Home » Kommuri venugopala rao » జాలిలేని జాబిలి

    టెలిఫోన్ డైరక్టరీ తీసి ఆమెకి రాసే ఎడ్రస్ లో కేరాఫ్  అని వుండేపేరు వెదికాడు. ఆ పేరు ఎవరిదో  అతనికి తెలియదు. అతని అదృష్టవశాత్తు వాళ్ల యింట్లో ఫోను వుంది. ఆ నంబర్ కి ఫోన్  చేశాడు.

    అతని గుండె గబగబ కొట్టుకుంటోంది.

    ఎవరో అవతలివైపు రిసీవర్ అందుకున్నాడు. "హలో" అంది ఎవరో చిన్న పిల్లవాడి కంఠం.

    "పద్మ..... పద్మజగారున్నారా?" అన్నాడు వణికే కంఠంతో.

    "మా అత్తయ్యాండీ?"

    మధుబాబుకు నవ్వు  వచ్చింది. "అవును  మీ అత్తయ్యే" అని అన్నాడు.

    "ఉండండి పిలుస్తాను. లైనుమీద వుండండి."

    అతను శ్రద్ధగా ఆలకిస్తున్నాడు.

    ఒకటి....రెండు.... మూడు క్షణాలు....

    "హలో!"

    అతను ఉలిక్కిపడ్డాడు! ఎంత సన్నగా వుంది ఆ కంఠం! ఏదో  లోకాతీతమైన బాధలు పడుతూ, బయటకి సామాన్యంగా కనిపించే వ్యక్తి మాట్లాడినట్లుగా వుంది.

    "మాట్లాడేది మీరేనా?" అంటున్నాడు మధుబాబు.

    "మీరెవరండీ?"

    ఒకక్షణం నిశ్శబ్దం. "మైగాడ్" అంది అవతలి కంఠం.

    "నేను వచ్చావు  మధూ? ఇప్పుడెందుకు వచ్చావు?" అనుకుంటోంది దిగులుగా పద్మజ అక్కడ.

    "పద్మా! పద్మా."

    "వింటున్నాను."

    "నన్నేం చెయ్యమంటారో చెప్పండి ఇప్పుడు."

    "మీరే చెప్పండి."

    "నేను హొటల్ లో దిగాను. ఎడ్రెస్ యిస్తాను, యిక్కడికి...."

    "రేపు సాయంత్రం మా ఇంటికి రండి"

    "పద్మా!"

    "అవును. ఇక్కడికి వచ్చేయండి. తప్పకుండా రండి. ఎదురుచూస్తూ వుంటాను. సెలవా మరి?"

    ఆమె ఫోన్ క్రిందపెట్టేసింది. అతను హతాశుడైనాడు.

    తాను రావటం ఇష్టంలేదా ఆమెకు? ఆ విషయం స్పష్టంగా చెప్పచ్చుగా. "వచ్చెయ్యి....వచ్చెయ్యి" ఇలా రాసిన పద్మజ మాటలేనా అవి. ఉత్తరాల్లో జీవించి, వాస్తవంలో మరణించే మైనపుబొమ్మా పద్మ! అసలు యీ  ఆడవాళ్ళంతా అంతేనేమో! అతనికి కోపం వచ్చింది. ఆమెని కలుసుకోకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోదామనుకున్నాడు. కాని ఎలా? ఆ అసంతృప్తి మరీ  భరించలేనిదిగా వుంటుంది. తను ఎందుకూ పనికిరాని అసమర్థుడిగా తయారవుతాడు. కాని ఆమె ఇంటికి వెళ్ళటం ఎలా? అక్కడ ఎవరెవరుంటారో ఏం పాడో! ఏం మాట్లాడతాడు అంతమందిలో? అసలంత బుద్దిలేకుండా అక్కడికెలా రమ్మంది? నిజంగా ఒట్టి మొద్దే. పైగా  తనని  అడవి  మనిషంటుంది. ఆమే అన్నీ. పైగా రేపటిదాకా  ఇక్కడ ఒక్కడే  ఎలా వుంటాడనుకుంది?

    ఆ సాయంత్రం సినిమాకు వెళ్ళాడు. చూడబుద్దికావటంలేదు. ఎలాగో ఆ రెండున్నర  గంటలు గడిపి, బయటకు వచ్చేశాడు. రూమ్ కి వచ్చి  అన్నం తినకుండా పడుకున్నాడు.

    నిద్ర రావటల్లేదు. బయట బాగా చలిగా వుంది! తలుపులన్నీ మూసుకుని, రగ్గు కప్పుకుని ఆలోచిస్తున్నాడు. ఈపాటికి ఏంచేస్తూ వుంటుంది పద్మజ!


                                 *    *    *

    సరిగ్గా అప్పుడు  పద్మజ తన డైరీలో ఇలా రాసుకుంటోంది..... "ఊహలోని మధుబాబు చెరిగిపోతున్నాడు."

    ముఖాన స్వేదబిందువులు అలుముకున్నాయి. అలిసిపోయిన మనసుతో ముందున్న బల్లమీదకు వాలి కళ్ళు మూసుకుంది.

    "పద్మజగారున్నారా?" నడిగాడు మధుబాబు అక్కడున్న అబ్బాయిని.

    "మా అత్తయ్యండీ."

    "అవును. మీ అత్తయ్య."

    "ఉంది కూర్చోండి, చెప్పివస్తాను" అంటూ లోపలకు  పరుగెత్తాడు.

    అతనక్కడ కుర్చీలో కూర్చుని నలువైపులా చూడసాగాడు. గుండె గబగబ కొట్టుకుంటోంది. ఇంత పిరికివాడా తను? ఎలాంటి శిక్ష విధిస్తోంది ఆమె తనకు?

    ఓ పదహారు, పదిహేడు ఏళ్ళ వయస్సులో వున్న అమ్మాయి తెర తొలగించుకుని ఇవతలకు వచ్చింది. నల్లగా పొట్టిగా, కొంచెం లావుగా వుంది. అపరిచితుడ్ని చూసి ప్రశ్నార్థకంగా  ముఖంపెట్టి "ఎవరు కావాలండీ?" అనడిగింది.

    "పద్మజగారు" అన్నాడతను బిక్కమొహంతో.

    "పిల్చుకు వస్తానుండండి" అంటూ ఆమె మళ్ళీ లోపలకు వెళ్లిపోయింది.

    'హమ్మయ్య' అని కుదుటపడి, మళ్ళీ ఓసారి  కలయజూచి "పెద్ద ఇల్లు చాలా" అనుకుంటున్నాడు.

    అడుగుల చప్పుడైంది. అతను తల ఎత్తి  చూశాడు. లోపల్నుంచి సన్నగా, పొడుగ్గా, ఎర్రగా, చాలా అందంగావున్న ఓ అమ్మాయి గదిలోకి వచ్చి మధుబాబుని చూసి, కొంచెం చాకితురాలై "ఎవరి కోసమండీ"  అంది తియ్యని కంఠంతో.

    అతనామె ముఖంలోకి పరీక్షగా చూస్తూ "పద్మజగారికోసం...." అన్నాడు.

    "ఓహొ! పిల్చుకు వస్తానుండండి" అంటూ ఆమె లోపలకు వెళ్ళిపోయింది. తిరిగి హంసనడకతో.

    మధుబాబు నిట్టూర్పు విడిచాడు.

    ఓ నిముషం గడిచాక మొదట లోపలకు వెళ్ళిన అబ్బాయి  ఇవతలకు  వచ్చి "గదిలోకి రమ్మంటుందండి అత్తయ్య" అన్నాడు.

    "ఎక్కడికి?"

    "తనగదిలోకి, రండి తీసుకువెడతాను."

    అతను లేచి నిల్చున్నాడు. కుర్రాడి వెనక నడవసాగాడు.

    లోపలికి వెళ్ళాక, ప్రక్కగా ఓ తెరకట్టివున్న గది చూపించి "ఇదే. లోపలకు వెళ్ళండి" అన్నాడు.

    అతని కాళ్లు తడబడినాయి. ఒక్కక్షణం కదలకుండా నిలబడిపోయాడు. ఆ క్షణంలో అతననుభవించిన యమయాతన  రాయటానికి నా కలం జంకుతోంది. అర్థంచేసుకొనే సానుభూతిపరులెవరైనా వుంటే ఓ నిట్టూర్పు విడవచ్చు.

    తెగించి లోపలకు అడుగుపెట్టాడు.

    "రండి" అంది పద్మజ

    అతడామెను చూశాడు. ఇద్దరిచూపులూ కలుసుకున్నాయి అనుకోకుండా. ఆమె అతన్ని నఖశిఖపర్యంతం చూస్తోంది. "కథ ముగింపుకు వచ్చింది" అనుకోసాగాడు మధుబాబు.

    "కూర్చోండి" అంది తియ్యటి కంఠంతో.

    అతనామెకెదురుగా ఓ సోఫాలో కూర్చున్నాడు. ఇద్దరూ మౌనంగా, ఏమీ మాట్లాడలేని స్థితిలో ఒకరివంక  ఒకరు నిముషాల తరబడి అవలోకించుకొంటున్నారు.

    "యూ ఆర్ గ్రేట్" అనుకున్నాడు మధుబాబు. అది ఆమెని చూశాక అతనికి కలిగిన మొట్టమొదటి తలపు. మామూలు అంతస్థుకి అందని  అపూర్వవ్యక్తిలా యీ  లోకానికి సంబంధించని మనిషిగా, అతీతముగా, చిత్రంగా, అందని తియ్యని ఆశగామ్ బాధల్ని అణచిపెట్టుకుంటూ బలవంతంగా జీవించే ప్రాణిలా, వరమివ్వని దేవతలా, తెల్లగా, జపాన్ బొమ్మలా సంతోషంతో అందంగా, సన్నజాజి గుచ్ఛంలా, అతిసుకుమారంగా, చురుగ్గా, తెలివిగా, అద్భుతంగా వుంది పద్మజ. ఇరవై ఇరవైఒకటియేళ్లకన్నా ఎక్కువుండవు. కొంచెం పొడవుగా, పోడుక్కి కొంచెం తగిన లావుగా వుంది. ముఖ్యంగా ఆ కళ్ళు....అబ్బ!...." ఒక కోటిలోనే గాదు, నీలాంటి స్త్రీ  ఈ భూమ్మీద లేదు" అనుకున్నాడు మధుబాబు ఆశ్చర్యంగా.

    నిజంగా పద్మజ అలా వుందో లేదో నేను స్పష్టంగా చెప్పలేనుకాని మధుబాబు కళ్ళకు అలా కనిపించిందనటంలోనూ, అతని హృదయపు లోతుల్నుంచి ఈ ఊహలన్నీ పొంగినాయనటంలోనూ రవంతకూడా అతిశయోక్తి లేదు!

    "ఏం మాట్లాడేది?" అన్నాడు మధుబాబు అసహజ కంఠంతో, జాలిగా . అది సంభాషణకు నాందీ ప్రస్తవన. చాలా నీరసంగా వుంది అతనికి.

    'ఎందుకు వచ్చేశారు?" అనడిగింది పద్మజ నిట్టూర్చి.

    "రాకుండా వుండలేకపోయాను. రాకుండా వుండలేకపోయాను" అన్నాడు, గొణుగుతున్నట్లు మధుబాబు.

    పద్మజ తన రెండుచేతులతో ముఖాన్ని దాచుకుంది.

    "అంతా పాడు చేసేశారు. అంతా పాడుచేసేశారు" అంది వ్యతీతంగా.

    అతను మాట్లాడకుండా చూస్తున్నాడు.

    ఆమెముఖాన చేతులు తొలగించి "యెందుకు వచ్చేశారు ఇంత హఠాట్టుగా? నన్ను ఓసారి చూసి చేతులు దులిపేసుకొని పోదామనా?"

    "నేను రావటం మీకు ఇష్టంలేదా?"

    "ఇష్టం....ఇష్టం... అబ్బ! నా భావాలు.... ఆ ఊహలు యెలా అర్థమవుతాయి మీకు? ఏం చెప్పేది మీకు?"

    "పద్మా!" అన్నాడు మధుబాబు గాద్గదికంగా!

    "ప్రపంచమంటే అసహ్యం కలిగితే ఇక్కడికి వచ్చెయ్యండి అని ఒకసారి మీరు వరం ఇచ్చారు. రావటానికి నేనూ భయపడ్డాను. మీ ఊహాస్వప్నం నాకు తెలుసు. నేను మీకు సమవుజ్జిని కాననీ తెలుసు. ఎక్కడకూ  పోలేక  ఏమీ చెయ్యలేక , చితికి ఛిద్రమైన హృదయంతో, అంతిమ ఆశతో, మీ దగ్గర  కొచ్చాను. నేను మీముందు చాలా  అల్పుడినని నా అంతరాత్మ ఘోషిస్తోంది. మీరు చాలా గ్రేట్. కాని అనవసరంగా నన్ను మీరు ఇమాజిన్ చేసుకొన్నారు. మీరు అనుకొన్నట్లు వుండటం నాకెలా సాధ్యం? దానికి నేనేం చెయ్యగలను? నన్నెవరైనా ప్రేమిస్తే, అభిమానిస్తే నన్ను నన్నుగానే చూసి, నా సర్వస్వం..... లోపాలూ, గుణాలూ అన్నీ తెలుసుకుని అభిమానించాలి నన్ను ఎవరిగానో, యెలాగో చిత్రించుకుని ఆరాధించటం నాకిష్టంలేదు. అది నేను భరించలేను. ఆ ఆరాధన నాకొద్దు. నాకెంత చిత్రహింసో మీకు తెలియదు. మనస్థితి ఇంతవరకూ వచ్చాక మిమ్మల్ని మరచిపోవటం దుస్సాధ్యంకావచ్చు. కాని  ఈ దాగిలిమూతలకు స్వస్తి చెబుదామనీ, యీ సంఘర్షణని బ్రేక్ చేసేద్దామనీ ఇక్కడకు వచ్చేశాను పద్మా! నీ ఊహాస్వప్నం చెదిరిపోతే క్షమించు. చాలాసార్లు చెప్పాను అలా చెయ్యొద్దని, కాని ఫలితం ఇద్దరం అనుభవిద్దాం. వస్తా పద్మా"

    అతను లేచి నిలబడినాడు. ముఖం ఎరుపెక్కింది.పెదవులు వణుకుతున్నాయి. చూపులు చలిస్తున్నాయి విషణ్నంగా, విషాదంగా.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra