Home » Dr. dasaradhi rangacharya » Rigveda Samhitha - Part 1


         ఓం నతా మనన్తి మాయినో నధీరా వ్రతా దేవానాం ప్రథమా ధ్రువాణి |
        నరోదసీ అద్రుహ వేద్యాభిర్న పర్వతాని నమేత స్థివాంసః ||

                ఎనిమిదవ అధ్యాయము - నూట పదమూడవ సూక్తము
              ఋషి-అంగిరసపుత్రుడు కుత్సుడు, దేవత-ఉషస్సు, ఛందస్సు-త్రిష్టుప్.


    1. వెలుగులు అన్నింటిలో ఉషస్సు వెలుగు శ్రేష్ఠము. అది తూర్పున ఉదయించును. అది పెరిగి ఉషస్సు కిరణములు సర్వవ్యాప్తములు అగును. రాత్రి సూర్యునికన్నది. రాత్రి ఉషస్సును కన్నది.

    2. ప్రకాశించు సూర్యునకు కన్నతల్లి ఉష. ఉషకు జన్మస్థానము రాత్రి. రాత్రి, ఉషస్సు సమాన బంధుత్వము కలవి. ఈ రెండును సూర్యుని కూడి ఒకదాని వెనుక ఒకటివచ్చి సర్వప్రాణులను వృద్ధులను చేయుచున్నవి.   

    3. ఉష-రాత్రి అక్కచెల్లెళ్లు. వాటి సంచారమార్గము ఒకటియే. ఆ మార్గము అనంతము. అవి రెండును అ మార్గమునందు సూర్యుని ఆజ్ఞకులోబడి సంచరించుచున్నవి. రాత్రి-ఉష వీటి రూపములు వేరు. అయినను ఐకమత్యము కలవి. ఒకదానిని ఒకటి బాధింపవు. ఒకేసారి ఉండవు.

    4. ఉషస్సు వెలుగుల రాశి. వాక్కులకు అధికారి. ఆమెను చూచియే ప్రాణులు పలుకును. ఆమె మా ద్వారములను సమస్త విశ్వమును ప్రకాశింపచేయుచున్నది. మా సంపదలను కాంతివంతము చేయుచున్నది.

    5. ఒకరి భోగములకు ఒకరి యాగములకు ఒకరి ధనములకు ఉషయే కారణము అగుచున్నది. కొద్దిచూపువారికి వెలుగును, భువనములు అన్నింటికి ప్రకాశము కలిగించుచున్నది. సంపన్నురాలయిన ఉష నిద్రించువారిని మేల్కొలుపుచున్నది.

    6. ఉష ఉదయించుట ఒకరికి ధనము కొఱకు, ఒకరికి అన్నము కొఱకు, ఒకరికి యజ్ఞము కొఱకు అగుచున్నది. ఒకనిని పనులకు, ఒకనిని కృషికి, ఇంకొకనిని వాణిజ్యము కొఱకు జాగృతము చేయుచున్నది. సకల విశ్వమును ప్రకాశవంతము చేయుచున్నది.

    7. ఉష ద్యులోక పుత్రిక. ఆమె చీకట్లను చీల్చి ఫలములను ప్రసాదించు దేవత. ఆమె ధవళ వస్త్రము ధరించి సకల భూసంపదను ధరించి మహారాణియై శోభిల్లుచున్నది. ఆమె మా యజ్ఞశాలకు విచ్చేయవలెను. చీకట్లను పారద్రోలవలెను.

    8. నిన్నటి ఉష-రేపటి ఉషల సంప్రదాయమునే నేటి ఉష అనుసరించుచున్నది. సకల ఉషస్సుల తొలి ఉష అంధకారమును అంతముచేసి జీవజాలమునకు చైతన్యము కలిగించినది. మృతప్రాయులయి నిద్రించిన వారిని జాగృతము చేసినది.

    9. ఉషస్సా ! నీవు అగ్నిని ప్రజ్వరిల్ల చేసినావు. సూర్యకామ్తిచే జగముల చీకట్లను తొలగించినావు. నరులతో యాగములు చేయించినావు. ఇన్ని పనులు చేయించిన నీవే దేవతలు అందరిలో మంగళప్రదవు.

    10. ఉషస్సు ఉద్భవించనున్నది. అది ఎంతకాలము నిలుచును? పూర్వము ఎన్ని ఉషస్సులు ఉదయించినవో ? ఇంకను ఎన్ని ఉషస్సులు రానున్నవో? నేటి ఉషస్సు గత ఉషస్సులను అనుకరించుచున్నది. రానున్న ఉషస్సులకు మార్గము అగుచున్నది. ఉషస్సు అనంతము.

    11. వెలుగులను ఇచ్చు పురాతన ఉషస్సును దర్శించిన వారు గతించినారు. మాకు ఇపుడు కనిపించు ఉషస్సు కూడ అట్టిదియే, రాబోవు ఉషస్సులను చూచువారు కూడ ఉండరు.

    12. ఉషస్సు శత్రువులను పారద్రోలునది. సుఖములను ప్రసాదించునది. వాక్కును ప్రకటించునది. యజ్ఞమును పాలించునది, పోషించునది. మంగళప్రదమయినది. అమ్మా ! ఉషోదేవీ ! మా యాగమునందలి చీకటిని తొలగింపుము.

    13. ఉషోదేవత విహరించుచుండును. పూర్వకాలమున చీకట్లను పోగొట్టినది. ఈ కాలమున వెలుగును బయలుపరచుచున్నది. రానున్నకాలమున చీకట్లను పోగొట్టగలదు. ఉషకు ముదిమిలేదు. చావులేదు. ఆమె తన వెలుగులతో విహరించుచుండును.

    14. అంతరిక్షమున సకల దిశలను ఉష కాంతులతో వెలిగించును. ఆమె అంధకారపు రూపుమాపును. ఎర్రని కిరణముల రథమున వచ్చును. నిద్రనుంచి మేల్కొలుపును.

    15. ఉష పోషించదగిన, కోరతగిన ధనములను ప్రసాదించుచున్నది. విశ్వమును జాగృతము చేయుచున్నది. జ్ఞానము కలిగించుచున్నది. అందములయిన అనేక ఉషస్సులను రానున్న ఉషస్సులను తొలి ఉషస్సు వృద్ధి చెందించినది.

    16. మానవులారా ! నిద్రవదులుడు. మేల్కొనుడు. చీకట్లుపోయినవి. మనదేహములకు ప్రాణము వచ్చినది. తేజస్సు వచ్చినది. ఉష ఉదయించినది. సూర్యుని రాకను ప్రకటించినది. అన్నము సమృద్ధిగ దొరుకుచోటునకు సాగుదము.

    17. రేభర్షి వెలుగుచున్న ఉషస్సును స్తుతివాక్కుల ప్రార్థించుచున్నాడు. ఉషోదేవీ! స్తుతికర్తకు చీకటి తొలగించుము. మాకు పుత్ర, పౌత్రులను, అన్నమును అనుగ్రహింపుము.

    18. హవిస్సులు సమర్పించు యజమానికి, ఉషోదేవి వీరులను, గోవులను ప్రసాదించుచున్నది. చీకట్లు పోగొట్టుచున్నది. స్తుతివాక్కు పూర్తి అయినంతనే అశ్వధనము సమకూర్చుచున్నది. యజమానులు ఉషోదేవికి హవిస్సులు అందించవలెను.

    19. ఉషోదేవీ ! నీవు దేవతలకు తల్లివి. అదితికి ప్రతిద్వంద్వవు. యజ్ఞములకు పాలకమవు. పూజ్యురాలవై విరాజిల్లుము. మా స్తుతులను స్వీకరింపుము. మా మంత్రముల కొఱకు ఉదయించుము. మమ్ము జనులలో నిలుపుము.

    20. హవిస్సులు సమర్పించిన స్తుతికర్తలకు ఉషోదేవతలు తాము కూర్చిన ధనమును ప్రసాదింతురు. మిత్రుడు, వరుణుడు, అదితి, సింధువు, భూమి అంతరిక్షములు రక్షించవలెను.

        నూట పదునాలుగవ సూక్తము - ఋషి - అంగిరస పుత్రుడు కుత్సుడు,
            దేవత-రుద్రుడు, ఛందస్సు - 10, 11 త్రిష్టుప్ తక్కినవి జగతి.


    1. కపర్ది, బలుడయిన రుద్రుని నుతింతుము. అతడు వీరులకు ఆశ్రయము కల్పించవలెను. సకలప్రాణులకు సుఖములు ప్రసాదించవలెను. సమస్త ప్రాణిజాలము రోగరహితము కావలెను. వర్ధిల్లవలెను.

    2. రుద్రుడా ! నీ పుత్రులు వాయువులు. నీవు శత్రుంజయుడవు. నిన్ను హవిస్సులతో అర్చించుచున్నాము. మనువు మాకు తండ్రి. అతడు మాకు రోగశమనమును భయనివారణమును ప్రసాదించినాడు. నీవు నీతిని బోధించుము. మేము వాటి ఫలితమును అనుభవింతుము.

    3. రుద్రుడా ! నీవు వరప్రదుడవు. సంపన్నులగు వాయువులు నీకు పుత్రులు. మేము యాగములు చేతుము. నీ అనుగ్రహము అర్థింతుము. నీవు సుఖశాంతులతో మావద్దకు విచ్చేయుము. నీరాక మాత్రమున మేము సంతానవంతులము అగుదుము. నీకు హవిస్సులు అర్పింతుము.

    4. రుద్రుడు కాంతిమంతుడు. యజ్ఞనిర్వాహకుడు. కుటిలగమనముగలవాడు. అధిక జ్ఞానవంతుడు. అట్టిరుద్రుని భక్తితో ప్రార్థించుచున్నాము. ఆ రుద్రుడు కోపమును దూరముగా విసరివేయవలెను. మేము ఆ రుద్రుని అనుగ్రహము వేడుచున్నాము.

    5. రుద్రుడు వరాహము వంటి దృఢగాత్రుడు. కాంతులవాడు. జటాజూటములవాడు. దివ్యతేజోరూపుడు. ద్యులోకమునుండి రమ్మని హవిస్సులు ఇచ్చి ఆ రుద్రుని ఆహ్వానించుచున్నాము. అతడు ఔషధములను తనచేతధరించి మాకు ఆరోగ్యకవచమును, గృహములను ప్రసాదించవలెను.

    6. మరుత్తులకు పితరుడయిన రుద్రునికొఱకు మధురాతిమధురమయిన ఉన్మత్తమయిన స్తుతులను చదువుచున్నాము. అమరుడవగు రుద్రదేవా ! నరులకు ఉపయుక్తము అగు అన్నమును పుత్రపౌత్రులను ప్రసాదించుము. మాకు సుఖములను ఇమ్ము.

    7. రుద్రుడా ! మాలో పెద్దవానిని చంపకుము. పిల్లవానిని చంపకుము. ఏడుచువానిని చంపకుము. కడుపులో ఉన్న వానిని చంపకుము. వృద్ధులు మా తలిదండ్రులను చంపకుము.

    8. రుద్రుడా ! మా పుత్ర పౌత్రులను, పరిచారకులను, గోవులను, అశ్వములను హింసించకుము. కోపమున మా పుత్రులను చంపకుము. నిన్ను హవిస్సులతో సదా ప్రార్థించుచున్నాము.

    9. పశుపాలకుడు పశువులను అధికారికి అప్పగించును. అట్లే రుద్రా ! ఈ స్తుతిమంత్రములను నీకు సమర్పించుచున్నాను. నీ అనుగ్రహము సుఖములను ఇచ్చునది. మంగళకరమయినది. మాకు సుఖములను రక్షణలను ప్రసాదించుము.

    10. రుద్రా ! నీవు శత్రునాశకుడవు. గోవులను, నరులను వధించు నీ ఆయుధములు మాకు దూరముగా ఉంచుము. మాకు ధనమును, సుఖమును ప్రసాదించుము. సర్వదా మా పక్షము వహించుము.

    11. మేము రక్షణలు కోరుచు ఈ సూక్తమును పలికినాము. రుద్రదేవునకు నమస్కారము. మరుత్తులతోకూడిన రుద్రుని ఆహ్వానించుచున్నాము. మిత్రుడు, వరుణుడు, అదితి, సింధువు, భూమి, అంతరిక్షము మమ్ము రక్షించవలెను.

    ఆలోచనామృతము :

    1. అంతిమ సమయమున ఏడిపించువాడు రుద్రుడు. సంసార దుఃఖము 'రుత్' అగును. దానిని నాశనము చేయువాడు రుద్రుడు. శబ్దరూపములయిన ఉపనిషత్తు 'రుత్' అగును. ఉపనిషత్తులు ప్రతిపాదించిన దేవత రుద్రుడు. శబ్దాత్మకమయిన వాక్కు 'రుత్'. వాక్కు ప్రతిపాదించిన దేవత రుద్రుడు. అంధకారావృతము 'రుత్'. దానిని పారద్రోలువాడు రుద్రుడు.

    2. మనువు ఔషధములు నరులకు ఇచ్చినాడు. రుద్రుడు నీతిబోధచేయు వరకు వి ఫలించలేదు.

    వైద్యము, ఔషధము నీతిమంతము అయినపుడు మాత్రమే ఫలించునని హెచ్చరించుచున్నాడు. ఇది నిత్య సత్యము.

                                             నూట పదిహేనవ సూక్తము
   
        ఋషి-అంగిరసపుత్రుడు కుత్సుడు, దేవత-సూర్యుడు, ఛందస్సు-త్రిష్టుప్.


    1. సూర్యుడు మిత్ర, వరుణ, అగ్నులకు నేత్రప్రాయుడు. అతడు ఆశ్చర్యకరములగు కిరణ సముదాయములతో ఉదయించినాడు. ద్యులోక, అంతరిక్ష, భూలోకముల నిండినాడు. స్థావరములకు సూర్యుడు జీవాత్మ అగును.

    2. ఉషస్సునందు దేవతలను ఆశించు యజమానులు సత్కర్మఫలము కొఱకు వేరువేరుగ యజించున్నారు. పడుచువాడు భార్యను వెంబడించినట్లు ఆ ఉషను సూర్యుడు వెంబడించుచున్నాడు.

    3. సూర్య కిరణములు శుభప్రదములు, నీటిని పీల్చునట్టివి. విచిత్ర వర్ణములు గలవి. సోత్రప్రియములు. వందనీయములు. అట్టి సూర్యకిరణములు ఆకాశమున ద్యులోకమున కాంతులను పరచినవి.

    4. సూర్యకిరణములు విస్తీర్ణములు అయినను వ్యవసాయము మున్నగు కార్యములకొఱకు సూర్యుడు తనకిరణములను ముడుచుకొనుచున్నాడు. అదే అతని స్వాతంత్ర్యము. అదియే సూర్యుని మహాత్మ్యము. సూర్యుడు తన కిరణములను వేరు చోటునకు చేర్చినపుడు లోకములకు రాత్రి అగుచున్నది.

    5. సూర్యుడు మిత్రావరుణులతో కూడి ఆకాశమునందు నిలిచి తనకాంతిచే దర్శనము ఇచ్చుచున్నాడు. సూర్యుని కిరణములు అనంతములు. ప్రకాశవంతములు. రసమును పీల్చునవి. అవి తమ వెలుగులతో ప్రకాశము కలిగించుచున్నవి. అవే కిరణములు తొలగి చీకట్లు కలిగించుచున్నవి.

    6. సూర్యకిరణములారా ! సూర్యుడు ఉదయించుచున్నాడు. దుష్టమగు పాపములను తొలగించుడు. రక్షించుడు. మిత్రుడు, వరుణుడు, అదితి, సింధువు, భూమి, అంతరిక్షము మమ్ము రక్షించవలెను.

                               (ప్రథమ మండలమున పదియారవ అనువాకము సమాప్తము.)

                     పదిహేడవ అనువాకము-నూట పదియారవ సూక్తము
                 ఋషి - కక్షీవంతుడు, దేవత - అశ్వినులు- ఛందస్సు - త్రిష్టుప్.   


    1. విమదుని భార్యను శత్రువులు అపహరించినారు. అశ్వినులు రథముమీద సేనలను నడిపించి విమదునకు భార్యను ఒప్పగించినారు. యజ్ఞకర్తలు దర్భలు పరిచినట్లు మేఘములు ఉదకములను చేర్చినట్లు అశ్వినులకు స్తుతులను కూర్చుచున్నాను.

    2. అశ్వినుల వాహనము గాడిద. అది బలముగలది. వేగముగలది. ఇంద్రాదుల గుఱ్ఱములతో సమమయినది. యమునకు ప్రియమయినది. యుద్ధములందు వేలకొలది బలములను జయించినది.

    3. భుజ్యుడు తుగ్రుని పుత్రుడు. చనిపోయినవాని ధనమును ఒకచోటునకు చేర్చునంత జాగ్రత్తగా తుగ్రుడు భుజ్యుని నావమీద పంపినాడు. అశ్వినులు నీటిమీద నడుచునవియు, మునగకుండనవియు అగు వారి నావలతో భుజ్యుని రక్షించినారు. తండ్రి వద్దకు చేర్చినారు.

    4. భుజ్యుని అశ్వినులు వేగవంతమయి నూరు చక్రములు కలిగి, ఆరు అశ్వములుగలమూడు రథములలో మూడు రాత్రులు, మూడు పగళ్లు, సముద్రమందు, ఎడారిలో, సముద్ర తీరమున రక్షించినారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra