Home » Vasireddy seeta devi novels » Sandhi Yugamlo Sthree

    ఈ ధోరణి స్త్రీలలో మరీ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి "నా కర్మ! నా రాత:" అని నొసలు బాదుకునే స్త్రీలు ఎందరో ఉన్నారు.
    రఘుకు ఆ పదవి ఎలా లభించిందని వేణు ఆలోచించాడు లంచం ఇస్తేనో, సిఫార్సు ఉండడం వల్లనో అతనికి ఆ ఉద్యోగం లభించిందనే విషయం ఏ కొంచెం ఆలోచించేవాడికైనా ఇట్టే అర్థం అవుతుంది.
    నేను మద్రాసులో ఉన్న రోజుల్లో మా ఇంటి దగ్గర్లో షణ్ముగం అనే ఆయన ఉండేవాడు. "అంతా ఆ భగవంతుడి దయ శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు" అంటూ ఉండేవాడు ఆకస్మాత్తుగా అతని ఏకైక సంతానం ఐదేళ్ళ కొడుకు నురగలు కక్కి చచ్చిపోయాడు. "భగవంతుడు నానొసట ఈ దుఃఖం రాసి పెట్టాడు" అనేవాడు.    
    ఆ పిల్లవాడికి ఆడుకుంటూ ఉంటే మేకు గుచ్చుకుంది అది తుప్పుపట్టిన మేకు గాయం లోతుగా తగల్లేదు అదేపోతుందిలే అని తడిగుడ్డ గట్టిగా చుట్టింది అతని భార్య రక్తం కారడం ఆగిపోయింది. జ్వరం వస్తే ఏవో మాత్రలు వేశారు. వెంటనే డాక్టరు దగ్గరకు తీసుకుని వెళ్ళి యాన్ టీ టిటానిక్ ఇంజక్షన్ ఇప్పిస్తే ఆ ప్రమాదం నుంచి బయటపడేవాడు కాని కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న ఆ తండ్రి మాత్రం ఆ విషయాన్ని అంగీకరించడు.   
    సంప్రదాయాన్ని పట్టుకుని వేలాడే కుటుంబంలో ఒక బాల వితంతువు ఉంది ఆమె అనేక బాధలు అనుభవించింది అందరూ ఆమె పూర్వజన్మలో ఏ పాపం చేసిందో, పాపం! ఈ జన్మలో అనుభవిస్తూందని జాలిపడేవారు ఆ పిల్ల చాలా అందమైంది.
    ఆధునిక భావాలుగల ఒక యువకుడు ఆ అమ్మాయిని ఆకర్షించి, రహస్యంగా తీసుకెళ్ళి పెళ్ళిచేసుకున్నాడు. కొన్ని రోజులు తల్లీ, తండ్రి లబలబలాడారు ఇప్పుడు ఆ అమ్మాయి ఎంతో సుఖంగా ఉన్నది ఆమె పూర్వ జన్మలో చేసిన పాపం ఏమయింది?
    కాకతాళీయంగా జరిగే సంఘటనలకు కూడా మనం అదృష్టాన్ని ఆపాదిస్తాము. వాస్తవంగా చూస్తే అదృష్టం అనేది ఏదీలేదు ఈ వైజ్ఞానిక యుగంలో కూడా కర్మ సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడే వాళ్ళ సంఖ్యే మనదేశంలో అధికం రాకెట్టూ, అణు బాంబులూ, టెలివిజన్లూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని కూర్చున్న వాళ్ళ ద్వారా కనుగొనబడినవి కావు.
    ప్రపంచంలో ప్రసిద్ధులయిన అన్వేషకులూ, ఇంజనీర్లు, డాక్టర్లూ, శ్రమ జీవులూ కర్మ సిద్ధాంతానికి తమ తమ ప్రతిభను వదిలేసి కాలు మీదకాలు వేసుకొని కూర్చుంటే, ఈనాడు మనకు ఈ రైళ్ళూ, విమానాలు, రాకెట్లూ, టెలిఫోన్లూ, రేడియోలూ లభించేవా? ఒకనాడు క్షయ వ్యాధి వస్తే నయం అయేది కాదు ఈనాడు ఈ వ్యాధి వల్ల ఎవరూ చనిపోవడం లేదు కారణం?
    కర్మ సిద్ధాంతాన్ని సోమరిపోతులు సృష్టించారు స్వార్థపరులు కల్పించారు మానవ అభ్యుదయ పథంలో అన్నింటి కంటే పెద్ద అవరోధం ఈ కర్మ సిద్ధాంతాలే గమ్యాన్ని చేరాలంటే మనిషి నడవాలి అనేది అందరికీ తెలిసిన విషయమే మతమూ, కర్మ సిద్ధాంతమూ ఒక కణానికి వుండే రెండు ముఖాలు మతంలో నమ్మకం ఉండేవాడికి కర్మ సిద్ధాంతంలో కూడా నమ్మకం ఉండి తీరుతుంది.
    రామారావు తన కూతురి పెళ్ళి చేశాడు పదితులాల బంగారం పెడతానన్నాడు అయిదు వేలు కట్నం ఇస్తానన్నాడు అది అతని తాహతుకుమించింది అయిదు వేలు ఎలాగో ఇవ్వగలిగాడు బంగారం కొనలేకపోయాడు పెళ్లయిన పెద్దకూతురి నగలకు మెరుగు పెట్టించి చిన్నకూతురికి పెళ్లిలో పెట్టాడు.
    అత్తవారింట్లో మూడునిద్రలు అయి పుట్టింటికి వచ్చాక పెద్ద కూతురినగలు తీశారు. ఆమె నగలు ఆమెకు ఇచ్చారు ఇది తెలుసుకున్న భర్తా, అత్తగారూ ఆ పిల్లకు నగలు పెడితేగాని తీసుకెళ్లమన్నారు. ఆ అమ్మాయి పుట్టింటిలోనే ఉండిపోయింది తల్లీ, తండ్రీ "దాని కర్మ" అంటారు క్రమంగా ఆ అమ్మాయికి కూడా తను దురదృష్టవంతురాలిననే నమ్మకం కలిగిపోయింది.
    భార్య దేవతావిగ్రహం ముందు తన దురదృష్టానికి ఏడుస్తుంది పైట కింద ఉన్న మాంగల్యాన్ని తీసి కళ్ళకు అద్దుకొని, కళ్లు తుడుచుకొని ఇంటి చాకిరీలో పడిపోతుంది అంతేగాని తమ కష్టాలను రెసిస్టెన్స్ తో ఎదుర్కొనే సాహసాన్ని కూడదీసుకోవడానికి ప్రయత్నించదు.   
    ఈ కర్మ సిద్ధాంతం వల్లనే ఈ దేశంలో సాధువులూ, భిక్షగాళ్ళూ దినదినాభివృద్ధి చెందుతున్నారు పని దొంగల సంఖ్య పెరిగిపోతున్నది స్త్రీ వెన్నెముకలో బలం లేకుండా పోతుంది.
    పరీక్షలకు ముందు కొబ్బరికాయలతో దేవాలయాల ముందు ప్రత్యక్షమయ్యే విద్యార్థుల్ని (యువకుల్ని, యువతుల్ని) చూస్తుంటే ఈ దేశంలో ఎప్పటికైనా అందరూ సుఖపడేరోజు వస్తుందా అనే సందేహం కలుగుతుంది నాకు.
                          నవ్వుల వెలుగులు విరజిమ్మండి!
    భర్త డ్రాయింగ్ రూంలో కూర్చుని స్నేహితులతో బాతాఖానీ కొడ్తున్నాడు. భార్య అన్నం వడ్డించి వంటింట్లో భర్త కోసం ఎదురుచూస్తూ కూర్చొని వున్నది కబురు చెయ్యగా చెయ్యగా ఆ భర్తగారు స్నేహితుల్ని పంపించి వంటింట్లోకి వచ్చారు.   
    భార్య కోపం తారాస్థాయిలో ఉన్నది. "అన్నం చల్లారిపోయింది ఎదురు చూసి చూసి వళ్ళుమండిపోయింది" అన్నది భార్య.
    "కోప్పడకు రాణీ: వీళ్ళు అన్నప్పుడల్లా వస్తారా?" అన్నాడు.
    "భోజనం చప్పగా చల్లారిపోయింది."
    "వోస్ ఇంతేగదా? ఏదీ నీ చెయ్యి ఇలా ఇవ్వు - నువ్వు చాలా వేడిగా వున్నావుగా: నీ చెయ్యి కాసేపు అన్నం మీద ఉంచెయ్!" అన్నాడు భర్త భార్యచెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. భార్య ముసిముసిగా నవ్వింది భర్త గలగలా నవ్వాడు యిద్దరూ నవ్వుకుంటూ, భోజనం ముగించారు మన ఇంట్లో, ఆఫీసులో బయటా, ప్రతీచోటా ఒకోసారి యిలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి ఎదుటి వారికి కోపం వచ్చినప్పుడు మనం సహనంతో నవ్వుతూ, చేతనైతే జోక్ చేసినట్టయితే ఆ వాతావరణంలోని టెన్ షన్ రిలాక్స్ అవుతుంది. యిది చాలా మందికి తెలిసిన విషయమే. అయినా మళ్ళీ చెబుతాను ఒక నాయకుడు ఉపన్యాసం ఇస్తున్నాడట స్టేజి మీదకు ఎవడో ఒక చెప్పు విసిరి వేశాడు అప్పుడు ఆ నాయకుడు కోపగించుకోలేదు. "రెండో చెప్పు కూడా వేస్తే నాకు ఉపయోగపడ్తాయి" అన్నాడట. దాంతో సభికులు ఘొల్లుననవ్వారట. నాయకుడు ఉపన్యాసం సాగించాడు అలా కాకుండా ఆ నాయకుడు రెచ్చిపోయి చెప్పు విసిరిన వాణ్ణి తిట్టేడనుకోండి! ఏమవుతుంది: అది రణరంగంగా మారి పోలీసులు జోక్యం కలిగించుకొనే వరకు పోవడానికి అవకాశం ఉన్నది.       
    నవ్వుతూ, నవ్వించగల లెక్చరర్స్ విద్యార్థులకు ప్రియపాత్రుడు అవుతాడు ఒక లెక్చరర్ ఆడపిల్లల కాలేజీలో పనిచేస్తున్నాడు ఆయన క్లాస్ లో ఒకరోజు కొందరు ఆడపిలలు పాఠం వినకుండా కబుర్లలో పడిపోయారు అది చూసి ఆయన "సాధారణంగా అందమయిన ఆడపిల్లలు తక్కువ మాట్లాడతారు" అన్నాడు ఒక్కసారి క్లాసులో శాంతి నెలకొన్నది.   
    ఆధునిక యుగంలో మనిషి జీవితం చాలా సమస్యలతో క్లిష్టంగా తయారైంది మానసికమైన టెన్ షన్ ప్రతివాళ్ళలోనూ ఉంటుంది ఈ మానసికమైన గింజులాటే అనేక రోగాలకు కారణం అంటున్నారు డాక్టర్లు. రిలాక్స్ కావాలి అని చెబుతారు ఈ అస్తవ్యస్త జీవితంలో తాను నవ్వుతూ నాలుగువైపులా వెలుగుల్ని విరజిమ్మే వ్యక్తిని అందరూ ప్రేమిస్తారు. అతని సాన్నిహిత్యం కావాలని కోరుకుంటారు కొందరి ముఖం చూస్తుంటే పొయ్యిమీద మంగలం గుర్తుకొస్తుంది వడ్లగింజలు వేస్తే పేలాలు వేగుతాయి అన్పిస్తుంది కొందరు ప్రపంచం మీదనే అలిగినట్టు కన్పిస్తారు వాళ్ళను పలకరించడానికే భయంగా ఉంటుంది. అలాంటివారు వాళ్ళూ సుఖంగా ఉండరు చుట్టూ వారినీ శాంతంగా ఉండనివ్వరు.
    ఒక యువతి కొత్తగా కాపరానికి వచ్చిందనుకోండి వంటచేసి భర్తకు వడ్డించింది తన వంటను భర్తమెచ్చుకోవాలని ఆమె ఆరాటం కూరలో కారం ఎక్కువే కాక, ఉప్పు వెయ్యడం మర్చిపోయింది ఆ భర్త ముద్దనోట్లో పెట్టుకున్నాడు గుటుక్కున మింగాడు. మంచినీళ్ళు తాగాడు కళ్ళలో నీరు తిరిగింది.  
    "ఎలా ఉంది వంట:" భార్య బిక్కమొహం వేసి అడిగింది.
    "చాలా బాగుంది."
    "మరి కళ్ళలో నీళ్ళు తిరిగినయ్యేం?"
    "ఆనందభాష్పాలు: మొదటిసారిగా నీ ప్రేమను కూరలో నూరి వండావు. ఒక ముద్ద నువ్వు కూడా తిని చూడు?" అంటూ ఒక ముద్దతీసి భార్య నోట్లో పెట్టాడు.
    భార్యకు అర్థం అయింది బాధపడింది భర్త నవ్వుతూ కొట్టేశాడు అదే అతను అన్నం వదిలేసి లేచి వెళ్ళిపోయేడే అనుకోండి ఆమె మనసు బాధపడేది వాళ్ళ దాంపత్య జీవితం ప్రారంభంలోనే అపశ్రుతిలో మొదలై ఉండేది.    
    కొందరు ఎంతో బాధలో ఉన్నా తమ మీద తాము జోక్స్ వేసుకొంటారు చుట్టూ వాళ్ళను నవ్విస్తారు ఇతరుల మీద జోక్స్ విసరడం తేలికే కాని తన మీద తాను జోక్ వేసుకోవాలంటే ఎంతో మానసిక సంస్కారం కావాలి.  
    ఇద్దరు స్నేహితుల మధ్య కూడా ఒకోసారి టెన్ షన్ రావచ్చును అలాంటప్పుడు ఏ ఒక్క వ్యక్తి నవ్వుతూ జోక్ చెయ్యగలిగినా వారి స్నేహం కలకాలం వర్ధిల్లుతుంది అలా కాకుండా కొందరు తమకు ఎవరినైనా ఏమైనా అనే అధికారం ఉంది అనుకుంటారు కాని తాము మాత్రం ఎవరైనా ఏమైనా అంటే భరించలేరు తమ మనసు చాలా సున్నితమైందిగా వారికి వారే భ్రమపడుతూ ఎదుటివారిని కించపరుస్తూ ఉంటారు.     
    కొంతమంది ఉంటారు ఎంతసేపూ స్వంత డబ్బా వాయిస్తూ ఉంటారు తనను తాను పొగుడుకొనే వ్యక్తి ఎదుటి వారి దృష్టిలో ఎంత చులకన అవుతాడో పాపం అతనికి తెలియదు స్వంత డబ్బా కొట్టుకునే వారిలో గుణం "పరనింద" కూడా ఉంటుంది ఇలాంటి వ్యక్తులకు నిజమైన స్నేహితులు ఉండరు.                  

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra