Home » Kommuri venugopala rao » హౌస్ సర్జన్

 

    "అయ్యో!" అన్నాను  అప్రయత్నంగా.

    "ఇప్పుడెలా  డాక్టర్ ! నావల్లే  జరిగిందని  తెలిస్తే  వాళ్ళు  నన్ను తిట్టిపోస్తారు. కొన్ని వందలమందికి  పెన్సిలిన్  చేశాను. రియాక్షన్  రాలేదు. ఇవాళ  నా కర్మ  కాలింది" అని నా చెయ్యి  వదిలి  నుదుటిమీద  చేయివేసి  కొట్టుకుని "ఈ పాపం నా చేతుల  మీదుగా  జరిగింది, వాళ్ళు  నన్ను  విడిచిపెట్టరు" అని కళ్ళు తుడుచుకొంది.

    ఆ స్థితిలో  ఆమెను  చూస్తే  నాకు జాలివేసింది. "పిల్లాడు  పోయాడని  వాళ్ళకు  తెలుసా ?" అనడిగాను.

    "ఉహు!" అని తల  ఆడించింది. "బ్రతికే  వున్నాడని వాళ్ళను  కుంటున్నారు."

    ఆ సమయంలో  ఆమెను  చెడుమాట  పడకుండా  తప్పించటానికి  ఒకటే  ఉపాయం  తోచింది. అది పాపమో, పుణ్యమో  మరింకా  దాన్నేమని  పిలుస్తారో  నాకు  తెలియదు.

    ఇవతలకి  వచ్చి  వాళ్ళ  దగ్గరకు  వెళ్ళాను. స్టెతస్కోప్ తో  కాసేపు పిల్లాణ్ణి పరీక్ష  చేశాను. గంభీరంగా  ఆలోచిస్తూ  నిలబడ్డాను.

    "ఎలా వుంది  బాబుగారూ !" అనడిగింది  తల్లి, కళ్ళనీళ్ళు  కారుస్తూ.

    "చాలా సీరియస్ గా ఉందమ్మా! మా ప్రయత్నం  మేము  చేస్తాము. తర్వాత మీ అదృష్టం" నాలో లేని  కఠినత్వాన్ని తెచ్చుకొని  యీ  మాటలని  లోపల నుండి  యింజక్షన్లు  తెచ్చి  రెండుమూడు  చేశాను.

    "ఇందాకా  బాగానే  ఉన్నాడు బాబుగారూ!" అంటున్నాడు తండ్రి.

    "విధి వక్రిస్తే  ఎంతలో  ముంచుకురావాలి  చెప్పండి" అని  ఓ పదినిమిషాలు  గడిచాక మరోసారి  చెయ్యిచూసి  పెదవి విరిచి  "ఉహు, లాభం లేదు తీసుకు వెళ్ళిపోండి" అని  చెప్పాను.

    ఇద్దరూ  ఒక్కసారి  గొల్లుమన్నారు. "ఓరి నాయనోయ్ ! ఓరి తండ్రోయ్! నీ కెంతలో  కాలం చెల్లిపోయిందిరా  నాన్నా!" అంటూ గుండెలు పగిలేలా  ఏడుస్తూ బయటకు తీసుకు వెళ్ళిపోయారు, ఎత్తుకుని.

    లోపలకు  వెళ్ళేసరికి  రాజేశ్వరి  రెండు చేతుల్లో  తలదాచుకుని  వెక్కివెక్కి  ఏడుస్తోంది.

    "డాక్టర్ !" అని పిలిచాను

    ఆమె చేతులు  ముఖంమీద  నుంచి  తొలగించి  నావంక  చూసి  "అట్టే జ్వరం కూడా లేదు. నేను యింజక్షన్  చేయకుండావుంటే  నూరేళ్ళు  జీవించే వాడు కదా" అని  తలుచుకుని కుమిలిపోతూ  ఏడుస్తోంది.

    కాసేపు  మౌనంగా  నిలబడ్డాను, ఏం చేయాలో  తోచక. ఆమెలోని  మానవత్వం  హిమాలయమంత  వెలిగించింది   నాకు.

    కొంతసేపున్నాక  తేరుకుని  ఆమెను  ఓదార్చాను. "చూడండి. ఆ కుర్రాణ్ని  మరణం నుండి  తప్పించటం  మీ చేతిలో లేదు  మీరతనికి  యిన్ జక్షన్ చెయ్యాల్సిరావటం దైవికం. మీరుకాక  నేను చేసినా  అదే జరిగి వుండేది. రోజుకు కొన్నివందలు  చేస్తున్నాం .అందరికీ  అలా  జరిగిందా ?"

    ఏమయినా  ఆమె మనస్సు  కుదుటబడలేదు. "నే నివేళ  పని  చేయలేనండీ  వెళ్ళిపోతాను" అని లోపలకువెళ్ళి  సి.ఎమ్.ఓ. ను కలుసుకుని, పర్మిషన్  తీసుకుని  యింటికి  వెళ్ళిపోయింది.

    ఆ తర్వాత  చాలా రోజులవరకూ  ఆమె ముఖంమీద  చిరునవ్వు చూడలేదు.

    సి.ఎమ్.ఓ  ఎప్పుడైనా  పనిమీద  బయటకు  వెళ్ళినప్పుడు, అక్కడ వుండే  హౌస్ సర్జన్లలోనే  ఒకర్ని  యాక్టింగ్ సి.ఎమ్.ఓ.గా  నియామకం  చేసి  వెళ్ళటం  ఓ ఆచారంగా  ఉండేది. ఆ విధంగా  నేనయిదారుసార్లు  క్యాజుయాలిటీ  మెడికల్  ఆఫీసర్ గా  పనిచేయటం  జరిగింది. కొన్నిసార్లు  రాజేశ్వరిని కూడా  చెయ్యమన్నారు గాని, ఆమె ఒప్పుకోలేదు.

    యాక్టింగ్  సి.ఎమ్.ఓ. గా  ఉన్నప్పుడు  పోలీసులు  త్రాగిన  వాళ్ళను  పట్టుకొచ్చి  మెడికల్  రిపోర్ట్  రాసి  యిమ్మనటం, నేను  పరీక్ష చేసి రాయటం, దొమ్మీ  కేసుల్లో  అందులో  దెబ్బలు  తిన్నవారి  గాయాలగురించి  రిపోర్టు  రాసివ్వటం  వీటిగురించి కోర్టుకు  వెళ్ళవలసి రావటం, కోర్టులో  యక్షప్రశ్నలు ,చిక్కుప్రశ్నలు, వాటికి సమాధానాలూ _ ఇవన్నీ  అనుభవించటం  జరిగాయి.

    క్యాజుయాలిటీకి  సీరియస్ కేసులతోబాటు, తలనొప్పీ అనీ, పంటినొప్పి  అనీ  కొంతమందివచ్చి  వేధిస్తూ  వుండేవాళ్ళు. ఈ శాఖ  పనిచేసేది ప్రమాదభరితమైన  కేసులకోసమే. చిన్న చిన్న  బాధలకు  సంబంధించినవన్నీ  ఉదయంవరకూ  ఆగి, ఆయా  శాఖలకు  సంబంధించిన  ఓ.పి. లకు వెళ్ళి  చూపించుకోవాలి. కాని కొంతమంది  ఉదయం ఓ.పి. లో  క్యూలో  నిలబడితే  చాలా ఆలస్యం  అవుతుందని  వెరిచి  గడుసుగా, పదకొండు గంటలు దాటాకా, క్యాజుయాలిటీకి వస్తూండేవారు. అలాంటివారికి  ఎంతవరకూ  నిజంగా  బాధవుందో  పసిగట్టి' మరునాడు  రమ్మని  సమాధానంచెప్పి  పంపించేసేవాళ్ళం.

    ఒకసారి రాజేశ్వరీ, నేను  యీ  విషయాన్ని  గురించే  చర్చించుకుంటూ  కూర్చున్నాం. క్రితంరోజు  మధ్యాహ్నం  ఓ పేషెంటు వచ్చి  వారంరోజుల నుంచీ  తలనొప్పిగావుందనీ, మందివ్వమనీ  అడిగాడు. వారం రోజుల బట్టీ  ఏం చేస్తున్నావయ్యా  అంటే  "తీరికలేదు  ఇప్పుడీ  దారిన  పోతూంటే  గుర్తొచ్చింది" అన్నాడు. ఈ విషయం  రాజేశ్వరికి  చెబుతూంటే  ఆమె కుతూహలంగా  ఆలకిస్తోంది.

    ఇంతలో  ఓ వ్యక్తి  మా దగ్గరకు  నడుచుకుంటూ  వచ్చాడు. మనిషి బలంగా ,ఎత్తుగా, ఠీవిగా వున్నాడు. పంచా, చొక్కా  వేసుకున్నాడు.

    "నడుస్తూంటే  నాకు  గుండెల్లో  నొప్పివచ్చింది. హాస్పిటల్ ఇక్కడే వుందికదా  చూపించుకుందామని  వచ్చాను" అన్నాడు  మావంక  చూస్తూ.

    రాజేశ్వరి  నా వంక  భావయుక్తంగా  చూసింది. "నువ్వు యిప్పుడు  వర్ణిస్తూన్న  పేషెంటులాంటివాడే  సుమా  యితను  అన్న  అర్ధం  వుందా  చూపులో.

    నేను  లోలోపల  నవ్వుకుని  లేచి  నిలబడి "ఆ బల్ల  దగ్గరకు  పదండి. పరీక్షచేస్తాను" అని ముందుకు  అడుగువేసివుంటాను.

    ఆ వ్యక్తి  కూడా  ఒక అడుగువేసి  వుంటాడు. హఠాత్తుగా  "అమ్మో !" అని ఒక అరుపు  అరిచి  గుండె  చేత్తోపట్టుకుని  క్రిందికి  వొరిగిపోయాడు.

    నేను ఒక్క  ఉదుటున  ముందుకు  పరిగెత్తి  అతన్ని  పట్టుకుందామని ప్రయత్నించాను. కాని అప్పటికే  పడిపోయాడు.    

    గబగబ వార్డుబాయ్ ని కేకేశాను. అతనువచ్చి  పరిస్థితి చూసి  యింకో  యిద్దర్ని  పిల్చుకువచ్చాడు. అంతాకలిసి  సాయంపట్టి  అతన్ని  బల్లమీదకు  చేర్చారు ,ఏమిటేమిటంటూ  లోపల నుండి  సి.ఎమ్.ఓ. పరిగెత్తుకు వచ్చాడు. ఆయన  యాక్టింగ్ సి.ఎమ్.ఓ. రోజూ వుండే  డాక్టరు  వారంరోజులు సెలవు  పెట్టిపోతే  ఆయన స్థానంలో  పబ్లిక్  హెల్త్  డిపార్ట్ మెంటులో  పనిచేస్తున్న  ఒకర్ని  తీసుకువచ్చి  తాత్కాలికంగా  నియమించారు.

    ఆయన ఏ  చిన్న  సమస్య  ఎదుర్కోవలసివచ్చినా,  పెద్ద  యిబ్బందిలో  పడిపోయినట్లు  ముఖంపెట్టి  "శానిటరీ  డిపార్టుమెంటులో చేరి  అయిదేళ్ళు  అయిందేమో, మెడిసిన్  పూర్తిగా  మరిచిపోయాను. నన్ను తీసుకువచ్చి  యిందులో  పడేశారు" అని  గొణుక్కుంటూ  ఉండేవాడు.

    ఇప్పుడు  పరిస్థితి  చూసి  గాభరాపడిపోయాడు. "ఏమిటి ? హార్టు ఎటాకా ? వస్తూనే పడిపోయాడా ? నా డ్యూటీలోనే  యిలాంటి  గడ్డుసమస్యలు  వచ్చిపడుతూంటాయేం  కర్మ ?" అని నా వంక  తిరిగి  "ఏం చేద్దాంమంటారు డాక్టర్ ? మీరు చెప్పండి" అన్నాడు.

    పేషెంటువంక  చూశాను. స్మృతిలోలేడు. నాడి  అతి పలచగా  కొట్టుకుంటోంది. గుండె చప్పుడు  స్టెతస్కోప్ కు  అందటం  లేదు సరిగ్గా. ఏ క్షణంలోనైనా  ఆగిపోయేటట్లుగా  ఉంది.

    "ఓపెన్ మెథడ్ లో కార్డియాక్  మసాజీ  చేద్దాం" అన్నాను.

    "ఓపెన్ మెథడే ! ప్రమాదమేమో."

    "ఇప్పుడు మాత్రం  ముంచుకురావటం  లేదా సార్ ? మీనమేషాలు  లెక్క పెట్టుకుంటూ  కూర్చుంటే  టైంలేదు .చెయ్యదలచుకుంటే  వెంటనే  చేసెయ్యటం, లేకపోతే  యింజక్షన్లతో  సంతృప్తి పడి  ఊరుకోవటం."

    "మీరు యిదివరకు  చేశారా ?"

    "చెయ్యలేదు. చూశాను."

    ఆయన ఒకక్షణం  ఆలోచించి  "ఆల్ రైట్, చేసెయ్యండి" అన్నాడు.

    సిస్టర్ని  స్కాల్ పల్ వగైరాలు  తీసుకురమ్మని  పంపించాను.

    నా చెయ్యిపట్టుకుని  ఎవరో  లాగినట్లయింది. తల ప్రక్కకి త్రిప్పి చూసేసరికి రాజేశ్వరి. "వద్దు" అన్నట్లు  సౌంజ్ఞ చేస్తోంది.        

    "పర్వాలే"దని  ఆమెకు చూపులతోనే  ధైర్యం చెప్పి సిస్టర్  తెచ్చిన స్కాల్ పల్ అందుకుంటూ  భగవంతుణ్ని ధ్యానించాను.

    అంతే. అంతా క్షణాలమీద  జరిగింది. సర్రుమని  యిన్ సిషన్ దూసుకుపోయి, గుండెమీది  చర్మాన్ని  విడదీసింది. రక్తం, తెగిపోయిన  చిన్న చిన్న రక్తనాళాలు. కారే  రక్తాన్ని  లెక్కచెయ్యలేదు. ఇంకో యిన్సిషన్ తో  లోపలకు  వెళ్ళిపోయింది. గుండె  కదిలించేటట్లు  టిష్యూనీ, చర్మాన్నీ వ్రేళ్ళతో బలంగా  ప్రక్కకు విడదీశాను. ఆగిపోతున్నట్లు, దీనంగా, భయంభయంగా  కొట్టుకుంటూ  యింకా  సజీవమైన  గుండె  సృష్టిరహస్యాన్ని  చూసినట్లయింది. లోపలకు  వ్రేళ్ళు  జొనిపి  కృత్రిమ కదలికను  కలిగించటానికి  కృషి  చేస్తున్నాను.

    ఈ లోపల  రాజేశ్వరి  నా ఆజ్ఞలను  పరిపాలిస్తున్నట్లుగా. నేను చెప్పినట్లు  గబగబ యింజక్షన్లిస్తోంది.

    మెత్తని గుండెను, సజీవమైన మనిషిగుండెను  నా వ్రేళ్ళు  క్రమపద్ధతిలో కదిలిస్తున్నాయి పేషెంటుకు ఆక్సిజన్ వెడుతోంది. సెదనస్ వెయిన్ గుండా  గ్లూకోజ్ సెలైన్  వెడుతోంది .గుండెకు  కోల్పోయిన శక్తి తిరిగి వస్తున్నట్లు, స్వయం సంచలనం అధికం  కాసాగింది.  

    ఊపిరి వస్తున్నది రోగికి. శరీరం  వేడెక్కుతున్నది.

    చివరికి  మా కృషి  ఫలించింది. గుండె  మామూలుగా  కొట్టుకోసాగింది. కనురెప్పలు  కదలసాగాయి. రోగి బ్రతికాడు.

    గుండెమీది  చర్మం  కుట్టేసి, బాండేజ్ వేసేశారు.

    సి.ఎమ్.ఓ  నన్ను  కావలించుకున్నంత  పనిచేసి  "మార్వలెస్ ! ఈ భూమ్మీద  ఏ దిక్కుకుపోయినా  మీకు తిరుగులేదు. నామాట  నమ్మండి" అని అభినందించేశాడు.

    రాజేశ్వరి  విప్పారిన  ముఖంతో  మనః  పూర్వకంగా  అభినందించింది.

    రోగికి  యింకా  పూర్తిగా  తెలివిరాలేదు. తగిన  కట్టుదిట్టాలు  చేసి  స్ట్రెచర్ మీద  అతన్ని  వార్డుకు పంపేశాము.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra