Home » Kommuri venugopala rao » హౌస్ సర్జన్


    ప్రతి గంటకూ  వెళ్ళి పిల్లవాణ్ని  చూస్తూనే  వున్నాను. చెయ్యవలసిందంతా  చేస్తూనే  వున్నాను  అలా తెల్లవారుఝామువరకూ  గడిచేసరికి  ఆశారేఖలు  పూర్తిగా  విచ్చుకున్నాయి. పిల్లవాడు జీవించాడు. పిల్లవాడి ప్రమాదావస్థ  తప్పిపోయేదాకా  నేను పడ్డ  అవస్థ  పరమాత్ముడి  కెరుక.

    రెండు రోజులు గడిచాక  అర్దరాత్రి సమయంలోనే  మరో చంటిబిడ్డకు  కార్డినోస్  అవసరం వచ్చింది  బంతిలాంటి  కుర్రాడు. చూడటానికి  ముద్దు వస్తున్నాడు. నిమోనియా  జ్వరం  వచ్చి చావు బ్రతుకుల మధ్య  వ్రేళ్ళాడుతున్నాడు. ఆక్సిజన్ వెడుతోంది. టెర్రామైసిన్  యిచ్చాను. కార్డినోస్ అవసరం  కూడా  వచ్చింది. పిల్లాడి దగ్గర  తల్లి ఒక్కతే వుంది, తండ్రి గ్రామాంతరం  వెళ్ళాడుట. ఈ లోపల  ముంచుకు  వచ్చేసరికి  హాస్పిటల్లో  చేర్పించింది. బజారుకి ఎవర్ని  పంపించటానికి  ఉపాయం  తోచక ఆలోచిస్తుంటే  కాసేపటికి  మొన్న  లివర్ ఫెయిల్యూర్ పిల్లాడికి  యిచ్చిన దాంట్లో యింకా  కొద్దిగా  కార్డినోస్  మిగిలి  వున్నట్లు  గుర్తుకు వచ్చింది, ఆ బెడ్ దగ్గరకు  వెళ్ళేసరికి  తల్లి క్రింద చాపమీద  పడుకుని  నిద్రపోతుంది. ఆమెకు నిద్రాభంగం  కలగజెయ్యటం  యిష్టంలేక, మరునాడు చెప్పవచ్చుననుకుని, ప్రక్కనున్న చిన్న బీరువా తెరిచి అందులో ఆమె పట్టుకున్న  డెకడ్రాన్ వయల్  తీసుకు వెళ్ళిపోయాను.

    ఎంత ప్రయత్నం  చేస్తేనేం, నిమోనియా  పిల్లాడు  బ్రతకలేదు. తల్లిని చూస్తే ఆశ్చర్యమేసింది. ఆమె మనసులో  ఎలాంటి దావాగ్నిజ్వాలలు  చెలరేగుతున్నాయోగాని, కంట తడిబెట్టటంగానీ  తన  దుఃఖాన్ని  బయటకు వ్యక్తం చేయటంగాని ఏమీ చెయ్యలేదు నేను టేబిల్  దగ్గరకు  వచ్చి డెత్ సర్టిఫికేట్  రాస్తూన్నప్పుడు  ఎదురుగా  బల్లమీద  చనిపోయిన  పిల్లవాణ్ని వొళ్ళో  పెట్టుకుని  నిశ్శబ్దంగా  కూర్చున్నది.

    సర్టిఫై చేశాక  ఆమె యిహ  వెళ్ళవచ్చునని  సూచిస్తూ, "మీకెంత మంది పిల్లలు!" అనడిగాను.

    "ఒక్కడే" అని సమాధానం  చెప్పి, లేచి ప్రశాంతంగా  బయటకు  వెళ్ళిపోయింది. బహుశా  తన కొడుక్కి  వచ్చిన జబ్బుచూసి, ఎన్ని ప్రయత్నాలు చేసినా  జీవించదని ఆమెకు  స్పురించి  వుండాలి. అందుకే  రాత్రంతా  మేము చేస్తున్న  భగీరధ  ప్రయత్నమంతా  ఏమీ  పట్టనట్లు  తిలకిస్తూ నిల్చుంది.

    ఈ సంఘటనకు  చలించిపోయి, బల్లమీద  రెండుచేతులూ  ఆన్చి, వాటిలో  తలవాల్చి  కూర్చున్నాను. ఎప్పుడు తెల్లారిపోయిందో  కూడా  తెలియలేదు.

    "బాబుగారూ!" అన్న పిలుపు  వినిపించి తలఎత్తి  చూశాను.

    లివర్ ఫెయిల్యూర్  పిల్లాడి  తల్లి. నేను తనవంక  చూడగానే  కృత్రిమంగా నవ్వటానికి  ప్రయత్నిస్తూ  "రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు  వచ్చి ఇంజక్షన్  మందు  తీసుకెళ్ళారటగా  బాబుగారూ ?" అంది.

    ఆమె మాటల్లో  ధ్వనించిన  భావం  చూసి  అసలే  చికాకుగా  వున్న నాకు  కోపం  వచ్చింది "ఏం ?" అన్నాను.

    ఆమె కొద్దిగా  భయపడినట్లు  "అబ్బే, ఏం లేదు. ప్రక్క వాళ్ళెవరో  చెప్పారు, చూశామని  ఆయనట్లా  తీసుకెళ్ళరే  అన్నాను, నేను." అంది విషయం  బయటకు  లాగటానికి  ప్రయత్నిస్తూన్నట్లు.

    నేను కటువుగానే  "నేనే తీశాను. మరో పిల్లాడికి  సీరియస్ గా వుంటే, అతనికి  వాడదామని  తీశాను. అయినా ఆ మందుని  గురించి  నీకంత తాపత్రయమెందుకు ? నీ పిల్లాడికి  అందిక  ఎందుకూ  పనికిరాదు. మరొకరికి  ఉపయోగిస్తే  నష్టమేమిటి ?" అన్నాను.

    "నాకు చెప్పకుండా  తియ్యటం  తప్పుకాదా  బాబుగారూ !" అంది వెంటనే తడుముకోకుండా. బోలెడు డబ్బుపోసి కొన్నది. అలా  చెప్పకుండా  తీసుకుంటే  ఎలా బాబుగారూ ? అయినా  మేము కొనుక్కున్నది  యింకోరి కోసం  వాడటం   తప్పుకాదా ? వస్తువు  మా దగ్గర  వుంటే  ఎప్పటికైనా  ఉపయోగించేది."

    సమస్త మనుష్యజాతిమీదా  ఆ క్షణంలో  నాకు  తీరని  అసహ్యం వేసింది. కోపం అణుచుకోలేక  జేబులోంచి  పదిరూపాయల  నోటుతీసి ఆమె ముందు  గిరవాటువేస్తూ  "చెప్పకుండా  తీసికోవటం  నాది బుద్ధితక్కువే అయింది  ఇదిగో  నీ డబ్బు. తీసుకుని  యిక్కణ్నుంచి  వెళ్ళు" అని అరిచాను.

    ఆమె నేలమీద నుంచి  ఆ నోటు వొంగి  తీసుకుని, "డబ్బెందుకు లెండి. మాటవరుసకు  చెప్పానుగాని" అని నీళ్ళు  నములుతోంది.

    "తీసుకు వెళ్ళు  అంతకన్నా  అధికం  నీతో  వాదించటానికి  నాకు ఓపిక లేదు."

    ఆమె నోటుతో  అక్కణ్నుంచి  వెళ్ళిపోయింది.

    ఒక్కోసారి  కొన్ని  హృదయవిదారకమైన  సంఘటనలు  జరుగుతూండేవి. ఒకసారి ఓ రెండేళ్ళ పాప  డయేరియాతో  బాధ  పడుతూంటే  ట్రీట్ మెంట్  రూమ్ లో బల్లమీద  పడుకోబెట్టి  సెలైన్ ఎక్కిస్తున్నాం. అలా ఎక్కించేటప్పుడు  తల్లి బల్లదగ్గరే  నిలబడి  బిడ్డ కాలు  కదలకుండ  పట్టుకుని  వుండాలి. కాలు వదిలితే  వెయిన్ లోంచి  సూది బయటకు వచ్చేసే అవకాశం వుంది. సాధారణంగా  వాళ్ళు  కూర్చోవటానికి  అక్కడ  స్టూల్ లాంటి దేమీ వుండదు .గంటల తరబడి నిలబడే  వుండాలి.

    ఆ పాపతల్లి  అలా నిలబడి  దబ్ మని  క్రిందపడిపోయింది సిస్టర్ నా దగ్గరకు  కంగారుగా  పరుగెత్తుకు వచ్చింది. నేను వెళ్ళి  ఆమెను  బెడ్ మీద  పడుకోబెట్టి  కాస్త  ఉపచారం  చేసేసరికి  నెమ్మదిగా  కళ్ళు  విప్పి చూసింది.

    "ఏమమ్మా ? ఎందుకూ  పడిపోయావు ? కళ్ళు తిరిగాయా ?"

    అవు' నన్నట్లు  తల ఊపింది.

    "ఏమీ తినలేదా ?"

    లేదన్నట్లు  సౌంజ్ఞ చేసింది.

    "ఎందుకని ?"

    అప్పుడు చెప్పింది ! ఆమె పెనిమిటి నాలుగు గంటలకు  వచ్చినప్పుడు  కాసేపు వుండి తర్వాత  ఆమెకు  హోటలు నుంచి  భోజనం పట్టుకువస్తానని  వెళ్ళిపోయాడట. గేట్ పాస్  ఒకటే  వుంటుంది. అది కాస్తా  తల్లి దగ్గర వుంది. ఆరుగంటలు  దాటితే  యిహ  లోపలకు  ఎవర్నీ  రానియ్యరు. బహుశా  ఆమె భర్తను బహుశా  గేటుదగ్గర   ఆపేసి వుంటారు. అందుకని తిరిగి లోపలకు  రాలేకపోయాడు. ఆమె ఉదయం నుంచీ  భోజనం లేదుట, నీరసంతో  నిల్చుని  పడిపోయింది.

    అలాంటి సమాచారం  వింటూంటే  గుండె  తోడేసినట్టుగా  వుంటుంది. ఆయాను  పిలిచి  ఆమె భర్త పేరు  కనుక్కుని, అతనిచ్చే   క్యారియర్ ను లోపలకు  తీసురమ్మని  చెప్పాను.

    హాస్పిటల్ లో  గేటుప్యాసు  అనేది చాలా ముఖ్యమైన  ఘట్టం. గేటు దగ్గర  ఘూర్ఖా హాస్పిటల్ లో  పనిచేసే  డాక్టర్లనూ, నర్సులనూ, మిగతా  సిబ్బందినీ  మినహాయించి  మిగతా  వారిని  గేటుప్యాస్  చూపించనిదే  బయట ఆపేస్తూ వుంటాడు. ఈ గేటు ప్యాస్  అనేది  ఒక పేషెంటును  వార్డులో  చేర్చుకున్నప్పుడు, ఆ రోగితాలూకు  మనిషికి  చీఫ్ గాని, అసిస్టెంటుగానీ  సంతకం  పెట్టి  యిస్తారు. అది తీసుకొని  గేటుదగ్గర  చూపిస్తే  ఘూర్ఖా  లోపలకు  పంపిస్తాడు. సాయంత్రం  నాలుగూ, ఆరుగంటల మధ్య  మాత్రం  విజిటర్స్ అందర్నీ  విడిచి పెడతాడు. గేటుకాపలావాడు  చేసేపని. ఒక్కోసారి  అతణ్ని  చూస్తే  జాలేసేటట్లు  చేస్తుంది. కొన్ని  వందలమంది  అతని చుట్టూ  మూగి, లోపలికి  వెడతామని  గడ్డం పుచ్చుకుని, చేతులు పుచ్చుకుని బ్రతిమలాడుతూ  వుంటారు. ఏ బంధువో ,ఏ స్నేహితుడో  హాస్పిటల్ లో  చేరాడని  అతణ్ని  చూడటానికి  దగ్గర  ఊళ్ళనుంచీ  దూరపు  ఊళ్ళనుంచీ  జనం  వస్తారు. గేటు దగ్గరే  వాళ్ళకి  ఆటంకం కలుగుతుంది. వీళ్ళందరి  వేడికోలులూ  లెక్కచేయని  మనస్థయిర్యం  గలవాడై  కావాలి  కాపలావాడు. వాళ్ళని బయటకు అదలిస్తూ, అరుస్తూ  గొంతుచించుకుంటూ  నానా హైరానా పడుతూ వుంటాడు. అయితే కార్లో వచ్చిన వాళ్ళ మాత్రం  ఆపడు. నీట్ గా డ్రెస్ చేసుకు వచ్చిన  వాళ్ళను కూడా  ఆపటానికి  భయపడతాడు. అయితే కాపలావాడిలో ఉదారత్వం లేకపోలేదు, అటూ ఇటూ చూసి మరీ  అర్జంటు పని వున్న వాళ్ళు అతని చేతిలో  యిరవై అయిదు పైసలు పడేస్తే  గప్ చుప్ గా  లోపలకు విడిచి పెడతాడు. ఈ విధంగా  అతని  పై సంపాదన  ప్రతి రోజూ బాగానే వుంటుంది.

    హాస్పిటల్ లోకి  అడుగు పెట్టిన  వ్యక్తిపడే  అవస్థ  అప్పుడే  తీరలేదు. అతనికి  కావలసిన రోగి  ఆచూకీ తెలుసుకోవటానికి  అతని  తాతలు  దిగిరావాలి. "ఫలానావాడు  కడుపునొప్పితోనో, పక్షవాతంతోనో  వచ్చాడు, అతన్ని  ఏ వార్డులో వుంచారు ?" అని తెల్లబట్టలు  వేసుకుని  హాస్పిటల్ కి సంబంధించినవాడిలా  కనిపించిన  ప్రతివాణ్ని  భయపడుతూ  అడుగుతారు. అంతా  అతని వంక  పట్టించుకోనట్లు  చూసి  వెళ్ళిపోయేవారేగానీ, సరియైన సమాధానం ఎవ్వరూ  యివ్వరు.

    ఇహ ఓ.పి. కి పేషెంటు పడే పాట్లు  చూడాలి. క్యూలో నిలబడి చూపించుకోవటంతో  ఆరంభమవుతుంది. తను యిబ్బంది పడక, డాక్టర్లని  యిబ్బంది  పెట్టక  వెళ్ళిపోయినవాడి పని  హాయిగానే  వుంటుంది. కొందరి జబ్బు సరిగా  అంతుపట్టదు. "నీవు యిక్కడ కాదు, నీ తలనొప్పికి కారణం ఇ.ఎన్.టి. డిపార్టుమెంటుకు వెళ్ళి  చూపించుకో" అని  అక్కడకు పంపేస్తారు. తీరా అతనక్కడకు  వెళ్ళే  సరికి  ఆ రోజు ఓ.పి. టైము  అయిపోతుంది. మరునాడు వెళ్ళి క్యూలో  నిలబడి  అక్కడ చూపించుకుంటే, అంతా తనిఖీ చేసి  ఎక్స్ రే  తీయించుకు  రమ్మంటారు  ఎక్స్ రే డిపార్టుమెంటు దగ్గర  పడిగాపులు  కాసి అతను ఫోటో తీయించుకుని, మరునాడు మళ్ళీ  ఇ.ఎన్.టి.ఓ. పికి వెడతాడు. అక్కడ ఎక్సరే  అదీ చూసి "ఇందులో  ఏమీలేదు. అంతా  బాగానే వుంది. కంటి డిపార్టుమెంటుకు వెళ్ళి  చూపించుకో" అని అక్కడికి పంపిస్తారు. అక్కడ ఆ రోజుకు టైము  అయిపోతుంది. మరునాడు  వెడితే  అక్షరాలూ, అవీ చదివించి కంట్లో మందు వేసి, లైటు పెట్టి చూసి, మూడు రోజులు పోయాక మళ్ళీ పరీక్ష చెయ్యాలి రమ్మంటారు. మూడురోజులు  అయినాక  వెడితే  మళ్ళీ తనిఖీ చూసి  ఏమీలేదని  మొదట  పంపించిన  డిపార్టుమెంటుకే  తిరిగి పంపిస్తారు.

    ఇలా  అందరకూ  జరుగుతుందని  కాదు. చాలామందికి  యీ మధ్యలోనే  ఎక్కడో రోగం  పట్టుబడి 
చికిత్సపొంది  హాయిగా  యిళ్ళకు  వెళ్ళి  రావచ్చు. కొందరు  దురదృష్టవంతులు  మాత్రం  యీ  తిప్పలు  పడుతూ ఉంటారు.

    ఇన్ని లోపాలతో, ఒడుదుడుకులతో  నిండి  వున్న  నష్టపడినవారి కన్నా  లాభం పొందినవారే  ఎక్కువ. మొదట్లో  యిబ్బందులకు  గురిఅయినా  ఓ రోగికి  చికిత్సా  విధానం  జనరల్  ఆసుపత్రులలో  వున్నట్లు  బయటెక్కడా  వుండదు. రోగనిర్ణయం  అక్కడ  జరిగినంత  పకడ్భందీగా  బయట జరగదు. రోగికి విశ్రాంతి, వేళకి  మందు, అవసరానికి  తగినట్లు  వాడుకోవటానికి  రకరకాల  ఎక్విస్ మెంటూ, తు.చ. తప్పకుండా  నడిచే స్టెరిలైజేషన్ పద్ధతులూ  బయటెక్కడా  సాధ్యం కావు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra