Home » Yandamuri veerendranath » మరో హిరోషిమా


    "అందుకే కదండీ మా కంపెనీకి 'పెర్వర్షన్' అని పేరు పెట్టిందీ. పోతే మీవాళ్ళు ఉవ్విళ్ళూరుతున్నమాట నిజమే అయుండొచ్చు. కానీ మా కంపెనీ ప్రశ్నాపత్రం చూసిన తర్వాత నన్ను మూకుమ్మడిగా చితగ్గొడతారని భయంగా వుంది. ఈ సైకాలజీ సబ్జెక్టే అలాంటిది. విశ్లేషించేకొద్దీ చాలా ఇబ్బందిగా వుంటుంది.... అందరినీ విడివిడిగా కూర్చోబెట్టే ఏర్పాటు చేయగలరా? ఎంతో టైమ్ పట్టదు. పది నిముషాల్లో అయిపోతుంది."

    "అలాగే" అన్నారు అమ్మాయిలు.

    "అయితే మరో చిన్న అభ్యర్ధన. ఏ అమ్మాయీ లేచి నిలబడి 'నేను దీన్ని ఫిలప్ చేయను' అని కాగితం విసిరెయ్యకూడదు. మాస్ సైకాలజీ మీద ఇది వెంటనే ప్రభావం చూపిస్తుంది. ఒకరలా చేస్తే మిగతా వారందరూ అదేపని చేస్తారు. ఇష్టం లేకపోతే కామ్ గా కూచోవాలి. పూర్తిచేసిన తర్వాత తీసుకొచ్చి ఈ సంచీలో వెయ్యండి. అన్నీ మీ ఎదుటే కలగా పులగం చేస్తాను. ఓకేనా?"

    "ఓ.కే.!" ముక్తకంఠంతో జవాబిచ్చారు అమ్మాయిలంతా.

    గ్రౌండ్ లోనే చెట్లకిందా, మెట్లమీదా దూరం దూరంగా సర్దుకుని కూర్చున్నారు. పరీక్ష హాల్లో ప్రశ్నాపత్రాలు పంచినట్టు అందరికీ తలో కాగితం ఇచ్చాడు బృహస్పతి. అర నిముషం పాటు అక్కడ గాలి కూడా నిశ్చలత్వాన్ని సంతరించుకుంది. అయితే అది అరనిముషంపాటే!

    ఒక అమ్మాయి సన్నగా కేక పెట్టింది. ఒక అమ్మాయి నోటి వెంట అప్రయత్నంగా 'ఛీ' అన్న పదం బయటికొచ్చింది. కొందరు చాలా ఇబ్బందిగా కదులుతున్నారు. కొంతమంది పెదాలు బిగపట్టి నవ్వాపుకున్నారు. ఒకరిద్దరు అప్రయత్నంగా పైటలు సర్దుకున్నారు. ఒక అమ్మాయి చెట్టుకి ఆనుకుని తల వెనక్కి వాల్చి, కళ్ళు మూసుకుని, బాయ్ ఫ్రెండ్ తో బృందావన్ గార్డెన్స్ కి వెళ్లింది.

    అందరూ కదులుతున్నారు. అయితే వాళ్ళ చేతిలో కలాలు మాత్రం కదలడంలేదు. వాళ్ళ మనోగతం అర్ధమైనట్టు బృహస్పతి చేతులు జోడించి అన్నాడు. ".... ఇది నా ఉద్యోగానికి సంబంధించిన సమస్య.... మీరు దాన్ని పూర్తి చేయకపోతే, నా జీవనాధారమే పోతోంది. ప్లీజ్.... ఎవరితోనూ పంచుకోలేని భావాలు పరోక్షంగా బయట పెట్టడంలో ఏ విధమైన హానీ జరగదు కదా! నా కోసం ఒక్కసారి ఆలోచించండి."

    అతడి మాటలు వారిపై ప్రభావాన్ని చూపించాయి. ఒక అమ్మాయి చకచకా రాయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మరో అమ్మాయి, నిముషం గడిచేసరికల్లా అందరూ తమ క్వశ్చనీర్ పూర్తిచేయడంలో నిమగ్నమయ్యారు. పావుగంట గడిచేసరికి ఒకరొకరే వచ్చి సంచిలో తాము పూర్తిచేసిన పత్రాలని పడవేయసాగారు. అయితే అతడి చేతిగాలి కూడా తమ పత్రాలకి తగలకుండా జాగ్రత్తపడ్డారు. తమ పేపరు మిగతావాటితో కలిసి పోయింది అని నిర్ధారించుకోవడం కోసం ప్రతి వారూ సంచిని ఒకటి రెండుసార్లు కుదిపారు కూడా!

    బృహస్పతి పెదవుల మీద సన్నటి చిరునవ్వు కదలాడుతోంది.


                          7


    "ఎందుకు నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్?" అడిగాడు హనుమంతరావు.

    "హేమంత గుర్తుకొచ్చి...."

    రావు కోపంగా ".... అవినీతి అధికారి వేషం వేసి మోసం చేసినందుకు, మళ్ళీ కనబడితే లాకప్ లో పెట్టి మక్కెలిరగ్గొడతానని ఆ ఇన్ స్పెక్టర్ నన్ను ఊళ్లోంచి వెళ్ళగొట్టింది. ఇంటిమీదకి రౌడీల్ని తెప్పించినందుకు నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. జానపద చిత్రాల్లో బాటసారుల్లాగ, భుజంమీద కర్రలేసుకుని, వాటి చివర్లో అన్నం మూటలు కట్టుకుని, మనం ఈ అడవిలో తిరుగుతున్నాం. ప్రస్తుతం అలిసిపోయి చెట్టుకింద పడుకున్నాం. ఎటునుంచి ఏ క్రూరమృగం వస్తుందో, కిందనుంచి ఏ తేలు ఎక్కడ కుడుతుందో తెలియని పరిస్థితి! నువ్వేమో ఏవేవో శపధాలు చేసి, నీతోపాటు నన్ను కూడా అడవుల పాల్జేసావు. ఇకముందు ఏం చెయ్యాలో ఆలోచించకుండా, తలకింద చేతులు పెట్టుకుని, వెల్లకిలా పడుకుని, తీరిగ్గా నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నావా?" కోపంగా అన్నాడు.

    "గర్ల్ ఫ్రెండ్ తాలూకు ఆలోచన కొబ్బరి నీళ్ళలాంటిది. మండుటెండలాంటి నిరాశా నిస్పృహల్లో సేద తీరుస్తుంది. అందులో కాస్త 'జిన్' కలుపుకుంటే కిక్ ఇస్తుంది." 

    "ఈ ఎండకి- నెత్తిమీద టోపి కూడా కాలిపోతోంది. ఇవ్వాళ సాయంత్రానికి తెచ్చుకున్న తిండి కూడా అయిపోతుంది. ఈ అడవిలో కొబ్బరి నీళ్ళు కాదు కదా, మామూలు నీళ్ళు కూడా దొరికే ఛాన్స్ లేదనిపిస్తోంది. ఏం చేద్దాం?"

    "హాయిగా వెల్లకిలా పడుకుని, పైనున్న చెట్టుకొమ్మల కేసీ, ఆకుల మధ్యనుంచి కనబడే ఆకాశం కేసీ చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకో బ్రదర్!

    ఆ ఆలోచన- గర్ల్ ఫ్రెండ్ లాంటిది. మనం ఆహ్వానిస్తే రాదు. దానంతటదే రావాలి" అంటూ కళ్ళు మూసుకున్నాడు బృహస్పతి.

    అతడి ఆలోచన గతంలోకి జారుకుంది.


                    *    *    *


    బ్యాగ్ ముందేసుకుని, అందులోంచి అమ్మాయిలు రాసిచ్చిన కాగితాల్ని బయటకు తీసాడు బృహస్పతి. హేమంత పూర్తిచేసిన పత్రాన్ని పట్టుకోవడానికి అతడికి ఎక్కువ టైమ్ పట్టలేదు. అంతకుముందే హోటల్ లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు యధాలాపంగా తీసినట్టు తీసి ఆమె నోట్ బుక్ లో చేతిరాత చూసాడు. మిగతా వాటిని పక్కన పడేసి, ఆమె రాసింది చదవసాగాడు. చదువుతున్న కొద్దీ అతడి మొహం వాడిపోయింది. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలకి ఆమె ఇచ్చిన జవాబులు....

    'మీ కింతకు ముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?'

    ఉన్నాడు.

    'ఒకరా, ఒకరికన్నా ఎక్కువా?'

    ఒకరే.

    అతన్ని వివాహం ఆడాలనే ఉద్దేశం ఉందా?

    ఉంది.

    అతడితో సంబంధం ఎంతవరకూ వచ్చింది?

    అందరు అమ్మాయిల్లాగే- ముద్దులూ, కౌగిలింతల వరకూ (పెళ్ళయ్యే వరకూ పవిత్రత కాపాడుకోవాలనే నిర్ణయంతో ఉన్నాం!)

    కాబోయే భర్త ఎలా వుండాలని మీ ఉద్దేశం?

    నన్ను నన్నుగా గుర్తించాలి. అమితంగా ప్రేమించాలి. సిగరెట్లు, పేకాట, తాగుడు లాంటి వ్యసనాలకి దూరంగా ఉండాలి. (నా పేరు చెప్పక్కర్లేదు కాబట్టి మనసులో వున్నదంతా రాసేస్తున్నాను) కనీసం కారు లేకపోతే జీవితం అనవసరం!


                                           *    *    *


    ఇది జరిగిన ఆరు నెలల తర్వాత ఒక సాయంత్రం హేమంత సంధ్య అతడిని మెయిన్ బజారులో చూసి గుర్తుపట్టింది. ఆశ్చర్యంగా ".... ఇదేమిటి? ఇలా అయిపోయారు?" అంది.

    బృహస్పతి నవ్వి "ఎలా అయిపోయాను?" అన్నాడు.

    "రండి, కాఫీతాగుతూ మాట్లాడుకుందాం!"

    "మీ కాలేజీ అమ్మాయిల కిదో ఊతపదంలా ఉందే!"     

    "వాట్ డూ యూ మీన్? కనబడిన ప్రతీ కుర్రాణ్ణీ కాఫీకి పిలుస్తామనుకుంటారా?" చిరుకోపంతో అంది హోటల్ లోకి ప్రవేశిస్తూ.

    "పోనీ సెలక్టివ్ గా కొంతమందిని"

    "ఏమో మరి! నాకు మాత్రం అలాంటివి తెలీదు. నిజం చెప్పాలంటే నేను మొదటిసారి హోటల్ కెళ్ళి కాఫీ తాగింది మీతోనే. ఇది రెండోసారి."

    అతడు ఆమె కళ్ళలోకి సూటిగా చూసి, ఎదో అనబోయి మనసు మార్చుకుని, "అప్పుడు మనం కాఫీ తాగలేదు. ఐస్ క్రీమ్ తిన్నాం" అన్నాడు.

    "మీకు ఆ విషయం కూడా భలే గుర్తుందే!"

    "అన్ని విషయాలూ గుర్తున్నాయి"

    "ఏమిటవి?" నవ్వుతూ అడిగింది.

    అతడు నవ్వలేదు. అభావంగా చెప్పసాగాడు.

    "ఆరోజు మీరు బాటిల్ గ్రీన్ పాటూరు నేతచీర కట్టుకున్నారు. దాని పైటకి నెమలి ఆకారంలో ఎనామిల్ పెయింట్ వున్న బోర్డరు, కుచ్చిళ్ళకి తెల్లపూసల పువ్వున్న పిన్ పెట్టుకున్నారు. వంకాయరంగు నెమలి డిజైన్ జరీ బోర్డరున్న బ్లౌజ్ వేసుకున్నారు. డీప్ రౌండ్ నెస్, లాంగ్ స్లీవ్స్ విత్ పఫ్ వున్న బ్లౌజ్ అది. నుదుటికి ఓనల్ షేపులో కాస్త పొడుగ్గా వున్న బొట్టు పెట్టుకున్నారు. చెవులకి త్రుభుజాకారపు జెంటిల్ మెన్ హేంగింగ్స్ వున్నాయి. చిన్న టాప్ వున్న సెకండ్ రింగ్స్ కూడా వున్నాయి. జుట్టుకి మేచింగ్ పూలనాట్ వేసుకున్నారు. మరి ఆ స్టయిల్ మీకే తెలుసో, మీ బ్యూటీషియన్ అమర్చిందో కాని, చెవి వెనకనుంచి ఒక పాయ తీసి, గాలికి వదిలేసారు. చాలా కొద్దిమందికే తెలిసిన స్టయిల్ అది! లైట్ గ్రీన్ షేడ్ వున్న మస్కరా రెప్పలకి వేసి వేయగానే, వాటి తడి ఆరకుండా రెప్పలల్లార్చి నట్లున్నారు. అది కనుబొమ్మలకి కాస్త కిందగా తగిలి, మరింత అందాన్నిచ్చింది. రిచ్ పర్పుల్ రంగులో గులాబీ కలర్ మిళితమైన పింకూ లిప్ స్టిక్ వేసుకున్నారు. కేవలం ఆ బ్రాండ్ లిప్ స్టిక్ కే అంత మెరుపు వస్తుంది. చెవి హేంగింగ్స్ కి మాచ్ అయ్యేలా మామిడి పిందెల బ్లాక్ మెటల్ ఛెయిన్ మెడలో.... గోల్డెన్ డైమండ్ ఛెయిన్ వున్న ఓవల్ షేపు వాచీ చేతికీ.... ముత్యపు ఉంగరం వెలికీ పెట్టుకున్నారు. కుడిచేతికి రెండు బంగారు గాజులున్నాయి. వాటి మధ్యలో అరడజను మట్టిగాజులు వేసుకున్నారు. ఒక గాజు చీరకీ, ఒక గాజు జాకెట్ కీ మేచ్ అయ్యేలాగ- ఒకటి బాటిల్ గ్రీన్ కలరైతే, మరొకటి బ్రింజాల్ కలర్ ది. కాళ్ళకి గోల్డెన్ కలర్ డిజైన్ స్ట్రయిప్స్ వున్న హైహీల్స్ వేసుకున్నారు. అన్నిటికీ మించి ఆ రోజు మీరు చార్లీ పర్ఫ్యూమ్ వాడారు. అవునా?"

    ఒక అపురూపమైన దృశ్యాన్ని చూస్తున్నట్లు ఆమె అతడివైపు చూస్తూ వుండిపోయింది. చాలాసేపటికి తేరుకుని "మైగాడ్!" అంది అస్పష్టంగా. అతడు మాట్లాడలేదు.

    "ప్రతీ అమ్మాయినీ ఇలాగే గుర్తు పెట్టుకుంటారా?"

    "లేదు. మిమ్మల్ని ఒకర్నే!"

    "ఎందుకు?"

    "ప్రేమించాను కాబట్టి."

    హేమంత సంధ్య చేతిలో స్పూన్ అప్రయత్నంగా జారి టేబిల్ మీద పడింది.

    అతడు అదే అభావమైన స్వరంతో అన్నాడు. ".... నా ప్రేమ గురించి మీరేమీ కలవరపడకండి. నేనింక మిమ్మల్ని కలవను. ఈ ఆరు నెలలూ కలవకపోవడానికి కూడా కారణమదే!"

    "మీరు చెప్తున్నది నాకేం అర్ధంకావడంలేదు. ప్రేమించడం ఏమిటీ? కలవక పోవడం ఏమిటీ?" అయోమయంగా అడిగింది.
   
    "అర్ధం అవ్వాలంటే మొదటినుంచీ జరిగినదంతా చెప్పాలి.... సాయంత్రం అయ్యేసరికి మా స్నేహితులందరికీ అమ్మాయిలని చూడడం కోసం రైల్వే ప్లాట్ ఫామ్ మీదకి చేరుకోవడం అలవాటు. నాకు పెద్ద ఇంటరెస్ట్ లేదు. GIRLS NEVER USED TO FASCINATE ME. అటువంటిది మొట్టమొదటిసారి మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయాను. నా స్నేహితుడికి పుస్తకాల పిచ్చి. స్టేషన్ లో పుస్తకాలు కొనుక్కుని మూడు కొత్త వందరూపాయల నోట్లు షాపువాడికి యిచ్చాడు. అదే సమయానికి మీరా షాపులో పుస్తకం కొనుక్కున్నారు. షాపువాడు ఆ నోట్లు మీ కిచ్చాడు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరు ఏమనుకున్నా సరే- వున్నదున్నట్లు చెపుతున్నాను. ట్రెయిన్ లో మనతో పాటొచ్చిన ఆ జీన్స్ పాంట్ వేసుకున్నవాడు నా స్నేహితుడు."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra