Home » Dr jandhyala papayya sastry » Karunasri Sahityam - 4 - Balasahiti - 2


    మరలఁ గొలఁది కాలములోనే రణోచిత వీరవేషములను ధరించి రూపొందిన శౌర్యధైర్యములోయన శత్రువులపైఁ జనుచున్న యోధాగ్రేసరులను గాంచి పౌరులందఱు జయజయ ధ్వానములు సలిపిరి. అపరాశంకరుని భంగి సంగరోద్రేకముతో సైన్యముల ముందు నడచుచున్న ఖడ్గ తిక్కనను సందర్శించి యింతకుముందు తమనాలోచితాముగ నాయనను గూర్చి పలికిన నిందావాక్యములకుఁ బశ్చాత్తాపపడిరి. ఈ పర్యాయము తప్పక జయము మనకే కలుగఁగలదని యాశించిరి.    

                              6
    
    ఇటులు రణతిక్కన చమూససముతుఁడై యనతి కాలముననే సమర రంగమును సమీపించెను. నెల్లూరు సైన్యమును దూరముననే సంరర్శించి కనిగిరి సైనికులు కడుంగడు విస్మయ మందిరి. పరాభుతులై పారిపోయినారు గదా యని తమ యాయుధాముల నెల్ల నొక్కచో నుంచి వారు విశ్రమించి చుండిరి. కాటమరాజు ప్రగల్భములు పలుకుచు తన సైనికుల శౌర్యదైర్య సాహసములను పలువిధములఁ బ్రశంసించుచుండెను. అకస్మికముగ రణభేరి మ్రోఁగుటచే వారందఱు నొక్క పెట్టున చకితులైరి. శాంతముగ నున్న సైన్యసముద్రము సంచలితమైపోయెను. కాటమరాజు వెంటనే యాయధుములను ధరించి సంగ్రామభూమికి జనుదెండని యాత్మ సైన్యమున కాజ్ఞాపించెను.
    ఉభయ సైన్యములకును మరల భయంకర సంగరము ప్రారంభమయ్యెను. ఎవరికి వారు తామే విజయలక్ష్మిని తప్పక వరింపఁగలమని ప్రాణముల నరచేతిలోఁ బెట్టుకొని రెట్టించిన యుత్సాహముతో వీరముర్తులై విజ్రుంభింప సాగిరి. అనాఁటి రణతిక్కన సంగరోత్సాహమువర్ణనాతీతము. ప్రళయ కాలమున ఫాలనేత్రము దేరచిన పరమేశ్వరుఁడగు త్రిశూలపాణివలె నతఁడు శాత్రవ దుర్నిరీక్ష్యుఁడైవిరాజిల్లు చుండెను. రివునికాయ మాయన యనన్యసామాన్య విక్రమ విజ్రుంభణము నవలోకించి "యితఁడు ద్రోణాచార్యుడు, యశ్వత్ద్హామయా , యర్జునుడా, యభిమాన్యుఁడా" యని వెఱుంనకు హుంకారమునకుఁ బగవారి గుండెలు బ్రద్దలగు చుండెను. అయన సింహగర్జనలకు కనిగిరి సైనికుల కర్ణరంధ్రములు గింగురుమనుచుండెను.
    ఇట్ట్టులా వీరాధివీరుడు విజ్రుంభించి శత్రువుల కెల్ల యెడలఁ దానయై కన్పట్టుచు హస్తము నందలి భయంకర కరవాలమును గిరగిరఁద్రిప్పుచూ "నిలుఁడు నిలుఁడు! పోకుఁడు పోకుఁడు!" అని హెచ్చరించుచు నప్రతిమాన రణోన్మాదముతో మైమరచి నిజఖడ్గమునకు ప్రత్యర్ధి బృందముల నెందఱేంరఱనో యాహుతి గావించుచుండెను. ఆ శూర శిరోమణి ప్రోత్సాహవాక్యములకు మహోత్సాహమునందుచు విక్రమపుర వీర సైనికులు కనిగిరి సైనికుల పైఁబడి చెల్లాచేదరోన రించుచుండిరి. సంగరము భయంకరమయ్యెను. ఖడ్గ తిక్కన ఖడ్గ ప్రహారములకు వైరి వీర మస్తకము లెన్నియో బంతుల వలె నాకసమున కేగిరి పోవు చుండెను.
    నడుమ నడుమ తిక్కన సైనికుల నిట్లు ప్రభోదించుచుండెను. "వీర సైనికులారా! విజ్రుంభింపుడు! వెనుదీయకుఁడు! న్యాయమునకై మీ ప్రాణముల నోద్దుఁడు. భండనమునుండి పారిపోయితిరా మీ జన్మభూమి పరులపాలగును. మీ రాజ్యము కాటమరాజు స్వాధీనమగును. మీరు పరతంత్రులగుదురు. పరతంత్రులగు ప్రజలు పలుకష్టముల పాలగుదురు. స్వాతంత్ర్యము లేని జన్మ మెందులకు? మీ పౌరుషమును బ్రకటింపుఁడు . మనుమసిద్ది మహారాజునకుఁ గళంకమును దేఁబోకుఁడు విక్రమసింహపురము విఖ్యాతి నిలఁబెట్టుఁడు"
    ఇవ్విధముగాఁ దమ్మునుత్సాహవాక్యములతో బ్రబోధించుచున్న తిక్కన దండనాధుని యజ్ఞానుసారముగా నెల్లూరి సైనికులు కండలు తెగి పడుచున్నను రక్తధారాలు ప్రవహించుచున్నను లెక్క సేయక శత్రువులను జక్కడు చుండిరి.
    రెండు పక్షములయందును సైనికులు కుప్పలు కుప్పలుగాఁ గూలి పడుచుండిరి. ఇంతలో గాటమరాజు సేనానాయకులతో నొకఁడగు పిన్నమ నాయఁడు ముందు కరుదెంచి ఖడ్గతిక్కనతో నిట్లు పలికెను;  "భూసురాగ్రణీ! పోరు నిలుపుము. మీరు బ్రాహ్మణులు. మేమో యాదవులము. మీకును మాకును యుద్దము యుక్తము కాదు. క్షత్రియోచితమైన   సంగ్రామము ధరణీసురులకు శోభనిచ్చునా? మిమ్ముఁ జంపినచో బ్రహ్మ హత్యా మహాపాతకము మాకుఁబ్రాప్తించును గదా"
    ఇట్లు వినయముతోఁ బలుకుచున్న పిన్నమనాయనింగాంచి ఖడ్గతిక్కన "ఒయీ! సమరము సల్పలేక ఏల నీరీతి ధర్మ వాక్యముల నుగ్గదించేదవు? నీ యుపాయము నా కర్ధమైనది. నీవనసారముగ నాలస్యము చేయించుచున్నావు. నా కరవాలమున కడ్డువచ్చి యీలోపుగా మీ సైన్యములచే మా సైన్యములను సంహరింపఁజేయఁదలపెట్టితివా? శూరత్వమునకు జాతితోఁ బనియేమి? జగదేకవీరుఁడైన పరుశురాముఁడు బ్రహ్మణుఁడు గాఁడా? కురుపాండవ ధనురాచార్యుఁడైన కుంభసంభవుఁడు బ్రాహ్మణుఁడుగాఁడా? చాలు చాలు తొలంగిపొమ్ము. మా పుల్లరిని మా కొసంగునట్లు కాటమరాజునకు హితోపదేశము సేయుము. లేదా వీరోచితమగు సంగ్రామమునకు సిద్దమగుము. మెట్ట వేదాంతములు కట్టిపెట్టు" మని పట్టువిడువక సహసాతీరేకముతో సింగపూఁగోదమవలె ముందుకు దుమికెను.
    రణతిక్కన వీరవిహరమునకు విస్మయమంది కాటమరాజుదులెవ్వరును నా శూరశిరోమణిని సమీపింపలేకపోయిరి. సర్వసేనానాయకుఁడగు బ్రహ్మ రుద్రయ్య యాత్మ సైనికుల యాపజయమునకు సహింపలేకపోయేను. వెంటనే యాతఁడు ముందుకుఁజోచ్చుకొని వచ్చి ఖడ్గ తిక్కన నేడుర్కోనేను. అనుపమాన వీరాగ్రగాన్యులగు వారిరువురద్వయుద్దమును గాంచుటకు నుభయ సైన్యమును యుద్దము చాలించినవి.
    ఇరువురును మహావీరులే! ఇరువురును బ్రాహ్మణవంశ సంజాతులే! ఇరువురును దమరాజు కొరకుఁ బ్రాణములు బలిగావింపఁ గృపాణములు ధరించి సంగ్రామరంగమున కురికినవారే! కొంతకాలమువరకు నశ్వములపై నెక్కి యోకరి కంటే నొక రెక్కడు మగంటిమిఁ బ్రదర్శించుచు సమరము గావించిరి. అనంతర మా మేటి వీరులు ఘోటకముల మీఁది నుండి క్రిందికి రుమికి ఖడ్గ యుద్దమును బ్రారంభించిరి. కత్తి పోటువలన నిరువుర శరీరముల నుండి నెత్తురు చిమ్మించి కొట్టుచుండెను. అరుణారుణ నేత్రాంచలములతో, నన్యోన్య పరాక్రమాభినందనములతో , నసమాన ధైర్యసాహసములతో , నఖండితోత్సహములతో, నకుంఠిత రాజభక్తితో నా వీరద్వయము పోరఁదొడంగినది.
    వారి యుద్దము భారతకాలము నాఁటి యభిమన్యు లక్షణ కుమారుల యుద్దము వలెనుండెను. ఇట్లు కొంతవడి వారిరువురు ఖడ్గములతోఁ బోరాడి తుట్టతుదకు పరస్పర కరవాలములకు బలియై యిరువురును నేలపైఁబడిరి.
    రెండు సైన్యములయందును తమ నాయకుల మరణమునకు హహకారములు మిన్ను ముట్టెను. అట్లు మృత్యుఁడై పడియున్న రణతిక్కన శిరమును నోటఁగఱచుకొని యాతని యశ్వరాజము విక్రమసింహపురమునకుఁ బరిగేత్తుకొని వచ్చి సిద్దనామాత్యుని భవనద్వారము ముందు దాని నునిచెను.
    ఆ విషాద దృశ్యము నంతయును నవలోకించుచున్న విక్రమసింహ పురవాసులు తమ దండనాయకుని మరణమునకు మిక్కిలి దుఃఖించిరి. తిక్కన తల్లిదండ్రులు కుమారుని మృతికిఁ గొంతపది సంతాపము నందియు వాని వీరోచిత మరణమునకు సంతసించిరి. రణతిక్కన భార్య తన ప్రాణానాదుని శిరస్సును కన్నుల కద్దుకొని యా శీర్షముతోపాటు సహగమనము గావింపఁదలఁచెను.
    చితి సిద్దమైనది. వీరాధివీరుఁడగు రణతిక్కన శిర మా చితి మధ్యమున నుంఁచఁబడినది. తిక్కన భార్యయగు చానాంబ పసుపు కుంకుమములు ధరించి పుష్పమాలాంలంకృతయై తన పతి శిరమునకు మూడు మారులు ప్రదక్షిణ మాచరించి కన్నులు మూసికొని యందుఁబ్రవేశించినది. తన ప్రాణనాధుని యుత్తమాంగముతో పాటుగా ఆ యుత్తమ వీరసాద్వీమణి యగ్ని జ్వాలలలో భస్మమైపోయినది.
    మనుమసిద్ది భూపాలుడు మహావీరుఁడగు తన సేనానాయకుని మరణవార్తకు పరితపించి తిక్కన తల్లిదండ్రులను, అన్నయగు కవి తిక్కనను సాంత్వనవాక్యములతో నూఱడించి యఖండసేనాసమేతుఁడై సంగరరంగమున కరుదెంచెను. అచ్చట తిక్కన సేనాని విక్రమమును బ్రదర్శించుచు గతాసువులై కుప్పలుకుప్పలుగాఁ బడియున్న కాటమరాజు సైన్యమును దర్శించి తన వీరాసేనాదిపతి యసాధారణ పరాక్రమమున కచ్చేరువంది మెచ్చుకొనుచు విరోధులను చించిచెండాడి విజయలక్ష్మి సహితుఁడై నిజనగరమునకు విచ్చేసెను. మనుమసిద్దిభూపాలుడు ఖడ్గతిక్కన విజయమును దేశమంతయుఁ జాటించెను. పుత్రసంతాపసంతప్తమాననులగు తిక్కన జననీజనకులకును, సోదర మృతికి వ్యధ నందుచున్న కవి తిక్కనకును నూరట కలుగునట్లు రణతిక్కన స్మృతి చిహ్నమును పినాకినీ తీరమున నిర్మించెను.
    ఖడ్గతిక్కన చరిత్రము పూర్తీయైనది. అయన వీరనామాక్షరములు తెలుఁగు వీరులచరిత్రలో మొదటి పంక్తిలో లిఖించబడినవి. ఆ శూరశిఖామణి పౌరుషమాంధ్రవీరుల కాదర్శప్రాయము. ఇట్టి వీరకుమారులను గున్న తెలుఁగుతల్లి ధన్యురాలు.

        
                           *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra