Home » Balabhadrapatruni ramani » Priyathama O Priyathama


    "మంజీరా!" అభినవ్ గంభీరంగా పిలిచాడు.
    ఆమె తల ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. ఏం జరుగుతోందో ఆమెకి తెలిసేలోగా...
    అభినవ్ పెదవులు ఆమె పెదవులతో ముడిపడ్డాయి. అతని నాలుక ఆమె పళ్ళ వెనుకగా దూరి, ఆమె మనసు లోతులు తెలుసుకుంటోంది. అతని పెదవుల నుండి, ఆమె పెదవుల మధ్యగా.... 'అధరసు ధారసం' అంటే అదేనేమో అనిపిస్తోంది!
    ఆమెని వదుల్తూ చెప్పాడు అభినవ్, 'పీటర్, ప్లైన్ లో పక్క కుర్రవాడూ, అశ్వత్థాలకి ముద్దు పెట్టినప్పుడు నీకు ఇలాగే అయిందా?"
    ఆమె సిగ్గుపడి తలవంచుకుంది. ఏమి అయిందో ఆమెకి తెలుస్తోంది మొదటిసారిగా!
    "మరి...మరి అలాంటప్పుడు ఆ స్పందన లేని చర్యలకి పెద్ద ప్రాముఖ్యతనిచ్చి, నిన్ను నువ్వు ఎందుకు అపవిత్రురాలివనుకుంటున్నావు? అన్ని చర్యలకీ కేంద్రం మనసు. ఆ మనసు ప్రతిసారీ, ప్రతి ఒక్కరితోటీ స్పందించదు. అది స్పందించనప్పుడు ఆ చర్యలో అర్థం లేదు. అది స్పందించనప్పుడు అంతకన్నా పరమార్థం లేదు!" అభినవ్ నవ్వుతున్నాడు.
    అతని మాటలు ఆమెకి అర్థం కాలేదు. కానీ అతనిలో ఒక గౌతమబుద్ధుడూ, వివేకానందుడూ కనిపించారు.
    "అభీ ఐ లవ్ యూ!" అంది మనస్ఫూర్తిగా.
    "ఐ టూ!" చెప్పాడు అభినవ్.


                                                    *    *    *    *


    అభినవ్, మంజీరా ఇల్లు చేరేసరికి అరుంధతీ, లూ కొత్త ఇంటికి మారిపోయినట్లు తెలిసింది.
    సుమిత్ర అభినవ్ వంక అనుమానంగా చూసింది.
    మంజీర అభినవ్ కి తండ్రికి పరిచయం చేసింది.
    "డాడీ, ఇతనే అభినవ్."
    నారాయణమూర్తి అతనివంక సాలోచనగా చూసాడు. ఆయనకి ఈ మధ్య మంజీరలో వచ్చిన మార్పు తెలుస్తోంది. ఏ పని చేసినా ఆలోచించి చేస్తోంది. అణుకువగా ఉంటోంది. దానికి కారణం ఏమిటో ఆయనకు ఇప్పుడు అర్థం అయింది. అభినవ్ తో ఒక గంట మాట్లాడారు. చివరికి ఓ నిశ్చయానికి వచ్చారు. అభినవ్ అందరిలాంటి కుర్రవాడూ కాదు! మంజీరని మార్చగలిగాడంటే సామాన్యుడు కానే కాదు అని!


                                                    *    *    *    *


    "కనుల కలికమిడీ... నీ కిరణములే, మనసును వెన్నగా చేసెనయ్యా! చెలిమి కోరుతో ఏవో చేతులు... లీలగా ఇప్పుడే కనిపించెనయా..."
    అరుంధతి చెమర్చిన కళ్ళతో పాటని ఆస్వాదిస్తోంది!
    "అరూ!" లూ వచ్చి ఆమె వెనుకగా నిలబడి, "ఆకాశాన్ని చూస్తే నీకు ఏమనిపిస్తోందీ?" అని అడిగాడు.
    "సూర్యాస్తమయాన్ని సంధ్య దిగులుగా చూస్తోంది!"
    "ఔను]! సూర్యుడూ, చంద్రుడూ లేని ఆకాశం వెలవెల పోతుంది. అవి ప్రకృతి మాతవరాలు! అలాగే పూలూ, కుంకుమ స్త్రీకి జన్మహక్కులు!"
    "బావా!" అరుంధతి విభ్రాంతిగా చూస్తుండగానే అతను తన చేతిలోని కుంకుమని ఆమె నుదుట దిద్దాడు.
    "బావా! ఏమిటీ పని?"
    "ష్... కదలకు. నీ ముఖాన పొద్దుపొడుపు లాంటి ఆ కుంకుమ బొట్టుని తనివి తీరా చూడనీ!"


                                                  *    *    *    *


    "అభీ ఇటుచూడు! ఈ పుస్తకం ప్రజెంట్ చేద్దామా గ్రానీ వాళ్ళకి" అడిగింది మంజీర.
    "మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమించాలంటే ఏం చెయ్యాలా?" ఇదా! ఇలాంటివి పది రాయగలరు వాళ్ళు! వాళ్ళని తక్కువ అంచనా వెయ్యకు!" అన్నాడు అభినవ్.
    "మరి నువ్వే ఏదైనా సెలెక్ట్ చెయ్యి" విసుగ్గా అంది మంజీర.
    "అదిగో ఆ రాధాకృష్ణుల బొమ్మ బావుంది కదూ!"
    "ఛ, రాధాకృష్ణులది ట్రాజెడీ, సత్యాకృష్ణుల బొమ్మ దొరుకుతుందేమో చూడు."
    "ఐతే భాగవతం కొనిద్దాం" నవ్వుతూ చెప్పాడు అభినవ్.
    "ఔను! అలాంటిదే ఏదో చెప్తావని ఎదురు చూస్తున్నాను.
    "నీకేం తెలుసు అందులోని ఆనందం? కొన్నిచోట్ల పోతన అసలూ..."
    "సరే నీ కోసం ఒకటి ఇప్పుడే కొంటాను కానీ, వాళ్ళకోసం ఈ 'ప్లేబాయ్' జోక్స్ బుక్ ప్యాక్ చేయించు" చెప్పింది నవ్వుతూ మంజీర.


                                                   *    *    *    *


    "సుమిత్ర నన్ను ఎంతగా అసహ్యించుకుంటోందో కదా!" బాధగా అంది అరుంధతి.
    "లేదు! త్వరలోనే మనసు మార్చుకుని నిన్ను చూడడానికి వస్తుంది మంజీరా, అభినవ్ వచ్చినట్లే!" అన్నాడు లూ.
    వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి, మనసులో ఏమీ లేకుండా వచ్చారు. నారాయణా, సుమిత్రా మనని గురించి ఎంత నీచంగా..."
    "ఊరికే ఆలోచించి మనసు పాడుచేసుకోకు! మన స్వర్గంలో కన్నీళ్ళకీ, వ్యధలకీ తావేలేదు" చెప్పాడు ఆమె కన్నీరు తుడిచి, గుండెల్లో పొదువుకుంటూ 'లూ.'
    ఓ శోబోదయానికి సుప్రభాతం పలుకుతున్నట్లుగా కొమ్మలో కోయిలమ్మ 'కుహూ! కుహూ!' అంటోంది.
    "మీరు... మీరు డాక్టర్ రాంప్రసాద్ గారితో మాట్లాడినదంతా...నిజమేనా! నాకు ఎందుకు చెప్పలేదూ?" సుమిత్ర గొంతు దుఃఖంతో బొంగురుపోయింది.
    కారు డ్రైవ్ చేస్తున్న నారాయణమూర్తి గంభీరంగా...
    "ఔను నిజమే! రిపోర్ట్స్ అన్నీ పరిశీలించి, ఆ విషయం డాక్టర్ గారు ధృవీకరించిన తరువాతే అప్పన్న మావయ్యకి తెలియబరిచాను! ఆ తరువాత సంగతులు నీకు తెలిసినవే!"
    "అంటే... అరుంధతి అత్తయ్య... ఇంక ఎన్నో రోజులు... భగవాన్! ఆమెకి ఇంత పెద్ద జబ్బా!"
    "'లుకేమియా' అంటే ప్రమాదమేగా! పొంచి ఉన్న పాములా ఏ క్షణాన్నైనా కాటెయ్యొచ్చు."
    "భగవాన్! నిజం తెలియక ఎన్ని నిష్ఠూరాలాడానూ? ఎన్ని మాటలన్నానూ! నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు" సుమిత్ర వెక్కివెక్కి ఏడుస్తూ, నారాయణమూర్తి భుజం మీద వాలిపోయింది.
    ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ, మరో చేత్తో సుమిత్రని దగ్గరకి తీసుకుని, నీకే కాదు, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదనుకున్నాం. కానీ నీ దగ్గర ఈ విషయం దాచడం భావ్యం కాదనిపించింది" అన్నాడు.
    "ఇప్పటికైనా చెప్పారు అంతేచాలు! నన్ను త్వరగా ఆ దేవత దగ్గరకి తీసుకునివెళ్ళండి, ఆవిడ్ని వెంటనే చూడాలి!" సుమిత్ర ఉద్వేగంగా అంది.
    "తప్పకుండా! కానీ ఏమీ తెలిసినట్లు ఉండకూడదు, బ్రతికిన నాలుగు నాళ్ళూ ఆనందంగా గడపాలి!"
    సుమిత్ర కళ్ళు తుడుచుకుని, 'సరే!' అంది.
    వాళ్ళ కారు నెమ్మదిగా అరుంధతీ, 'లూ'ల 'స్వీట్ హోం' వైపు సాగిపోతోంది!


                                                         * సమాప్తం *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra