Home » D kameshwari » Chikati Tolagina Ratri


    అందరిని వివరాలడిగింది రమాదేవి. పుట్టుపూర్వోత్తరాలు వాకబు చేసింది. కుమారస్వామి అందరి గురించి చెప్పాడు.
    "బాగుంది, నలుగురూ ఇంజనీర్లన్నమాట! చక్కగా కలిశారు. మిమ్మల్ని చూస్తె ముచ్చటగా వుంది!" అంటూ ఓ కాంప్లిమెంట్ పారేశింది.
    ఆవిడ గురించి వివరాలడగడానికి నలుగురికీ రకరకాల అనుమానాలు అడ్డొచ్చాయి. సంభాషణలు పొడిగించడమెలాగా అని అవస్థ పడేంతలో ఆ పరిస్థితిని తప్పిస్తూ మణి కాఫీ కప్పులతో వచ్చాడు. నలుగురూ నాలుగు కప్పులు ముందుకు చాచారు. 'అగ్గిపెట్టెలంటే తీసుకున్నాను. కాని, నాలుగు కప్పులు ఒక్కసారి ఎలా తీసుకొను చెప్పండి" నవ్వుతూ అంది రమాదేవి. నల్గురూ సిగ్గుపడి చేతులు వెనక్కి లాక్కున్నారు. ట్రేలో పెట్టిన కప్పు తనే తీసుకుంది రమాదేవి. మీ చేతుల్లోవి మీరే త్రాగేయండి! అంది చనువుగా.
    "కాఫీ చాలా బాగుంది. వెరీ నైస్....'అంది రమాదేవి మెల్లగా సిప్ చేసి నవ్వు పులుముకున్నారు. మోఖాలకి నలుగురూ.
    ఇంకో కప్పు తీసుకోండి. పోనీ ప్లాస్కులో పోసి పంపమంటారా తర్వాత తీసుకోడానికి...... కుమారస్వామి అడిగాడు, ఆమె కప్పు టేబిల్ మీద పెట్టాక.
    "అబ్బే ఎందుకు, కాస్సేపట్లో మారెడ్డి వస్తాడు. వాడిచేత తెప్పించుకుంటాను హోటల్నించి అంతగా అవసరమైతే ....'
    "హోటల్నించి ఎందుకు. ఆ కాఫీ మీలాంటి వారు త్రాగగలరా, ప్లాస్కులో పోసి తెస్తాడు మణి......అన్నాడు కృష్ణశర్మ.
    "మరి వంట మనిషికి జ్వరమైతే , భోజనానికి ఏం చేస్తున్నారు? అరా తీసాడు వెంకట్రావు.
    "ఏదో రాత్రిపూట పార్టీల పేరుతొ అక్కడా ఇక్కడ సరిపోయింది. మధ్యాహ్నం రెడ్డి చేస్తున్నాడు. అంతకంటే హోటలు వంటే బాగుందనిపించింది నాకు, వాడొచ్చాక క్యారియర్ తెస్తాడు.....'....నిజంగా వంట రాకపోవటం ఎంత ఇబ్బంది. ఇప్పుడయినా నేర్చుకోవాలి . ఇంక ....కాని ఏదో గొడవతో కుదరదు. అసలు మా ఫ్రెండ్స్ ఎవరికీ వంట మనిషికి జ్వరమని తెలియదు. లేకపోతే హోటల్లో తింటావా అని యుద్దానికి వచ్చి వుండేవారు...."
    "అవును, మీరెందుకు అవస్థ పడడం ఎదురుగా వున్నాం, మా వంటవాడు వండుతాడు మీ కోసం కూడా, మీ వంట మనిషికి నయమయే దాకా...."
    "యెందుకు మీకా శ్రమ. దాని కెప్పటికి నయమవుతుందో...." "యిందులో శ్రమ కేముంది. మేం వండం గదా, మా మణి వండి క్యారియర్ లో తెచ్చిస్తాడు మీకు.....ఏదో రెండు మూడు రోజులు సర్దుకుందురు గాని....' అందరూ తలో మాట అని రమాదేవిని మొహమాట పెట్టారు.
    "వద్దండి నేనేదో ఊరకే అన్నాను, ఆమాత్రం రెండు రోజులు గడుపుకోగలను. యిటీజ్ అల్ రైట్, మీరు లేకపోతే ఏం చేసేదాన్ని ...." భోజనం ఏర్పాటు కోసమే వచ్చినట్టు అనుకుంటారేమో నన్న సంభ్రమంలో తడబడ్తూ అంది రమాదేవి.
    కాని మిత్రులు వదలలేదు. బలవంతపెట్టి రమాదేవిని , అంగీకరింప చేశారు. తరువాత రెండు రోజులు క్యారియర్ సరఫరా జరిగింది.
    కాఫీ త్రాగి, రెండు రోజులు ఆ యింట భోజనం తిన్న రమాదేవి వాళ్ళకి ఋణపడినట్టు మరో పది రోజులకీ నల్గురిని డిన్నర్ కి పిలిచింది. మరోసారి ఏదో అవకాశం పురస్కరించుకుని టీకి పిలిచింది. ఆ తర్వాత ఆమె యింట్లో జరిగే పార్తీలన్నింటికీ వాళ్ళూ ఆహుతులయ్యారు.
    అలా మొదలయిన వాళ్ళ పరిచయం క్రమేపీ వృద్ది చెందింది. ఏమీ తోచని సాయంకాలాలు తోటలో కుర్చీలు వేయించి టీ త్రాగుదాం రమ్మంటుంది. అప్పుడప్పుడు ఏ సినిమాకో బయలుదేరి ఆవేళకి ఎవరేదురుగా వుంటే వాళ్ళని తీసుకెడుతుంది. పేరు పెట్టి "నీవు" అంటు చనువుగా మాట్లాడే రమాదేవికి తామంటే ఎంతో ఇష్టమని అనుకుంటారు తప్ప ఆ నల్గురూ కించపడరు. ఆమె చనువు వాళ్ళకి అనందం.
    రమాదేవితో పరిచయం మొదలయ్యాక వాళ్ళ ప్రవర్తనలో , ఆలోచనల్లో, మాటల్లో, ఆఖరికి తమలో తాము పరస్పరం చూపుకునే స్నేహపూరిత వాతావరణంలో అనుకోని మార్పులు రాసాగాయి.
    రమాదేవి అందమైనది. అందమైనదే కాక అందమైన భావాలు గలది. ఆధునికత అంటే ఇష్టం! మగాడ్ని చూసి ముడుచుకుపోయి మూల కూర్చునే రకం గాదు. చనువు ఇస్తుంది! చనువు తీసుకుంటుంది. స్వేచ్చ గోరుతుంది. తెలివి గలది. తెలివిగా మాట్లాడగలది! అన్నింటిని మించి ఎదుట వ్యక్తిని వశపరచుకోగల సమ్మోహనాస్త్రం లాంటి చిరునవ్వూ గలది! ఒక్క చూపుతో మనిషిని చుట్టూ త్రిప్పుకోగలదు. వొకసారి చూసి, ఆమెతో మాట్లాడిని వ్యక్తీ మళ్ళీ మళ్ళీ ఆ అనుభావాల కోసం ఆరాటపడినాడు. ఆమె స్నేహం కోసం తపించకుండా వుండలేడు. ఆమె చూపే చనువు, చొరవ చలాకి, అప్పుడప్పుడు మగవాళ్ళకి వేరే అర్ధాలు చెపుతాయి. ఆ జంట నగరాలలో ఆమెకి తెలియని బార్లు, హోటళ్ళు , క్లబ్బులు లేవు. పెద్ద పెద్ద క్లబ్బుల్లో మెంబరు ఎక్కడి కెళ్ళినా ఆమెని పెద్ద పెద్ద వాళ్ళంతా అట్టహాసంగా ఆహ్వానిస్తారు. నమస్కారాలు పెడతారు. మన్నిస్తారు. గౌరవిస్తారు. ఆరాధిస్తారు. ఆమె కంటే ధనవంతులు, హోదా పలుకుబడి కలవారుండచ్చు. కానీ ఆమె చుట్టూ వున్న ఆకర్షణ వేరు, దాన్ని గ్లామర్ అనవచ్చునేమో! అది అమెకున్నంతగా మరొకరికి లేదనాలి.
    ఆ గ్లామరుని ఉపయోగించుకోడమూ ఆమెకి బాగా తెలుసు. వ్యక్తుల్ని సులభంగా ఆకర్షించి చుట్టూ త్రిప్పుకుని, అవసరం తీరగానే అంత సులభంగానూ వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేసి మర్చిపోగలదని కొందరంటారు.    
    పరిచయం ఎక్కువయిన కొద్ది నలుగురూ రకరకాలుగా ఆమె స్వభావం గురించి చర్చించుకునే వారు వాదులాడుకునేవారు.
    మొత్తం మీద నల్గురికి రమాదేవి మంచి కాలక్షేపం క్రింద తయారయింది.
    ఓ రాత్రి ఏడెనిమిది గంటల వేళ ప్లేట్లతో ప్రసాదం లాంటిదేదో తెచ్చాడు మణి.
    "ఏమిట్రా ఇది వెంకట్రావు అడిగాడు. నలుగురూ ప్లేట్లు అందుకుంటూ ఆశ్చర్యంగా చూశారు.
    "ఎదురింటి అమ్మగారు పంపారండి. వారు సత్యన్నారాయణ వ్రతం చేసుకున్నారట.....' మణి మెల్లగా చెప్పాడు.
    సత్యన్నారాయణ వ్రతం. నలుగురి ఆశ్చర్యానికి అంతులేక పోయింది. వినీలాకాశంలో తెల్లమబ్బు ముక్కలాగ అతకనట్టనిపించింది.
    "వెళ్ళిన బ్రాహ్మణులందరికి మామిడిపళ్ళు, రెండేసి రూపాయలు, కూడా ఇచ్చి పంపారండి." అన్నాడు మణి. అది తనకీ ముట్టిన వైనం ప్రకటిస్తూ , ఆమె యెడ గౌరవ ప్రవత్తులు వాడి మాటల్లో చూపుల్లో వ్యక్తమవుతున్నాయి.
    "ఎన్న సమాచారం?" మణి వెళ్ళాక కుమారస్వామి కొంటెగా అన్నాడు.
    "పాప పరిహారార్ధం గాబోలు" వెంకట్రావు నవ్వాడు. ఒక్క క్షణం మౌనం.
    "పాపాలెం చేసింది?" శర్మ అదోలా చూశాడు.
    "ఏం కధ? అవిడ్నంటే నీకు ఉలుగ్గా ఉంది?' వెంకట్రావు ఉదికించాడు.
    "సినిమాకి తీసికెళ్ళిందిగా మొన్న, ' స్వామి.
    "నీ కేందుకంత బాధ. యీసారి నిన్ను తీసుకెళ్ళమంటానులే"
    "నీ సిఫార్సేవడికి కావాలోయ్. ఇంతకీ ఆ పాపం కదేమిటి?"
    "ఏముంది? రాత్రిళ్ళు ఒంటిగంట రెండు గంటల దాకా బారుల్లో , క్లబ్బుల్లో త్రాగడం, తందనాలాడ్డం, ఒళ్ళు తెలియకుండా కనబడ్డ వాళ్ళందరితో డాన్సులు, విహారాలు.....యివన్నీ పాపం కాక పున్యాలేమిటి?"
    "కానీ మొన్నేమయిందనుకున్నావు? యిద్దరం అలా కార్లో పోతున్నాం. ఉన్నట్టుండి దేవాలయం ముందు కారాపింది. అభ్యంతరం లేకపోతే లోపలికి వెడదాం అంది. లోపలికెళ్ళాం, రెండు రూపాయలు పళ్ళెంలో వేసింది. భక్తిగా పూజారి ఇచ్చిన హారతి కళ్ళ కద్దుకుంది. బొట్టు పెట్టుకుంది. తలలో పువ్వు పెట్టుకుంది . అలాంటి పని చేయడం ఆధునికత, నాగరికతలకు భంగం అనుకునే ఈ రోజుల్లో ఆమె ప్రవర్తన ఆశ్చర్యమనిపించింది. అందులో రమాదేవి లాంటి మనిషి....."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra