Home » Dr c. ananda ramam » Maro Mundadugu

 

    "యతీ ! ఇప్పటికీ నీకు వెంకటయ్య ఉద్యమాలలో నమ్మకం వుందా? ఇంకా అతడు దేశ శ్రేయస్సు కోసమే పాటుపడుతున్నాడని అనుకుంటున్నావా?" ప్రభాకర్ సూటిగా అడిగాడు యతిని.
    యతి తల దించుకున్నాడు. అదే సమాధానమన్నట్టు.
    "అయితే ఇప్పటి కయినా ఆ వెంకటయ్యను వదిలేస్తావా?"
    ఆశగా , బెదురుగా చూసాడు. యతి ఈ విషవలయం లోంచి బయట పడటం సాధ్యమా అన్నట్టు.
    ప్రభాకర్ మనసు కరిగిపోయింది.
    "నీ కేండుకూ? నువ్వు నిశ్చింతగా ఉండు. ముందు నువ్వు పోలీసులకు దొరికిపో! నేను బెయిల్ మీద విదిపిస్తాను. లాయరుని నియమించి నీ కేస్ గెలిపిస్తాను. ఆ తరువాత ,ముందు నీ చదువు పూర్తీ చేసుకో! చదువు పూర్తయ్యాకే ఏదైనా! ముందు నీకే సరయిన జ్ఞానం లేకపోయాక మరొకరికి ఏం భోధిస్తావు?" యతి సమాధానం చెప్పలేదు. భయంగా, దిగులుగా , ఆందోళనగా ప్రభాకర్ ని చూసాడు. ఆ చూపుల నిండా లక్ష సందేహాలు! అర్ధం చేసుకున్నాడు ప్రభాకర్.
    "బి బ్రేవ్ మైయ్ ! ఇప్పుడింత కంటే మార్గం లేదు. ఇలా అజ్ఞాతంగా ఎంతకాలం గడుపుతావ్? నీకు నిజంగా పీడిత ప్రజా నికాన్ని ఉద్దరించాలని వుంటే ఇది కాదు మార్గం. నువ్విప్పుడు కేవలం కొందరు స్వార్ధపరుల స్వప్రయోజనానికి వుపకరణంగా  వున్నావు అంతే"
    ప్రభాకర్ మాటలతో యతికి ధైర్యం వచ్చింది "మీరేం చెయ్యమంటే అది చేస్తాను. నాకు భయమనేది లేదు. కానీ అన్యాయంగా బలి కావడం కంటే కర్తవ్యం కోసం పోరాడుతూ చావడం ఇష్టం" అన్నాడు.
    యతి తనంత తానుగా పోలీసులకు లొంగిపోయాడు. ప్రభాకర్ బెయిలు మీద విడిపించాడు. ప్రసిద్దుడైన క్షణాలలో ఈ కేసుకు సంబంధించిన రూమర్స్ దేశమంతటా ప్రాకి పోయాయి. అన్ని వార్తా పత్రికలోనూ ఈ విషయం అనేక రూపాలలో వచ్చింది. ఈ పరిణామాలకు అటు యాదవదేవ్ , ఇటు వెంకటయ్య ఇద్దరూ భయపడి పోయారు. కోర్టులో కేసు విచారణకు వస్తే ఏయే విషయాలు బయట పడతాయో నని ఇద్దరు ఆరాటపడ సాగారు. యతి వెంకటయ్యను కలుసుకోవటం పూర్తిగా మానేసాడు. వెంకటయ్య కబురు పంపినా వెళ్ళలేదు. అంచేత వెంకటయ్య తానె యతితో మాట్లాడటానికి ప్రభాకర్ ఇంటికి వచ్చాడు. ప్రభాకర్ ఎంతో మర్యాదగా ఆహ్వానించాడు. వెంకటయ్యకు యతి వినయంగా నమస్కారం చేశాడు. కమల అందరికీ కాఫీలు అందించింది. ప్రభాకర్, వెంకటయ్య చాలాసేపు దేశంలో రాజకీయాలు మాట్లాడుకున్నాడు. చివరకు వెంకటయ్య యతితో "యతి! నువ్విలాంటి పని చేస్తావనుకోలేదు." అన్నాడు అసలు విషయానికి వస్తూ .
    "నేనేం చేసాను?" అమాయకంగా అడిగాడు యతి.
    వెంకటయ్యకు మండి పోసాగింది. "మన ధ్యేయం శాంతి యుతంగా ఆందోళనలు జరిపించాలని. నువ్వు ఏకంగా యాదవ దేవ్ గారిని హత్య చెయ్యటానికి వెళ్ళావు"
    "నేను యాదవదేవ్ గారిని హత్య చెయ్యటానికి వెళ్ళలేదు. ఆయనతో మాట్లాడటానికి వెళ్ళాను."
    "నీ కెందుకు అధిక ప్రసంగాలు? ఎవరితో ఏం మాట్లాడాలో అదంతా చూసుకోవడానికి నేనున్నాగా.చూడు, ఇప్పుడెలా ఇరుకున పడ్డావో!"
    "ఫరవాలేదు లెండి! ఇప్పుడు నేనొకడ్ని ఇరుకున పడ్డాను. ప్రభాకర్ గారి దయవల్ల బయట పడనూ వచ్చును. "మీ శాంతియుతమైన ఆందోళనల వల్ల ఈ పాటికి పోలీసుల చేతుల్లో ఎందరు అభం శుభం తెలియని విద్యార్ధులు ఆహుతయి పోయేవారో!"
    నిర్భయంగా వెంకటయ్య ముఖం మీదే అనేశాడు యతి. వెంకటయ్య బిత్తరపోయాడు ఉక్రోషం అణచుకోలేకపోయాడు. "నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వు పెద్ద దేశ నాయకుడివి అవుతావను కున్నాను. చివరకు ఇలా గుండాలా తయారయ్యావు" అనేసాడు. ప్రభాకర్ ఊరుకోకుండా " ఈ రోజుల్లో ఎవరు నాయకులో, ఎవరు వినాయకులో తేల్చుకోవడం కష్టమవుతుంది లెండి? అందరిదీ ఒకటే దృష్టి: పదవులు దక్కించుకోవాలా అనీ" అంటూ చిన్న చురక అంటించాడు. ఉన్నమాట అన్నందుకు మండిపడుతూ, రాజకీయాలలో అరితెరటం వల్ల, ఆమంట అణచుకొని చిరునవ్వు చిందిస్తూ నమస్కారం చేసి బయట పడ్డాడు వెంకటయ్య .
    కోర్టులో కేసు విచారణ జరుగుతోంది పాపం కూలీలకు కోర్టులంటే చాలా భయం. అనేక కారణాలు! వాళ్ళకు కోర్టు వ్యవహారాలు ఏమీ తెలియవు. కరుడు గట్టిన అజ్ఞానం అన్నిటికి ఎవడో ఒక నక్షత్రకున్ని ఆశ్రయించ వలసిందే ఆ నక్షత్రకుడు ఎముకలు తప్ప మరేమీ మిగలని వీళ్ళ ఎముకలు నమిలి కాని వదలడు. దీనికి తోడు కోర్టులో కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటుంది. వాళ్ళ గ్రామాలేక్కడో కోర్టు లెక్కడో: ఆ మూల నుంచి ఈ మూలకు లెక్కలేనన్ని సార్లు ప్రయాణం చెయ్యాలంటే , వాళ్ళ పనులూ పాడవుతాయి. ఇల్లూ గుల్లవుతుంది.
    అందుకే వాళ్ళు కోర్టులంటే బెదిరిపోతారు. ప్రభాకర్ గారి ప్రోద్భలంతో యతి సాధించిన మొదటి విజయం, కూలి జనంలో ధైర్యం కలిగించి వాళ్ళు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేలా ప్రోత్సహించటం దీనితో యాదవదేవ్ నిజంగా బెదిరిపోయాడు. కూలి జనం భయంతో బెదిరిపోతూ అమాయకంగా "చిత్తం చిత్తం అంటున్నంత వరకూ , అతడు బూట్ కాలితో ఎంతైనా అణగద్రోక్కగలడు. కానీ వాళ్ళు ధైర్యంగా కోర్టులో నిలిచి తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటానికి సిద్దమయితే ఏం చెయ్యగలడు? అక్కడికి తన చేతిలో వున్న ఒకే ఒక ఆయుధం ప్రయోగించి చూసాడు. డబ్బు గుప్పించి వాళ్ళని తన వైపు తిప్పుకోవాలని చూసాడు. యతికే దిగ్భాంతి కలిగేలా కూలిజనం ఆ లంచాలకు లొంగలేదు. వెనుకటి తమ కష్టాలు మరిచిపోకుండా ఒక్క మాట మీద నిలబడ్డారు. కోర్టుకొచ్చి జరిగినదంతా సాక్ష్యమిచ్చారు. కేసు విచారణ యించు మించు సంవత్సరం సాగింది. ఆ సంవత్సరమంతా ప్రభాకర్ అతి బలవంతం మీద యతిని ఇంట్లోనే ఉంచుకున్నాడు. కన్నకోడుకులా ఆదరించాడు. అయినా యతికి ఆ ఇంట్లో వుండటం నిప్పుల మీద వున్నట్లే వుంది. అందుకు కారణం వేణు.


                                                             19

    తమ ఇంటికి వచ్చిన అతిధిని వేణు గుర్తించిన క్షణం.....అది అతని జీవితంలో అత్యంత దుర్ముహర్తం! ఎవరిని తాను ద్వేషిస్తున్నాడో , ఎవరు తనపై ఆధిక్యతను నిరూపించుకుంటున్నారని కుమిలి పోతున్నాడో - ఎవరికి తను తాళి కట్టి భార్యగా చేసుకున్న స్త్రీ హృదయంలో స్థానం ఉందని అతనికి నిశ్చయంగా తెలుసో, ఆ వ్యక్తీ ఎదురుగా ఉన్నాడు. తనిమ్ట్లోనే వున్నాడు. అన్నిటికంటే తన తండ్రి పర్యవేక్షణలో వున్నాడు. ఏమి చెయ్యలేని అసహాయత అతని కళ్ళలో నిప్పులుగా వురికింది. వేణుని చూసిన మరుక్షణం యతి పరిస్థితి  అలాగే అయింది. దుర్మార్గుడు! పశుబలంతో ఒక అమాయకురాలి జీవితాన్ని సర్వనాశనం చేసిన అధముడు! యతి మనసు క్రోధంతో ఊగిపోయింది. ఆ క్షణంలో అక్కడికక్కడ అతడి పీక నొక్కాలన్నంత కసి కలిగింది. కానీ అంతలోనే ఆ ఉద్రేకం మీద నీళ్ళు చల్లింది. అతడు 'మయూర భర్త' అనే భావం! తనను ఇంతగా ఆదరించి అండగా ఉన్న ప్రభాకర్ కొడుకనే భావం!
    "ఏం వేణూ. భాగున్నవా?" మర్యాదగా పలకరించాడు. వేణు ఒక్కసారి భుజాలు కుదించి ఎగరేసి , అతి నిర్లక్ష్యంగా "నాకేం?" అన్నాడు. యతి ఇంకేమి మాట్లాడలేక పోయాడు వేణు మనసు ఏదో కసితో రగులుకు పోసాగింది. తన ప్రతీకారాన్ని ఏ విధంగా తీర్చకోవాలా అనే అలోచిచనే , అతని కెప్పుడూ-------

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra