Home » Dr c. ananda ramam » గర్ల్ ఫ్రండ్

    జయపాల్ గారు, ఆయన అనుకూలం చూచుకొని తనే ఫోన్ చేస్తారు మీకు. ఏ ఇబ్బందీ ఉండదు మీకు." అన్నాడు జయపాల్ గారి పి.ఏ. తను దిగాలుగా చూస్తే నవ్వి, 'ఈమాత్రం చొరవ చెయ్యలేకపోతే మీరే ఉద్యోగమూ చెయ్యలేరు. ఈకాలంలో ఆడపిల్లలకి, ఉద్యోగాలు చేసి స్వతంత్రంగా జీవించాలనుకొనే ఆడపిల్లలకి, తనకితానుగా అన్ని విషయాలూ ఆలోచించుకొనే వివేకమూ, ఏ పరిస్థితిలోనైనా నిబ్బరంగా నిలిచే స్థయిర్యమూ, రెండు ఉండాలి. లేకపోతే ఉద్యోగాలంటూ రావటం దండుగ!' అన్నాడు.
    హేండ్ బేగ్ భుజానికి తగిలించుకొని చిన్న సూట్ కేస్ చేత్తోపట్టుకుని ఖరీదైన బట్టలతో హడావుడిగా గందరగోళంగా నడిచే మనుష్యులమధ్య నుంచి నిరాడంబరంగా, నిదానంగా నడిచివచ్చి టాక్సీలో కూచుని 'తాజ్ కి' అని చెప్పింది. ఆ తరువాత పి.ఏ. చెప్పినట్లుగానే దేనికీ యిబ్బంది కలగలేదు. రిసెప్షన్ లో తన పేరు చెప్పగానే తన రూమ్ నంబరు చెప్పి, ఆ కీ యిచ్చి, వెంట బాయ్ ని పంపించారు. రూమ్ ని చూపించటానికి. లిఫ్ట్ లో తన రూమ్ చేరుకుంది. నడిసముద్రంలో విసిఎఇవేయబడ్డవాడు అప్రయత్నంగానే ఈత నేర్చుకున్నట్లుగా. తనకు తానుగా అన్ని విషయాలూ నిర్వహించుకోగలిగే చొరవ వచ్చేస్తోంది. రూమ్ లోకి వెళ్ళి కాల్ బెల్ నొక్కి బాయ్ చేత కాఫీ ఫలహారాలు తెప్పించుకొంది. స్నానంచేసి బట్టలు మార్చుకొని పక్కమీద పడుకుంది.
    ఏమాత్రం బడలికగా లేదు .ప్రయాణం చేసినట్లే లేదు. యెంత హాయిగా ఉంది ఆ ప్రయాణం! కానీ అంత ఎత్తునుంచి క్రిందపడితే?....ఏం ఆలోచన ఇది? ఎందుకీ ఆలోచన తనను వెన్నాడుతోంది? ఫోన్ మ్రోగింది. తీసి "హలో!" అంది.
    "నేను జయపాల్ ని మాట్లాడుతున్నాను."
    గంభీరమైన ఆ కంఠస్వరానికి అదిరిపడి తను మాట్లాడుతోంది ఫోన్ తోననే మాటకూడా మరిచిపోయి లేచి నిలబడి "నమస్కారమండి!" అంది. "సాయంత్రం నాలుగుగంటలకి కారుపంపుతున్నాను. బయలుదేరిరా!" ఫోన్ పెట్టేసిన చప్పుడు. డాబు, దర్పం, అహంకారం తప్ప మాట వినిపించలేదు ఆ కంఠంలో....అవతలివైపు ఫోన్ పెట్టేసిన తరువాత కూడా ఇంకా వినవలసినదేదో ఉన్నట్లు ఫోన్ వైపు చూస్తు నిలబడిపోయి చివరకు ఒక విధమయిన నిస్పృహతో ఫోన్ పెట్టేసింది. మళ్ళీ పడుకుంది. చీటికి మాటికీ శ్రీనివాస్ గుర్తుకొస్తున్నాదు. ఏం చేస్తుండి ఉంటాడు? బహుశః ఏ ఇంటర్వ్యూకోసమో కొల్లేటి చాంతాడులాంటి ఏ క్యూలోనో, ఏ చివరనో నిలబడి వుంటాడు. ఆశనిరాశలమధ్య ఊగిపోతూ....ఒక్క శ్రీనివాసే కాదు. గుండెజబ్బుతో బాధపడుతూ అయోమయంగా చూసేతల్లి, కాటరాక్ట్స్ తో ఒక కన్ను కనపడక, ఒక కన్నుతోనే చేజేతులా కరిగించుకొన్న తన ఆస్థితో సృష్టించుకొన్న అంధకారాన్ని చూస్తు కుమిలిపోయే తండ్రీ....స్టేట్ ఫస్టు వచ్చి మెడిసన్ చదవాలని ఉబలాటపడుతూ, "పోనీ, ఉద్యోగం చేస్తానక్కా!" అంటున్న ముక్కుపచ్చలారని చెల్లెలూ, కష్టపడి అయిదేళ్ళు చదివించి బి.ఇ. డిగ్రీ తెచ్చుకొని మూడేళ్ళనుంచీ వ్యర్ధంగా ఉద్యోగం కోసం తిరిగి తిరిగి వేసారిపోయి చివరకు మొండిగా ఇల్లు వదిలిపోయిన అన్నయ్య....అందరూ గుర్తుకొస్తున్నారు.
    అంతస్థులపైన అంతస్థులతో ఆకాశాన్నంటే సౌధాలతో, ఉక్కిరిబిక్కిరిగా తిరిగే జనంతో గందరగోళంగా ఉంది బొంబాయి మహానగరం. ఇంత ఉక్కిరి బిక్కిరిగా తిరుగుతూ ఈ జనం సాధించేదేమిటో? కూడూ, గుడ్డాకేనా, ఈ ప్రయాస అంతా! మానవుడి బ్రతుకంతా కూడూ, గుడ్డ, ఇంతేనా?
    నాలుగయింది. వేద ప్రత్యేకించి ఏమీ అలంకరించుకోలేదు. వున్నవాటితో మంచి చీర కట్టుకుని తలదువ్వుకొని బొట్టుపెట్టుకొని సిద్ధంగా ఉంది. కాల్ బెల్ విని తలుపు తెరిచింది. యూనిఫారంలో వున్న డ్రైవర్ తలవంచుకుని నమస్కారం చేసి చిన్న చీటీ ఇచ్చాడు.
    "కారులో బయలుదేరిరా! భయంలేదు.
     జయపాల్...." 
    "భయంలేదు" అన్నమాట చదువుకుని నవ్వుకుంది. రూమ్ కి తాళం వేసి, తాళంచెవి రిసెప్షన్ లో ఇచ్చి వచ్చి కారులో కూచుంది. కారు గిర్రున దూసుకుపోతోంది విశాలమైన రోడ్లమీదుగా__లెక్కలేనన్ని కార్లు, అంతులేనన్ని బస్ లు, మేడలు, ఆ పక్కనే ఒక పెద్ద సిమ్మెంటు తూములో కాపురముంటున్న కొన్ని చింకి బతుకులు. కారు పెద్దమేడ కాంపౌండ్ లోకి దూసుకుపోయి ఆగింది. గుమ్మంలో నిలబడి వున్నాడు జయపాల్. పైజామాతో సిల్క్ లాల్చీతో! బంగారు గొలుసుతో, వేద కారు దిగగానే చిరునవ్వుతో "గుడీవినింగ్" అని ఆహ్వానించాడు.
    బొమ్మలా నిలబడ్డ వేదను చూస్తూ "లోపలికిరా! ఇది ఆఫీసుకాదు. నా ప్రైవేట్ బంగళా! ఇక్కడ మాత్రమే నేను చాలా ఫ్రీగా మాట్లాడతాను. నువ్వూ ఫ్రీగా మాట్లాడవచ్చు, కమిన్" అన్నాడు.
    వణుకుతున్న కాళ్ళతో వేద లోపలికి నడిచింది. విశాలమైన హాలు, అటుపక్కా ఇటుపక్కా అందంగా అమర్చిన సోఫాసీట్లు, వాటిమధ్య డెకోలామ్ టేబిల్స్__పెద్ద పెద్ద కిటికీలు, వాటికి అందమైన తెరలు. గోడలకు ఉత్తమ కళాభిరుచి వ్యక్తంచేసే ఖరీదైన తైలవర్ణ చిత్రాలు ....
    వేద విభ్రాంతితో చుట్టూ చూస్తూంటే, "ఈ ఇంటి అందం చూడాలనుకుంటే ఇక్కడ కాదు. ఇలారా!" అన్నాడు. మంత్రముగ్ధలా అతడి వెంట నడిచింది. లోపల అడుగు పెట్టగానే అది పడకగది అని తెలిసి ఒక్క క్షణం బిగుసుకుపోయింది. డబుల్ కాట్స్. యు. ఫోమ్ బెడ్స్ ఒక పక్కగా సోఫాసెట్, బెడ్ కీ, సోఫాలకూ, మధ్యగా ఫోన్. వేద అవస్థ గమనించనివాడిలా ముందుకు నడిచి ఒక కిటికీ తెర పక్కకు లాగి సముద్రం, అల్లకల్లోలంగా ఎగిరెగిరిపడుతూ అదేపనిగా ఘోషిస్తోంది. బీచినిండా మనుష్యులు, సముద్రాన్ని చూసేవారికంటే తమ గొడవలో తామున్నవారే ఎక్కువ. కొందరు మాత్రం ఒడ్డునుతాకే కెరటాల నీటిలో కాళ్ళు పెట్టి ఆడుతున్నారు. 
    "దీని జుహూ బీచ్ అంటారు. బొంబాయిలోని అందమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఈ కిటికీలోనుంచి చూస్తె సూర్యాస్తమయమూ, ఆ కిటికీలోంచి చూస్తే చంద్రోదయమూ ఒకసారే కనిపిస్తాయి మనకి. బొంబాయిలో ఒక ప్లాట్ దొరకటమే ఎంతో కష్టం. ఇండిపిండెంట్ హౌస్ ఉండాలంటే, అదీ బీచ్ కి ఈమాత్రం దూరంలో...."మధ్యలో ఆపి గర్వంగా నవ్వాడు జయపాల్.
    తన్మయత్వంతో కిటికీలోంచి దూరంగా వున్న సముద్రం చూస్తోన్న వేద ఆ నవ్వుతో మనసుకి మల్లు గుచ్చినట్లయి కిటికీకి ఎడంగా వచ్చేసింది.
    "కూచో!" అన్నాడు జయపాల్. ఆమె సోఫాలో కూచుంది. జయపాల్ వచ్చి ఆమె పక్కనే కూచున్నాడు. ఆమె కుంచించుకుపోయింది. కానీ ఎడంగా జరగలేదు.
    "ఉద్యోగంకోసం ఇంత దూరం వచ్చావు. నీకంత అవసరమా, ఆ ఉద్యోగం?" వేద ముఖంలోకి చూస్తూ అడిగాడు.
    "అదికూడా అడగాలా?"
    "నన్ను నమ్మి ఇక్కడి వచ్చేసావు. ఇప్పుడు నేను నిన్నేమైనా చేస్తే...."
    "ఏమీ చెయ్యలేరు. చేసినా తప్పించుకోలేరు."
    "ఎందుకు?"
    "హోటల్ లో నా పక్క రూమ్ వాళ్ళతో స్నేహం చేసుకున్నాను ఎనిమిది గంటలలోగా నేను తిరిగిరాకపోతే పోలీస్ రిపోర్టు ఇయ్యమని చెప్పివచ్చాను."
    తన పెద్ద బొజ్జ ఊగిపోయేలాగ "అహహ!" అంటూ చాలాసేపు నవ్వాడు జయపాల్.
    "నువ్వు నిజంగా చాలా తెలివైనదానివి. ధైర్యస్తురాలివి. కానీ' నన్ను నువ్వింకా ఏమాత్రమూ అర్ధంచేసుకోలేదు. నువ్వు హోటల్ లో అడుగుపెట్టినప్పటినుంచీ, ఈ క్షణంవరకు ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నావో నేను తెలుసుకుంటూనే ఉన్నాను. నీ మనసులో ఏమనుకుంటున్నావో కూడా చెప్పగలను...."
    "చెప్పండి!"
    "ఏదో మహాదారుణం జరగబోతోందని ఊహించుకుంటున్నావు."
    "ఎలా చెప్పగలిగారు?"
    "నీ ముఖంచూసి__నీ ముఖంలో ఆ మాత్రం సిన్సియారిటీ లేకపోతే, ఇంత ఖర్చుపెట్టి ఇక్కడికి పిలిపించేవాడిని కాను...."
    "అంటే?....మీ ఉద్దేశమేమిటో నాకు అర్ధంకావటంలేదు!"
    "అది చెప్పటానికే పిలిపించాను. నేను మానభంగాలు చేసే సినిమా విలన్ ని కాను. డబ్బుపారేస్తే ఈ మహాపట్నంలో అందాలు తేలిగ్గానే దొరుకుతాయి. బట్ ఐ వాన్టు ఎ గర్ల్ ఫ్రెండ్!"
    "వాట్?"
    "గర్ల్ ఫ్రెండ్! నాకు నీ ఫ్రెండ్ షిప్ కావాలి. ఇది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలా తాత్కాలికమైనది కాదు. అన్నివిధాలా మనం ఒకరికొకరం స్నేహితుల్లా ఉంటాం! దానిలో బంధాలూ, నిర్భంధాలూ ఏమీ లేవు. మనసులు కలిసినంతకాలం స్నేహితుల్లా ఉంటాం! ఎప్పుడు విడిపోవాలనిపిస్తే అప్పుడు విడిపోతాం!"
    వేద ఆలోచనలో పడింది.
    "నువ్వంత తల పగలగొట్టుకోవలసినదేమీలేదు. ఇందులో ఈ రకమైన ఫ్రెండ్ షిప్ స్త్రీ పురుషులమధ్య ధనికవర్గాలలోను, మధ్యతరగతివారిలోనూ కూడా ఈ మధ్య సాధారణమయిపోయింది. యు ఆర్ సో లవ్లీ! సో ఇన్నోసెంట్ అండ్ డిగ్నిఫైడ్. అందుకే నా గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని కోరుతున్నాను."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra