Home » Kommuri venugopala rao » Vugave Uyyaala


    "నేను ఊళ్ళో లేను. లేకపోతే ఇంతవరకూ రానిచ్చేవాడ్ని కాదు" అన్నాడు దివాకర్. "ఆ రాజాగాడు ఒట్టి రోగ్. వాడంటే నాకూ అసహ్యమే. వాడికి ఆడపిల్లల్ని ఏడిపించటంతప్ప వేరేపని లేదు. మీకేం భయంలేదు. మీ వెనక నేనున్నాను. ఆ రాజాగాడేమైనా అంటే వాడి అంతు తేల్చిపారేస్తాను. ఒక కంట నేను కనిపెడుతూనే వుంటాను. మీరేం భయపడకండి."

 

    వాళ్ళకు ధైర్యం చెప్పి దివాకర్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.

 

    "మధ్య ఇతనెవరు? నాటకంలో అవసరంలేని పాత్రలా వున్నట్లుండి ఊడిపడ్డాడు" అంది మాధవి స్వగతంగా.

 

    "నాకు భయంగాగా వుంది. అడకత్తెరలో పోకచెక్కలా మనం ఇద్దరి మధ్య ఇరుక్కుపోవటంలేదు కద?" అన్నది కల్యాణి పాలిపోయిన ముఖంతో.

 

    "భయంగా వుండటం నీ జన్మహక్కేమిటి? పద ఆకలిదంచేస్తోంది" మాధవి చెయ్యిపట్టుకుని ఆమెను ముందుకు లాక్కెళ్ళింది.

 

    క్లోక్ రూంలో ప్రమీల కలిసింది. మాధవిని చూసి విష్ చేసింది.

 

    "మీకు దివాకర్ ఎవరో తెలుసా?" అనడిగింది మాధవి.

 

    "నాకు జస్ట్ వన్ ఇయర్ జూనియర్."

 

    "అతనెలాంటివాడు?"

 

    "అతనికీ బలగం వుంది. అతనో లీడర్."

 

    "రాజాకీ, అతనికీ పడుతుందా?"

 

    "పడదు. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.అతని గ్రూప్ వేరు. ఇతని గ్రూప్ వేరు. సమయంవస్తే ఒకర్నొకరు దెబ్బతియ్యాలని చూస్తూ వుంటారు. రెండు మూడుసార్లు కొట్టుకోవటంవరకూ వెళ్ళింది."

 

    "అంటే, రెండు గ్రూపులున్నా యన్నమాట. ఇద్దరిలో ఎవరు ఆధిక్యత సంపాదించారు?"

 

    "తాను సీనియర్ నని దివాకర్ డామినేట్ చెయ్యాలని చూశాడు కాని, గెలుపు రాజాదే అయింది!"

 

    "రాజా! రాజా!! రాజా!!!" మాధవి ముఖం కోపంతో ఎర్రబడింది.

 

    లంచ్ అవర్ అయాక బయోకెమిస్ట్రి క్లాస్ కు వెళదామని వస్తోంటే దార్లో రాజా ఎదురయ్యాడు.

 

    అతన్ని చూస్తూనే కల్యాణి గతుక్కుమంది.

 

    "నానుంచి తప్పించుకునేందుకు ఆ దివాకర్ ని ఆశ్రయించారా? వాడికి మిమ్మల్ని కాపాడగల సామర్థ్యం వుందా?" అనడిగాడు హేళనగా.

 

    మాధవికి కోపం వచ్చింది. "మాకెవరి ఆశ్రయమూ అక్కర్లేదు మిస్టర్. మమ్మల్ని మేము కాపాడుకోగలం" అంది.

 

    "అలాగా? అయితే ఆ దివాకర్ తో మంతనాలు దేనికి?"

 

    "మాట్లాడితే మంతనాలాడినట్లు అర్థంకాదు."

 

    "ఓహో! సరే" అంటూ రాజా కల్యాణివైపు తిరిగి "నాతో రా" అన్నాడు.

 

    కల్యాణి గుండె వేగంగా కొట్టుకోసాగింది. "ఎక్కడకు?" అంది అప్రయత్నంగా.

 

    "ఎక్కడికో నీకనవసరం రా. అంతే."

 

    కల్యాణి మాధవివైపు చూసింది. "ఆమె రాదు" అన్నది మాధవి.

 

    "నేను రమ్మంటున్నాను" అన్నాడు రాజా ఆజ్ఞాపింపుగా.

 

    "నీ ఆజ్ఞల్ని శిరసావహించటానికి మేము నీ క్రింద సబార్డినేట్స్ ము కాదు. ఆఫ్ట్రాల్ నువ్వు కూడా మాలాగా ఒక స్టూడెంటువి."

 

    "నోర్ముయ్" అన్నాడు రాజా.

 

    "యూ షటప్" అంది మాధవి అంతకంటే ఆగ్రహంగా.

 

    అప్పటికే పదిమందీ చుట్టూ మూగారు. అందులో సీనియర్సూ వున్నారు, జూనియర్సూ వున్నారు. అనుకోకుండా టెన్షన్ పెరిగిపోయింది.

 

    అవమానంతో రాజా ముఖం కందగడ్డయిపోయింది. ఏ జూనియరూ అతనికిలా ఎదురుతిరగలేదు. ఆవేశం అవధులు దాటింది.

 

    "ఏమిటే పేలుతున్నావు?" అంటూ చెయ్యెత్తాడు.

 

    ఆ చెయ్యి వెనకనుంచి ఎవరో గట్టిగా పట్టుకున్నట్లయింది. అతను తలత్రిప్పి చూసేసరికి దివాకర్.

 

    "ఏమిట్రా ఆడపిల్లలమీద అథార్టీ చేస్తున్నావు? జాగ్రత్త. కాలూ చెయ్యీ విరిచెయ్యగలను" అన్నాడు వెనక్కి లాగుతూ. అతని వెనక పదిమంది వున్నారు.

 

    "ఏడిశావు" అన్నాడు రాజా.

 

    "ఎవరేడుస్తారో ఇప్పుడు చూపిస్తాను. ఒరేయ్ చూస్తారేం?" అని దివాకర్ అనగానే వెనకవున్న పదిమందీ రాజాని చుట్టుముట్టి, అతను రెసిస్ట్ చేసేలోపల బలవంతంగా బయటకు ఈడ్చుకుపోసాగారు. ఇంతలో ఎక్కడ్నుంచో మరో ఇరవైమంది విద్యార్థులు వచ్చి పడ్డారు. వాళ్ళంతా రాజా గ్రూప్ వాళ్ళు. రాజాని గేటుదాటించి అవతలకు చేరేసరికి మెరుపులా వచ్చి ఎదుటివారిమీద పడ్డారు.

 

    బయట పెద్ద గలాటా జరుగుతోంది. విద్యార్థులు అటూ ఇటూ పరిగెత్తుతున్నారు. చుట్టూ జనంమూగుతున్నారు. మధ్యమధ్య చెల్లా చెదురవుతున్నారు.

 

    కల్యాణి ముఖం రక్తంలేనట్లు పాలిపోయింది. "ఇదంతా నావల్లే జరిగింది" అంది నేరస్థురాలిలా.

 

    "నువ్వేం చేశావ్? వాళ్ళలో దుష్టత్వం అలా చేయిస్తుంది" ఆమె భుజంమీద చెయ్యివేసి ఓదార్పుగా అంది మాధవి.

 

    "ప్రిన్సిపాల్ కి రిపోర్టు చేస్తే?"

 

    "వద్దు. ఇలాంటివి పర్సనల్ గానే పరిష్కరించుకుంటే మంచిది. ప్రిన్సిపాల్ దాకా వెళితే డిబార్ లూ, డిస్మిస్ లూ జరిగి పగలు మరింత పెరిగిపోతాయి" అంది మాధవి.

 

    "పాపం నా గురించి మీరుకూడా చాలా మాటలుపడ్డారు" అంది కల్యాణి బాధగా.

 

    "ఇంతకు ఇంత ఎప్పటికైనా పగతీర్చుకుంటాను. అతన్నంత తేలిగ్గా విడిచిపెట్టను" ఆమె కళ్ళనుండి కసి కురిసింది.

 

    సాయంత్రం కాలేజీనుండి బయలుదేరిన బస్సు లేడీస్ హాస్టల్ దగ్గర ఆగగానే ఆడపిల్లలందరూ ఒక్కొక్కరుగా దిగుతున్నారు. మాధవి, కల్యాణితోసహా దిగాక ఎందుకో అనుమానం వచ్చి, తలత్రిప్పి చూసేసరికి చెట్లక్రింద నీడల్లో రాజా నిలబడివున్నాడు. ప్రక్కనే స్కూటరు. వాళ్ళను తనవైపు రమ్మన్నట్లు సైగచేశాడు.

 

    "నువ్విక్కడే వుండు" అని మాధవి ఒక్కతే నడిచి వెళ్ళింది.

 

    ఏం చేస్తాడు? మళ్ళీ చెయ్యెత్తుతాడా? అలా జరిగితే? ఆమె సిద్ధంగావుంది.

 

    "మీ ఎస్కార్డ్ ను నామీద ఉసికొల్పావుగా. వాడో హీరో అనుకున్నావు. పాపం గుచ్చేశాను మీ ఫ్రెండుని. వారంరోజులదాకా కాలేజీకి రాలేడు" గర్వంగా అన్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra