Home » Manjari » నన్ను ప్రేమించవు

    "నా తండ్రికి కష్టం వస్తే చూసేవాళ్ళు గ్రామంలో లేరు. సులోచన మా అమ్మలా ఉంటుంది. దానిని చూడకుండా నా తండ్రి ఉండలేడు. అది పెళ్ళిచేసుకుని ఆయనకళ్ళముందు కాపురం చేస్తుంటే ఆయన ఎక్కువకాలం బ్రతుకుతాడు. ఈడొచ్చిన కూతుళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలియకపోతే ఏ తండ్రయినా ఎంతకాలం బ్రతుకుతాడు?"
    "నువ్వు చెప్పింది నిజమే. కాని అక్కడ నీ చెల్లెలికి బాధ్యత లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు."
    అర్చన మాట్లాడలేదు.
    "మీ పిన్ని నిన్ను బజారులో అమ్మకానికి పెట్టింది. ఇప్పుడు సులోచననితిరిగి గ్రామం పంపడం భావ్యం కాదు. ఇక్కడే ఉంటుంది. మనం వాళ్ళకి పెళ్ళి చేద్దాం" అన్నాడు.
    "పెళ్ళి చెయ్యడం సరే, శీతయ్యకి ఏ పనీ రాదూ. నా చెల్లెల్ని ఎలా పోషిస్తాడు?" అడిగింది.
    "సులోచన విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తి నీ తండ్రి. ఆయన అభిప్రాయం తెలుసుకుందాం...."
    "అవును. వాళ్ళిద్దర్నీ పంపి తెలుసుకోమందాం...." అంది అర్చన.
    చిన్నగా నవ్వాడు రామకృష్ణ. ఏదో విధంగా చెల్లెల్ని ఇంటికి పంపాలని ఆమె కోరుకుంటున్న విషయం ప్రతి మాటలో వ్యక్తమవుతోంది. చెల్లెలికి జరిగే హాని గురించి పట్టించుకోవడం లేదు. సులోచన వైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
    "నా గురించి మీ రెవరూ ఇబ్బంది పడొద్దు. నా విషయంలో నేను నిర్ణయం తీసుకోగలను. మా గ్రామం వెళ్ళినా నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్దంగా లేను. గ్రామం నుండి బయలుదేరినప్పుడే కష్టాలు ఎదురవుతాయని, వాటిని భరించాలని అనుకుని వచ్చాం. మీరు కనిపించారు కాబట్టి ఇన్ని మాటలు చెబుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మాకు తోచినట్టు బ్రతుకుతాం." ఖండితంగా చెప్పింది సులోచన.
    "మీరువెళ్ళక్కర్లేదు. మీ తండ్రే ఇక్కడకు వస్తాడు." చెప్పాడు రామకృష్ణ.
    అక్కాచెల్లెళ్ళు మొహాలు ఒక్కసారిగా వికసించాయి. నాలుగు రోజుల తరువాత లక్ష్మినారాయణని తీసుకురావడానికి శివరావు వెళ్ళాడు.       
                                                                         *    *    *  
    ఉదయం ఆరు గంటలకు పూర్ణా మార్కెట్ కి వచ్చాడు శీతయ్య. విశాఖపట్నంలో ప్రధాన మార్కెట్ అది. చిన్న మార్కెట్లలో వ్యాపారం చేసుకునేవాళ్ళు అక్కడే సరుకులు కొంటారు. అంచుచేత ఆ మార్కెట్ ఉదయం పది గంటల వరకూ రద్దీగా ఉంటుంది.
    మార్కెట్ అంతా తిరిగి చూశాడు శీతయ్య. కూరగాయలు హోల్ సెల్ గా అమ్మే ప్రదేశంలో నిలబడ్డాడు. పది కిలోల వంకాయలు ధర యాభై రూపాయలు. చిల్లరగా వాటిని కిలో ఆరేడు రూపాయలకు అమ్ముతున్నారు. అంటే పది కిలోల వంకాయలు అమ్మితే పది నుండి ఇరవై వరకూ మిగులుతుంది.
    మరునాడు ముప్పై కిలోమీటర్ల దూరంలోని కొత్తవలస వెళ్ళాడు. రైతులు పొలంలో పది కిలోల వంకాయల్ని ముప్పై రూపాయలకి ఇస్తున్నారు. రైతు నుండి వినియోగదారునికి చేరేసరికి వంకాయ ధర రెట్టింపు అవుతుంది. అలాగే మిగతా కూరగాయల గురించి కూడా తెలుసుకున్నాడు.
    వారం రోజుల తరువాత రామకృష్ణతో మాట్లాడాడు శీతయ్య. తను సేకరించిన సమాచారం అతనికి చెప్పి, తనేం చెయ్యాలనుకుంటున్నాడో చెప్పాడు. రామకృష్ణ వెయ్యి రూపాయలు అప్పుగా ఇచ్చాడు. వాటిని తీసుకుని వడ్రంగి వద్దకు వెళ్ళాడు. అతను మూడు రోజుల్లో చిన్న తోపుడు బండి తయారుచేసి ఇచ్చాడు. రామకృష్ణ దగ్గర మరో ఐదు వందలు తీసుకున్నాడు శీతయ్య.
    మరునాడు రాత్రి అన్నం తిని చివరి బస్సులో కొత్తవలస చేరుకున్నాడు. రైతులతో ముందే పరిచయం చేసుకోవడం వల్ల వాళ్ళు కూరగాయలు ఇచ్చారు. వాటిని నైట్ హాల్ట్ బస్సులో పడేసి అందులోనే పడుకున్నాడు. ఉదయం నాలుగు గంటలకు బయలుదేరి ఐదు గంటలకల్లా కురుపాం మార్కెట్ దగ్గర దిగాడు. అప్పటికి ఇంకా చీకట్లు విచ్చుకోలేదు.
    గుమ్మంలో కూర్చుని తన కోసం ఎదురుచూస్తున్న సులోచనని చూడగానే అతని మనసు సంతోషంతో నిండిపోయింది. తను తెచ్చిన మూట ఆమె దగ్గర వదిలి మిగతా మూటలు తేవడానికి వెళ్ళాడు. అతను వచ్చేసరికి కూరగాయల్ని శుభ్రంగా కడిగింది సులోచన. ఇద్దరూ కూరగాయల్ని బండిలో పేర్చారు. క్షణాల్లో స్నానంచేసి తయారయ్యాడు శీతయ్య.
    "ఎదురు రా..." చెప్పాడు సులోచనతో.
    ఆమె కొంతదూరం వెళ్ళి ఎదురుగా నిలబడింది. ఇద్దరూ ఒకేసారి కదిలారు. అతను అదంతా తన కోసమే చేస్తున్నాడనే భావం వల్ల ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. సులోచన తనని ఇష్టపడటం అనేది ఓ అదృష్టంగా భావిస్తాడు శీతయ్య. అందుకే అతను ఉత్సాహంతో బండి త్రోసుకుంటూ సందు మలుపు తిరిగాడు.
    అంతవరకూ వాళ్లనే గమనించిన రామకృష్ణ వెనక్కి తిరిగాడు' పది రోజుల క్రితం బ్రతకడం గురించి ఓ చిన్న సలహా శీతయ్యకి చెప్పాడు. ఆ రోజు నుండే అతను ఆ పనిలో మునిగిపోయాడు. జీవితంలో పైకి రావడానికి ఆ మాత్రం అంకిత భావం చాలు. పైసా చాలా చిన్నది. కాని అవి వంద కలిస్తే తప్ప రూపాయి కాదు. ఈ విషయం గుర్తించిన మనిషి తొందరలోనే పైకొస్తాడు.
                                 *    *    *
    ఎప్పటిలానే తెల్లవారింది ఆ రోజు కూడా!
    మార్నింగ్ వాక్ నుండి తిరిగొస్తున్న ఓ అధికారి క్షణం పాటు ఆగాడు. ఇరవై సంవత్సరాల నుండి ఆ కార్యక్రమం కొనసాగిస్తున్న అతను తన వీధిలో వచ్చిన మార్పుని తేలిగ్గానే గమనించాడు.
    వాకింగ్ పూర్తయిన తరువాత స్నానంచేసి బ్రేక్ ఫాస్ట్ ముగించి మార్కెట్ కి వెళ్ళడం ఆయన దినచర్యలో ఒక భాగం. కూరగాయలు తాజావి తేవడం కోసం వాకింగ్ నుండి తొందరగా వచ్చేస్తాడు. ఆ రోజు ఇంటికొస్తూ సందు మొదట్లో నిలబెట్టిన కూరగాయల బండిని గమనించి అటువైపు నడిచాడు. ఆ కాలనీకి అటువంటి బండి రావడం అదే మొదటిసారి. బండిపైన పేర్చిన కూరగాయల్ని పరీక్షగా చూశాడు. అన్నీ తాజాగా సూర్యుని లేత కిరణాలు పడి మెరుస్తున్నాయి.
    "క్యాబేజీ కిలో ఎంత?" అతను అడిగాడు.
    "నాలుగు రూపాయలు సార్!" శీతయ్య వినయంగా చెప్పాడు.
    రెండు రోజుల క్రితం కిలో ఐదు రూపాయలకు మార్కెట్ నుండి తేవడం అతనికి గుర్తుంది. శీతయ్య తనని "సార్" అనడం అతనికి ఎంతో నచ్చింది. మిగతా కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్నాడు. మార్కెట్ కంటే తక్కువ ధరలని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. రెండు రకాల కూరగాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాడతను.
    శీతయ్య ఆయనతో పాటు వెళ్ళి ఇంట్లో కూరగాయలు ఇచ్చి డబ్బులు తెచ్చుకున్నాడు. ఆ కాలనీలో నివసించే వాళ్ళంతా ఉద్యోగస్తులు. మార్కెట్ కి స్కూటర్ మీద వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటారు. బేరంచేసే అలవాటు లేకపోవడం వల్ల వర్తకుడు చెప్పినా ధర చెల్లిస్తారు. అందుచేత కాలనీలోని గృహిణులు శీతయ్య దగ్గర కూరగాయలు కొనడానికే మొగ్గు చూపారు.
    "నా తండ్రికి కష్టం వస్తే చూసేవాళ్ళు గ్రామంలో లేరు. సులోచన మా అమ్మలా ఉంటుంది. దానిని చూడకుండా నా తండ్రి ఉండలేడు. అది పెళ్ళిచేసుకుని ఆయన కళ్ళముందు కాపురం చేస్తుంటే ఆయన ఎక్కువకాలం బ్రతుకుతాడు. ఈడొచ్చిన కూతుళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలియకపోతే ఏ తండ్రయినా ఎంతకాలం బ్రతుకుతాడు?"
    "నువ్వు చెప్పింది నిజమే. కాని అక్కడ నీ చెల్లెలికి బాధ్యత లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు."
    అర్చన మాట్లాడలేదు.
    "మీ పిన్ని నిన్ను బజారులో అమ్మకానికి పెట్టింది. ఇప్పుడు సులోచననితిరిగి గ్రామం పంపడం భావ్యం కాదు. ఇక్కడే ఉంటుంది. మనం వాళ్ళకి పెళ్ళి చేద్దాం" అన్నాడు.
    "పెళ్ళి చెయ్యడం సరే, శీతయ్యకి ఏ పనీ రాదూ. నా చెల్లెల్ని ఎలా పోషిస్తాడు?" అడిగింది.
    "సులోచన విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తి నీ తండ్రి. ఆయన అభిప్రాయం తెలుసుకుందాం...."
    "అవును. వాళ్ళిద్దర్నీ పంపి తెలుసుకోమందాం...." అంది అర్చన.
    చిన్నగా నవ్వాడు రామకృష్ణ. ఏదో విధంగా చెల్లెల్ని ఇంటికి పంపాలని ఆమె కోరుకుంటున్న విషయం ప్రతి మాటలో వ్యక్తమవుతోంది. చెల్లెలికి జరిగే హాని గురించి పట్టించుకోవడం లేదు. సులోచన వైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
    "నా గురించి మీ రెవరూ ఇబ్బంది పడొద్దు. నా విషయంలో నేను నిర్ణయం తీసుకోగలను. మా గ్రామం వెళ్ళినా నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్దంగా లేను. గ్రామం నుండి బయలుదేరినప్పుడే కష్టాలు ఎదురవుతాయని, వాటిని భరించాలని అనుకుని వచ్చాం. మీరు కనిపించారు కాబట్టి ఇన్ని మాటలు చెబుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మాకు తోచినట్టు బ్రతుకుతాం." ఖండితంగా చెప్పింది సులోచన."తాజాగా ఉండాలని వీటిని రాత్రి తోటలో కోయించాను. అక్కడా నుంచి నేరుగా తీసుకురావడం వల్ల బజారుపైన తక్కువ ధరకి ఇవ్వగలుగుతున్నాను." కూరగాయల తాజాదనం గురించి ప్రశంసించిన ఒకామెతో చెప్పాడు శీతయ్య. తన మాటల్లో కాస్త లౌక్యం కలిపాడు.
    "కేరట్, బీట్ రూట్ తేలేదేం?" అడిగిందావిడ. అప్పటికే ఆమె ఇరవై రూపాయల కూరగాయలు తీసుకుంది. ఆమె తీసుకొచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్ వాటితో నిండిపోయింది.
    "రేపు తెస్తానమ్మా!" చెప్పాడు శీతయ్య.
    "రోజూ వస్తావా?" అడిగింది ఆశ్చర్యంగా.
    "ఉదయం ఆరు గంటలకు ఇక్కడ ఉంటాను."
    "నువ్వు రోజూ వస్తావని తెలియక మూడు రోజులకు సరిపడే కూరగాయలు తీసుకున్నాను. రేపు కొత్తిమీర తేవడం మర్చిపోకు...." చెప్పింది వెళుతూ.
    పది గంటలకు తను తెచ్చిన కూరగాయల్లో చాలా భాగం అమ్మేశాడు. పనికిరాని వాటిని ఏరి ప్రక్కన పెట్టాడు. కొనడానికి వచ్చిన వాళ్ళు వాటిని చూసి శీతయ్య మీద మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నారు. మూడు రోజుల క్రితం శీతయ్య ఆ కాలనీకి వచ్చి పరిశీలించి వెళ్ళడం వాళ్ళకి తెలియదు. అంతేకాదు కాలనీలో నివసించేవాళ్ళ జీవన విధానాన్ని కూడా అతను తెలుసుకున్నాడు.
    అక్కడనుంచి బయలుదేరే ముందు ఆ రోజు అమ్మకాన్ని లెక్క చూశాడు. పెట్టుబడి పోను నలభై రూపాయల చిల్లర మిగిలింది. అతను సంతోషంగా ఇంటికి తిరిగొచ్చాడు. అన్నం తిని మార్కెట్ కి వెళ్ళి రెండు రేకు డబ్బాలు డిబ్బీలుగా తయారు చేయించి తెచ్చాడు. ఆ రోజు వచ్చిన ఆదాయంలో పదిహేను రూపాయలు ఒకదానిలో, పదిరూపాయలు మరో దానిలో వేశాడు. మిగిలిన వాటిని సులోచన చేతికిచ్చాడు.
    "ఇంటికోసం ఖర్చు చెయ్యి....." చెప్పాడు.
    "డిబ్బీలు దేనికి?" అడిగింది.
    "మొదటిది అప్పు తీర్చడానికి, రెండోది మనకోసం. పిల్లలు పుడితే కావాలిగా...." అన్నాడు.
    శీతయ్య మొహంలో కొంటెతనం కనిపించకపోయినా సిగ్గుపడి అక్కడనుంచి లోపలకు పారిపోయింది సులోచన.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra