Home » Balabhadrapatruni ramani » Priyathama O Priyathama


    అభినవ్ నవ్వుతున్నాడు. అతని చెయ్యి ఇంకా ఆమె తల మీదే వుంది.
    'మంజీర నవ్వాలి! ఏడవకూడదు. నవ్వాలి అంటే నా చెంప మీద కొట్టి నవ్వాలి అంతేనా! అయితే సరే, కానీ... అందర్నీ పిలవనా?" అంటూ తన చెంప ఆమెకి అందిస్తూ, కళ్ళు మూసుకున్నాడు.
    మంజీర ఇంకా ఆశ్చర్యం నుండి కోలుకోనట్లు, అలాగే అతన్ని చూస్తూ ఉండిపోయింది.
    "ఊ... కానీ" అన్నాడు అతను కళ్ళు తెరుస్తూ.
    "యూ... రియల్లీ.." అంటూ తన గుప్పెళ్ళతో అతని గుండెల మీద సుతారంగా కొడ్తూ, వెక్కి వెక్కి ఏడుస్తూ, అతన్ని హత్తుకుపోయింది మంజీర.
    "ఐయామ్ రియల్లీ లక్కీ!" ఆమె చెవిలో నెమ్మదిగా చెప్పి, ఆమెని మరింతగా దగ్గరకి తీసుకున్నాడు అభినవ్.


                                                  *    *    *    *


    అరుంధతికి మళ్ళీ జ్వరం తిరగబెట్టింది.
    'లూ' ఆమెకి రాత్రిపగలూ కనిపెట్టుకొని సపర్యలు చేస్తున్నాడు.
    సుమిత్రకిది కొరుకుడు పడడం లేదు.
    "చూసారా భాగోతం! రాత్రిళ్లు కూడా ఆమె గదిలో ఇతనికి ఏం పనీ? నాకు ఒళ్ళు మండిపోతోంది. కడిగేస్తాను ఎప్పుడో" అంది భర్తతో.
    "తొందరపడకు! నాలుగు రోజులు ఓపికపట్టు" చెప్పాడు నారాయణమూర్తి.
    అతను తనని నాలుగు రోజులు ఎందుకు ఓపిక పట్టమన్నాడో, నాలుగు రోజులు పోయాక తెలిసింది సుమిత్రకి.
    నాలుగు రోజుల్లో అరుంధతికి నెమ్మళించింది.
    ఆ రోజు భోజనాల దగ్గర 'లూ' చెప్పాడు.
    "నేనూ, అరుంధతీ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోబోతున్నాము. బ్రతికిన నాలుగు నాళ్ళూ కలిసే బ్రతుకుతాము."
    సుమిత్ర తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది.
    నారాయణమూర్తి లేచి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
    అరుంధతి గదిలోనే ఉంది. 'లూ' కూడా బైటికి వెళ్ళిపోయాక, సుమిత్ర గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. "ఇదేనా సాంప్రదాయం? ఇదేనా మంచీ మర్యాదా? ఈ వయసులో ఇద్దరికీ సిగ్గూ శరం ఉండఖ్కర్లా! ఛీ, ఛీ నిన్నటిదాకా మడి చీర విప్పకుండా, ముసుగేసుకుని తిరిగి, ఈనాడు ఇలా... అవ్వ! నలుగురిలో మేము తలెత్తుకుని బతకాలా? వద్దా! ఈ ముచ్చట చూడడానికేనా బలవంతంగా నన్నూ, నా బిడ్డనూ ఈ దేశం లాక్కొచ్చారూ! ఆ దేశంకన్నా ఈ దేశం ఏం తక్కువ తిందీ! నా దేశం, నా సంస్కృతీ అని గుండెలు బాదుకున్నారుగా!" ఇలా ఆమె ధోరణి సాగిపోతూనే ఉంది.
    మంజీరకి ఏమీ అర్థం కాకుండా ఉంది పరిస్థితి. ఎవరిది తప్పు? తన తల్లిదా? లేక వారిదా? ఆమె మనస్సుని సమాధాన పరుచుకోవడానికి అభినవ్ ఇంటికి బయల్దేరింది.


                                                      *    *    *    *


    "అభీ! ఈ వయసులో కూడా అలాంటి స్పందనలు ఉంటాయా? సమాజాన్ని ఎదిరించి ఐనా సరే, కలిసే ఉండాలి అన్న నిర్ణయం తీసుకున్నారంటే వారిది నిజమైన ప్రేమ అనాలా? లేక కామం..."
    "మంజీరా!" అన్న అరుపు జానకి నోటి నుండి వచ్చింది.
    అభినవ్, మంజీరా వెనక్కి తిరిగి చూసారు.
    జానకి గదిలోకి వస్తూ అంది. "మీ సంభాషణ నాకు వినిపిస్తూనే ఉంది. దానికి జవాబు నేను చెప్తాను. ప్రేమించుకోవడానికి వయసుతో నిమిత్తం లేదమ్మా. ఒంటరితనం లోంచి నాకు ఓ తోడు కావాలి అనే తృష్ణ పుడ్తుంది. ఆ తృష్ణని తీర్చే వారుంటే, వారితో ఏర్పరుచుకునే ఆ బంధాన్ని స్నేహం, ప్రేమా అని ఏ పేరైనా పెట్టుకోవచ్చు! మనిషికి అనాదిగా గుర్తింపు కావాలి. తోడు కావాలి. అది కనీసపు కోరిక! అన్నం, బట్టా, గూడూతోపాటు తీరవలసిన కోరిక, ఐనా దానికి అందరూ తప్పు పడ్తారు. ఒకరికి అన్యాయం జరగనంత వరకూ, ఆ కోరికలో తప్పు లేదనే నా అభిప్రాయం. అరుంధతిగారు జీవితంలో ఏం పొందారూ? భర్త వల్ల కనీసం బిడ్డా, పాపా కూడా పొందలేదు. పిల్లల వల్ల ఆ లోటు తీరకపోయినా కనీసం వారు మనస్సుకి వ్యాపకం కలిగించి ఉండేవారేమో! అటువంటి ఒంటరి జీవితంలో ఒక మనిషి వెలుగు ప్రసాదిస్తానంటే, ఆ స్నేహపూరితమైన చెయ్యి అందుకోవడం తప్పా! ఆమె జీవితాన్ని గురించి విమర్శించే హక్కు మనకి ఎక్కడిది? విమర్శించే ఈ లోకం ఎప్పుడైనా ఆమె కోరికలూ, ఆనందం ఎందులో ఉన్నాయో ఆలోచించి తీర్చడానికి ప్రయత్నించారా? ఆయనా, ఆవిడా ఇద్దరూ ఒంటరిగా తలా ఒక చోటా ఉండేకన్నా, ఒకేచోట ఉండడంలో ఆనందముంది అనుకున్నారు. అందులో తప్పేంలేదు."
    తల్లిలో అంత వివేకం, విచక్షణా ఉన్నాయని అభినవ్ కి ఆ నిమిషం దాకా తెలియదు. అబ్బురంగా చూసాడు తల్లి వైపు.
    "ఔను ఆంటీ! అమెరికాలో పెరిగినా అమలాపురంలో పెరిగినా ఒకటే మనసు పరిపక్వత చెందకపోతే ఎంత వెనకబడి ఆలోచిస్తామో నాకు ఇప్పుడే తెలిసింది. అమ్మ మాటలు విని నేనూ వాళ్ళని తప్పు పట్టాను. కానీ, ఇప్పుడు నాకు అర్థం అయింది. వాళ్ళు చేస్తున్న దానిలో తప్పులేదు. వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఆ విషయం మమ్మీకి కూడా అర్థం అయ్యేటట్లు చెప్తాను" అంది మంజీర.
    "నాకూ ఆ కొత్త జంటని ఓసారి చూసి అభినందించాలని ఉంది. నేనూ వస్తా పద!" అన్నాడు అభినవ్ ఆమెతో.
    కొడుకూ, ఆ అమ్మాయీ కలిసి వెళ్తుంటే జానకి ఏమీ అభ్యంతరం పెట్టలేదు.
    "మనసుల్ని కట్టి పడవేసే శక్తి మానవులకి లేదు" అనుకుంది. అందుకేనేమో... ప్రేమంటే, జీవితంలో ఒక భాగంగా పరిచయమయి, అదే జీవితం అనిపించేటంతగా మనని మార్చి వేసే అద్భుతశక్తి అని ఎక్కడో చదివిన గుర్తు!


                                                  *    *    *    *


    మంజీరా, అభీ ఇద్దరూ కలిసి అడుగులు వేస్తున్నారు.
    అతని చేతిలో ఆమె చెయ్యి ఇమిడి వుంది.
    ఆమెకి ఏదో నిశ్చింత పొందినట్లుగా హాయిగా ఉంది!
    "అభీ, నీతో కొన్ని విషయాలు చెప్పాలి" ఆమె నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అంది.
    "చెప్పు"
    "చెప్పాక నన్ను అసహ్యించుకుంటావేమో!"
    అతను నవ్వాడు.
    "ఇప్పుడు నవ్వి ఊర్కున్నా, తరువాత, తరువాత నన్ను అసహ్యించుకుంటావేమో!"
    "నిన్ను నేను అసహ్యించుకునేటంత పెద్ద సంగతులు నువ్వేం చేసావు?"
    మంజీర తల వంచుకుని, "అక్కడ కూర్చుని మాట్లాడుకుందామా?" అంది పార్కువైపు చూపిస్తూ.
    ఇద్దరూ అటు నడిచి, ఒక బెంచీ మీద కూర్చున్నారు.
    మంజీర చెప్పడం ప్రారంభించింది. తన చిన్నతనం నుంచీ తనకు అలవాటైన తొందరపాటు గురించీ, తన బోయ్ ఫ్రెండ్స్ గురించీ.
    "పీటర్ నన్ను ఓసారి ముద్దు పెట్టుకున్నాడు. నేను అతని కోసం ఇంట్లోంచి డబ్బు దొంగతనం చేసి పట్టుబడ్డాను. నేను అతన్ని ప్రేమించాను అనుకున్నాను. నాన్న కాదన్నారు. నిజమైన ప్రేమ ఇలా ఉండదన్నారు. ప్రేమికులు విడిగా ఉండలేరు అన్నారు. నాన్న చెప్పిందే నిజమయింది. చిత్రంగా 'ఫ్లైన్' ఎక్కగానే నేను అతన్ని మరిచిపోయి, పక్కనున్న యువకుడ్ని ఏడిపించడంలో మునిగిపోయాను. అతని పెదవుల మీద ముద్దు పెట్టాను. అతను నన్ను ముట్టుకుంటే ఆ స్పర్శ భరించలేకపోయాను. దాన్ని ఏవంటారూ? నాకు కామమా? లేక పిచ్చా? పల్లెటూరి వాడ్ని అమాయకుడ్నీ అశ్వత్థని ఆట పట్టించాను. అతనికి ముద్దుపెట్టి రెచ్చగొట్టాను. అతను వచ్చాక కొట్టించాను. ఏదో అసంతృప్తి. ఏదో వెలితి నా చేత అలా చేయించేది. నిన్ను మొదటిరోజు కొట్టినప్పుడూ అలాంటి సంతృప్తే. నా 'అహం' నా చేత ఆలా ఆడించేది. కానీ, నీ స్పర్శ కోసం, నీకోసం నేను తపించిపోయాను. నువ్వు లేని ప్రతిక్షణం నాకు నరకంగా తోచేది. అభీ! నువ్వు పవిత్రుడివి. ధర్మాచార పరాయణురాలైన తల్లి పెంపకంలో, బుద్ధిగా పెరిగి పెద్దయిన వాడివి. నేను అపవిత్రురాలిని. శీలం, సౌశీల్యం అనేవాటికి అర్థం తెలియకుండా పెరిగినదాన్ని. నిన్ను తాకడానికి కూడా నాకు అర్హత లేదేమో! నన్ను... నన్ను..." ఆమె సన్నగా ఏడుపు మొదలుపెట్టింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra