Home » Manjari » నన్ను ప్రేమించవు

    అతని తలమీద ముందు ప్రక్క జుట్టు చాలా వరకూ ఊడిపోయింది. అనాసకాయకి తోక ఉన్నట్టు వెనుక ప్రక్క మాత్రం కొద్దిపాటి జుట్టుంది. ఆ జుట్టు పిలక మాదిరిగా కనిపిస్తోంది. శివరావు చిన్నగా నవ్వుకున్నాడు.
    అతనికి తెలియదు.
    తను ఎంతో జాగ్రత్తగా చేస్తున్న పనిని తిరుగులేని సాక్ష్యంతో ప్రపంచానికి తెలియబోతున్నదని, పిలకలాంటి జుట్టు గల ఆ వ్యక్తే దానికి కారణమని, అంతేకాదు ఆ పని మీదే అతను ఫోన్ చేస్తున్నాడని కూడా తెలియదు.
                             *    *    *    *
    కాలనీలో నివసించే ప్రజలకు శీతయ్య ఓ ముఖ్యమైన వ్యక్తిగా మారాడు. కూరగాయలు తాజాగాను, శుభ్రంగాను ఉండటంవల్ల అందరూ అతని దగ్గరే కొనసాగేరు. ప్రత్యేకంగా కాలనీ నుండి మార్కెట్ కి స్కూటర్ మీద పోయి కూరగాయలు తెచ్చే బెడద మగవాళ్ళకి తప్పిపోయింది.
    రెండు నెలలు గడిచాయి.
    కాలనీ ప్రజలు ప్రతి ఆదివారం మధ్యాహ్నం సమావేశమవుతారు. ఓ సమావేశంలో శీతయ్య దుకాణం పెట్టుకోవడానికి స్థలం చోపించాలని నిర్ణయించారు. పదిరోజుల తరువాత దుకాణం తెరిచాడు శీతయ్య.
    రైతులు శీతయ్య దుకాణానికి తెచ్చి కూరగాయలు ఇవ్వసాగేరు. తెల్లారేసరికి తాజా కూరగాయలు, పచ్చటి ఆకు కూరలతోను సీతయ్య దుకాణం దర్శన మిచ్చేది. కూరగాయల ధరల విషయంలో శీతయ్య ఎప్పుడూ కక్కుర్తి పడలేదు. అందుచేత ప్రక్క కాలనీల నుండి కూడా జనం వచ్చి కూరగాయలు కొనేవారు. తక్కువ లాభంతో ఎక్కువ వ్యాపారం చెయ్యడం వల్ల శీతయ్య వ్యాపారం క్రమంగా పెరిగింది. అంతే కాదు, వ్యాపారిగా మంచి పేరు కూడా వచ్చింది.
    ఒక ఆదివారం నాడు యూనివర్శిటీ లేడీస్ హాస్టల్ ప్రిన్సిపాల్ ఆ కాలనీలోని అన్నగారి ఇంటికి కుటుంబంతో సహా వచ్చింది. చాలాకాలం తరువాత ఇంటి కొచ్చిన చెల్లెల్ని ఆప్యాయంగా పలకరించారు అన్నగారు. ఉద్యోగంవల్ల వచ్చిన గెజిటెడ్ హోదా నరనరాన్ని జీర్ణించుకుని, కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు కూడా తనో ప్రత్యేకమైన వ్యక్తిలా ప్రవర్తిస్తుంది. అన్నగారు సాధారణ ఉద్యోగి అవడంచేత ఆమె ప్రవర్తన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
    ఆ ప్రిన్సిపాల్ దృష్టి శీతయ్య కూరగాయల దుకాణంపై పడింది. కూరగాయలన్నీ తాజాగా కనిపించాయి. అతను ప్రతి దినం వాటిని అలాగే అమ్ముతాడని తెలుసుకుని ఆశ్చర్యపడింది. వెంటనే మొత్తం కూరగాయల ధరలు కాగితంపై రాయించి తీసుకుంది. రెండు రోజుల క్రితం హాస్టల్ మెస్ కి సరఫరా చెయ్యబడ్డ కూరగాయలు చూసిందావిడ. అవి నాసిగా కనిపించటంతో వార్డెన్ ని పిలిచి అడిగింది. మార్కెట్ కి కూరగాయలు రావటం లేదని, కాంట్రాక్టర్ ఎంతో కష్టంపైన వాటిని సరఫరా చేస్తున్నాడని చెప్పింది. మార్కెట్ లో కూరగాయలు దొరకని పరిస్థితి ఉంటె శీతయ్య దుకాణంలోని అప్పుడే మొక్కలనుండి కోసినట్టు కనిపిస్తున్న కూరగాయలు ఎలా వచ్చాయో అర్ధం కాలేదు.
    మరునాడు ఉదయం హాస్టల్ కి వెళ్ళింది ప్రిన్సిపాల్. అంతకుముందు హాస్టల్ మెస్ కాంట్రాక్టర్ సబ్మిట్ చేసిన బిల్లు తీసింది. శీతయ్య దుకాణం నుంచి తెచ్చిన ధరలతో పోల్చి చూసింది. రెండింటి మధ్య కనిపిస్తున్న వ్యత్యాసం చూసి ఆశ్చర్య పడిందామె. బిల్లులో కొన్నింటి ధర రెట్టింపు ఉంది.
    ఆమె తిన్నగా మెస్ లోకి నడిచింది. తెచ్చిన కూరగాయల మూటల లోపల పెట్టిస్తున్న కాంట్రాక్టర్ ప్రిన్సిపాల్ కి నమస్కారం చేశాడు. ఆమె అతని నమస్కారాన్ని పట్టించుకోనట్టు మూటలు ఊడదీయించి మొత్తం కూరగాయలు నేల మీద పోయించింది.
    ఒక చీటీ రాసి అటెండర్ తో పంపింది ప్రిన్సిపాల్. కుర్చీలాక్కుని అక్కడే కూర్చుంది. అటెండర్ గంటలో కొన్ని మూటలు తీసుకుని వచ్చాడు. ఏదో జరగబోతున్నదని పసికట్టి విద్యార్ధినులు మొత్తం అక్కడ చేరారు. అటెండర్ తెచ్చిన మూటల్లోని కూరగాయలు మరో ప్రక్క పోయించింది ప్రిన్సిపాల్.
    కాంట్రాక్టర్ మొహం తెల్లగా పాలిపోయింది.
    ఏం జరిగిందో అతను గ్రహించి మౌనంగా హాస్టల్ బయటకు నడిచాడు. ఇప్పుడు తనని దేవుడు కూడా రక్షించలేడని అతనికి అర్ధమయింది. నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్న ఆ కాంట్రాక్ట్ వదులు కోవడం అతనికి బాధగా ఉంది. తను వార్డెన్ కి ప్రతినెల కొంత సొమ్ము చెల్లిస్తున్నాడు. అందులో ప్రిన్సిపాల్ కి ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఉంది. సంవత్సరం క్రితం వచ్చిన ప్రిన్సిపాల్ సోము అందుతున్నదో లేదో తెలుసుకోకపోవడం తన తప్పు. దానికి మూల్యం చెల్లించాడు..
    అదే రోజు హాస్టల్ కి కూరగాయలు సరఫరా చేసే కాంట్రాక్టు శీతయ్యకి ఇవ్వబడింది. ఆ నిర్ణయం తీసుకోవడంవల్ల విధ్యార్ధినుల్లో ప్రిన్సిపాల్ గౌరవం పెరిగింది. వృత్తి పరమైన బాధ్యతల పట్ల ఆమె ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండదు. తనకి గర్వమని, అహంకారమని చెప్పుకుంటారని ఆమెకు తెలుసు. బాధ్యతల పట్ల కఠినంగా వ్యవహరించే తన పద్ధతి వల్ల ఆ పేరు వచ్చిందని కూడా ఆమెకు తెలుసు.
    తనకి ఆ కాంట్రాక్టు రావటం అదృష్టమని భావించాడు శీతయ్య. ప్రస్తుతం సహాయం కోసం ఒక మనిషిని పెట్టుకున్నాడు. ప్రతి దినం అతని ద్వారా హాస్టల్ కి కూరగాయలు పంపుతున్నాడు. ఒకసారి వార్డెన్ అలవాటుగా శీతయ్య తన మామూలు గురించి అడిగింది.
    "మీరోసారి మార్కెట్ కి వెళ్ళి విచారించండి. నేను ఇస్తున్న ధరలకు కూరగాయలు అక్కడా కూడా దొరకవని అర్ధమవుతుంది. మీకు లంచం ఇచ్చి కూరగాయలు సప్లయి చెయ్యడం నా తరం కాదు. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారికి ఆ విషయం చెప్పేస్తాను." ఆమెతో నిర్మొహమాటంగా చెప్పాడు శీతయ్య.
    వార్డెన్ అదిరి పడింది.
    పాత కాంట్రాక్టర్ సరఫరా చేసిన కూరగాయలు ప్రతిరోజూ తనిఖీచేసి ప్రిన్సిపాల్ కి చెప్పలేదనే అభియోగంతో మొన్ననే మెమో అందుకుంది. ఇప్పుడు అతను వెళ్ళి లంచం అడిగిన విషయం చెబితే మొత్తం కథ బయటకు వస్తుంది. అదే జరిగితే ప్రిన్సిపాల్ తన అంతు చూస్తుంది.
    మరెప్పుడూ వార్డెన్ సీతయ్య జోలికి వెళ్ళలేదు.
    శీతయ్యకు వ్యాపారంలో నిత్యం రకరకాల మనుషులు తారసపడతారు. అందరితో లౌక్యంగా వ్యవహరించడం నేర్చుకున్నాడు. ఇప్పుడతను ఇంట్లోని మనుషుల గురించి అర్ధం చేసుకోగలుగుతున్నాడు. ఒకరోజు సాయంకాలం అక్కా చెల్లెళ్ళని తీసుకుని బజారు వెళ్ళాడు. ఇద్దరికీ చెరో చీర కొన్నాడు. అర్చన మొహం వెలగడం గమనించాడు.ఆడవాళ్ళు అల్ప సంతోషులని, వాళ్ళని మంచి చేసుకోవడం చాలా తేలికని గ్రహించాడు.
                                                                     *    *    *
    శివరావు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. ప్లాట్ ఫాం టిక్కెట్ తీసుకుని లోపలకు నడిచాడు. లోపల ప్రయాణీకులతో హడావిడిగా ఉంది. ఓ బెంచీ మీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు. అతని మెదడు ఆలోచనలతో నిండిపోయింది.
    జీవితంలో దాదాపు సగభాగం గడిచిపోయింది. తను ఇంకో పాతిక సంవత్సరాలు బ్రతకొచ్చు. తన వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదు. తను తలపెట్టిన పని నిర్విఘ్నంగా పూర్తవుతుందని నమ్మకం ఉంది. ఇప్పుడు మనసులో అంతగా ఆందోళన లేదు. గతంలో ఓ ప్రశ్న మనసులో ఉదయించేది. తనెందుకు పుట్టాడు? అని. ఆ ప్రశ్నకి జవాబు తట్టేది కాదు. మనిషి జీవితం ప్రవాహం లాంటిది. అది పల్లం వైపు సాగినట్టు, మనిషి జీవితం వృద్దాప్యం వైపు కదులుతుంది. జీవిత గమనంలో తలొంచుకుని వెళుతున్న మనిషి హఠాత్తుగా ఓ రోజు తలెత్తి గమనిస్తాడు, తను చాలా దూరం ప్రయాణం చేశానని. ఆ తరువాత కాలం అతన్ని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుపోతుంది.
    ఒకప్పుడు జీవితాన్ని అందమైన వర్ణ చిత్రం అనుకున్నాడు. తీరాచూస్తే అది అందంగానూ లేదు, వర్ణచిత్రమూ కాదు. ఎప్పుడూ ప్రశాంతంగా బ్రతకాలని కోరుకునేవాడు. అదే తనకి దక్కకుండా పోయింది. ఆర్ధిక పరమైన చిక్కులతో జీవితం చితికిపోయింది. ఇప్పుడు దానినుండి బయట పడటానికి ప్రయత్నిస్తున్నాడు.
    సిగరెట్ చివరికంటా కాలి వ్రేళ్ళని చురుక్కుమనిపించింది. ఆలోచనల నుండి తేరుకుని సిగరెట్ పడేసి లేచి స్టాల్ దగ్గరకు వెళ్ళి కాఫీ త్రాగాడు. మరో సిగరెట్ వెలిగించుకుని తను కూర్చున్న చోటుకి వచ్చాడు. అక్కడ ఎవరో కూర్చున్నారు. శివరావు ప్లాట్ ఫాం చివరకు వెళ్ళాడు. అక్కడా నిలబడి సిగరెట్ కాల్చసాగేడు.
    సరిగ్గా ఒంటి గంటకు మద్రాసు మెయిల్ వచ్చింది. శివరావు ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ దగ్గర నిలబడి దిగుతున్న వాళ్ళని గమనించాడు. అతనికి కావాల్సిన వ్యక్తి కనిపించలేదు. మరోసారి పరీక్షగా చూసి బయటకొచ్చాడు. రోడ్డుమీద వాహనాలు లోపలకు వచ్చే మార్గంలో అటువైపు నిలబడి కనిపించాడో వ్యక్తి. అతను నల్ల సూట్ లో ఉన్నాడు. చేతిలో బ్రీఫ్ కేస్ వుంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra