Home » Mucherla rajani sakuntala » గెస్ట్ హౌస్

ఉలిక్కి పడ్డం పీటర్సన్ వంతు అయ్యింది.
"ఏంటి మిస్టర్ రామయ్యా మీరంటున్నది...దిశైవని ఆహ్వానించే వ్యక్తా?"
"అవును...నేను కుశైవని ప్రయోగించాను. అవతలి వ్యక్తి దిశైవని ఆహ్వానించి కుశైవతో యుద్దానికి సిద్దం చేసేడు"
"ఇంపాజిబుల్...ఇండియాలో దిశైవగురించి తెలిసినవాళ్ళు ఉన్నారంటే నమ్మను. మా సింగపూర్ లో సుసిరియో సంతతికి చెందిన వాళ్లకు మాత్రమే తెలిసిన విద్య. ఆ తెగవాళ్ళు మాత్రమే దిశైవను ఆహ్వానించగలరు..."
"నిజమే కావచ్చు...సింగపూర్ నుంచి ఆ తెగకు చెందినవాళ్లు ఇక్కడికి వచ్చి ఉండొచ్చుగా...."
తల అడ్డంగా ఊపి అన్నాడు పీటర్సన్.
"ఆ అవకాశం లేదు. దిశైవని రప్పించగల ఒకే ఒక చివరి మాంత్రికుడు సుసిరియోను నేను కుశైవని ప్రయోగించి చంపాను."
"మరయితే ఈ వ్యక్తి ఎవరు? రామయ్య అడిగాడు.
"తెలుసుకుంటాను...అయినా కుశైవను ఎదుర్కొనే శక్తి దిశైవకు వుండనుకోను..." చెప్పాడు పీటర్సన్.
"కుశైవను ఎదుర్కోవడం దిశైవకు కష్టమే...అయితే ఆ క్షణంలో ఎవరిదో ఆత్మ దిశైవకు దారి చూపించింది. దిశైవను ఆహ్వానించిన వ్యక్తి స్థిర సంకల్పం కుశైవని బెంబేలెత్తించింది. చివరి వరకూ ప్రయత్నించాను.
మరో తంతుని అతనిపైకి ప్రయోగించాలనుకున్నాను. కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని వదిలేసాను. అయినా సరే ఆ మనిషిని మనం ఓ కంట కనిపెట్టాలి" రామయ్య స్థిరంగా చెప్పాడు.
"ఆల్ రైట్...ఆ పని మా డేనియల్ చూసుకుంటాడు...మీరు మీ పనిలో వుండండి. అన్నట్టు ఇవ్వాళ సాయంత్రమే ఆ ఐదుగురు యువకుల ప్రయాణం. వాళ్ళతోపాటు నేను ఒక్కడినే వెళ్తున్నాను. వాళ్లని అడవిలోకి పంపించి వస్తాను. ఈ లోగా మీరు నిర్వర్తించాల్సిన తంతుని మొదలు పెట్టండి" చెప్పాడు పీటర్సన్.

                                       * * *
ఆ ఐదుగురూ బుద్దిగా కూచున్నారు.
అప్పటికే వాళ్ల జర్నీ బ్యాగులు సిద్దంగా వున్నాయి. పదిహేను రోజులకు సరిపడా పుడ్డు, మిగతా సరంజామా సిద్దం చేసుకున్నారు.
బిస్కెట్స్ ప్యాకెట్స్, బ్రెడ్డూ, జామూ, నూడుల్స్, కార్న్ ప్లెక్స్ లాంటివి తినడానికి రెడీ చేసుకున్నారు.
షేవింగ్ కిట్, సూయింగ్ కిట్ లాంటి చిన్న చిన్న దిటెయిల్స్ కూడా మిస్సవలేదు. వీడియో కెమెరా, లాప్ టాప్ కూడా రెడీ చేసుకున్నారు. పరీక్షకు సిద్దమయ్యే విద్యార్దుల్లా వుంది వాళ్ల మానసిక పరిస్థితి. మరో ప్రక్క టెన్షన్ గావుంది.
సినిమాల్లోనో, నవలల్లోనో హీరోలు చేసే అడ్వంచర్స్ వేరు. నిజ జీవితంలో అడ్వంచర్ చేయడం వాళ్లకు చిత్రమైన అనుభవంతో పాటు భయమూ కలగజేస్తోంది.
వాళ్ల ఎదురుగా రాబర్ట్ వున్నాడు.
"మైడియర్ యంగ్ బోయ్స్...నేను చెప్పేది చాలా కేర్ ఫుల్ గా వినండి...నేను చెప్పే ప్రతి విషయం మీ మెదడులో రికార్డయిపోవాలి.
ముందుగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి...పిరికితనం, అభద్రతాభావం, భయం...ఇవేమీ మీ మనసు పరిసరాల్లో రానివ్వకండి...
మీ కాన్ సెంట్రేషన్ అంతా ఆ గెస్ట్ హౌస్ ను చేరుకోవడం పైనే కేంద్రీకరించండి...చిత్రావతి అడవి గురించి నేను సేకరించిన విషయాలు మీకు చెబుతున్నాను.
మ్యాప్ కూడా రఫ్ గా తయారు చేసాను..." అంటూ టీపాయ్ మీద మ్యాప్ పరిచాడు. అతని చేతిలో పాయింటెడ్ స్టిక్ వుంది.
"ఇది చిత్రావతి రైల్వే స్టేషన్. ఇక్కడ గూడ్సు బండి ఆగుతుంది. ఇక్కడ్నుంచి మీరు ఇరవై నిమిషాల నడక సాగించాలి. ఆఫ్ కోర్స్ ఈ విషయం మిమ్మల్ని అడవిలోకి తీసుకువెళ్ల వాళ్ళే చూసుకుంటారు.  
మీరు అడవిలోకి వెళ్లగానే ఐరన్ ఫెన్సింగ్ వున్న గేటు తాళం వేసి మిమ్మల్ని అక్కడికి చేర్చిన మనిషి వెనక్కి తిరిగివస్తాడు. అక్కడ్నుంచి మీ అడ్వంచర్ మొదలవుతుంది. ఆ ఐదుగురూ ఊపిరి బిగపట్టారు.
"అ...డ్వం...చ...ర్" ఆ పదమే ఓ విధమైన ఉద్వేగానికి కలుగచేస్తుంది.
"మీరు అడవిలోకి ప్రవేశించాక ఐదు కిలోమీటర్ల మేర ఏ అవాంతరమూ వుండదు. చెట్లు, మధ్య మధ్య చిన్న గుట్టలు తప్ప. ఆ తర్వాత దట్టమైన చెట్లు మొదలవుతాయి. దాదాపు పది కిలోమీటర్ల మేర ఈ దట్టమైన అడవి వుంటుంది.
ఇక్కడే హిస్నోక్ అనే జాతికి చెందిన భయంకరమైన విష సర్పాలు వుంటాయి. మీకు తాచుపాము, రక్తపింజెర, నాగుపాము లాంటి విష సర్పాల గురించే తెలుసు. ఈ హిస్నోక్ అనే జాతి విష సర్పాలు పది అడుగుల పొడవు వుంటాయి. కొండ చిలువల కన్నా ప్రమాదకరమైనవి.
కొన్నివేల అడుగుల దూరంలో ఉన్నా ఇవి మనిషి రాకను పసిగట్టగలవు. చాలా బద్దకంగా కనిపించే హిస్నోక్ జాతి విష సర్పం చాలా షార్ప్ గా రియాక్టవుతుంది. మనిషికన్నా వేగంగా సమీపించగలదు. మామూలుగా కోరలతో కాటేయడం గాక...ముందు తోకతో శత్రువును దెబ్బ తీస్తుంది.
శత్రువు సొమ్మసిల్లి పడిపోయాకే తన బలమైన కోరల్ని శత్రువు శరీరంలోకి దించుతుంది.
దీని విషం అతి ప్రమాదకరమైనది.
దీనికి దాదాపు విరుగుడు లేదు. కాకపోతే ఒక అదృష్టం ఏమిటంటే ఈ హిస్నోక్ జాతి విష సర్పం దాదాపు అరగంటపాటు మనిషిని తన తోకతో చీల్చి చెండాడుతుంది. శత్రువు స్పృహ కోల్పోయ్యేవరకు అతనిని తన కోరలతో చంపేయదు.
హిస్నోక్ ఎటాక్ నుంచి తెలివిగా ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ వుంది. దాని తోకలోనే ఎక్కువ బలం వుంటుంది. ఆ తోకను దెబ్బ తీయగలిగితే ఈజీగా ఎస్కేప్ అవ్వొచ్చు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ హిస్నోక్ శత్రువును ముందుకు తరుముకుంటూ వెళ్తుంది. వెనక్కి తరమడం చేయదు.     
సో...ఈ హిస్నోక్ విషసర్పం నుంచి తప్పించుకోవాలంటే దాని తోకను బలహీనపరిచి వెనుకవైపు అంటే తోక భాగం వైపు పరుగెత్తాలి. అన్నట్టు ఈ విష సర్పాల బరువు వంద కేజీలకు పైమాటే. ఒక్కసారే మనిషిని మింగేయగలదు. ఈ విషసర్పం విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి.
ఈ హిస్నోక్ జాతి విష సర్పాలు చిత్రావతి అడవిలోనే వుంటాయి. అవీ వేళ్ళ మీద లెక్కించే సంఖ్యలోనే. మీ ప్రయాణంలో మరో మజిలీ నరమాంస భక్షకులు, చిత్రావతి అడవిలో నలభై అరవై కిలోమీటర్ల మధ్య కోయజాతి ఒకటి వుండేది. ఆ జాతి అంతరించేక, అక్కడ నరమాంసం భక్షకులు తిష్టవేసారు అంటారు. నిజానికి నరమాంస భక్షకులే కోయజాతిని అంతం చేసారని అంటారు. ఏడున్నర, తొమ్మిది అడుగులు ఉండే ఈ నరమాంస భక్షకులు పులులను, ఎలుగుబంటుల్ని ఒంటి చేత్తోనే చంపేసే తమ ఆకలిని తీర్చుకుంటున్నారట. వీళ్ల చేతి వ్రేళ్లకు చివర వుండే గోళ్లలో విషం వుంటుంది. మనిషిని ఇనుప ఊచకు అడ్డంగా వేలాడదీసి, మంటల్లో మాడ్చి చంపి తినే క్రూరులు.
ఇప్పుడీ నరమాంస భక్షకులు ఉన్నారో లేదో తెలియదు. అయినా మీ జాగ్రత్తలో మీరుండాలి..." రాబర్ట్ చెప్పుకుపోతూనే వున్నాడు.
చాలా బుద్దిగా వింటున్నారందరూ...
నచికేత మెదడు రాబర్ట్ చెప్పే విషయాన్ని పదిలపర్చుకుంటోంది.
"నరమాంస భక్తుల గండం నుంచి మీరు బయటపడ్డా, పులుల జాతి మీ కోసం కాచుక్కూచుంటుంది.
ఈ అడవిలో పులులు, సింహాలు వుంటాయి. బ్లాక్ ఫేంథర్స్ (ఓ రకం చిరుత పులులు), సింహాలు, పులులు ఆకలితో నకనకలాడుతూ వుంటాయి. ఏ క్షణమైనా ఎటాక్ చేయవచ్చు. మరో విషయం" అంటూ ఆగాడు రాబర్ట్...

                                      18
అందరూ ఆసక్తిగా ఆ మరో విషయం ఏమిటా అని చెవులు రిక్కరించారు.
"చిరుత జాతికి చెందిన పులులన్నీ చాలా ఈజీగా చెట్టు ఎక్కగలవు. వేగంగా పరుగెత్తగలవు. చాలా దూరం దూకగలవు. తెల్లపులి, పెద్దపులి పిల్ల, సింహం లాంటిది చెట్లు ఎక్కలేవు.
ఈ పులులు, సింహాలు, బ్లాక్ పేంథర్స్ నుంచి చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి.
సాధ్యమైనంత వరకూ గ్రూపుగానే వుండండి..." అని ఒక్కక్షణం ఆగి సోఫాలో తన ప్రక్కనే వున్న ఓ బ్యాగ్ ఓపెన్ చేసాడు. అందులో ఓ రివాల్వర్, పది నుంచి పదహారు అంగుళాలు పొడవున్న కత్తులు, ఓ బాక్స్ వున్నాయి.
"మిస్టర్ నచికేత మీకు ఫైరింగ్ నేర్పిస్తాను...చాలా తక్కువ సమయం వుంది. నీ టాలెంట్, నీ ఏకాగ్రత చూపించు...ఒకే ఒక గంటలో నీకు రివాల్వర్ ఎలా పేల్చాలో చెబుతా...ఆ తర్వాత నీ అదృష్టం...నీ కసి మీద నీ సక్సెస్ ఆధారపడి వుంటుంది.
ఈ కత్తుల చివర పాయిజన్ వుంటుంది. ఆపదలో మీకు పనికివస్తాయి. బాక్స్ లో ఫస్ట్ ఎయిడ్ కు సంబంధించినవి వున్నాయి..." చెప్పాడు రాబర్ట్.
నచికేత కళ్ళు కన్నీళ్లతో మెరిసాయి.
మిగతావారి పరిస్థితి కూడా అలాగే వుంది.
"థాంక్యూ సర్...మేము ఎవరో...మీరు ఎవరో...మొన్నటి వరకూ...కానీ మాకోసం మీరు..." నచికేత రాబర్ట్ రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకొని అన్నాడు.
"నో మైడియర్ బోయ్స్...ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మరొకరితో అటాచ్ మెంట్ వుంటుంది. మీ అడ్వంచర్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను...ఆల్ ద బెస్ట్..." చెప్పాడు రాబర్ట్.     
వాళ్లనుంచి వీడ్కోలు తీసుకునే ముందు నచికేతను పక్కకు పిలిచి...అతని చేతికి చిన్నసైజు సెల్ ఫోన్ ఇచ్చి చెప్పాడు.
"మిస్టర్ నచికేతా...ఇది ట్రాన్ సిస్టర్ లా కనిపించే ఫోన్...రెండువందల కిలోమీటర్లమేర నువ్వెక్కడున్నా నాతో మాట్లాడొచ్చు...పదిహేను రోజులకు సరిపడా బ్యాటరీ చార్జింగ్ వుంది. ఇది అత్యవసర పరిస్థితులో నన్ను కాంటాక్ట్ చేయడానికి ఉపయోగించు, తప్పని సరి అయితేనే...అనే విషయం మరిచిపోకు. ఎందుకంటే మన మాటలు ట్రాప్ చేసే ప్రమాదం వుంది.ఎప్పుడూ నీ దగ్గరే ఉండనివ్వు..."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra