Home » Dr. dasaradhi rangacharya » Sukla Yajurveda Samhitha


    వరుణుడు విశాల అంతరిక్షమున సూర్యుని కొరకు మార్గము నిర్మించినాడు. అడుగు పెట్టరాని అంతరిక్షమున సూర్యుడు అడుగుపెట్టి సంచరించుటను సంభవము చేసినాడు. అతడు సాధారణులకు దుఃఖము కలిగించుటను - చాడీలు చెప్పుటను సహితము సహించడు. శిక్షించును.

    (అవభృతస్నానమునకు యజమాని జలప్రవేశము చేసి అనవలసినది)

    24. (వెలిగించిన సమిధను నీళ్లలో వేసి దాని మీద ఆజ్యము వేయవలెను)

    అగ్నీ! నీవు అపాంపాత నామము గలవాడవు. అసురులు కల్పించిన విఘ్నములను భంగము చేసినావు. జలమునందు ప్రవేశించినావు. నీవు ఇంటింట విరాజిల్లుము.  ఘ్నత ఆహుతులను స్వయముగా స్వీకరింపుము. నీ జిహ్వ జ్వాలా రూపమగును. ఘ్నతమున ఉన్నతమై వెలుగొందుము. అగ్నయే స్వాహా.

    25. (ఋజీషకుంభమును నీళ్లలో వేయవలెను)

    సోమమా! నీ హృదయము జలములలోన - సముద్రమందు ఉన్నది. అచట నీ లోనికి జలమును, ఓషధులును ప్రవేశించవలెను. యజ్ఞమునందు శుభవచనములు ఉచ్చరించియు- నమస్కరించియు - నిన్ను ప్రతిష్ఠించుచున్నాను. సోమాయ స్వాహా.

    26. (నీటిలో ఋజీష కుంభము నీ గర్భస్వరూపము. రుచికరమును- చక్కనిదగు ఈ ఋజీషమును స్వీకరించుము.

    ఋజీషప్రాయమగు సోమమా! ఇక ఇదియే నీలోకము. ఇందులో ఉండి మాకు సుఖశాంతులు కలిగించుము. మా ఆపదలన్నింటిని - ఇచటినుండి - అచటికి చేర్చుము.

    27. అవభృతయాగమా! నీవు మెల్లగా నడువుము. నీవు సదావేగగతి గలదానవు. అయినను మెల్లగా కదులుము.

    యజ్ఞమా! దేవతల యెడల చేసిన పాపములను ప్రవహింపచేసి తెచ్చినాను. మనుష్యుల చేత - మనుష్యుల విషయమున చేసిన పాపములను నీటపారించి తెచ్చినాను. విపరీత పరిణామముల హింసలనుంచి మమ్ము రక్షింపుము.

    (యజమాని స్నానము చేసి జలము నుండి బయటికి వచ్చి, వస్త్రము ధరించి, ఆహవనీయాగ్నికి సమిధను సమర్చించవలెను)

    సమిధా! నీవు దేవతల సమిధవు. "దేవానాం సమిధాసి"

    28. (యజ్ఞార్థము పదినెలల పిండము కంపించవలెను. వాయువు వలెను, సముద్రతరంగముల వలెను కంపించవలెను. దశమాస గర్భపిండము కంపించవలెను.

    29. గర్భిణి గోవూ! నీగర్భము యజ్ఞయోగ్యమైనది. నీయోని స్వర్ణమయమైనది నీపిండము వికలము కాని అవయవములు కలది. ఈ గర్భమును తల్లికి కలుపుచున్నాను.

    (గర్భపు రక్తముచే హొమము చేయవలెను)

    30. బహుదర్శనీయము- అనేకరూపవంతము. గర్భరూపసొమము గర్భమందు మహిమను పొందునుగాక. గర్భిణి  గోవును ఒకటి, రెండు, మూడు, నాలుగు మరియు ఎనిమిది పాదములు గల దానిగా భావించి సర్వభూతములందు వ్యాపించును గాత - స్వాహా

    31. మరుత్తులారా! ఏ యజమాని ఇంట -ద్యులోక విశిష్టప్రకాశముగల - మీరు సోమపానము చేయుదురో ఆయజమానియే సురక్షితుడు అగుచున్నాడు.

    32. ద్యావాపృథ్వులారా! కరుణించండి. మీకరుణారసమున ఈ యజ్ఞమును తడపండి. మాకు జీవనయోగ్య ధనములు ప్రసాదించండి.

    33.వృత్రహంతా! విచ్చేయుము. వేదస్వరూపులగు నీ హర్యశ్వములను ఆహ్వానించినాము. వాటికి యజ్ఞకాలము తెలియును అది స్వయముగా రథమున తగులుకొనును. సోమాభిషవ శిలలు - రథమునెక్కిన - నీమనసును మాయజ్ఞము వైపు మరలించవలెను.

    సోమమా! సోమాభిషము నుండి నీవు ఉపయామగ్రహమున గ్రహించబడినావు.

    34. హర్యశ్వములు పొడుగు జూలు గలవి. హరిత వర్ణలు, వర్షము కలిగించునవి. తరుణలు. సోమపాయి ఇంద్రా! సూర్యాశ్వములను రథమునాకు కట్టుము. స్తుతిరూపవాణి వినుము. మా గృహామునకు విచ్చేయుము.

    35. ఇంద్రా! నీవు అప్రతిహత బలశాలివి. హర్యశ్వములు నిన్ను మాత్రమే సహించును. అవి నిన్ను  వసిష్ఠాది ఋషుల వద్దకును - మానవుల యజ్ఞముల వద్దకును కొనిపోవును.

    36. ప్రజాపతి ఈ సమస్తలోక, లోకాంతరములందున్నాడు. అతడు సమస్త ప్రజలతో ఆనందించును. అతడు సూర్యుడు, అగ్ని, విద్యుత్ అను మూడు జ్యోతులతో కూడి ఉండును. అట్టి ప్రజాపతియే 'షోడశి' అగును. "త్రీణిజ్యోతీంషి సచతే సషోడశీ"

    37. (షోడశిగ్రహము నందలి సోమమును సేవించవలెను)

    షోడశిగ్రహమందలి సోమమా! ఇంద్రరాజు - వరుణ సామ్రాట్టు - వారిరువురు నిన్ను సర్వప్రథమముగా సేవించినారు. వారి తరువాతనే నేను సేవించినాను. నా ప్రాణములతో పాటు నాలో ఉన్న సరస్వతియు - ఈ సోమమున - సంతృప్తి చెందవలెను స్వాహా.

    (షోడశియాగము పూర్తి అయినది)

    38. (ద్వాదశాహము ప్రారంభము)

    అగ్నీ! నీవు శుభకర్మలవాడవు. మాలో బ్రహ్మవర్చస్సు, సువీర్యమును నింపుము. మాకు అన్నము, అశ్వగోధనములను ప్రసాదించుము.

    సోమరసమా! నీవు ఉపయామ గ్రహమున తీసికొనబడినావు. నిన్ను తేజస్వి అగ్ని కొరకు పరిగ్రహించుచున్నాను. ఇది నీ స్థానము. తేజస్వి అగ్ని కొరకు నిన్ను ఇచట స్థాపించుచున్నాను.

    తేజస్వి అగ్నీ! దేవతలందు నీవు పరమ తేజోవంతుడవు. నీ ప్రసాదమున నేను మానవులందు బ్రహ్మతేజస్విని కావలెను.

    39. ఇంద్రా! నీవు ఓజస్సుతో లేచినావు. అధిషవణ చర్మము మీద అభిషవించిన సోమపానము చేసినావు. ఆనందమున తేలియాడి క్రింది పెదవిని చప్పరించినావు.

    సోమమా! నీవు ఉపయామగ్రహమున తీసికొనబడినావు. నిన్ను ఓజస్వి ఇంద్రుని కొరకు పరిగ్రహించినాను. ఇదిగో ఇది నీస్థానము. ఇచట నిన్ను ఓజస్వి ఇంద్రుని కొరకు స్థాపించినాను.

    ఇంద్రా! దేవతలందు అత్యంత ఓజస్వివి. నీ అనుగ్రహమున నేను మానవులందు ఓజస్విణి కావలెను. (ద్వితీయ అతిగ్రాహ్య గ్రహమును పట్టుకొని)

    40. (మూడవ అతిగ్రాహ్య గ్రహమును పట్టుకొని)

    సూర్యకిరణములు మానవునకు అనుకూలములై ప్రజ్ఞాపికలై కనిపించినవి. అవి అగ్నికిరణముతో సమానముగా మెరయుచున్నవి.

    సోమమా! నీవు ఉపయామగ్రహమున తీసికొనబడినావు. నిన్ను తేజస్వియగు సూర్యుని కొరకు పరిగ్రహించినాను. ఇదిగో ఇది నీ స్థానము. ఇచట నిన్ను తేజస్వి సూర్యునికొరకు స్థాపించినాను.
   
    తేజస్వితమ సూర్యా! నీవు ప్రకాశమానులందు అత్యంత ప్రకాశమానుడవు. నీ అనుగ్రహమున నేను మానవులందు ప్రకాశమానుడను కావలెను.

    (ద్వాదశాహ యజ్ఞము ముగిసినది)

    41. (గవామయనామక సంవత్సర సత్రము యొక్క విషువన్నామ మధ్యాహ్నమున సూర్యునకు పశువును బలిఇచ్చి అతిగ్రాహ్యగ్రహమును తీసికొనవలెను)

    సూర్యుడు విశ్వమును వీక్షించదలచినాడు. అతని కిరణములు కాంతిమయములు. సర్వమును చూపగలవు. ఆ కిరణములు భానుమూర్తిని పై అంతరిక్షమునకు తెచ్చినవి.

    సోమమా! నీవు ఉపయామగ్రహమున తీసికొనబడినావు. నిన్ను తేజస్వియగు సూర్యుని కొరకు పరిగ్రహించినాను. ఇదిగో ఇది నీ స్థానము. ఇచట నిన్ను తేజస్వి సూర్యుని కొరకు స్థాపించినాము.

    42. (గార్గత్రిరాత్ర సవనమున వేయిగోవులను దక్షిణగా ఇచ్చు విధానము ఉన్నది. ఆ వేయింటిలో చివరి ఆవుపేరు రోహిణి. దానిని హవిర్ధానము మధ్యణ నిలిపి ద్రోణకలశమును వాసన చూపించవలెను)

    మహిమగల రోహిణీ! ఈద్రోణకలశమును మూర్కొనుము. ద్రోణకలశమున నిండిన సోమము నీలో ప్రవేశించవలెను. దానిని నీవు ఓజస్వరూపిణి చేసి మాకు తిరిగి ఇమ్ము. మేము మిమ్ము పూజించి వేయిగోవులను ఇచ్చినాము. అందుకు ప్రతిఫలముగా ఆ వేయిగోవులను మాకు తిరిగి ఇమ్ము. ఆ గోవులు దుగ్ధధారావంతములు కావలెను. నీ అనుగ్రహమున నాకు మరింత గో అశ్వధనము లభించవలెను.

    43. (రోహిణిగోవు కుడిచెవిలో యజమాని చెప్పవలెసినది)

    నీవు అహంతవ్యవు. మనుపుత్రి ఇళవలె స్తుత్యవు. ఆనందము నిచ్చుదానవు.  ఆహవనీయవు. కోరదగిన దానవు. ఆహ్లాదికవు. ద్యుతియుక్తవు. అదీనదేవమాత అదితికి సాటివచ్చు దానవు. క్షీరవతివి. మహిమాన్వితవు. విశేషఖ్యాతి గల దానవు. ఇంతటిదానవు నీవు దేవతల ముందునన్ను సుకృతుడను - కృతవ్రతుడను అని వివరింపుము.

    44. (గవామయన యాగపు చివరిరోజున పశువధ తుర్వాత ఇంద్రసంబంధి గ్రహమును గ్రహించుటకు మూడుమంత్రములున్నవి)

    ఇంద్రా! నీవు మా హింసక శత్రువును వధించుము. మామీద సేనతో దండెత్త దలచినవానిని మట్టి కరిపించుము. మాకుహాని తలపెట్టిన దుష్టుని రసాతలమున కంపుము.

    సోమరసమా! నిన్ను ఉపయామ గ్రహమున - విశిష్టయుద్ధకారి ఇంద్రుని కొరకు గ్రహించినాను. ఇది నీస్థానము. విశిష్ట యుద్ధకారి ఇంద్రుని కొరకు నిన్ను స్థాపించినాను.

    45. (రెండవ మంత్రము)

    ఇంద్రుడు వాక్పాలకుడు. సర్వకర్మ. మనోవేగముగల వాడు. మమ్ము నేటి అన్నపు యుద్ధమున రక్షించమని ఇంద్రుని ఆహ్వనించుచున్నాను. సమస్తలోకములకు కళ్యాణకర్త, సుకర్ముడగు ఇంద్రుడు మా సకల ఆహ్వానములను మన్నించవలెను.

    సోమరసమా! నిన్ను ఉపయామగ్రహమున సర్వకర్మ ఇంద్రుని కొరకు గ్రహించినాను. ఇది నీస్థానము. ఇచట నిన్ను సర్వకర్మ ఇంద్రుని కొరకు స్థాపించినాను.

    46. (మూడవ మంత్రము)

    విశ్వకర్మా! నీవు ఇంద్రుని హవిస్సుతో వర్థిల్లచేసినావు. రక్షక ఇంద్రుని సర్వ వధరహితుని చేసినావు. ఇంద్రుని ముందు పూర్వకాల ప్రజలు తలలు వంచినారు. బలశాలి ఇంద్రుడు. అందువలన అందరిచే ఆహ్వానించబడువాడు అయినాడు.

    సోమరసమా! నిన్ను ఉపయామ గ్రహమున - విశ్వకర్మ ఇంద్రుని కొరకు గ్రహించుచున్నాను. ఇది నీస్థానము. ఇచట నిన్ను విశ్వకర్మ ఇంద్రుని కొరకు స్థాపించినాను.

    47. (ఔదుంబర కలశమున సోమము నింపవలెను. హొత చమసమందున్న 'నిగ్రామ్య' జలమును అందులో కలుపవలెను. మూడు సోమలతలను అందులో వేయవలెను. 'అగ్నయేత్వా' మొదలగు మూడు మంత్రములు చదివి 'అదాభ్య' గ్రహమును అందుకొనవలెను)

    సోమరసమా! నిన్ను ఉపయామ గ్రహమును తీసికున్నాను. గాయత్రీ ఛందోవంతవగు నిన్ను ఇంద్రుని కొరకు గ్రహించినాను.

    సోమరసవరా! నిన్ను ఉపయామగ్రహమున తీసికున్నాను. జగతీ ఛందమవగు నిన్ను విశ్వదేవతల కొరకు గ్రహించినాను.

    సోమరసమా! ఈ అనుష్టుప్ ఛందము సాక్షాత్తు నీ స్తవమే అగును.

    48. (ఆహవవీయవేది వద్దకు వెళ్లుచు 'అధాభ్య' జలమును సోమవల్లి ఖండముల మీద చల్లవలెను)

    సోమమా! కదలాడు మేఘముల గర్భమందు శయనించు వర్ణజలమును రాల్చుటకు నిన్ను కంపింపచేయుదును.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra