Home » D kameshwari » Jeevitham Chejaraneeyaku

    కదిలే రైలయితే ఆగే స్టేషన్లు, వచ్చేపోయే ప్రయాణీకులు, వెనక్కి పరిగెత్తే చెట్లు చేమలు, మనతో ప్రయాణించే చందమామ, మనల్ని దాటుకుపోయే రైలు బండ్లు ఇలా ఎన్నో రకాలుగా కాలక్షేపం వుంటుంది. గమ్యం చేరుతున్నాం అన్న ఆశ, ఆత్రుత, ఆరాటం, ఆనందం వుంటుంది. మనిషికి మార్పు అన్నది లేకపోతే పిచ్చేక్కిపోతాడు. నా సంగతే చూడు. పెళ్ళి వరకు సవ్యంగా వెళ్ళిన నా ప్రయాణం, తరువాత పట్టాలు తప్పిన రైలుబండి అయిపోయి, ప్రయాణం ఆగిపోయింది. రోజూ ఒకటే దినచర్య మనిషికి ఎంత విసుగనిపిస్తుంది.
    అదే కాలేజీ, అదే పాఠాలు, అదే తిండి, అదే నిద్ర, అవే పుస్తకాలు చదవడం - రోజూ ఒకటే రొటీన్ తో పదిహేనేళ్ళకే ఎంత విసిగిపోయానో నీకెలా చెప్పను? ఎవరికోసం బతకాలి. ఎవరికోసం సంపాదించాలి. ఎవరి ఆనందంకోసం అలంకరించుకోవాలి. నాకెవరున్నారు, ఎందుకీ బతుకు అన్న వైర్యాగ్యం పెళ్ళి అయిన ఐదారేళ్లకే వచ్చేసింది. అదే అందరిలా కాపురం చేసుకుంటుంటే ఆ కాపురంలో సుఖం లేకపోయినా - నా ఇల్లు, నా సంసారం అనుకొంటూ చాకిరీ  చేసుకుంటూ, పిల్లల్ని కంటూ, వాళ్ళని పెద్ద చేసుకుంటూ, వాళ్లకోసం బతుకుతూ..... ఏదోరకంగా రోజులు మార్పుతో గడిచిపోయేవి.
    ఏ మార్పు, ఏ అనుభూతులూలేని ఈ బతుకుకంటే ఆ బతుకే నయమేమోననిపిస్తుంది ఇప్పుడు. మార్పులేని జీవితం కంటే కష్టాలు, కన్నీళ్ళు ఉన్న జీవితమే బెటర్ ఏమో! చదువుంది, డబ్బుంది, సుఖాలు అన్నీ వున్నాయి. కాని బతుకులో రమ్యత, అనుభూతిలేవు విద్యా, నా జీవితంలో. నీ వయసులో, వయసువేడిలో నేనూ ఆవేశంగా ఆ మొగుడు లేకపోతేనేం, ఉద్యోగం వుంది, హాయిగా బతుకుతాను అనుకున్నాను. ఆవేశం, వేడి, ఆ ధాటి అన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు నీకింతగా చెప్తున్నాను అంటే, నాలా నీవూ బాధపడకూడదన్న ఆలోచన నాకు కల్గిందంటే ఈ మోనాటనస్ జీవితంకంటే ఆ జీవితమే బాగుండేదేమో అన్న ఆలోచన నాలో కల్గడమే కారణం ఏమో! నే చేసినపనికి పశ్చాత్తాపపడటం ఏమో ఇది!
    విద్యా...... మనిషికి చిన్నతనంలో తల్లిదండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వయసువచ్చాక భార్యాపిల్లలో, భర్తా పిల్లలో ఎవరో ఒకరు మనం కావాలనుకునేవారుండాలి. మన ఇల్లు, మన పిల్లలు అన్నది లేకపోతే ఆ మనిషి మనుగడకి అర్థం కల్పించక విసిగిపోతాడు. విద్యా..... ఒక సంగతి చెప్పనా! నాన్న నన్నెంత బాగా చూసినా పెళ్ళికాగానే పుట్టి పెరిగిన ఈ ఇల్లు నాకు పరాయిదిలా కన్పించేది. ఈ ఇంట్లోనేనో గెస్టులా మొహమాటపడుతూ బతికేదాన్ని. అదేనా భర్త ఎంత దుర్మార్గుడైనా, నన్నెంత హింసించినా అది నా ఇల్లు అన్న తృప్తి, అదో రకం హక్కు వుంటుంది అక్కడ.   
    ఒకసారి పెళ్ళి కాగానే మనలో మార్పు మనకే ఆశ్చర్యంగా ఉంటుంది విద్యా! రెక్కలు వచ్చిన పక్షి గూడువదిలి తనకో జంటని చూసుకుని మరో గూడు నిర్మించుకుంటుందే మనం మనుషులం! 'మనది', 'నాది' అన్న ఆలోచనలేకపోతే బతకడం కష్టం. కష్టమో, సుఖమో నీ ఇల్లంటూ నీకు వుండాలి. నీ పుట్టింట్లో పట్టుపరుపులు వున్నా ఆ ఇల్లు పరాయిదనిపిస్తుంది. ఏదో గెస్టులా ఎన్నాళ్ళుండటం ఇక్కడ అని మొహమాటంగా వుంటుంది. ఏం చేస్తే ఏం తప్పో, ఎవరేం అనుకుంటారోనని బిడియంగా ఉంటుంది అడుగడుగునా. విద్యా..... అనుభవించినవారికే తెలుస్తుంది ఈ తేడా. నీవు వచ్చి పట్టుమని పది రోజులు అవలేదు. కనక నీకేం అన్పించకపోవచ్చు. నీ తల్లి, తండ్రి నిన్నెంత ప్రేమించినా రేపు ఈ ప్రేమ, ఈ సానుభూతి  నీపట్ల వుంటుందన్ననమ్మకం లేదు. కాపురం వదిలిన ఆడపిల్ల కన్నతల్లికే తక్కువ అవుతుంది. ఈనాడు నిన్ను సపోర్ట్ చేస్తున్న నీ అన్నలు రేపు పెళ్ళాలు రాగానే నిన్ను విమర్శిస్తారు. నీ తల్లి, తండ్రి బతికినన్నాళ్ళు కష్టమైనా నిష్ఠూరమైనా కన్నారు కనక నీ బాధ్యత తీసుకుంటారు. వారి తరువాత నీ అన్నలకి నీ సంగతేం కావాలి! నీ ముందున్న ఏభై ఏళ్ళ జీవితాన్ని వంటరిగా గడపగలగడం అంటే మాటలు కాదు. విద్యా! బాగా తొందరపడకుండా, అన్ని కోణాలనుంచి ఆలోచించిగాని ఏ నిర్ణయానికీరావద్దని నా సలహా. నీ శ్రేయోభిలాషిగా తొందరపడద్దని, ఆవేశంతో తప్పటడుగువెయ్యొద్దని చెబుతున్నాను."  
    "ఆంటీ..... ఆ భర్త నిరాదరణ, ఆ హరాస్ మెంట్, ఆ అత్తామామల అథార్టీ భరిస్తూ బతకడమే మంచిదంటారా...... కాపురం వదలకుండా కష్టమో, నిష్ఠూరమో అక్కడే పడుండటం మంచిదని నీ సలహానా?!" విద్య గొంతులో కాస్త తిరస్కారం, హేళన ధ్వనించింది.    
    అది నిర్మల దృష్టిని దాటిపోలేదు. కాని ఆమె కోపం తెచ్చుకోలేదు. విద్య చిన్నపిల్ల. ఆవేశంలో ఆలోచిస్తూంది. ఆ స్థితిలో ఉన్న తనూ అప్పుడు అలానే అనుకుంది. వయసు తెచ్చిన అనుభవంతో ఇప్పుడు ఆలోచిస్తూంటే, తను తొందరపడిందన్న నిజం ఈ పదిహేనేళ్లలో ముల్లులా గుచ్చుకుంటూనే వుంది తనని. భర్తని కాస్త మార్చడానికి ప్రయత్నించాల్సిందేమో! తనవైపు నించి తనేం చేసింది అతనికి అనుగుణంగా మారడానికి అన్న ఆలోచన చాలా ఆలస్యంగా వచ్చింది. అందుకే విద్యకింతగా చెప్పడం అనుకుంది నిర్మల.
    "విద్యా..... నీకేం చెప్పాను - మేరేజ్ అంటే నథింగ్ బట్ జస్ట్ ఏన్ అడ్జెస్ట్ మెంట్. ఒక తల్లి కడుపున పుట్టిన నలుగురూ ఒకలా వుండరే. ఒక ఇంటపుట్టి పెరిగినా మనస్తత్వాలు కలియవే. అలాంటిది ఇరవై ఏళ్ళు, పాతికేళ్ళు వేరే వేరే చోట బతికి హఠాత్తుగా పెళ్ళి పేరుతో ఇద్దరు మనుషులు కలిసి ఒక ఇంట్లో బతకడం అంటే మాటలు కాదు. అలా బతకడానికి ఎన్నో చిన్న చిన్న కోరికలు చంపుకోవాలి. ఎన్నో త్యాగాలు చెయ్యాలి. ఒకరికోసం ఒకరు కొన్ని వదులుకోవాలి. అహాలు చంపుకోవాలి. స్వార్థాన్ని జయించాలి.    
    ఇద్దరిని కలిపి ముడివేసి, ఒకకప్పు కింద బతకమన్నప్పుడు ఆ ఇద్దరి ఆలోచనలు ఒకలా వుండకపోవచ్చు. అభిప్రాయబేధాలు వస్తాయి. కలతలు, కలహాలు తప్పవు. ఇక ఇంట్లో ఎక్కువకాలం ఎవరైనా సరే..... నీ తల్లికాని, చెల్లిగాని, అన్నగాని, కల్సి వుంటే అనేకరకాల అభిప్రాయభేదాలు వస్తాయి. కన్యగా ఎక్కువకాలం మిగిలిపోతే కన్నతల్లితోనే కలహాలు తప్పవు. తల్లి అంటే తప్పు పట్టని మనం అత్త అంటే సహించం. అన్న, చెల్లి విసుర్లు విసిరితే ఉడుక్కు సహించే మనం అదే ఏ మరిదో, తోడికోడలో, ఆడపడుచో అంటే అవమానం జరిగినట్టు కొట్టుకుపోతాం!    
    ఇరవై ఏళ్ళు మనం తండ్రి చాటుగా పెరిగినప్పుడు ఆయన పెద్దవాడిగా ఏదన్నా మందలిస్తే సహించగలిగిన మనం, మరో ఏభై ఏళ్ళు భర్త పరిరక్షణలో బతకాల్సిన మనం, మనకంటే పెద్దవాడుగా భర్త మందలిస్తే, తప్పుపడితే ఎందుకలా గిజగిజలాడిపోతాం? అష్టకష్టాలు పడిపోతున్నట్టు ఎందుకు భావిస్తాం? తల్లిదండ్రి అన్నదమ్ములతో రక్తసంబంధం వుంది. భర్త, అత్తమామల కొత్త జీవితంలో ప్రవేశించినవారు. రక్తపాశం లేనివారు. అలాంటివారు ఏదన్నా అంటే వీళ్ళెవరు అనిపిస్తుంది. పుట్టిన ఇరవై ఏళ్ళు తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో పెరిగిన మనం పెళ్ళికాగానే ఒక్కసారి ఏదో స్వేచ్చ పొందినట్టు ఫీలవుతాం.          

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra