ఇలా పదిమందికి సాయపడటంవల్ల ఆయన అహం సంతృప్తి చెందుతుందేమో! అమ్మగారు అర్థరాత్రి ఆయన కన్సల్టింగ్ రూం లోనికి వెళ్ళి "ఎంత కష్టపడుతున్నావురా నాయనా" అని జుట్టు నిమరటం ఆయనికి ప్రతిఫలమేమో!? కానీ ఎవరూ నా వైపునుంచి ఆలోచించరేం? నాకేమవసరం వుందని అనుకోరేం? ఈ దగ్గిర వాళ్ళు-ఈ బంధువులు, వీళ్ళ మొహాలమీద నవ్వులు, ఏమీ తెలియనట్లు పనులు జరిపించుకోవటాలు... ఇవన్నీ చూస్తుంటే నాకు ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. అదృష్టవశాత్తు ఆ అవసరం లేకుండా వెళ్ళిపోతున్నాననుకోకు. వెళ్ళిపోయే ముందు నేను ప్రార్థించే చివరి ప్రార్థన ఏమిటో తెలుసా అన్నయ్యా?

    ".... భగవంతుడా! వచ్చే జన్మంటూ వుంటే నాకు ఒక చిన్న ఇల్లు ఇవ్వు. అందులో నా భర్తా, నా పిల్లలే వుండాలి. మా ఇంటికి బంధువులు ప్రేమా ఆప్యాయతలు తీసుకురావాలి. కోర్కెలతో రాకూడదు. మా అత్తా మామలకి పై అంతస్తులో ఒక గది ఇస్తాం. మా వంటిళ్ళలోకి, మనసుల్లోకి తొంగి చూడొద్దని చెప్పు. ప్రతిరోజూ మా పడగ్గదిలోనే మేము పడుకునే అవకాశం ఇవ్వు. నా పిల్లలను నేను నా ఇష్టానుసారం పెంచుకునేలా చెయ్యి.

    మరింత ప్రేమ మా మధ్య నెలకొల్పు.

    మాలో స్వార్థాన్ని కాస్త తగ్గించు.

    ముఖ్యంగా మా అవసరాల కోసం మాలో ఉత్పన్నమయ్యే స్వార్థానికి "ప్రేమ" అని పేరు పెట్టుకోవటాన్ని మానించి తప్పించు. నా ఇల్లు నాకు మిగుల్చు.

    ఇల్లంటే నలుగురు మనుష్యులూ ప్రేమా ఆప్యాయతలతో బంధింపబడవలసిన నిలయమే కానీ, పదిమంది శత్రువులు తమ తమ గదుల్లో వ్యూహాలు పన్నుతూ, తప్పనిసరిగా బ్రతకవలసి వచ్చే వలయం కాదని నిరూపించు.

    అదీ నా ప్రార్థన.... అంతే అన్నయ్యా నేను చెప్పదల్చుకున్నది. వెళ్లొస్తాను- అరుణ."

    ఇది విద్యాధరీ! నన్ను నిలువునా కదిల్చి వేసిన ఉత్తరం. ఎంతో ఆలోచించాను. నిన్ను ప్రేమించిన తొలి రోజులవి. ప్రేమంటే ఏమిటి అన్న చింతన బయల్దేరింది. శరీరం కోసం భార్యని, వృద్ధాప్యం కోసం పిల్లల్ని, అహం సంతృప్తికోసం ప్రియురాల్ని, అవసరం కోసం భర్తనీ, రక్షణకోసం కులాన్ని, దేశాన్ని, భాషని.... ఇలా సంకుచితంగా కాకుండా ప్రేమనేది ఉండదా అని ఆలోచించాను.

    పొగడ్తలు, ద్వందార్థపు మాటలు, ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు, సానుభూతులూ, ఓదార్పులూ, తర్కాలూ, ఆవేశాలూ.... ఇలా ఒక్కొక్క స్టేజి దాటి క్రమంగా బయటకు వస్తే- నాకో సత్యం బోధపడింది. ఆ సత్యం ఏమిటో నీ వద్దనున్న పుస్తకపు "చివరి పేజీ"లో వుంది.

    నీ దగ్గిర శెలవు తీసుకొనబోయే ముందు ఒక సలహా చెపుతాను విద్యాధరీ!

    ఆలోచించకు!

    ఆలోచించకుండా ప్రేమిస్తేనే స్పందిస్తావు- ఆస్వాదిస్తావు.

    ఆలోచించేకొద్దీ మనుష్యుల మధ్య బాంధవ్యాలు, ఎంతో సంక్లిష్టంగా కనుపిస్తాయి. హ్యూమన్ రిలేషన్స్ అన్నీ వ్యాపారబంధాలే తప్ప- అనుబంధాలు కావని తోస్తుంది. నా చెల్లెలి ఇంట్లో ప్రతీ వ్యక్తి ఒక బంధం ఏర్పర్చుకుని అవసరాలు తీరుస్తున్నారని నా చెల్లెలి వాదన. అంతకన్నా పైస్థాయికి వెళ్లి ఆలోచిస్తే, ఆమె అత్తగారికి కూడా ఏదో ఒక రీజన్ వుండి వుండకపోదు. ఎక్కడయితే శత్రుత్వం వుంటుందో అక్కడ ప్రతి మనిషీ తనకంటూ ఒక రీజన్ ఏర్పర్చుకుని వాదించటం ప్రారంభిస్తాడు.

    ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ రీజన్ వుండదు. ప్రేమ తప్ప ఇంకేమీ వుండదు. అంత ప్రేమనివ్వటం ఇష్టంలేక దేవుడు మనిషికి "రీజనింగ్" అన్న శాపాన్ని ప్రసాదించాడు. ఇదే నేను కనుక్కున్న సత్యంలో ఒక భాగం.

    'నేను నీ కోసం యెదురుచూస్తాను' అన్న వాక్యంతో దీన్ని ముగించను. నా ప్రేమ స్వచ్చమైనదైతే నీవెందుకు నాకు! నీ జ్ఞాపకం చాలు. నీతో వుండాలనుకోవటం స్వార్థం. నా ప్రేమ ఎప్పుడైతే ఈ స్వార్థాన్ని అదిగమించిందో, అది నిన్ను దాటి నీ జాతినీ, కులాన్నీ, రాష్ట్రాన్నీ, దేశాన్నీ, ప్రపంచాన్నీ దాటి విశ్వవ్యాప్తమౌతుంది. అదే విశ్వజనీయమైన ప్రేమ!!! ఆలోచించవద్దని సలహా ఇచ్చాను. ఆలోచించగలిగితే ఆ స్థాయిలో ఆలోచించమని సూచిస్తూ ముగిస్తున్నాను."

    అతడి మాటలు ఆగిపోయాయి.

    ఆమె అలాగే కూర్చుండిపోయింది.

    ఎక్కడ దూరతీరాల మేఘాల అంచుల్లోంచి అల్లల్లా -ఆమె సుషుప్తిని ప్రభావితం చేస్తూ... కృష్ణశాస్త్రి పాటలా... ఆరుద్ర మాటలా...

    మలయ మారుత మొకటి మనిషైన రీతి.
    మాధుర్య రసరాశి - మనిషైన రీతి.

    అతనెవరు అడవుల్లోంచి అలా నడుస్తూ వస్తున్నాడు?

    అతను ప్రజలకోసం ఏం తెస్తున్నాడు?

    ఎందుకు జనం అంతా అతడి రాకకోసం అలా ముకుళిత హస్తాలతో ఎదురుచూస్తున్నారు? ఎందుకు అతడి రాకకోసం భూదేవి కూడా అలా ఒద్దికగా నిలబడి వుంది? అతనెవరు? అనుదీప్ కదూ. కాదు. కానీ పోలికలు అలాగే వున్నాయి. కాదేమో?

    కోటి కనులతోటి కొలను చూసింది.
    కోటి గొంతులతోటి పులుగు పాడింది.
    కొమ్మ కొమ్మకి కన్ను - రెమ్మ రెమ్మకి కన్ను.
    కూర్చుకుని ప్రతి తరువూ చూసింది.

    సకల మానవాళికోసం అతడొక సందేశం తీసుకు వస్తున్నాడు. అందరూ వినండి. ప్రేమంటే ఏమిటో అతడు చెపుతాడు. అవసరం కోసం ఉద్భవించని ప్రేమ గురించి అతడు చెపుతాడు. కన్నులు కూడా చెవులు చేసుకుని వినండి.

    మనో కవాటాలు తెరవండి. చక్షువుల్ని దివిటీలు చేసుకుని చూడండి. బంధాలు తెంచుకోండి. భక్తినే రమించండి. దేవుడే ప్రియుడు. ప్రేమే నైవేద్యం. శరీరం జ్వలించే హారతి. యజ్ఞపురుషుడు సువర్ణ కలశంలో ప్రేమని నింపుకుని తీసుకొస్తాడు. అయితే ఆ దేవుడు మీకు గుళ్ళల్లో దొరకడు. అతడికోసం మీరు తలనీలాలు సమర్పించనవసరం లేదు. అతడికోసం క్యూల్లో నిలబడనవసరం లేదు! ప్రేమ ఒక యజ్ఞం అయితే, ఆ యజ్ఞానికి పరాకాష్ట రతి. అక్కడ పెదవులు కదళీ ఫలాలు, నాలుక తమలపాకు, స్థనాగ్రాలు పోకచక్కలే! కానీ నిజమైన ప్రేమకు పరాకాష్ట ఉంటుందా ఎక్కడైనా! అది నిరంతరం స్రవంతిలా సాగిపోదా? ఏ కలయికవల్లా దాని తీవ్రత తగ్గదు కదా! విశ్వ జనావళి ప్రేమలో ముంచెత్తే విశ్వజనీయమైన ప్రేమముందు- ఒకరి నొకరు ప్రేమించుకోవటం ఎంత చిన్న విషయం. దీనికి ప్రేమ అని పేరు పెట్టుకోవటం ఎంత హాస్యాస్పదం!! ఒకరు కొందర్ని మాత్రమే ప్రేమించగలగటం- ఎంత ఇరుకు ఆలోచన!

    అతడి మాటలు ఇంకా ఆ గదిలో ప్రతిధ్వనిస్తున్నట్లే ఉంది. ఒక్కొక్క వాక్యం ఆమెని పదే పదే ఆలోచింప చేస్తోంది. ఆమెకు దుఃఖం వచ్చింది. ఆవేశం వచ్చింది. తనెంత మూర్ఖురాలో అర్థమైంది. ఉద్వేగం హెచ్చింది! వెళ్ళాలి. అతడి దగ్గరికి వెళ్ళాలి అని తొందరపడింది.

    బాగా రాత్రయింది.    

    అయినా ఎవరూ తనని ఆపలేరు.

    లేస్తూంటే ఆమె దృష్టి ఎదుటి పుస్తకంమీద పడింది.

    థ్రిల్లర్!!!

    ఒక్క ఉదుటున దాన్ని దగ్గరికి లాక్కొని చివరిపేజీ తీసింది.

    తెల్లగా ఉన్న ఆఖరి కాగితం.

    చేతివేళ్ళు వణుకుతూ వుండగా పెన్ కాప్ తీసి, ఉద్విగ్నతతో దానిమీద వ్రాయటం ప్రారంభించింది.

    ఐ లవ్ యూ అనుదీ....

    పాము కాటు వేసినట్లు ఆమె కలం ఆగిపోయింది! 'అనుదీ...' అన్న అక్షరాల్నుంచీ ఇంకు ఎర్రగా మారింది.

    అంటే ....

    అంటే ....

    ......................

    ఆమె చేతిలో పుస్తకం అలాగేవుంది.

    గాలిలా ఆ గదిలోంచి బయటకు పరుగెడ్తూంది. గదికి తాళం కూడా వేయలేదు. అయిదు నిముషాల్లో ఆస్పత్రి చేరుకున్నది.

    ఎమర్జెన్సీ వార్డులో పదోనెంబరు పడకవద్దకు పరుగెత్తింది. ఆ పక్కమీద ఎవరో స్త్రీ వున్నది. అనుదీప్ కాదు.

    "ఇంతరాత్రి లోపలికి ఎలా వచ్చారు?" అని అడుగుతూన్న నర్స్ మాటలకి సమాధానం ఇవ్వకుండా "... ఇక్కడి పేషెంట్?" అంది.

    అదే సమయానికి స్ట్రెచర్ బయటకు వస్తూవుంది. వెనుకే రవిశాస్త్రి నడుస్తూ వస్తున్నాడు. స్ట్రెచర్ పై తెల్లటి గుడ్డ కప్పివున్నది. ఆమె మనసేదో కీడు శంకించింది.

    ఒక్క ఉదుటున దగ్గిరకి వెళ్ళి గుడ్డ తొలగించింది. అనుదీప్...! మృత శరీరం...!! అప్పుడామె పెట్టినకేక ఆకాశాన్ని కదిల్చింది. భూమిని ఆపింది. అతడి వదనాన్ని చేతుల మధ్యకు తీసుకుంది. ఆమె కన్నీటి పొరల మధ్య అతడి మొహం అస్పష్టంగా కనిపిస్తోంది. రవిశాస్త్రి చెపుతున్నాడు-

    "ఆపరేషన్ అయినప్పుడే డాక్టర్ అనుమానం వెలిబుచ్చాడు. కానీ ఎక్కడో నమ్మకం.. అనుదీప్ కి ఏమీకాదనీ... ఏ దుష్టశక్తి అతడి ప్రాణాలు తీయలేదనీ.... కానీ..."

    ఆమె వినటంలేదు. అనుదీప్ కి వదనాన్నే చూస్తోంది. అకస్మాత్తుగా ఆమెలో దుఃఖం ఎవరో తీసేసినట్టు ఒక్కక్షణంలో మాయమైంది.  

    అలల అడుగున చేపలు కదిలినట్టు మనసులోని ఆలోచన్లు ....నిజంగానే నా ప్రేమలో నిజాయితీ వుంటే.... తీవ్రత వుంటే.... కదలదా కైలాసగిరి?

    ఆమె అతడి కనురెప్పల్ని చూస్తోంది. రెప్ప సందుల్లోంచి నిస్తేజమైన కళ్ళు... ఒకప్పుడు ప్రేమని పంచిన కళ్ళు... వాటినే చూస్తోంది. పూర్ణకలశంతో ఆకాశంనుంచి ఎవరో ప్రేమని ఒలకపోస్తున్నభావం!

    తపస్సు మనిషిని ఋషిని చేస్తే....

    భగవంతుడు ఇచ్చేది వరమైతే...

    ఆ వరం వల్ల మనిషి దేన్నైనా సాధించగలిగే శక్తి సంపన్నుడు కాగలిగితే...!

    ఓ భగవంతుడా!

    నా ప్రేమకీ తపస్సుకున్నంత శక్తి వుంది.

    నాకోసం మరణించిన ఇతడికి ఆ వరం నేను ఇస్తున్నాను. ఆ వరం... మేఘం నుంచి జారిన వర్షపు చుక్క. అతడి పెదవుల పగడపు రేకుల మధ్య పడి... ముత్యమై...ముత్యమంత ముద్దై...

    ఆమె వంగింది.

    ప్రేమ...

    అమరార్చిత పదయుగము- అభయ ప్రదకరయుగము.

    ప్రేమ...

    దానజపాగ్నిహోత్రుడు, భవత్సదాంబుజ ధ్యానరతుండూ అయిన ప్రవరుని శక్తి కన్న మిన్న.

    ఆ ప్రేమని నా పెదవుల దోసిలిపట్టి, నీ కిస్తున్నాను మిత్రమా! ఈ అమృతం నిన్ను బ్రతికిస్తున్నది. బ్రతికిస్తున్న.. బ్రతి...

    మృతదేహంపైకి వంగి, అనుదీప్ పెదవుల్ని ముద్దాడబోతున్న ఆమెని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇన్ స్పెక్టర్ రవిశాస్త్రి. అతడి ఆశ్చర్యానికి కారణం ఆమె ప్రవర్తన! ఆమె దుఃఖించటంలేదు. విచారం లేదు. అదీ అతడి విస్మయానికి కారణం. అంతలో అతడికి అనుదీప్ చెయ్యి కదిలినట్టు అనిపించింది.

    అతడు స్థబ్దుడయ్యాడు. చూస్తున్నది కలా? తిరిగి అయోమయంగా చూసాడు. లేదు. తనది భ్రమ! అనుదీప్ మృతశరీరం అచేతనంగా అలాగే వున్నది. కానీ.... కానీ...

    ఆమె నుంచి వెలువడుతూన్న ఒక కాంతి కిరణం అతడిని చుట్టు ముడుతున్నట్టు... ఒక వలయంలయా...

    అ....ను...దీ...ప్

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra