Home » Yandamuri veerendranath » దుప్పట్లో మిన్నాగు


    "రెండోసారి".
    దైవాధీనం గుండె వేగంగా కొట్టుకోసాగింది. పదిపౌండ్ల పందెంతో యాభైవేలు గెల్చుకోబోతున్నాడు తను. మూడొందల దగ్గిర పందెం నిలబడటం తన అదృష్టం. తనకి వందమైళ్ళు కుషన్ ఉంటుంది-
    బైట తుఫాను ఉధృతమైనట్టుంది-
    ఓడ అటూ ఇటూ వూగుతూంది.
    జనంలో ఒక ముసలతను లేచి "పదకొండు" అన్నాడు.
    దైవధీనం "పధ్నాలుగు" అన్నాడు.
    "పదహారు"
    "ఇరవై" ఈసారి అన్నది దైవాధీనం కాదు, ఇంకెవరో.
    పందెం పెరుగుతూ ఉంది. దైవాధీనం చూస్తున్నాడు. అతడికి వేలంపాటలో ఆవేశం ఇష్టంలేదు. అలా పాల్గొంటే అవతలివాడూ ఉద్వేగంతో ఆవేశం చెంది, అనవసరంగా వేలం సొమ్ముని హెచ్చిస్తాడు.
    "నాలుగువేల అయిదొందల రూపాయలు.... ఒకటోసారి..... రెండో సారి."
    అప్పుడు దైవాధీనం లేచి "అయిదువేలు" అన్నాడు అందరి కళ్ళూ అతడివేపు తిరిగినయ్. ఆక్షనీరు లెక్క కడ్తున్నాడు.
    మొత్తం యాభై అయిదు వేల రూపాయలు పోగయిండి. అతడికి ఆ మొత్తం వినగానే చేతివేళ్ళు వణకసాగాయి.
    తను జీవితాంతం కష్టపడినా సంపాదించలేనంత డబ్బు అది. అయిదు సంవత్సరాలు విదేశంలో కూలీగా పనిచేస్తే కూడబెట్టగలిగింది ఆరువేలకన్నా లేదు. అటువంటిది స్వదేశానికి చేరుకోబోయే ఈ ఆఖరి రోజు యాభై అయిదువేలు.
    దైవాధీనం వణుకుతున్న చేతుల్తోనే చెక్కువ్రాసి ఇచ్చాడు. తరువాత తన స్థానానికి వచ్చి పడుకున్నాడు. ఓడకి తగుల్తున్న కెరటాల చప్పుడు స్పష్టంగా వినిపిస్తూంది. ఈ రాత్రి ఓడ విరిగిపోయి ఇక్కడ ఆగిపోయినా ఫర్లేదు. మూడొందలకి ఒక్కమైలు తక్కువైనా తను గెలవటం ఖాయం. ఏం చెయ్యాలి ఇన్నివేలతో. మారిస్ మైనర్ కొనుక్కోవాలి. చిన్నఇల్లు కట్టుకోవచ్చు..... ఇవన్నీ కాదు అతడికి ఆనందాన్ని ఇస్తున్నవి. ఈ వార్తా చెప్పగానే తన భార్య మేరీ మొహంలో కనబడే వెలుగు.
    ఈ ఆలోచనలతో దైవాధీనం రాత్రి చాలా సేపటివరకూ నిద్రపోలేదు. వూగుతున్న ఓడ చెక్కలని చూస్తూ చాలాసేపు గడిపాడు. ఎప్పటికో నిద్రపట్టింది.
    మరుసటిరోజు మెలకువ వచ్చేసరికి వెచ్చటి సూర్యకిరణం అద్దంలోంచి లోపలికి పడుతూంది. అతడు వెంటనే కదల్లేదు. అలాగే పడుకుని ఓడని ఢీకొనే కెరటాల చప్పుడుకేసీ, అటూ ఇటూవూగే వూపుల గురించీ ఎదురుచూశాడు. అయితే అటువంటిదేమీ కనబడలేదు. ఏదో అనుమానం వచ్చి, క్షణంలో అది పెనుభూతమై ఒక్క గెంతులో పక్కమీద నుంచి కిందికి దూకి, సముద్రంకేసి చూశాడు.
    సూర్యకాంతిలో అద్దంలా మెరుస్తూంది సముద్రం నిశ్చలంగా ఉన్న ఆ సముద్రంలో ఓడ రెట్టింపు వేగంతో సాగిపోతూంది. ఆకాశంలో చిన్న మేఘం కూడా లేదు.
    దైవాధీనం నెమ్మదిగా వచ్చి పక్కమీద కూలబడ్డాడు. మొహం తెల్లగా పాలిపోయింది. కాళ్ళలో సత్తువ పోయింది. వెన్నులో మొదలైన చలి ఒళ్ళంతా పాకింది.
    ఈ పందెం తను ఓడిపోవటం ఖాయం.
    అంటే ఇంతకాలం పెళ్ళాం బిడ్డల్ని వదిలి, విదేశంలో రెక్కలు ముక్కలు చేసుకుని పడిన కష్టం అంతా ఒక్క రాత్రిలో పోబోతూంది. తన కళ్ళముందే హారతి కర్పూరమై పోతూంది.
    ఏం చెయ్యాలి ఇప్పుడు.
    ఈ వార్త విని మేరీ ఎలా ప్రవర్తిస్తుంది?
    అసలు మన దేశపు గడ్డమీద అడుగు పెట్టగానే ఏం చేస్తాడు? అతడి కళ్ళముందు కోపం, అసహ్యం నిండిన మొహంతో నిలబడ్డ భార్య ప్రతిబింబం  కనిపించింది.
    మధ్యాహ్నం పన్నెండింటికల్లా ఈ ఓడ మూడొందలేమిటి? ఈ లెక్కన ఆరొందలకన్నా ఎక్కువ మైళ్ళు ప్రయాణం చేసేటట్టు కనిపిస్తుంది......కెప్టెన్ కి మతిభ్రమించి ఓడని వెనక్కి తిప్పితే తప్ప! పోనీ కెప్టెన్ కి పదివేలు లంచంగా ఇచ్చి  ఓడని స్లో చెయ్యమంటే? అప్పటికీ తనకి నలభై వేలు లాభం! తన ఆలోచనలకి అతడికే నవ్వు వచ్చింది. అన్నీ జైలు కెళ్ళే ఆలోచన్లే.
    అంతలో అతడి మొహంలో మార్పు వచ్చింది ఒక గొప్ప ఐడియా స్ట్రయిక్  అయినట్టూ.
    ఆ ఆలోచన అతడిలో ఎటువంటి మార్పు తీసుకొచ్చిందంటే అతడు దాదాపు పక్కమీదే ఎగిరి గంతువేశాడు. పిడికిళ్ళు మూసి గాలిలోకి ఎగిరేశాడు.....తను సముద్రంలోకి దూకేస్తే?
    .....సముద్రం చాలా నిర్మలంగా ఉంది!!!
    ......తను నీటిమీదే తేలుతూ ఉండొచ్చు!!!
    ఒక ప్రయాణీకుడు పొరపాటున ఓడ మీద నుంచి సముద్రంలోకి జారిపోయాడు అని తెలుయగానే ముందు ఓడ ఆగుతుంది. తరువాత చిన్న  బోటుని నీళ్ళలోకి దించాలి. దాన్ని వెనక్కి పంపి, తనని రక్షించి ఎక్కించుకోవాలి. బోటు ఓడను చేరుకొన్నాక తననీ, బోటునీ పైకి తీసుకోవాలి. దీనంతటికీ ఎంతలేదన్నా గంటన్నరపడుతుంది. అసలు ఓడ ఆగటానికే పావుగంట పడుతుంది. పావుగంటలోనూ అది పదిమైళ్ళు ముందుకెళ్ళి పోయి వుంటుంది. ఈ పదిమైళ్ళూ బోటు వెనక్కి రావటానికి అరగంట పడుతుంది. మొత్తం కలిపితే గంటన్నర.
    ఆ గంటన్నర వేస్టు అవుతే తను విజయం సాధించినట్టే, మొత్తం అరవైమైళ్ళు వెనకబడుతుంది కాబట్టి.
    దైవాధీనం టైమ్ చూశాడు. తొమ్మిదయింది. ఎంత తొందరగా ఇది మొదలు పెడితే అంత మంచిది వీలైనంత తేలిక దుస్తులు వేసుకోవాలి. స్పోర్ట్సు డ్రెస్ అయితే మంచిది. కాన్వాస్ షూస్ వేసుకుంటే ఎవరికీ అనుమానం రాదు. తనకీ తేలిగ్గా వుంటుంది.
    అతడు సముద్రం వేపు చూశాడు.
    అలాగే నిర్మలంగా వుంది. అదృష్టవశాత్తు ఈ ప్రాంతంలో షార్క్ చేపలు లేవు.
    అతడు నెమ్మదిగా చెక్క మెట్లు ఎక్కిపైకి  వచ్చాడు. బాగా ఎండగా వున్నా, సముద్రం మీదనుంచి ఆగి ఆగి  వచ్చే చల్లటి గాలి ఎంతో హాయిగా వుంది.
     బాల్కనీ అంచు దగ్గిర నిలబడ్డ ఒక మధ్య వయస్కురాలైన ఆంగ్లో ఇండియన్ సముద్రం కేసి చూస్తూ వుంది, అటు తిరిగి నిలబడి.
    దైవాధీనం సంతోషించాడు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లే కలిసి వస్తున్నాయి. ఎవరూ లేకపోతే చూసే దెవరు? చూడాలి. చూసి కెవ్వున అరవాలి. ఆ అరుపుకి ఓడ సిబ్బంది అంతా పరుగెత్తుకు రావాలి. అతడు అడుగు ముందుకేశాడు.
    'ఆగు దైవాధీనం, ఆగు' అని ఎవరో హెచ్చరించినట్టయింది.
    'తీరానికి వేయి మైళ్ళ దూరంలో నడిసముద్రంలో దూకబోతూ, అంత తొందరపాటు తగదు' అనుకున్నాడు. తను దూకటం చూసినా, ఈమె అరవకపోతే?
    ఆ ఆలోచన రాగానే అతడి ఒళ్ళు జలదరించింది. తనెంత తొందరపాటుతో ప్రవర్తించబోయాడు! తను పడిపోవటం చూస్తూనే ఆమె తప్పకుండా అరుస్తుందని ముందు నిశ్చయించుకోవాలి. ఆమె అరవక పోవటానికి రెండు కారణాలుండవచ్చు.
    మొదటిది: ఆమె మూగదై ఉండటం!
    రెండోది: ఆమె ఓడ తాలూకు ఎక్కువ స్పీడుమీద పందెం కాసిన వారిలో ఒకరై ఉండటం! అదే జరిగిన పక్షంలో వేలకి ఆశపడి తనని నడిసముద్రానికి  అప్పగించెయ్యొచ్చు కదా! 'ఒక అల్పప్రాణికోసం ఓడని ఆపుతే నాకు  నష్టం' అని  ఆమె అనుకుంటే  కష్టం. ఏ విషయమూ తేల్చుకోవటం కోసం అతడు ఆమె దగ్గిరగా  వెళ్లి రెయిలింగ్ మీద చేతులు వేస్తూ, 'హల్లో' అన్నాడు. ఆమె తల తిప్పి అతడి  చూస్తూ 'హల్లో' అంది.
    అమ్మయ్య. కనీసం ఆమె మూగది కాదు.
    "నిన్నరాత్రి వేలంపాటలో మిమ్మల్ని చూశాను."
    "వేలంపాటా? అదేమిటి?"
    "ఒక్క రోజులో ఓడ ఎంత ప్రయాణించగలదు అన్న  పందెంమీద వేలంపాత."
    "అవును. షిప్ లో అలాటిదేదో జరుగుతందట కదూ- నాకు తెలీదు"
    చాలు. మీకు తెలియకపోవటమే మంచిది.
    "నిన్న రాత్రి తుఫానుకి ఈ ఎండ చాలా రిలీఫ్ గా వుంది కదూ! టాపిక్  మారుస్తూ అన్నాడు.
    ఆమె తలూపింది.
    "ప్రొద్దున్నే ఎండలో ఎక్సర్ సైజు చెయ్యటం నాకు అలవాటు" అన్నాడు.
    "చాలా మంచి ఆలవాటు" అని ఆమె నవ్వింది.
    "సీ యూ"
    "గుడ్ బై" అంతా సరీగ్గానే ఉంది దైవాధీనం! ఇక దూకటమే!!!
    అతడు ఆమెనుంచి పదిగజాల దూరంగా వెళ్లాడు. ఆమె అటు తిరిగి సముద్రంవైపు చూస్తూంది. అదే మంచిది. తను పొరపాటున పడిపోయాననే అనుకోవాలి. ఇప్పుడిక సమస్య- అతడు అనుకున్నంతసేపు ఓడ ఆగుతుందా లేదా అన్నది. అలా కాని పక్షంలో లైఫ్ బోటులో ఎక్కటానికి తనే తిప్పలు పడ్డట్టూ నటించి ఆలస్యం చెయ్యాలి. ఆలస్యం చేసిన ప్రతి నిమిషమూ తన పందెం గెలవటానికి ఉపయోగపడేదే!
    అన్నిటికన్నా ప్రమాదకరమైనది ప్రోపెల్లరు. నీళ్ళల్లో పడగానే అది తనవైపు లాక్కుంటే, ఆ ఫాను రెక్కలమధ్య పడి తను ముక్కలుగా మారటం ఖాయం. ఓడనుండి పడిన చాలా మంది, అలాగే శిథిలమైపోయారు. కానీ ఇక్కడ తను 'పడ' బోవటం లేదు. 'దూక' బోతున్నాడు. దూకేటప్పుడే దూరంగా పడేలా దూకాలి.
    అతడు నీటికేసి చూశాడు. ఆ చల్లటి నీటిని చూస్తూంటే దూక్కండనే చలి పుడుతోంది. దూకేటప్పుడు కాళ్ళు ముందు పడేలా దూకాలి. లేకపోతే ఆ వంద అడుగుల ఎత్తునుంచి దూకిన దూకుడుకి వెన్నెముక విరగటం ఖాయం.
    అంత నిర్మలంగా కనబడుతున్న సముద్రపు అక్కడి లోతుని తలుచుకుంటే భయం వేసింది. కానీ ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ యిది సాధ్యం కాదు. ధైర్యం చెయ్యాలి.
    చెక్కలకి కట్టిన గొలుసులు మీదనుంచి అవతలికి ఒక కాలు పెట్టాడు. తరువాత రెండోకాలుకూడా నెమ్మదిగా చేర్చి, పట్టుకున్న గొలుసుని వదిలేసి గాలిలోకి డైవ్ చేస్తూ, "హెల్ప్!" అని అరిచాడు.
    "హెల్ప్! హెల్ప్!" అని అరుస్తూ నీళ్ళలోకి జారిపోయాడు. అతడి కాళ్ళకి నీళ్ళు తగిలి దబ్బున  శబ్దం అయింది.
    మొట్టమొదటి అరుపు వినిపించగానే ఆమె తల తిప్పి చూసింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనబడింది. తను చూస్తున్నది కలో. నిజమో ఆమెకి అర్థంకాలేదు. స్పోర్ట్స్ డ్రెస్ లో వున్న వ్యక్తి, ఇప్పటివరకూ తనతో మాట్లాడినవాడు ఒక చిన్న మూతలాగా ఓడ మీదనుంచి జారిపోవటం కనబడింది.
    ఆమెకేం చెయ్యాలో తోచలేదు. తాడు విసరాలా, కేకలు పెట్టి అందర్నీ పిలవాలా?
    ఆమె వంగి  నీటివైపు టెన్స్ గా, అనిశ్చితతో చూసింది. అంతలో వెంటనే ఆమె మొహంలో రిలాక్సేషన్ కనబడింది. నీటి అలలమీద ముందు ఒక తల, తరువాత భూజాలూ పైకి వచ్చాయి. ఆ తరువాత అతడు చేతిని రెండుసార్లు గాలిలోకి వూపాడు. ఆమె అమ్మయ్య అనుకుంది. తను కూడా చెయ్యి వూపింది.
    ఇంతలో ఇంకొక స్త్రీ, డెక్ పైకి వచ్చి "ఇక్కడున్నావా నువ్వు? నీ కోసం అంతా వెతికాను. ఇలా ఒంటరిగా ఉండొద్దని డాక్టరు చెప్పలేదూ" అంది కోపంగా.
    "చాలా చిత్రం జరిగిందిలే ఇక్కడ" అంది మొదటి స్త్రీ. "స్పోర్ట్స్ ప్రాక్టీసు కోసం ఒకతను సముద్రంలో దూకాడు. అయినా ఈ నడిసముద్రంలో ఈతేమిటి బాబూ!"
    "అందుకే డాక్టరు నిన్ను ఒంటరిగా వదలొద్దు అన్నాడు పదపద"
    ఆమె క్రిందికి మెట్లు  దిగుతూ "అతనెవరో చాలా మర్యాదస్తుడిలా వున్నాడు నావైపు స్నేహ పురస్కారంగా చెయ్యి వూపాడు కూడా" అన్నది.
                         *    *    *
    విజ్జి కథ పూర్తి చెయ్యగానే  నేను నా స్నేహితులవైపు చూసేను. నిశ్చయంగా విజ్జికూడా పందెం బారినుంచి దాటిపోయాడని తెలుస్తూనే వుంది. శ్రోతలందరి మొహం టెన్షన్ తో నిండివుంది.
    ప్రతీవారూ 'తరువాత ఏమయింది' అని అడగబోయి' అతడి  కథ పూర్తయిందనీ, అలా అడగటం ద్వారా తమ ఆసక్తిని తెలియ జెప్పటమే అవుతుందనీ అనుకుంటున్నారని నాకు తెలుసు. కానీ అందర్లోనూ కథ ఇంకా కొనసాగుతే బావుణ్ణు అన్న భావన కదలాడ్తూంది. సముద్రం మధ్యలో దైవాధీనం ఏమయ్యాడు? అతడు రక్షింపబడ్డాడా? షార్క్ చేపలబారికి గురి అయ్యాడా? వగైరాప్రశ్నలు అందరిలోనూ కదలాడుతున్నాయి.
    పాత్రలమీద జాలి కలగటమే కథకుడి ఉద్దేశ్యమయితే విజ్జి, మొదటి కథ చెప్పిన శివకన్నా ఎక్కువ మార్కులు కొట్టేశాడని చెప్పొచ్చు. కానీ అదంతో నిర్ణయించవలసింది నేను కాదుకదా!
    "కథ అంటే ఓడ ప్రయాణంలా వుండాలి" అన్నాడు విజ్జి. "కథకి ఒక సంపూర్ణత వుండాలి. కానీ ఆ సంపూర్ణత పాఠకుడిని కథ చదివి పక్కన  పడేసేలా  చెయ్యకుండా ఒకక్షణం 'ఫీల్' అయ్యేలా చెయ్యాలి. ఆ పీలింగ్ సంతృప్తితో కూడినదై వుండకూడదు. ఉదాహరణకి మన శివ చెప్పిన 'దుప్పట్లో మిన్నాగు' తీసుకుంటే అందులో ఎన్నో ప్రశ్నలు అస్పష్టంగా మిగిలిపోయాయి. దుప్పటిలో దూరిన మిన్నాగుని వాళ్ళు ఏం చేశారు? అది బయట కొచ్చిందా?? అసలు అది మిన్నాగేనా? లేక పురికొస తాడా? వగైరా అన్నీ అనుమానాలే. పాఠకుడికి ఇన్ని అనుమానాలు మిగల్చకూడదు."
    శివ కోపంగా, "చెప్పదల్చుకొన్న విషయం అయిపోగానే కథ ఆపుచెయ్యటం కొత్త టెక్నిక్. మిగతా విషయాలు అనవసరం. సినిమా గ్రూప్ ఫోటోకోసం ప్రాతలందర్నీ తీసుకురావటంలా వుంటుంది ఆ ముగింపు" అన్నాడు.
    "ఏదీ, ఉన్నట్టుండి కథ ఆపుజేసెయ్యటమా?" వ్యంగ్యంగా అన్నాడు. విజ్జి.
    "నువ్వు ఈ విధంగా మాట్లాడి, మిగిలిన జడ్జీల మనసు మీద ముందే ముద్ర వేస్తున్నావు. దీనికి నేను ఆబ్జెక్టు చేస్తున్నాను" అన్నాడు శివ.
    "అబ్జెక్షన్ సస్టెయిన్డ్" ముద్దుగా అన్నాడు శేషు. ఒక పెగ్ తాగగానే వాడికి  నోరు తడబడుతుంది.
    "నేను చెప్పేది........ కథలో కూడా అస్పష్టత లేకుండా ఒక విధమైన పనిపూర్ణత గురించి"
    "నువ్వు చెప్పింది కథలో కూడా ఆ అస్పష్టత వుందిగా"
    "ప్రతీ కథలోనూ కూడా అస్పష్టత వుండాలి"
    "అలా ఉండాలీ అనుకున్నప్పుడు, లోపల దూరిన మిన్నాగు ఏమయిందీ అన్న ప్రశ్న కూడా పాఠకులకి ఉద్భవించటం మంచిదే"
    "ఎవరి కథ బాగుందీ అన్న చర్చ మానేసి మనం మూడో కథకి వెళదామా?" అన్నాడు వెంకు.
    "అదేదో నువ్వే చెప్పు."
    "కథలో ఒక విలన్ వుండాలి. హీరోతోకాని, హీరోయిన్ తో గానీ అతడు శిక్షింపబడాలి. పాఠకులు సెల్ఫ్ ఐడెంటిపై చేసుకుని, కథ పూర్తయ్యాక ఒక విధమైన సంతృప్తిని పొందాలి. అదీ మంచి కథ అని నా ఉద్దేశ్యం. అలాటి కథని- దీన్ని కథ అనేకంటే నా అనుభవం అంటేనే మంచిది. కథ పేరు 'మానవాతీత వ్యక్తి" అంటూ మొదలు పెట్టాడు. 
                       *శుభం*
    (38 ఎపిసోడ్  నుంచి వెంకు చెప్పిన కథ : మానవాతీత వ్యక్తి వస్తుంది.)

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra