా ఆట పద్ధతులు గమనిస్తున్న ఆమె క్షణమయినా ఆలస్యం చేయలేదు.

    మాటతోపాటుగా వేదికి మీదికి రానేవచ్చేసింది.

    పదిమంది యువకుల్లో ఒకరు హీరో కావటం సహజమే. కాని అతడే తిరుగులేని చక్రవర్తి అనటంలో అర్ధమేమి వుంది?

    ఈ విషయాన్ని నిరూపించాలనిపించిందామెకు!

    మిగిలినవారు తమ ప్రతిభని నిరూపించుకునేందుకు మరో అవకాశం ఇచ్చినందువల్ల పోయేది ఏముంది? గెలిచిన యువకుడితో కాసేపు కబుర్లాడి వెళ్ళిపోవచ్చు. కావాలనుకుంటే ఈ అయిదు రోజులూ కలిసి తిరగొచ్చు. సరదా అయిన ఈ పోటీలో పాల్గొంటే తప్పేముంది? అనుకుంది.

    ఈసారి యువకుల పట్టుదల పెరిగి ప్రతీకారం స్థాయికి వచ్చి చుక్కల్ని తాకుతోంది. వారు బుసలు కొడుతున్నారు.

    ఆమని మెడలో వున్న ఒంటిపేట గొలుసుతీసి అందరికీ చూపించింది. ముగ్గురు ముద్దుగుమ్మలతో పిచ్చాపాటి కబుర్లు ఆడుకుంటున్న వాల్మీకి వంక కవ్వించుతున్నట్టుగా చూపించింది.

    "నీకు నాలుగో నంబర్ వస్తుంది" అంది వీరాభిమాని.

    "ప్రపంచం గొడ్డుపోయిందా? ఆ యువకులు అందరూ దద్దమ్మలు అనుకుంటున్నావా? వాజెమ్మలా మాటాడకు. నోరు ముయ్యి!" అంది ఆమని యువకులు అందరికి వినిపించేలాగా!"

    దిగజారిపోతున్న ధైర్యానికి ఆ మాటలు మందులా పనిచేశాయి. ఈసారి పులి బిడ్డలై విజృంభించేందుకు వారు నడుం కట్టారు. చెయిన్ ని ఉండలా చుట్టి చేయి చాచి వీలయినంత ఎక్కువదూరం విసిరింది ఆమని! అందరితోపాటు ఈసారి కూడా వాల్మీకి తలపడ్డాడు! ఈసారి గెలుపెవరిది అనే ఉత్కంఠ అందర్నీ తినేస్తోంది!

    వాల్మీకి తన టెక్నిక్ ప్రకారం నీటిలో మునిగాడు దూరంనించే! యువకులు వలయం కట్టారు. ఈసారి అతని బెదిరింపులకు లొంగకూడదని ఒకరినొకరు హెచ్చరించుకున్నారు.

    ఒకరి తరువాత ఒకరుగా తమ అన్వేషణ ముందుకు తీసుకుపోతున్నారు. అయితే ఈసారి వారికి దూరంగా నీటి మీద తేలుతున్న ఒక యువకుడు ఉలికిపడి పైకి గెంతాడు.

    "చచ్చాను బాబోయ్ రక్షించండి! రక్షించండి!" అని అరిచాడు.

    కోలాహలం అయిందికాని ఇందాకటి లాంటిదే ఇది కూడా అనుకున్నారు అందరూ! కాని అతని కేకలు క్షణక్షణం పెద్దవి అయాయి! అన్వేషణ సాగుతూనే ఉంది. ఏం జరుగుతుందో గట్టు మీద వారికి తెలియదు. కోలాహలానికి అలజడికి ముగింపు వాల్మీకి గెలవటమే కదా అని ధైర్యంగానే ఎదురుచూస్తున్నారు.

    యువకుడు కేకలు పెట్టడం ఆగిపోయింది.

    అతడు నీటిలో మునిగి నిముషం తరువాత తెప్పలా పైకి తేలాడు.

    ప్రాణాలు పోయినట్టు శవంలా అన్పించాడు.

    ఏదో ప్రమాదం జరిగిందని యువకులు గ్రహించారు.

    నీటి ప్రమాదంలో ఉన్న మనిషికి దగ్గరగా వెడితే వెళ్ళిన వారికి కూడా ప్రమాదమే! ఈ సంగతి ఈదే వారందరికి తెలుసు! చెయిన్ సంగతి మర్చిపోయారు. ఎవరికి వారు ప్రాణాలు రక్షించుకునే ఆదుర్దాలో గట్టును చేరుకుంటున్నారు.

    నీటిపైకి వచ్చిన వాల్మీకి ఇది గమనించాడు.

    వెంటనే యువకుడి శరీరాన్ని భుజాలమీదికి ఎత్తి నిలువురింతవేస్తూ గట్టుకు తీసుకువచ్చాడు. ఇప్పడు దళాలన్నీ కలిశాయి.

    అందరూ ఒకే చోటుకి చేరిపోయారు.

    యువకుడు ఎక్కువగా నీరు త్రాగలేదు! అతన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కాలి పిక్కల మీద పాము కోరలు దిగిన గుర్తులున్నాయి.

    వాటిని చూచి నవ్వాడు వాల్మీకి!

    అందరి ముఖాల్లో భయం దోబూచులాడుతోంది.

    కొందరికి అనుమానం వచ్చింది నవ్వుతాడేమిటని?

    "నీటి పాము కరిస్తే ఏమీ అవదు! అతను భయం వల్ల స్పృహ కోల్పోయాడు! గాలి ధారాళంగా తగిలితే లేచి కూర్చుంటాడు" అన్నాడు.

    "నీటిలో విష జంతువులు కూడా ఉంటాయి. అది నీటి పాము అని నిర్ధారణ ఏమిటి? పట్నం తీసుకుపోవడం ఎందుకయినా మంచిది" అని పెద్దలలోంచి ఒకాయన సలహా ఇచ్చాడు.

    "అక్కరలేదు! అలా లావుపాటి కోరలు నీటి పాముకే ఉంటాయి. త్రాచు అయితే వాటి కోరలు రేగుముల్లు గీచుకుపోయినట్లుగా దిగుతాయి! అంతేకాదు, త్రాచు కోరలు దూర దూరంగా ఉంటాయి! ఈ గాయం కన్పించేంత దగ్గరగా ఉండవు.

    పైగా రక్తం కూడా గాయం నించి కారినంత ఎక్కువగా కారదు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra