Home » Yandamuri veerendranath » చెంగల్వ పూదండ


    పేపర్ బోయ్ ఈవెనింగ్ ఎడిషన్ పడేసి వెళ్ళిపోయాడు. లక్ష్మీనారాయణ ఎదురు కుర్చీలో కూర్చొని వున్నాడు.

    "ఏమిటి విశేషాలు?" అడిగేడు.

    "ఏముంటాయి.....మామూలు రాజకీయాలే?" అన్నాను. పేపరు చూస్తూ -అంతలో మూడో పేజీలో ఒక వార్తా నన్ను ఆకర్షిస్తోంది. వంగి కుతూహలంగా చదవసాగేను. పూర్తిగా చదివేసరికి రక్తం పూర్తిగా యింకిపోయినట్టు నా మొహం తెల్లగా పాలిపోయింది.

    "ఏమైంది?" అడిగేడు లక్ష్మీనారాయణ.

    "ఏం లేదు? ఏం లేదు" అన్నాను నా కలవరపాటును అనుచుకోవటానికి ప్రయత్నిస్తూ.

    "ఏం లేదంటారేమిటి? ఏదో వుంది. ఆ పేపరిలా ఇయ్యి" అన్నాడు భార్యతో. అప్పటివరకు మా ఇద్దరి మధ్య సంభాషణనీ తెల్లబోయి చూస్తున్న అతడి భార్య ఈ లోకంలోకి వచ్చినట్టు చప్పున వంగొని పేపరు తీయబోయింది.

    "వద్దు-ఇవ్వకండి" అన్నాను దాదాపు అరుస్తున్నట్టు. ఆమె బెదిరినట్టు చెయ్యి వెనక్కి తీసుకొంది. దాంతో అతడిలో మరింత అనుమానం పెరిగి "ఇవ్వు, లేకపోతే ఒట్టే-" అన్నాడు.

    ఆమె నావైపు చూసింది, నేను మాట్లాడలేదు. ఆమె వంగి, పేపరుతీసి, అతడికి అందించింది. అతడు తొందర తొందరగా పేపరు పరకాయించి చూస్తూ -"ఎక్కడ-ఏమిటి" అన్నాడు.

    కుర్చీ వెనక్కి జారబడి  కూర్చొని అరచేయి నుదుటిమీద వేసుకొని "మూడోపేజి నాలుగో కాలమ్" చెప్పాను నిర్వేదంగా.

    క్షణంపాటు భయంకరమైన నిశ్శబ్దం ఆ గదిలో నాట్యం చేసింది. ఆ తరువాత లక్ష్మీనారాయణ కీచుపెట్టిన కేక వికృతంగా ప్రతిధ్వనించింది.

    "......అంటే.....అంటే" అడిగాడు. నేను మాట్లాడలేదు.

    "ఇది నిజమేనా - నిజంగానే జరిగిందా" దాదాపు రోదిస్తున్నట్టు అడిగేడు.

    "ఏం జరిగిందండీ, ఆ పేపరు యిలా యివ్వండి" అంది అతని భార్య కంగారుపడుతూ.

    "నువ్వూరుకోవే" కసురుకొంటున్నట్టు గట్టిగా అరిచి, నా వైపు తిరిగేడు-

    "మీరు మాట్లాడండీ! ఏమీ మాట్లాడకపోతే పిచ్చెక్కిపోతుంది".

    కళ్ళమీదనుంచి చేతులు తియ్యకుండా, చాలా చిన్న స్వరంతో నెమ్మదిగా చెప్పాను.

    "ఏం మాట్లాడను? అందులో వున్న వార్తే నిజమైతే మనం సరుకు ఎగుమతి చేసిన దేశం తన కరెన్సీని ఇరవై  నాలుగు  పర్సెంట్ డివాల్యూ చేసింది. అంటే దాదాపు తొమ్మిది లక్షలు దాకా మనకి నష్టం రాబోతుంది. ఈ వార్తా తెలియగానే రేపు మనకు బ్యాంక్ నుంచి లెటర్ వస్తుంది! గ్యారంటీగా నిలబడ్డందుకు మన ఆస్తులు జప్తు చేయబడతాయి! సెక్యూరిటీ యిచ్చినందుకు మన ఇళ్ళు స్వాధీనం చేసుకోబడతాయి! మన ఆస్తులన్నీ కలిపినా ఈ నష్టం పూడదు. సర్వనాశనం అయ్యాము. లక్ష్మీనారాయణగారూ రేపట్నుంచీ జోలె పట్టుకొని వీధిలో నిలబడవలసిన పరిస్థితి మనది-"


                                                                           15

   
    అతడికి స్పృహ వచ్చేసరికి రాత్రి తొమ్మిదయింది. డాక్టర్ ఇంజక్షన్ చేసి, ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు.

    అతడు మాట్లాడలేదు. పై కప్పుకేసి చూస్తూ మౌనంగా పడుకొన్నాడు ఆ మౌనం భయంకరమయింది. ఎవరన్నా మాట్లాడిస్తే, కళ్ళు తిప్పి చూస్తున్నాడు కానీ, ప్రశ్నకి జవాబు చెప్పటంలేదు. అతడి స్థితిని వూహించగలగటం కష్టమైన పనేవీ కాదు. ఇకనుంచి అతడు ప్రతి చిన్న విషయానికి భార్యమీదనే ఆధారపడాలి. భార్య పేరుమీద ఏదన్నా ఆస్ధి వుంటే  దానిమీద బ్రతకాలి! లేకపోతే అదీ లేదు....గొప్పగా బ్రతికిన వాడికి యింతకన్నా నరకం ఏముంటుంది?

    అతడివైపే చూస్తూ కూర్చొన్నాను.

    అతడి భార్య గ్లాసుతో పాలు తీసుకొచ్చింది! అతి కష్టం మీద తాగించేం. తాగి నిస్త్రాణగా పడుకొన్నాడు.

    నా గదిలోకి వచ్చేశాను.

    కిటికీ తలుపులు తెరిచి బయటకు చూస్తూ నిలబడ్డాను. వాన జల్లులు జల్లులుగా పడుతోంది. మెరిసినప్పుడళ్ళా గదంతా ఎర్రగా ప్రతిబింబిస్తోంది. దూరంగా ఎక్కడో ఉరుముతోంది.

    సంఘర్షణ -సంఘర్షణ

    గదిలో లైటు వేసేను!

    వాల్ టు వాల్ కార్పెట్ మెరుస్తోంది. అక్వేరియంలో చేపలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీపకాంతి వీనస్ బొమ్మమీద విశ్లేషణం చెందుతోంది. వెనీషియస్ బైండ్స్ లోంచి వెలుగు బయటపడుతోంది. దూరంగా పన్నెండు కొట్టింది.

    లక్ష్మీనారాయణ పడుకున్న గది దగ్గరకు వచ్చాను. కిటికీ రెక్క సగం వేసి వుంది. నెమ్మదిగా తోశాను. చప్పుడికి అతడి భార్య కళ్ళువిప్పి చూసింది. బయటకు రమ్మని సైగచేసేను. ఆమె లేచి బయటకు వచ్చింది.

    బయట చీకట్లో కాలికి తగిలి, రౌండ్ టేబిల్ మీదవున్న గ్లాసుక్రిందపడి చప్పుడయింది. కిటికీలోంచి మళ్ళీ చూసేను. లక్ష్మీనారాయణ కళ్ళు విప్పి పక్కనే వున్న ఖాళీ పడకవైపు చూస్తున్నాడు.

    ఇంతలో ఆమె నా దగ్గరగా వచ్చి "ఎందుకు పిల్చేరు?" అంది.

    "నీతో మాట్లాడాలి" అన్నాను.

    "ఇప్పుడా?"

    "అవును, ఇప్పుడే, ఈ క్షణమే. ఇది సెటిల్ అవకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది" అన్నాను.

    "ష్" అందామె నెమ్మదిగా మాట్లాడమన్నట్టు. కిటికీరెక్క కొంచెం తెరిచి, లోపలికి చూసి దగ్గరగా వేస్తూ "నిద్రపోతున్నాడు" అన్నాడు.

    "ఏమిటి చెప్పండి."

    ఆమె భుజాలచుట్టూ చేతులు వేసి "రేపు నేను వెళ్ళిపోతున్నాను- తెల్లవారకుండానే" చెప్పాను.

    "ఎక్కడికి" అందామె విస్మయంతో.

    "రేపటికి అందరికీ తెలిసిపోతుంది ఈ విషయం. పూలమ్మినచోట కట్టెలు అమ్ముకొని బ్రతకటం యిష్టంలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను."

    "మరి.....మరి మా సంగతి" ఆందోళన ఆమె కంఠంలో ప్రతిధ్వనించింది.

    "ఆ విషయమే చెప్తున్నాను" ఆగి ఆమె చేతిని నా చేతిలోకి తీసుకున్నాను.

    "ఇంతకాలం ప్రేమంటే ఏమిటో తెలియదు. కాని నిన్ను చూసేక అర్థమయింది, నేనేం కోల్పోయానో."

    ఆమె ఆశ్చర్యంతో  కళ్ళు పెద్దవి చేసుకుని చూడటం గమనించి, 'అవును! ఇక్కడ నీకింకేం వుంది? నాతో వచ్చేయి. నా ఆస్థి అంతా అమ్మేసి శంకర్ దాదాతో పంపిన సంగతి నీకు తెలుసు. ఆలోచించుకో" ఆమె శరీరం మీద నా వ్రేళ్ళు నాట్యం చేయసాగేయి. "ప్లీజ్- నాతో వచ్చేయ్. ఇక్కడ కష్టాలు కన్న ఇంకేవీ లేవు నీకు. నాతో వచ్చేస్తే ఇంకో చోట కొత్త జీవితం మొదలుపెడ్దాం. నీకు ఏ  కష్టమూ రాకుండా పూవుల్లో పెట్టి చూసుకుంటాను. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను. రాననకు ప్లీజ్" అన్నాను.

    ఆమె రానని వుంటే ఎంతో సంతోషించి ఓటమి ఒప్పుకుని వెళ్ళిపోయి వుండేవాణ్నేమో, కాని ఆమె తన నలభై ఏళ్ళ శరీరాన్ని నాకేసి అదుముతూ "వస్తాను" అంది. మా సంభాషణ- లక్ష్మీనారాయణ విన్నాడని  నాకు తెలుసు.

    ఏదో చప్పుడై మెలకువ వచ్చింది.

    టేబుల్ లైట్ స్విచ్ వేసేను.

    మళ్ళీ చప్పుడు వినిపించింది.

    లైటార్పి బయటకొచ్చాను.

    లక్ష్మీనారాయణ గదిలోంచి వినిపిస్తోంది. అప్పుడు వెళ్ళి తలుపుతోసేను.

     పక్కమీదనుంచి క్రిందకు నేలమీదకు పడిపోయివున్నాడు. బాధతో అటూ ఇటూ పొర్లుతున్నాడు.

    దగ్గరగా వెళ్ళేను.

    మొహం అంతా వికృతంగా మారిపోయింది.

    అతను తన జీవితపు ఆఖరి క్షణాల్లో వున్నాడు.

    "బాధ - బాధ" అంటున్నాడు. మోకాళ్ళమీద వంగి అతడి పక్కన కూర్చొన్నాను.

    "బాధ.........." జుగుప్సతో నా పళ్ళు బిగుసుకున్నాయి. "వళ్ళంతా కుష్టుతినేసి నా అనేవాడు లేక - హొరున కురిసే వర్షంలో - మర్రిచెట్టు క్రింద దిక్కులేని చావు చచ్చిపోతున్నప్పుడు నా ప్రియమైన స్నేహితురాలు అనుభవించిన బాధతో పోల్చుకుంటే ఇదే పాటిది?"

    నా మతాల అలికిడికి అతడు కళ్ళు తెరిచి నన్ను  చూసి, "ద్రోహి" అన్నాడు. అతడి జుట్టు పట్టుకొని తలని పైకి లేపేను.

    'ఎవడ్రా ద్రోహి? ఒక అమాయకుడ్ని జైల్లోకి తోసేవు. అనాధగా వున్న ఒక  అబలని నీ కామానికి బలి చేసేవు. ఎనిమిది నెలల గర్భిణిని వెలయాలిగా అమ్మేసేవు. నువ్వురా ద్రోహివి-నువ్వు."

    నావైపే తదేకంగా చూస్తున్న అతడి మొహంలో రంగులుమారేయి. నన్ను గుర్తించినట్టూ "ను....నువ్వు" ఏదో అనబోయేడు. మాటరాలేదు. తల పక్కకి వాలిపోయింది. చేతిలోంచి నిద్రమాత్రల సీసా నేలమీద దొర్లింది.


                                    16


    తలుపు దగ్గిరగా వేసి నా గదిలోకి వచ్చేను. అతడి భార్య ఇంకా నిద్రలోనే వుంది.

    డ్రాయర్ సొరుగు చప్పుడు కాకుండా తీసి, రివాల్వర్ జేబులో వేసుకొని బయటకొచ్చేశాను.

    నాలుగయింది. మేఘాలు చెదిరి వెన్నెల పిండార బోసినట్టు  వుంది.

    ప్రహరీగోడ తలుపువేస్తూ - నా ఇంటివేపు ఆఖరిసారి చూసేను. వెన్నెల్లో వీడ్కోలు చెబుతున్నట్టు వుంది. పార్వతి ఇంటిస్థానే వెలసిన లక్ష్మీనారాయణ ఇల్లు దీపం పెట్టేవారు లేక వెలవెలబోతూ వుంది.

    ఆఖరిసారి చుట్టూ పరికించి చూసి వడివడిగా అడుగులు వేసుకుంటూ చీకట్లో కలిసిపోయేను.

    నాలుగు వీధులు దాటేసరికి పావుగంట పట్టింది. తడిసిన కలప మీద నుంచి వస్తోన్న గాలి వింత పరిమళాన్ని తెస్తోంది - ఎత్తుగా వున్న కర్రల గుట్టల నీడలు విశాలంగా పరచుకొని వున్నాయి.

    గుమ్మం దగ్గర నిలబడి తలుపు తట్టేడు. రెండు నిమిషాల్లో ఎవరో లేచిన అలికిడి వినిపించింది.

    "ఎవరూ" అంటూ బాబాయ్ కళ్ళు నులుముకుంటూ వచ్చి తలుపు తీసి, నన్ను చూడగానే సంభ్రమాశ్చర్యాలతో "రండి......రండి" అన్నాడు. తెల్లవారుజామునే నన్ను చూసిన ఆశ్చర్యం అతడి కళ్ళల్లో కదులుతోంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra