Home » Vasireddy seeta devi novels » Dr Vasireddy Sitha Devi Rachanalu - 4


    "ఓణీ వేసుకుంటే రజని పెద్దపిల్లలా వుందికదూ చంద్రం!" అంది హేమ, రజనిని చూసి నవ్వుతూ పవిట సర్దుకుంటున్న రజని నెత్తిమీద చిన్నగా మొట్టికాయ వేశాడు చంద్రం.
    
    "ఏంటయ్యా కొడతావ్?" అంటూ రజని బాబాయి చెయ్యిపట్టుకొని బయలుదేరింది.
    
    భోజనాల దగ్గిర అందరూ చాలా సంతోషంగా వున్నారు. ఎన్ని విషయాలలో చర్చించుకున్నారు. వదినగారు మరిది విస్తట్లో మరీ మరీ వడ్డించింది.
    
    తను పుట్టిన ఇంట్లో, తనవారందరి మధ్యా, ముఖ్యంగా హేమ పక్కన కూర్చొని భోజనం చేస్తున్న చంద్రానికి తన అంత అదృష్టవంతుడు ఇంకొకడు లేదనిపించింది.
    
    "చంద్రం!చూడు నాయనా! పెద్దవాణ్ణి చెబుతున్నాను మరోలా భావించకు-"
    
    ప్రసాదరావు ప్రారంభించైనా ఉపోద్ఘాతం అర్ధంకాక ప్రశ్నార్ధకంగా చూశాడు చంద్రం.
    
    "నీ ఇల్లు వాకిలీ, ఇంత ఆస్తీవున్న నీవు - ఎక్కడో, ఎవరిపంచనో పడివుండాల్సిన కర్మేంకాలింది చెప్పు చంద్రం! మీ అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా?"
    
    చంద్రం ముఖం చిట్లించుకున్నాడు. ఏదో అనాలన్నంత ఆవేశం వచ్చింది. కాని గొంతులోని మాటల్ని నోటివరకూ రానివ్వకుండా అణచుకున్నాడు. అందరూ అంత ఆనందంగా వున్న ఆ సమయంలో తను ఆవేశంతో అశాంతిని రేపటం మంచిది కాదనుకున్నాడు.
    
    చంద్రం మౌనాన్ని అమ్గీకరంగా తీసుకున్న ప్రసాదరావు "ఈ రాత్రికే సామాను తెచ్చేసుకో చంద్రం!" అన్నాడు ఉత్సాహంగా.    

 

    చంద్రం అన్న ముఖంలోకి చూశాడు కృష్ణారావు కళ్ళల్లో ఆదుర్దా స్పష్టంగా కనిపించింది. కాంతమ్మ అప్పుడే వంటింటివైపు వెళ్ళటంవల్ల ఆమె అభిపరయాన్ని తెలుసుకోలేకపోయాడు చంద్రం. అతని కళ్ళు అప్రయత్నంగానే హేమ వైపుకు మళ్ళాయి. తల వంచుకుని పళ్ళెంలో పులుసన్నం కలుపుతున్న వైఖరిచూస్తే, హేమ మనస్సు ఎక్కడో వున్నట్లనిపించింది. ఆమె తలఎత్తి చంద్రంవేపు చూసింది.
    
    "వచ్చేయి చంద్రం! కనీసం నా కోసమయినా వచ్చేయి!" హేమ కళ్ళతోనే ప్రాధేయపడుతున్నట్లనిపించింది చంద్రానికి.
    
    "వచ్చేయ్ బాబాయ్! నువ్వు రాకపోతే నేనూ నీదగ్గరికే వచ్చేస్తా." రజని ఏడుపుగొంతు విన్న చంద్రం ఉలిక్కిపడ్డాడు.
    
    "వస్తానమ్మా! ఇకనుంచి ఇక్కడే ఉంటాను" అన్నాడు చంద్రం ఆలోచించకుండానే.
    
    అందరి ముఖాలూ ఆనందంతో వెల్లి విరిశాయి. హేమ ముఖం మెర్ క్యూరీ లైటులా ఒక్కసారి వెలిగింది.
    
    "భోజనం కాగానే నువ్వూ,  రజనీ కార్లోవెళ్ళి సామాను తీసుకురండి" అన్నాడు కృష్ణారావు సంతోషంగా.
    
    "ఇవ్వాళకాదు. ప్రకాశం ఊళ్ళోలేడు. ప్రకాశం వచ్చేంతవరకూ నేను అక్కడే వుంటాను. అతను రేపో ఎల్లుండో రావచ్చు ఆ తరవాత ప్రకాశానికి చెప్పి, రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాను -" అన్నాడు.
    
    ఆ మాట లంటున్నప్పుడు చంద్రం ముఖంలోని గాంభీర్యాన్ని చూచి అంతకంటే బలవంతంచేసే ధైర్యం ఎవరికీ లేకపోయింది.
    
    భోజనాలయాయి. తాంబూలాలు వేసుకుంటూ,  అంతా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.
    
    ఇంతలో పనిమనిషి వచ్చి ఎవరో అమ్మాయి చంద్రంబాబుకోసం వచ్చిందనీ, వెళ్ళమంటే వెళ్ళకుండా గంటసేపటినుండి గేటులో గొడవ చేస్తూందనీ చెప్పింది. అన్ని కళ్ళూ చంద్రంవైపు తిరిగాయి - ఆశ్చర్యంగా, అనుమానంగా చంద్రంకూడా ఏమీ అర్ధంకాక ఓ క్షణంకాలంపాటు తెల్లబోయాడు.
    
    వెంటనే అతని బుర్రలో గౌరీ మెరుపులా మెరసింది. గాబరాగా లేచి బయటకొచ్చాడు. గౌరీ గేటులో గూర్ఖావాడితో తగాదా పడుతోంది లోపల ప్రవేశించటానికి.
    
    గౌరిని చూడగానే చంద్రంలోని నవనాడులూ కుంగిపోయాయి. అంతలోనే అంతులేని కోపంవచ్చింది. గబగబా రెండు అంగల్లో గేటుచేరాడు.
    
    "ఏం, మళ్ళీ ఇక్కడికెందుకొచ్చావ్?" గద్దించాడు చంద్రం.
    
    "సినిమాకు తీసుకెళతానని ఆ నరకంలోకి తోస్తావా? నిన్నేమో మంచి వాడనుకున్నాను. అన్నీ దొంగమాటలే-" తిరిగి తిఇర్గి అలసిపోయివున్న ఆమె గొంతులో కోపం, దుఃఖం పెనవేసుకున్నాయి. కళ్ళలో తిరిగిన నీటిని బలవంతంగా ఆపుకుంటోంది కట్టలు తెగకుండా.
    
    గౌరి మీద చంద్రానికి జాలివేసింది. కాని, వెంటనే తన పరిస్థితి జ్ఞాపకం వచ్చి గాబరాపడ్డాడు.
    
    "అనవసరంగా గొడవచెయ్యకు. ముందు నువ్విక్కడినుంచి పోతావా పోవా?" బెదిరించినట్లు అన్నాడు చంద్రం.
    
    "పోతాను, ముందు నా పెట్టె నా కిచ్చెయ్యి, అందులోనే నా బట్టలూ. సామానూ ఉంది. ఇంటి తాళంచెవి నీ దగ్గరేగా వుంది," అంది రోషంగా గౌరి, కన్నీరు కట్టలుతెంచుకుంది. అప్పటికే ఇంట్లోవాళ్ళంతా బయటకొచ్చి ఇద్దర్నీ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రజని పక్కనే నిల్చొని తమాషా చూస్తున్నట్లు ఆనందిస్తున్నది.
    
    గౌరి పలికిన చివరిమాటలు అందరి మనస్సులో అనుమానాన్ని ధృవపరిచింది. కాంతమ్మ భర్త ముఖంలోకి చూసి అదోలా వ్యంగ్యంగా నవ్వింది. కృష్ణారావు తల సిగ్గుతో, అవమానంతో వాలిపోయింది. గబగబా లోపలకు వెళ్ళిపోయాడు. ప్రసాదరావు కళ్ళలో అవమానం, ముఖంలో జుగుప్స ఉబికివచ్చాయి. హేమకు దుఃఖం వచ్చింది. అంతలోనే చంద్రం అంతకుముందే చెప్పినమాటలు గుర్తొచ్చాయి. ఈ అమ్మాయి అచ్చం చంద్రం వర్ణించిన అమ్మాయిలాగే వుంది. హేమ మనస్సంతా ఏదో అసహ్యంతో నిండి చీదర చీదరగా అనిపించింది.
    
    చంద్రం అందరి ముఖాలవైపూ మార్చి మార్చి చూశాడు. తను ఎలాంటి పరిస్థితిలో పడిపోయాడో తెలుసుకున్నాడు. ఒక్క క్షణంకూడా అక్కడ నిల్చోలేకపోయాడు. విసురుగా గేటు తెరుచుకొని బయటకు వెళ్ళబోయాడు.
    
    "బాబాయి...ఎక్కడికి? నేనూ వస్తా!" పరిస్థితిని అర్ధం చేసుకోని రజని అమాయకంగా అంటూ బాబాయి చెయ్యి పుచ్చుకుంది.
    
    చంద్రం ఆగి, ఆప్యాయంగా రజని తలమీద నిమిరాడు. కళ్ళలో నీరు తిరిగింది. "నువ్వన్నా నన్నర్ధం చేసుకోమ్మా!" అన్న భావం రజని తల నిమురుతున్న అతని చేతి స్పర్సలో ఇమిడి వుంది. ఏదో అనబోయాడు. ఇంతలో కాంతమ్మ సుడిగాలిలా వచ్చింది. రజని చెయ్యి పట్టుకొని బిరబిరా లోపలకు ఈడ్చుకుపోయింది.
    
    "ఆ బజారు మనుషుల్తో నువ్వెక్కడికి పోతావే?" లోపలకు వెళుతూ అన్న కాంతమ్మ ఎత్తిపొడుపు మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి చంద్రం చెవులకు.
    
    గౌరీ రెక్క పట్టుకొని మొదటగా రోడ్డుమీదకు లాక్కెళ్ళాడు చంద్రం. ఎదురుగా వస్తున్న రిక్షాను ఆపి గౌరిని ఎక్కమని తనూ ఎక్కి కూర్చున్నాడు.
    
    చంద్రంలో కోపం పొగలు కక్కుతూంది. మరోవైపు బాధా, అవమానం - ఇన్నిటికీ కారణమయిన గౌరిని నమలి మింగేయాలనిపిస్తోంది. చేతి వ్రేళ్ళతో కణతలు నొక్కుకుంటూ తనను తానే సంబాళించుకోటానికి ప్రయత్నిస్తున్నాడు. చంద్రం బుర్ర పనిచేయటం మానేసింది. ఏ ఆలోచనా లేదు. కేవలం ఏదో హోరుతో తల బద్దలవుతూంది.
          
    గౌరికి తను చాలా పెద్ద తప్పే - ఏదో చేశానని అర్ధం అయింది. భయంతో రిక్షాలో ఒదిగి ముడుచుకొని కూర్చుంది. ఏ క్షణంలో బద్దలవుతుందోనని భయపడుతూ అగ్ని పర్వతం పక్కనే కూర్చొని వున్న మానవుని మానసిక పరిస్థితిలా వుంది గౌరి మానసిక స్థితి.
    
    రిక్షా కొరిటపాడు చేరింది. అప్పటికే పదిన్నర అయింది. గుడిసెల్లో సందడి సద్దుమణిగి ఉంది. చంద్రం రిక్షా వాడికి డబ్బులిచ్చి యంత్రంలా ప్రకాశం ఇంటివైపు నడిచాడు గౌరి బిక్కుబిక్కుమంటూ చంద్రం వెనకే వెళ్ళింది.  

 

    చంద్రం తాళంతీసి లోపలకు వెళ్ళాడు. గౌరి ఇంట్లోకి వెళ్ళటానికి జంకుతూ వాకిట్లోనే నిలబడింది. మరో క్షణంలో చేతిలో ట్రంకుపెట్టెతో చంద్రం బయటకు వచ్చాడు. ఆ పెట్టెను దభీమని గౌరి కాళ్ళముందు పడేసి గిర్రున వెనక్కు తిరిగివెళ్ళి తలుపు గడియ పెట్టుకున్నాడు.
    
    మంచంమీద నడుం వాల్చిన చంద్రానికి దుఃఖం పొర్లుకొచ్చింది. కళ్ళవెంట నీళ్ళు కారిపోతున్నాయి. కొంతసేపటికి తలలో హోరు తగ్గింది. మనస్సుకు కొంత ఆలోచించే శక్తి వచ్చింది.
    
    ఎవరో ఏడుస్తున్న వెక్కిళ్ళు వినిపించాయి. చంద్రానికి అయితే, గౌరీ వెళ్ళిపోలేదన్నమాట! తను ఎంత మొరటుగా ప్రవర్తించాడు! తన సంస్కారం ఇంతేనా? అర్ధరాత్రిపూట ఆ పిల్ల ఎక్కడకు వెళుతుందని తను ఎందుకు ఆలోచించ లేకపోయాడు?

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra