Home » Chandu harshavardhan » The Partner

 

    ఆమె చర్యకు సునిల్ గతుక్కు మన్నాడు.
    చివ్వున లేచి బెడ్ పై దూరంగా జరిగాడు.
    ఏమనుకుందో  ఏమో రేష్మా ..... కింద పడివున్న తన బట్టలను అందుకుని పక్క గదిలోకి వెళ్ళింది.
    సునిల్ మనస్సంతా గజిబిజిగా వుంది.
    తను తొందరపడినట్టా? లేక ఆమె కావాలని.......
    తనే తొందరపడి వుండాలి..... తను చేసిన పనికి రేష్మా తనను ఏమని అనుకుంటుందో, మోసగాడిలా భావించిందేమో ....తను కావాలని అలా చేయలేదని ఆమెని నమ్మించడం ఎలా? అలా చెప్పినంత మాత్రాన రేష్మా పవిత్రురాలు కాలేదుగా......
    కానీ , ఆమె వాలకం చూస్తుంటే అలా లేదే?
    తనంటే ఇష్ట పడుతున్నట్టుగా ఉంది.
    సునిల్ అలాంటి ఆలోచనలతో ఉండగానే రేష్మా వచ్చింది.
    స్నానం చేసి వచ్చింది కాబోలు .... ఆమె ఒంటిపై తడి ఇంకా ఆరకుండానే నైటీ వేయడం వలన ఆమె శరీరంలోని వంపు సొంపులన్నీ కొట్ట వచ్చినట్టు కనిపిస్తున్నాయి.
    "హాయ్ హాండ్ సమ్ .....ఏమిటి అలా డీలాగా కుర్చుండిపోయావు రాత్రి మనం ఏం చేసుకున్నామో తలుచుకుంటూ అనందిస్తున్ననా---లేక విచారిస్తున్నానా? విధి బహు చిత్రమయింది అని అంటుంటారు. చూడు మన కలయిక కూడా అలాంటిదే అనుకో. ఎప్పుడు ఎవరు యెక్కడ కలుస్తారో ఎందుకు విడిపోతారో -----చివరకు ఏమవుతామో తెలియదు. అలానే మనమిద్దరమూ. నిన్నటివరకూ మనం ఎవరికి ఏమవుతామో తెలియదు. కానీ ఇప్పుడు కలిసి చాలా దూరం ప్రయాణించాం కదూ?"
    అప్పటికే సునీల్ పెదవి విప్పలేదు.
    తను తప్పుచేశానన్న ధోరణిలోనే వున్నాడతను.
    జరిగిపోయిన దాన్ని గురించి బాధపడి ప్రయోజనం లేదు హాండ్ సమ్ . ఎందుకు అలా జరిగింది అనేదీ అనవసరం. నువ్వు నన్ను ఏదో చేశావని, నిన్ను తాళి కట్టి పెళ్ళి చేసుకోమని కోరను -----నీవల్ల నా జీవితం చెడిపోయిందని -----నన్ను చెడగొట్టావని నేను భావించడం లేదు. మన కలయిక ఒక అపురూపమయిన తీపి గుర్తుగా గుర్తుంచు కుంటాను. జరిగింది మరవడానికి ప్రయత్నించు" అంటూ ఊరడించినది అతడిని.
    సునీల్ యంత్రికంగానే లేచి బయటకు నడిచాడు.
    జరిగిపోయినదానిని ఆమె అంత స్పోర్టివ్ గా తీసుకున్నా, అతను మాత్రం అలా సరిపెట్టుకోలేక పోయాడు.
    రేష్మా ప్రతిరోజూ పోగ్రాం లో పాల్గొంటున్నప్పటికీ, ఏదో గిల్టీ తో అసలు ఆమె వైపు చూడడమే మానివేశాడు ----అప్పటినుండి ఆమెను పలకరించలేదు. ఆమె కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు.
    సునీల్ ---జరిగిన సంఘటనను మరచిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఒకరోజు రేష్మా అతని కోసం హడావుడిగా వచ్చింది.
    వచ్చీ రావడంతోనే ఆమె చెప్పిన పిడుగులాంటి వార్తవిని సునిల్ హతాశుడైపోయాడు.
    "ఏమిటి నువ్వు చెప్పేది?"
    రేష్మా భుజాలను పట్టి కుదుపుతూ రెట్టించి అడిగాడు సునీల్.
    "అవును -----నిజమే --------నేను చెప్పేది నిజమే. మనం యిద్దరం కలిసి వున్నప్పుడు వీడియో తీశారు. ఆ కాసేట్ తీయించింది నువ్వేనని ------ నువ్వు బ్లూ ఫిలిమ్స్ తీయిస్తున్నవని నీమీద గిట్టని వాళ్ళు ఎవరో పోలీస్ కంప్లయింట్ యిచ్చారు. మనల్ని తీసిన కాసేట్ పోలీసుల చేతిలో ఉంది. నీకోసం పోలీసులు వస్తున్నారు. జగపతి గారితో ఫోన్ లో మాట్టాడుతుండగా విని నిన్ను హెచ్చరిద్దామని పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వు అర్జెంటుగా  పారిపో ......ఎక్కడో ఒకచోట దాగుకుని ఈ గొడవలు సద్దుమణిగాక రావచ్చు .......ఏం ఆలోచించకుండా ముందు నువ్వు పారిపో లేదంటే ప్రమాదం.....' అంటూ ఖంగారు పెట్టింది రేష్మా.
    సునీల్ నవనాడులు కుంగి పోయినట్టయ్యాయి.
    తన ప్రమేయం లేకుండానే మందు మత్తులో జరిగిన కామక్రీడలను ఎవరో వీడియో తీశారన్న మాట -----అసలు తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినప్పటికీ మౌనంగా దోషిలా వెళ్ళిపోయాడు. దానికి పర్యవసానమా యిది.
    తను తెలిసి యే నేరమూ చేయలేదు. అలా అని నిర్దోషిగా నిరూపించుకునే అవకాశమూ లేదు.
    "ఈ విషయం గజపతి గారికి చెబితే , అయన పోలీసులతో మట్టాడతారేమో .....' అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు సునీల్.
    "పిచ్చివాడా .........అసలు విషయం తెలియక అలా అంటున్నావు. నా అనుమానం నిజం అయితే అతనే మనల్ని విడీయో తీయించి వుంటాడు. కానీ ఈ విషయం ఎలా తెలిసిందో పోలీసులకు తెలిసిపోయింది. కాసేట్ వాళ్ళ చేతులలో పడింది. వాళ్ళు వచ్చే లోపే నువ్వు పారిపోవడం మంచిది నా మాట నమ్ము సునీల్!"
    ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని స్థితి అతనిది.
    గజపతి అలా చేసి వుంటాడాంటే నమ్మలేకపోతున్నాడు.
    కానీ ఎప్పటి నుండో అతని దగ్గర పనిచేస్తున్న రేష్మా కంటే నిన్న గాక మొన్న వచ్చిన తనకు ఎక్కువ ఏమీ తెలియదు కదా ......
    అదీ గాక , ఆ కాసేట్ లో రేష్మా కూడా వుంది.
    ఆమె చెబుతున్నప్పుడు నమ్మకుండా ఎలా వుండగలడు?
    "ఒకసారి గజపతి గారిని కలిసి "
    నా మాటల మీద నీకు నమ్మకం  లేదేమో ----నిన్ను రక్షించుకోవాలని నేను పడే తాపత్రయం నీకు అర్ధం కావడం లేదు. గజపతి పైకి కనిపించేటంతా మంచివాడు కాదు. నీలాంటి వాళ్ళను తెలివిగా ట్రాప్ లో వేస్తుంటాడు. నేనూ అలానే అతని గుప్పిట్లో ఇరుక్కుపోయాను.... ఇప్పుడు నువ్వు....రేపు మరొకరు .... అంతే ....నిజం నిలకడ మీద నీకే తెలుస్తుందిగా ......" అంటూ తొందర చేసింది రేష్మా.
    తనను తను సమాధాన పరచుకుంటూ ఎవరూ తనను గమనించక ముందే సునిల్ బయటకు పరుగు దీశాడు.
    అతను వెళ్ళిన మరునిమిశంలోనే పోలీస్ జీప్ ఆ బార్ ముందు ఆగింది.
    ఆ దృశ్యం దూరం నుంచి చూసిన సునిల్ రక్త ప్రసరణ వేగం హెచ్చింది....
    అంతే......
    ఆ తరువాత సునిల్ ఏమయ్యాడో .........ఎక్కడ వున్నాడో ఎవరికీ కనిపించలేదు.
    ఒక వారం రోజుల తరువాత.....
    గజపతి ఒక్కడే ఆఫీసులో ఒంటరిగా వున్న సమయంలో గడ్డం మీసాలు పెరిగి పిచ్చివాడిలా వున్న సునీల్ లోనికి అడుగుపెట్టాడు.
    అతను ఎవరో ముందు గుర్తుపట్టలేకపోయాడు గజపతి.
    కాని, గుర్తుపట్టాక.....
    "యూ స్కౌండ్రల్ ........ఎంత పనిచేశావురా అప్రాచ్యుడా.....నిన్ను మంచివాడు అని నమ్మి ఉద్యోగం ఇచ్చిందుకు నా బార్ కే చెడ్డపేరు తీసుకువస్తావా?" అంటూ కోపంతో చిందులేశాడు గజపతి.
    తన జీవితంలో అతను ఎందుకు అలా అడుకున్నాడో నిలదీయాలని వచ్చిన సునిల్ గజపతి మాటలు ఏమీ అర్ధం కాలేదు.
    "ఏమిటి మీరంటున్నది?"
    "ఏమీ తెలియని నంగనాచిలా మాట్టాడకు....నా బార్ లో పనిచేసే డాన్సర్ తో కలిసి శృంగారాన్ని ఒలకబోస్తావా? దానికి తోడూ వీడియోలు తీసుకుంటారా? అంత ఒళ్ళు కొవ్వొక్కి కొట్టుకునేవాళ్ళు నా బారే కావలసి వచ్చిందా! నువ్వు ఏదో నిరుద్యోగివని , ఏ ఆధారం లేక అలా కొట్టు మిట్టాడుతున్నావని జాలిపడి నిన్ను చేరదీసినందుకు నాకు చక్కగానే బుద్ది చెప్పావు. పోలీసులను మేనేజ్ చేసుకోడానికి నా తలప్రాణం తోకకు వచ్చింది ...ఇక ముందు నా బార్ లో అడుగు పెట్టకు......గెట్ అవుట్..." ఆవేశంగా అరిచాడు గజపతి.
    అతను చెప్పేది అబద్దం అని తనకు తెలుసు ----కాని ఆ విషయం నిరూపించలేడు . తనకు యే పాపమూ తెలియదని నమ్మించ'లేడు . గజపతే చేశాడని నమ్మి తను పారిపోయిన విషయం ఇప్పుడు చెబితే నమ్మి ఆశ్రయం ఇచ్చింది కాక నిందలు కూడా వేస్తున్నావా అని మరింత రెచ్చి పోతాడు అయన......
    అందుకే సునిల్ మౌనంగా వెనుదిరిగాడు.
    'అగు!"
    ఎందుకో వూహించలేకపోయినా నిలుచుండి పోయాడు సునిల్.
    "నువ్వు నీతి తప్పి ప్రవర్తించినా నేను నీతి తప్పడం లేదు. నువ్వు నా దగ్గర పనిచేసినంత కాలానికి నీకు రావలసిన జీతం ఇదిగో .....జీతం కూడా ఇవ్వకుండా వెళ్ళగొట్టాడు అనే నింద నాకెందుకు ." అంటూ ఒక నోట్ల కట్టను అతని చేతిలో వుంచి వెనుదిరిగి వెళ్ళిపోయాడు గజపతి.
    ఆ నోట్ల కట్ట వైపు ---- గజపతి వైపు చూస్తూ చివరగా తాను చెప్పదలచుకున్నది చెప్పి వెళ్ళిపోవాలనుకున్నాడు సునిల్.
    "గజపతిగారూ .......మీరు నన్ను అపార్ధం చేసుకున్నారు. నిజంగా నాకే పాపమూ తెలియదు ......అసలు వీడియో అనేది ఒట్టి అబద్దం ......నేను ఎందుకు తీస్తాను వీడియో----" అంటూ ఇంకా ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు సునిల్.
    "ఓహో ....అలాగా ......అయితే ఇది యేమిటి మిస్టర్.....యిందులో ఎవరు వున్నారో చూసి చెప్పు"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra