Home » Yandamuri veerendranath » Rakshasudu


    బోటు పేలిపోయిన మరుక్షణం వాళ్ళు అయోమయంలో పడతారు. ఆ కొద్దిపాటి సమయంలోనే తను తప్పించుకోవాలి. మిగతావి విజయ్ చూసుకుంటాడు.

 

    అంతలో దూరంగా చప్పుడు వినిపించింది. చెవులు రిక్కించి విన్నాడు.

 

    పోలీసు జీపు వస్తూంది. సమయం ఆసన్నమయింది!

 

    అతడు కెమేరాలోంచి అవతలి దృశ్యాన్నిచూస్తూ క్లిక్ మనిపించాడు. చిన్న మెరుపులా ఫ్లాష్ మెరిసింది. దూరంగా బోటులోకి పెట్టెలు ఎక్కిస్తున్న కూలీలు ఆకాశంకేసి చూసి తిరిగి పనిలో లీనమయ్యారు.

 

    అంతలో పోలీసు వానులువచ్చి ఆగినయ్. విజయ్ దిగి, కూలీల దగ్గరికి నడుస్తున్నాడు. అయితే చాలా ఆశ్చర్యం కలిగే విధంగా, ఆ కూలీల్లో ఏ విధమయిన అలజడీలేదు. విజయ్ ఒక కూలీని ఆపి, పెట్టె దింపమని, తెరచి పరీక్షిస్తున్నాడు. రెండు నిముషాలు పరిశీలించి విజయ్ ఆశాభంగం చెందినట్టు అక్కడనుంచి కదలటం కనిపించింది.   

 

    పోలీసులు తిరిగి తమవాహనం దగ్గిరకి నడుస్తున్నారు. అతడు తన కళ్ళను నమ్మలేనట్టుగా చూశాడు. వంకచెక్కా రామ్మూర్తి పెట్టెల్లోకి ఎక్కిస్తున్నవి నిశ్చయంగ కోరల్స్ కావు. ఎక్కడో ఏదో మోసం జరిగింది. పోలీసు జీపు, వ్యాను కదిలి వెళ్ళిపోతున్నాయి.

 

    ఆఖరి ప్రయత్నంగా మరోసారి కెమేరా ఫ్లాష్ మనిపించాడు. సరీగ్గా అదే సమయానికి పిస్తోలు పేలింది.

 

    అప్పటిదాకా 'అతడి' అవస్థని చిరునవ్వుతో గమనిస్తూన్న వంకచెక్కా రామ్మూర్తి - పోలీసువ్యాను కాస్త కనుమరుగవగానే తన అనుచరులకు సైగచేశాడు. అప్పుడే లేచి నిలబడుతున్న అతడివైపు పిస్తోలు గురిపెట్టబడింది. అతడు కెమేరాని ఫ్లాష్ చేస్తూ వుండగా అదిపేలింది.

 

    గాజుసీసా బ్రద్ధలైనట్లు కెమేరా ముక్కలై గాలిలోకి ఎగిరింది.

 

    వెంటనే మరోసారి పేలుడు శబ్దం వినిపించింది. బుల్లెట్ వచ్చి అతడి భుజంలో గుచ్చుకుంది. కాలుతున్న ఇనుప వూచని శరీరంలోకి గుచ్చి తిప్పుతున్నట్టు భగ్గున్న మండింది.

 

    మరెవరైనా అయితే ఆ షాక్ కి నిర్మిణ్నులై ఏంచేయాలో తోచక తల్లడిల్లేవారే. కానీ అతడు అనుక్షణం ప్రమాదాలమధ్య బ్రతుకుతున్నవాడు. వెంటనే రియాక్టు అవటం అతడికి తెలుసు. రెండోసారి పిస్తోలు పేలగానే అతడు చప్పున నీళ్ళలోకి డ్రైవ్ చేశాడు. కానీ అవతలి వాళ్ళు కూడా సామాన్యులుకాదు. అతడు నీళ్ళలోకి గెంతేలోపులోనే మరోసారి పేలింది. ఈసారి గుండువచ్చి అతడి తొడలో గుచ్చుకుంది. అతడి వళ్ళంతా రక్తంతో తడిసిపోయింది. అతడు నీళ్ళలోకి దూకగానే అక్కడ నీళ్ళన్నీ ఎర్రగా మారసాగాయి.

 

     ఎక్కువలోతు లేదు అక్కడ. కానీ అడుగునంతా బురద.... కొమ్మలు, పొదలు నీటినుంచి బయటకు వచ్చి తేలుతున్నాయి. ఆఫ్రికా అడవుల్లో నదులు ఇలాగే వుంటాయి. ఎక్కడ నీరువుంటుందో, ఎక్కడ భూమివుంటుందో తెలీదు. దూరంగా సముద్రపు హోరు ఆ చీకట్లో భయంకరంగా వినిపిస్తూంది. ఈ అలజడికి ఒకపాము కొమ్మమీదనుంచి నీళ్ళలోకి దూకింది.

 

    నీటి అడుగున ఎక్కువసేపు వుండడం కష్టమవుతూంది అతడికి. కానీ ఏమాత్రం కదిలినా బుల్లెట్లు తన శరీరాన్ని తూట్లుతూట్లుగా పొడుస్తాయని అతడికి తెలుసు. వళ్ళు జల్లెడవక తప్పదు.

 

    రామ్మూర్తి తన అనుచరులవైపు 'ఆగమన్నట్టు' సైగ చేశాడు. దానికి కారణం వుంది. దూరంగా విజయ్ తాలూకు పోలీసుజీపు వెళ్ళిపోతున్న శబ్దం వినిపించటంలేదు.

 

    రామ్మూర్తి అనుమానం కరక్టే!

 

    పిస్తోలు శబ్దాలువిని విజయ్ జీపు ఆపుచెయ్యమన్నట్టు ఆజ్ఞాపించి, చెవులు రిక్కించి విన్నాడు. అంతా నిశ్శబ్దంగా వుంది.

 

    రొయ్యలగూడెం కాలవ దగ్గర రహస్యంగా 'కోరల్స్' ఎగుమతి జరుగుతున్నాయని వార్త తెలిసి హుటాహుటిన వచ్చాడు. కానీ ఇక్కడ పెట్టెల్లో వున్నది మామూలు 'వస్త్రాలు'. చట్టబద్దంగానే జరుగుతున్నట్టు గుమస్తా రసీదులు చూపించాడు. అయినా ఏదో అనుమానం తొలుస్తూనే వుంది. అనుమానిస్తూనే వెనుదిరిగాడు. అంతలో ఈ శబ్దం.

 

    విజయ్ కొంచెం సేపు ఆగాడు. అంతా నిశ్శబ్దంగా వుంది. ఫర్లాంగు దూరంలో వంకచెక్కా రామ్మూర్తి ఇదంతా చిరునవ్వుతో గమనిస్తున్నాడు. 'అతడు తన వలయంలో చిక్కుకున్నాడనీ, ఇంక ఎటూ పోలేడనీ' అతడికి తెలుసు. అందుకే తాపీగా వేచివున్నాడు. అతడి అంచనా కరెక్టయింది. ఎంతసేపటికీ మరే శబ్దమూ వినిపించకపోవడంలో అతడు జీపుని పొమ్మన్నాడు.

 

    అంతలో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది.

 

    దూరంగా బోట్ లో కూర్చుని దీన్నంతా చూస్తున్న రాబోట్ కి ఇక్కడ జరుగుతున్న దేమిటో అర్థంకాలేదు. అన్ని దృశ్యాలూ అస్పష్టంగా కనిపిస్తున్నాయంతే. పోలీసు ఇనస్పెక్టరు వెనుదిరిగి వెళ్ళిపోవటం తెలిసింది. తన బాస్ కెమేరా ఒకటి రెండుసార్లు ఫ్లాష్ మనిపించటం కనిపించింది. తరువాతేమయిందో అర్థంకాలేదు. ముందనుకున్న ప్లాన్ ప్రకారం వాటర్ మిసైల్ వెళ్ళి అవతలి వాళ్ళ బోటుని కాల్చివేయలేదు.

 

    అతడు సందిగ్దావస్థలో వుండగానే, పిస్తోలు పేలిన శబ్దం వినిపించింది. ఉలిక్కిపడ్డాడు. అంతలో మరోసారి అదే శబ్దం, ఒక శరీరం తుప్పల్లోంచి చేపలా ఎగిరి నీళ్ళల్లో పడటం చూశాడు. ఎంత చీకటిలోనైనా అతడు గుర్తుపట్టగలడు. అది తన యజమాని శరీరం!!!

 

    అతడు వీరభద్రుడయ్యాడు. యుక్తాయుక్తాలు మర్చిపోయాడు. కేవలం ఆవేశం మాత్రమే మనసంతా నిలిచింది. వంకచెక్కా రామ్మూర్తి మనుష్యులు ఎదురుగా నవ్వుతున్నట్టు కనిపించింది. బోటు స్టార్టు చేశాడు. తుఫాను వేగంతో సరుకులున్న పడవవైపు సాగిపోయాడు. అది గమనించిన రామ్మూర్తి అనుచరులు ఆ బోటువైపు కూడా కాల్పులు జరపసాగారు. అతడు ఆగలేదు. అతడికి అంతగా తెలివిలేదు. పనులు నిర్వర్తించటమే తెలుసు. అందుకే అతడికి 'రాబోట్' అని పేరు పెట్టారు అతని స్నేహితులు. తన యజమాని శత్రువుల చేతిలో మరణించాడన్న సత్యం అతడిని పిచ్చివాడిని చేసింది.

 

    అదే వేగంతో వెళ్ళి పడవని ఢీకొన్నాడు.

 

    బ్రహ్మాండమైన విస్ఫోటనంతో వెలిగిన వెలుగు అక్కడి చీకటిని నిముషంపాటూ పారద్రోలింది. దూరంగా వెళ్ళిపోతూన్న పోలీసులతో సహా అందరూ ఈ హఠాత్ చర్యకి నిర్విణ్ణులయ్యారు.

 

    నీళ్ళలో పూర్తిగా మునిగి ఉన్న అతడు కూడా తన చుట్టూ వున్న ప్రమాదాన్ని ఖాతరు చెయ్యకుండా తలెత్తి చూశాడు. బోటు పడవకి తగలగానే పేలిపోవటం కంటపడింది. అందులోంచి రాబోట్ శరీరం దాదాపు ఇరవై అడుగుల పైకిలేచింది. దూదిపింజల్లా ఏ అవయవానికా అవయవం గాలిలో విడిపోయింది.

 

    'రాబోట్' అని అతడు దిక్కులు పిక్కటిల్లేలా అరవబోయాడు.

 

    అంతలో శరీరం నుంచి ఖండంగా విడివడిన చెయ్యి వచ్చి అతడి పక్కన నీళ్ళలో పడింది.

 

    చుట్టూ ఏం జరుగుతూందో ఆ విషయాలన్నిటినీ గ్రహించగలిగే స్థితికి అతడి మనసింకా చేరుకోలేదు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra