Home » Yandamuri veerendranath » చీకట్లో సూర్యుడు


    "అనూహ్యా" అతడి పిలుపు స్పీకర్ లో వినిపించగానే తృళ్ళిపడింది. "కంప్యూటర్ కనెక్షన్ ఇవ్వు-"

    ఆమె ఇచ్చింది. "బ్రహ్మవిద్యా నువ్వు చెప్పిన పానెల్ - 4 యిదేనా?" అడిగాడు వాయుపుత్ర.

    "కాదు. రెండడుగుల కింద వుంటుంది."

    వాయుపుత్ర మరికాస్త క్రిందకు జారాడు! ఈసారి నల్లటి అక్షరాల్తో పానెల్ జాయింట్-4 అని ముద్రించిన బాక్స్ కనిపించింది. వాయుపుత్ర సోలార్ టాంక్ మీద నిలబడి నడుముకు కట్టిన బెల్ట్ నించి ఇనుస్ట్రుమెంట్ తీశాడు. బాక్స్ కవర్  విప్పడానికి అరనిముషం పట్టింది.  వాయుపుత్ర మనసులో ఏదో శంక..... తను బాగుచేయాల్సినది యిది కాదేమోనని అనుమానం. అతడు  మరికాస్త క్రిందకు జారాడు. పవర్ బాక్స్- 2 వెనుక వాహనం  కాస్త  దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది.

    "వాయూ త్వరగా రావాలి. కంప్యూటర్ డేంజర్ సిగ్నల్ చూపిస్తోంది."

    వాయుపుత్ర పైకి పాకడం ప్రారంభించాడు. అతడు లోపలికి వచ్చి తలుపు మూసుకోగానే నిశ్చింతగా ఊపిరి వదిలింది అనూహ్య.

    వాయుపుత్ర కంట్రోలు రూంలోకి అడుగుపెట్టాడు. వాహనం స్పీడ్ పెరగలేదు. మరింత తగ్గింది.

    "బ్రహ్మవిద్యా, ఏమిటిది వాహనం వేగం ఇంకా తగ్గుతోంది?"

    "అవును."

    "ఫాల్ట్ ఎక్కడుంది?"

    "చెప్పానుగా. అదే"

    "కొత్తది మార్చానుగా"

    "అయినా ఫాల్ట్ అక్కడేనని తెలుస్తోంది."

    "నీతో లాభం లేదు. మెషీన్ ననిపించుకుంటున్నావు" విసుక్కున్నాడు వాయుపుత్ర. బ్రహ్మవిద్య మౌనం వహించింది.

    యశ్వంత్ నీరసంగా లేచి కూర్చున్నాడు. వాయుపుత్ర విప్పుకొచ్చిన జాయింట్ పరీక్షించాడు. అతడికి ఓపిక లేదు. తల మీద గాయం ఇంకా మానలేదు. "ఇందులో తప్పు  ఏం లేదే?" అన్నాడు నిఖిల్. అతడింకా లేచేస్థితిలో లేడు.

    "అవును కంప్యూటర్ మళ్ళీ అదే ఫాల్ట్ చూపిస్తోంది."

    "మన దగ్గర మరో జాయింట్ బాక్స్ వుందా?"

    "లేదు ఒక్కటే, ఇప్పుడే అది మార్చాను."

    "తప్పు అక్కడే వుందని కంప్యూటర్ చెప్తూంటే, అది మార్చినా ఇంకా అలాగే వుంటే, ఫాల్ట్ సోలార్ పవర్ బాక్స్ లోనే వుందని ణా అనుమానం సౌరశక్తి నిలవఎంతుందో చూడు-"

    "పదివేల యూనిట్లు" వాయుపుత్ర వచ్చి చెప్పాడు. చెప్తూ వుండగానే రాబోయే ప్రమాదం అతడు గ్రహించాడు. సౌరశక్తి లీక్ అయిపోయింది.

    యశ్వంత్ ముఖం మ్లానమయింది. ఫాల్ట్ ఎక్కడుందో తెలిసింది. కాంతివేగాన్ని మించి వాహనం నడపాలంటే పది గిగోవాట్ల శక్తితో వాహనాన్ని ముందుకు తోస్తూండాలి. అప్పుడే నౌక వేగం పెరుగుతుంది. లేకపోతే నౌక వేగం క్రమ క్రమంగా తగ్గి, మామూలు వేగంతో కొన్నాళ్ళు నడిచి......ఆ తర్వాత బరువు పెరిగి కృత్రిమ వాతావరణాన్ని కోల్పోతుంది. అప్పుడు లోపల ప్రతిక్షణం కుళ్ళిన కోడిగుడ్లులా కొద్దికొద్దిగా ప్రాణాలు కోల్పోవలసిందే. అంగారక గ్రహం తాలూకు అమ్మోనియా మేఘాలు నౌకని తనలోకి లాగేసుకుంటాయి.

    "మొన్నటి యాక్సిడెంట్ లో సోలార్ పవర్ బాక్స్ దెబ్బతిని వుండాలి. అదే కారణం అనుకుంటాను" యశ్వంత్ వివరించాడు. ఎవరూ మాట్లాడలేదు.

    ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ "నేను వెళతాను. మరోసారి చెక్ చేస్తాను. చెప్పండి ఏం చేయాలి" అన్నాడు వాయుపుత్ర.

    "పవర్ బాక్సంటే చాలా ప్రమాదం వాయుపుత్రా. ఏ చిన్న పొరపాటు జరిగినా నువ్వు ఊహించలేనంత పెద్ద షాక్ కొడుతుంది."

    ఆ విషయం అతడికి తెలుసు. కానీ ఇది అతడి పని. కంప్యూటర్ కి సంబంధించిన ఇటువంటి రిపేర్ల కోసమే తను ఈ నౌకలో పంపబడ్డాడు. తిని, తాగి, రోమాన్స్ చెయ్యటం కోసం కాదు. "పర్వాలేదు. ప్రయత్నం చెయ్యకుండా ఓటమిని వొప్పుకోను. మీరు గైడ్ చెయ్యండి" అన్నాడు. యశ్వంత్ అతడివైపు చూశాడు- ఇద్దరి చూపులు కలుసుకున్నాయి.

    ఒకప్పుడు తనను మృత్యుద్వారం నించి కాపాడిన వ్యక్తిని అంత ప్రమాదంలోకి పంపటమా? తన  అసహాయతకి యశ్వంత్ కి దుఃఖం  వస్తోంది. వాయుపుత్ర అతడి సందేహాన్ని అర్థం చేసుకున్నాడు. "ఈ నౌకకి ప్రస్తుతం కమాండర్ ని నేను. మీరు గైడ్ చేయగలిగితే సంతోషిస్తాను. లేకపోయినా నేను వెళ్ళి చేయగలిగింది చేస్తాను" అతడి మాటల్లో స్థిరత్వం కనిపించింది.

    "ఈ నౌక కెప్టెన్ గా నేను నిన్ను పవర్ బాక్స్ దగ్గరికి పంపను-"

    "క్షమించాలి, మీకు గాయమైన తరువాత నాకు సంక్రమించిన అధికారాన్ని  తిరిగి మీకు నేనింకా అప్పగించలేదు" కటువుగా అన్నాడు వాయుపుత్ర. ఇద్దరిమధ్యా వాత్సల్యపూరితమైన ఘర్షణ జరుగుతోంది కానీ సమస్యకి అది పరిష్కారం కాదని ఇద్దరికీ తెలుసు. యశ్వంత్ నిస్సహాయంగా తలూపాడు.

    వాయుపుత్ర మరోసారి బయటకు వెళ్ళటం అనూహ్య మనసుని కలవరపెడుతోంది. బ్రహ్మవిద్య అబద్ధం ఎందుకు చెప్పిందో కూడా  అర్థమయింది.

    వాయుపుత్ర శూన్యంలోకి అడుగు పెట్టాడు. నిమిషం  తర్వాత అతడి కంఠం వినిపించింది. "ఇక్కడే దెబ్బతింది యశ్వంత్, లోపల వైర్లు కనిపిస్తున్నాయి."

    "జాగ్రత్త. ఇన్సులేటెట్ గ్లౌవ్స్ వేసుకున్నానని వాటిని ముట్టుకోకు. పక్కన రెడ్ కలర్ బాక్స్ చిన్నది కనిపిస్తోంది. దానికి పుష్ బటన్ వుంటుంది. దాన్ని ఆన్ చెయ్యి."

    వాయుపుత్ర యశ్వంత్ చెప్పినట్లల్లా చేస్తున్నాడు. పది నిముషాల్లో పని పూర్తయింది. లోపల వ్యక్తుల మొహాల్లో సంతోషం కనిపించింది.

    "అంతా క్లోజయింది కదూ?" అడిగాడు యశ్వంత్.

    "పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడేం చెయ్యాలి?"

    "ఒక్కటే పని మిగిలింది. నువ్వు ఆన్ లో పెట్టిన బటన్ తిరిగి ఆఫ్ చెయ్యాలి."

    వాయుపుత్ర పుష్ బటన్ మీద వేలు పెట్టాడు. అది ఆఫ్ అయిన మరుక్షణం వాహనం ఒక్కసారిగా జర్క్ యిచ్చింది. అది ఊహించని వాయుపుత్ర చేతి కందిన పవర్ బాక్స్ ని పట్టుకున్నాడు. అంతే వెయ్యి వోల్టుల ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు వెనక్కి జారిపోయాడు స్పృహ తప్పుతుండగా అతడు చివరగా  చేసిన పని పవర్ బాక్స్ లాక్ వేసెయ్యడం. ఆ వూపుకి అతడు బలంగా (వ్యతిరేక దిశలో) వెనక్కి వెళ్ళాడు. ఈ వెయ్యవవంతు క్షణంలో వాహన నౌక ముందుకు వెళ్ళింది.

    "సోలార్ పవర్ సిస్టమ్ ఓ.కే" అని కంప్యూటర్ మీద మెరుస్తోంది. ఆ వార్తా వాళ్ళకి సంతోషం కలిగించడం లేదు. శూన్యంలో గిరికీలు కొడుతున్న వాయుపుత్ర శరీరం మీదే వుంది వాళ్ళ దృష్టి అంతా. స్పృహ లో వుంటే వాహనాన్ని అందుకోవడం అతడికి సమస్య కాదు. శూన్యంలో ఒకటి వేగం- రెండోది అచేతనావస్థ - మెలికలు పడుతున్న తాడు దానికితోడు.

    "వాయుపుత్రా గెటప్" స్పీకర్ లోంచిఅరుస్తున్నాడు. యశ్వంత్. సమాధానం లేదు. వాయుపుత్ర ఊపిరి తీసుకోవడం మాత్రం  స్పష్టంగా వినిపిస్తోంది.

    యశ్వంత్ నౌకని న్యూట్రల్ లోకి తిప్పాడు. నౌకని వెనక్కు తీసుకెళ్ళడం సులభమే గాని ఆ ధాటికి వాయుపుత్ర మరింత వెనక్కు జరిగితే కష్టం.

    "ఏం చెయ్యాలి"

    యశ్వంత్ తల బద్ధలవుతుందేమోననిపిస్తోంది. అనూహ్య పరిస్థితి అంతకంటే ఘోరంగా వుంది. వచ్చి యశ్వంత్ కాళ్ళ దగ్గర కూలబడింది.

    "నేను వెళతాను. చెప్పండి ఏం చెయ్యాలో" అంది.

    "వద్దు. నీ వల్ల అయ్యేపని కాదది. జీరో గ్రావిటీలో అలవాటు లేకుండా శూన్యంలో నడవడం, మరొక వ్యక్తిని లాక్కురావడం నీ వల్ల అయ్యేపని కాదు. డాక్టర్ ఫిలిప్స్ అంతకంటే బలహీనంగా వున్నాడు. ఏం చెయ్యాలో తోచడం లేదు" యశ్వంత్ స్వరం  గద్గదికమైంది.

    "అయినా సరే ప్రయత్నిస్తాను. ణా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు. పర్మిషన్ ఇవ్వండి" అంది ఏడుస్తూ అనూహ్య,

    "అనూ" మృదువుగా పిలిచాడతడు. అనూహ్య తలెత్తి చూసింది. అతడలా పిలిచి చాలా కాలమయింది.

    "ఒకప్పుడు యిలాంటి పనిస్థితిలోంచే నన్ను రెండుసార్లు కాపాడిన వ్యక్తి అలా అసహాయంగా శూన్యంలో కదలిపోతుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు? లే, వెళ్ళి నాకు స్పేస్ సూట్ తెచ్చి పెట్టు. కొంచెం సాయం చెయ్యి. నేనే వెళతాను."

    "కాసేపు నిలబడితే కళ్ళు తిరిగి పడిపోయేలా వున్నారు. మీరా వెళ్ళేది? వద్దు."

    "ఫర్వాలేదు. ఆ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు. నిఖిల్ నిలబడలేని స్థితిలో వున్నాడు. స్పేస్ సూట్ తీసుకురా. అలాగే డాక్టర్ ని ఒకసారి ఇలా పిలుపు." అనూహ్య లోపలికి వెళ్ళింది. యశ్వంత్ నీరసంగా కళ్ళు మూసుకున్నాడు. అతడికి తెలుస్తోంది తను వెళ్ళగలిగే స్థితిలో లేనని.

    "యశ్వంత్ డాక్టర్ ఫిలిప్స్ ఎక్కడా కనిపించడం లేదు." గాభరాగా వచ్చింది అనూహ్య.

    "సరిగ్గా చూడు."  

    "అంతా చూశాను. ఎక్కడా లేడు" ఆమె చెపుతూండగానే 'వే అవుట్' తెరుచుకున్న శబ్దం వచ్చింది. యశ్వంత్ చప్పున కెమెరా ఆన్ చేశాడు.

    ఎయిర్ లాక్ సిస్టమ్ రిలీజ్ చేసి స్పేస్ సూట్ తో బయటకు వెళుతున్న ఫిలిప్స్ కనిపించాడు.

    "వద్దు డాక్టర్, వెనక్కు రండి. మీ వల్ల అయ్యేపని కాదు" గాభరాగా పిలిచాడు యశ్వంత్.

    "ఫర్వాలేదు. ప్రాక్టికల్ అనుభవం లేకపోయినా ట్రైనింగ్ లో శూన్యంలో నడిచాను. ప్రయత్నం చేయనివ్వండి" ఫిలిప్స్ కంఠం బైట ద్వారంనుంచి వినిపించింది అనూహ్య వేగంగా బైటకు పరుగెత్తింది.

    కొద్దిరోజుల క్రితమే యశ్వంత్ కి తనరక్తం ఇచ్చాడు ఫిలిప్స్. పైగా ఆ ఇద్దరి అనారోగ్యంతో అతడికి విశ్రాంతి లేక చాలా బలహీనంగా వున్నాడు. శూన్యంలో కదిలే మనిషిని పట్టుకు నడిపించడానికి చాలా శక్తి కావాలి.

    "డాక్టర్, నా మాట వినండి. వెనక్కు వచ్చేయ్యండి" మళ్ళీ పిలిచాడు యశ్వంత్.

    మైక్ లో ఫిలిప్స్ కంఠం "సారీ యశ్వంత్" అని వినిపించింది.

    యశ్వంత్ లేచి, అతన్ని వారించటానికి బైటకి రాబోయేడు. ఆ గది తలుపు మూసుకుపోయింది. అప్పటికే అనూహ్య బయట గదిలోకి చేరుకుంది. డాక్టర్  ఫిలిప్స్ ఆయత్తమవుతున్నాడు.
   
    వాయుపుత్రని, వాహనాన్ని బంధించి వుంచిన తాడు వదులు అవుతోంది. అంత వేగంలో, పరస్పర వికర్షణ శక్తితో ఆ బరువుని పట్టుకొని వుంచటం కష్టమే. న్యూట్రాన్ రెండో చలన సూత్రం విలయతాండవం చేస్తూ మనిషిని పరిహసిస్తోంది.

    "వద్దు డాక్టర్, మీకా శక్తి లేదు."

    డాక్టర్ ఫిలిప్స్ ఆగాడు. "వాయుపుత్రని రక్షించగలిగానా - సరే! లేకపోయినా నా అవసరం మీకంతగా లేదు. ఏయే అనారోగ్యాలకు ఎలాటి మందులు వాడాలో బ్రహ్మవిద్యకి ఫీడ్ చేసి వుంచాను-"

    "డా....క్ట....ర్....." అంది అనూహ్య.

    మాస్క్ లో ఫిలిప్స్ మొహం కనపడటంలేదు.

    చెయ్యిసాచేడు. ఆమెకు అర్థంకాలేదు. అప్రయత్నంగా షేక్ హాండ్ ఇచ్చింది.

    "నీ మనసులో మాట తొందరగా వాళ్ళిద్దరికీ చెప్పెయ్యి అనూహ్యా! సమస్య వేగంగానూ బలంగానూ పెరిగి బాధపెట్టేది మనసులోనే.......బయటకొస్తే అది బలహీనమవుతుంది. ఇది నేను నీ కిచ్చే చివరి సలహా అనుకుంటాను."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra