అప్పుడు వినిపించింది- గుండెలవిసిపోయేలా కేక. ఆ కంఠం వసుమతిది.

 

                                                                  *    *    *

 

    ఆస్పత్రి గేటు నుంచి రివర్స్ లో వెనక్కి వస్తున్న కారుని చూసి- వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తున్నారో అర్థంగాక చూస్తూ నిలబడిన వసుమతికి, లోపల గదిలో ఏదో పడి భళ్ళున పగిలిన శబ్దం వినిపించింది. లోపలికి వెళ్ళింది. ఆమె ఇంకా పూర్తిగా లోపలికి వెళ్ళకుండానే 'ఏక్- క్ క్ క్' మన్న స్వరం- గొంతులో ఏదో అడ్డుపడితే ఊపిరి లోపలికి లాక్కోవటానికి కష్టపడ్డట్టూ- పామునోట పడ్డ కప్ప ఆఖరి క్షణంలో హృదయ విదారకంగా అరిచినట్టూ వినిపించింది.

 

    వసుమతి లోపలికి పరుగెత్తబోయి గుమ్మం దగ్గిరే ఆగిపోయింది.

 

    ప్రార్థన పక్కమీద లేదు.

 

    ఒక్క క్షణంపాటు వసుమతికి చూస్తున్న దృశ్యం అర్థం కాలేదు. అర్థం అయ్యేసరికి ఆమె గుండె ఆగినంత పనయింది.

 

    చేతికి గుచ్చిన సూది గాలిలో వేలాడుతుంది. దాని చివర రక్తం చుక్క అలాగే వుంది. పగిలిన ఐ.వి. ఫ్లూయిడ్ సీసా పెంకులు మంచానికి అటువైపు చిందర వందరగా పడివున్నాయి. ప్రార్థన ఒక చెయ్యి ఆ గాజు పెంకుల మీద పడి అక్కణ్నించి రక్తం స్రవిస్తూంది. అయినా ఆ బాధ తెలిసినట్టు లేదు. శరీరం అంతా నేలమీదకు పడిపోయినా, సీసా స్టాండుకి కట్టి వుండటం వల్ల ఒక సమాధిలోంచి పొడుచుకు వచ్చినట్టు పక్క వెనుకనుంచి పైకి కనబడుతూంది. ఒక కాలు కూడా పూర్తిగా క్రిందకి జారక, గాలిలో వేలాడుతూంది.

 

    "పన్నూ" అంది వసుమతి వణుకుతూన్న కంఠంతో. రెండోసారి మళ్ళీ 'పన్నూ' అని అరుస్తూ గాలిలో లోపలికి దూసుకువెళ్ళి, పక్కకీ గోడకి మధ్య జారిపోయిన ఆ పాప శరీరాన్ని రెండు చేతుల్తో హిస్టీరిక్ గా పైకి లాగింది.

 

    ప్రార్థన ఛాతి గాలిలో ఎగిరెగిరి పడుతూంది. వసుమతి ఆ తలని వళ్ళోకి తీసుకుని గెడ్డాన్ని పట్టుకుని వూపబోయి, మొహాన్ని చూసి చటుక్కున ఆగిపోయింది.

 

    ప్రార్థన కనుపాపలు లోపలివైపు వెనక్కి తిరిగిపోయి, తెల్లటి కనుగుడ్లు బయటికి కనపడుతున్నాయి.

 

    "హెల్ప్" అని అరిచింది వసుమతి. ఆమె గొంతు కీచుగా ధ్వనించింది. తరువాత వరుసగా 'హెల్ప్... హె...ల్...ప్....' అని కేకలు పెడుతూనే వుంది. ఆస్పత్రి గోడలు ప్రతిధ్వనించేలా, పిచ్చెక్కినట్టూ ఆమె పెడుతూన్న కేకలు విని- ఆ కంఠాన్ని ముందు గుర్తించింది భార్గవ. కారు దగ్గర్నుంచి జువ్వలా పరుగెత్తాడు.

 

    ఈ లోపులో పైన గదిలో హడావుడి మొదలయింది. ముందో నర్సు పరుగెత్తుకు వచ్చింది. తరువాత ఇద్దరు హౌస్ సర్జెన్లు వచ్చారు. బాగా కుర్రవాళ్ళలా వున్నారు. అందులో మరీ లేతగా వున్న కుర్రవాడు దాదాపు వసుమతి చేతుల్లోంచి పేషెంట్ ని లాక్కొని పక్కమీద పడుకోబెట్టాడు. రెండో హౌస్ సర్జెన్ పాప కండిషన్ చూసి బెదిరిపోయినట్టూ అతడి మొహం చూస్తేనే తెలుస్తుంది. నర్సు మాత్రం అనుభవజ్ఞురాలిలా వుంది. చప్పున బి.పి. పరికరాల్ని దగ్గరకు లాగి చేతికి కట్టసాగింది. ఈ లోపున మొదటి హౌస్ శ్ర్జెన్ స్టెత్ తో పాప ఛాతి పరీక్షించి 'మైగాడ్' అన్నాడు. హార్ట్ బీట్ చాలా ఫాస్టుగా వుంది. ఇండివిడ్యువల్ సౌండ్స్ వినపడటం లేదు.

 

    'డాక్టర్ ని పిలవండి అర్జెంటుగా' అంది నర్సు తనే వాళ్ళమీద అధికారిలా. రెండో హౌస్ సర్జెన్ బయటికి పరుగెత్తాడు. ఈ లోపులో మొదటి అతడు పాపనే పరీక్షగా చూస్తూ "సైనోటిక్ గా కనబడటం లేదూ" అన్నాడు. ఈ లోపులో ఇంకో నర్స్ పరుగెత్తుకు వచ్చింది. 'మౌత్ టు మౌత్ ఇవ్వనా' అని అడిగాడు.

 

    వసుమతి గోడకి బల్లిలా అతుక్కుపోయి ఇదంతా చూస్తుంది.వీళ్ళందరూ పాపచుట్టూ చేరి చేస్తున్నది ఏమిటో- మాట్లాడుతున్న ఇంగ్లీషు పదాలు ఏమిటో ఆమెకు అర్థంకాలేదు. సముద్రంలో పడి సీరియస్ అయినా, వళ్ళు కాలి సీరియస్ అయినా ఒకటే చికిత్సలా వుంది. ఆమెకు ఒకటి మాత్రం అర్థమైంది. పాప కండిషన్ అకస్మాత్తుగా సీరియస్ అయింది. ప్రస్తుతం చాలా ప్రమాదకరంగా వుంది. చుట్టూ నిలబడిన మనుష్యుల మధ్యనుంచి, వడిలిపోయిన తోటకూర కాడలా కనబడుతూంది.

 

    ఇంతలో వైట్ కోట్ లో ఒక నలభయ్ ఏళ్ళ డాక్టర్ వచ్చింది- రాగానే "ఎనీ కార్డియాక్ హిస్టరీ?" అని అడిగింది.

 

    "లేదు డాక్టర్"

 

    "బి.పి."

 

    నర్సు చెప్పింది.

 

    "వెంటనే కార్డియోవర్డు చెయ్యాలి" అంటూ డాక్టర్ నర్సుకు ఇంగ్లీషులో తొందర తొందరగా సూచన్లు ఇచ్చింది. నర్సు బయటకు పరుగెత్తింది. ఈ లోపులో డాక్టర్ పాప గొంతు క్రింద అరచేత్తో పిడికిలి బిగించి 'ధబ్' మని గట్టిగా గుద్దింది. ఆ చప్పుడుకి వసుమతి కంపించి పోయింది. హౌస్ సర్జెన్ ఇంజెక్షన్ ప్రిపేరుచేసి, చేతికి గుచ్చాడు. ముందుగా వెళ్ళిన నర్సు చక్రాల స్టాండు తోయించుకుని వచ్చింది. ఇంకో యిద్దరు తెల్లని కోటుల్లో వచ్చారు.

 

    ముందు వచ్చిన డాక్టరు రెండు ఎలక్ట్రిక్ వైర్లు జాయింటు చేయబడి వున్న పాడ్ లను ప్రార్థన వీపు వెనుక ఒకటి, ఛాతీ మీద ఒకటి అమర్చి "కొద్దిగా వెనగ్గా వుండండి" అంటూ స్విచ్ వేసింది. యాభయ్ వాట్స్ షాక్ మూడు సెకండ్లపాటు తగిలి పాప చేపపిల్లలా ఎగిరిపడి ఒక్కసారిగా శరీరం కుదించుకుపోయి, ఆ తరువాత చేతులు గాలిలో విసిరేస్తూ కీచుమని కేకపెట్టింది.

 

    భార్గవ వరండాలో ఒకవైపు నుంచి పరుగెత్తుకుంటూ వెళ్ళేసరికి, మరోవైపు నుంచి డాక్టర్ మహేంద్ర కూడా దాదాపు అదే వేగంతో పరుగెత్తుకుంటూ గదిలో ప్రవేశించాడు.

 

    వాళ్ళిద్దరూ చెరోవైపు నుంచీ ప్రవేశించే సమయానికి ప్రార్థన కాస్త రికవర్ అయింది. డాక్టర్ మహేంద్ర చకచకా మిగతావారికి సూచనలు ఇచ్చి ప్రార్థన చేతిని తీసుకుని పల్స్ చూసి, సంతృప్తిగా తలూపాడు. అతడు భార్గవని గమనించలేదు. వసుమతితో, "ఏమీ ఫర్లేదు. సడెన్ గా హార్ట్ బీట్ ఎక్కువయిందంతే" న్నాడు. "రండి బయట మాట్లాడుకుందాం..." అన్నాడు ఆమెని గదిలో వుంచటం యిష్టం లేనట్టుగా.

 

    వసుమతి కూతురి మొహంవైపు చూసి, పూర్వక కళ గమనించి బయటకు నడిచింది. ఒక తోటీ గాజు పెంకులు తుడిచేసి వెళ్ళిపోయాడు మరో నర్సు ఇంకో బాటిల్ కోసం వెళ్ళింది.

 

    ప్రార్థనతోపాటు గదిలో ఒక్క పాప మాత్రం మిగిలిపోయింది.

 

    అది జిన్నీ!

 

    ఆమె చేతిలో ఒక బొమ్మ వుంది.

 

    తండ్రిని కారు ఆపమని, తీసుకొచ్చిన బొమ్మ అది. చాలా రోజుల క్రితం ఆ బొమ్మ తనకిమ్మని ప్రార్థన అడిగినప్పుడు- ప్రాణంపోయినా ఇవ్వనని పంతం పట్టిన పాప-

 

    పడుకుని వున్న అక్కని డిస్టర్బ్ చేయకుండా, తలదిండు క్రింద తను తెచ్చిన బొమ్మని జాగ్రత్తగా పెట్టేసి, అక్కణ్నించి బయట కొచ్చేసింది.

 

    "వెంట్రెక్యులర్ ట్రాకికార్డియా" అన్నాడు మహేంద్ర. "మిసెస్ భార్గవా... ప్రార్థన పరిస్థితి ఏమీ బాగోలేదు. మందులకు అసలు రెస్పాన్స్ అవ్వటం లేదు". 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra