Home » Chandu harshavardhan » ది బ్లడ్


    'అయితే...ఈయన ఎవరో పూర్తిగా తెలియకుండానే, ఆపద్భాందవుడని నమ్మి వెంటపడి వెళ్ళడం...'

    పండీపండని వ్యక్తిత్వంతో, తెలిసీతెలియని లోకజ్ఞతతో ఊగిసలాడిపోతున్నది సింధు. ఇప్పుడేం చేయాలి...? ఏం చేయాలి...?

    "కలిసొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవడం అంటే ఇదే. నువ్వు నిజంగా నష్టజాతకురాలివేనమ్మాయ్! చావు బ్రతుకుల మధ్య చితికిపోతున్న నువ్వు ఏ మాత్రం అవకాశం దొరికినా చేజారిపోనీక జీవించడము కోసమే అంతిమ పోరాటం సల్పాలే కాని, లేనిపోని కుశ్సంకలతో, అనుమానాలతో, అలసత్వంతో నీలో నువ్వే కుంచించుకుపోకూడదు. వివేకవంతురాలివైతే వెంటనే మేల్కొని విజ్ఞతతో వ్యవహరిస్తావు, లేదా నీ ఖర్మ! వెళ్లొస్తాను..." అంటూ అతను వెనుదిరిగాడు. వేగంగా నాలుగడుగులు వేశాడు.

    "సార్!" ఆతురతగా అతని చేతిని పట్టుకుంది సింధు...

    అమాయకంగా, అయోమయంగా చూసింది. కన్నీటి తెరల మధ్యగా చూసింది...

    అది చాలు ఆనంద్ కు. అతను కర్తవ్యాన్ని తక్షణమే గుర్తించాడు.

    ఇంటికి తాళం వేశాడు. ఆమెను జీప్ లో తన ప్రక్కన కూర్చోపెట్టుకున్నాడు.

    అది కదలి రయ్యిన దుమ్ములేపుకుంటూ వెళ్ళిపోయింది.

    జీప్ కు నెంబరు ప్లేటు స్థానే F/R వుండడాన్ని గమనించనే లేదు సింధు.

    అది ఆమె చేసిన తొలి తప్పిదం...

    ఇరుగు పొరుగు వారికి కనీసం మాటమాత్రమైనా చెప్పలేదు. అది రెండవ తప్పు...

    ఆతురతతో, ఉత్సుకతలో, అత్యుత్సాహంలో అతిభయంకర ఘడియలలో తప్పొప్పులు తట్టవు; అసలేమీ తోచదు...! అది సహజం. నైజం...

    సింధు సయితం...


                                                              *    *    *


    కారు బంగళాలోకి ప్రవేశిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది దానిని ఆపివేశారు.

    కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూవస్తున్న ప్రధాని పుత్రుడు అభిషేక్ భృకుటి ముడిపడింది. తన కారునే నిలువరించే దమ్ములు ఎవరికున్నాయి?

    "వాటిజ్ దిస్? వాట్ హేపెండ్ టు యు దిస్ డె...!" గర్వంగా ప్రశ్నించాడు. అధికార దర్పం అతని స్వరంలో ధ్వనించింది.

    "సారీ, సర్! సెక్యూరిటీ ఆఫీసరు కొత్తగా వచ్చారు. ప్రతికారును, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా సోదా చేయవలసిందిగా ఆదేశించారు" సెక్యూరిటీ ఇన్ స్పెక్టరు నమ్రతగా చెప్పాడు.

    "ఐ సీ...! ఆయన రాగానే నా దగ్గరకు పంపండి..." అంటూనే గేరు మార్చి కారును విసురుగా ముందుకు దూకించాడు అభిషేక్. సరాసరి పోర్టికోలోకి తీసుకువెళ్ళి ఆపి దిగి, దగ్గ్రరలో వున్న అటెండెంట్స్ కు సైగ చేశాడు. ఇరువురు అటెండెంట్స్ పరుగున వచ్చారు.

    కారు వెనుక సీటులో పడుకుని వున్న వ్యక్తిని చూపుతూ, "ఇతను స్పృహ లేకుండా రోడ్డుప్రక్కన పడివుంటే తీసుకువచ్చాను. తీసుకువెళ్ళి ఔట్ హౌస్ లో చేర్చి, వెంటనే డాక్టరుకు కబురుచేయండి. ఇతను స్పృహలోకి రాగానే నాకు తెలియపరచండి!" అంటూ ఆజ్ఞలు జారీ చేశాడు అభిషేక్. అంటూనే హాలులోకి దూసుకుపోయాడు. 

    ఆ రోజునే కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన సెక్యూరిటీ ఆఫీసరు విక్రమ్ దూరం నుంచి దీనినంతటినీ గమనిస్తూ చూస్తున్నాడు.

    "ఆగు!" తన గదిలోకి వెళ్ళబోతున్న అభిషేక్ కు చేయి అడ్డు పెట్టింది అపర్ణ.

    ఖిన్నుడయ్యాడు అభిషేక్. ప్రధాని పుత్రుడనైన తననే శాసిస్తుందా? ఎవరీమె, ఈమె తాహతేమిటి? తమ ఇంత పని చేసే ఒక ఆయా! పెక్కుమంది పరిచారికలలో ఒకతె. తమ ఎంగిలి మెతుకులు తిని బతికే ఈమె తమ అధికారాన్నే ధిక్కరిస్తుందా? కళ్ళు నెత్తికొచ్చాయా...!

    అయితే, అతనిలోని విచక్షణ క్షణం  మేలుకొంది. వెనువెంటనే తటపటాయించాడు. పులిలాంటివాడు కాస్తా పిల్లిగా మారాడు. ఆ బాల్యంగా తనను పెంచింది ఈ ఆయానే...!

    తాము స్థితిమంతులు కావచ్చు. ఇవ్వాళ అధికారంలో వుండవచ్చు. కాని...

    "సారీ, ఆంటీ! ఇవ్వాళ బ్రేక్ పాస్ట్ కు రాలేకపోయాను. ఇక నుంచి రోజూ తెల్లవారఝాము అయిదు గంటలకే వెళ్ళిపోతాను. బ్రేక్ పాస్ట్ వేళకు నేను రాలేనని డాడీకి చెప్పు!" తన ధోరణిలో నిర్లక్ష్యంగా చెబుతూనే తన గదిలోకి వెళ్ళబోయాడు. అతను సౌమ్యంగా అందామనుకున్నా, స్వరం కటువుగానే వుంది!

    "య్యూ... రాస్కెల్..."

    గంభీరమయిన ఆ కంఠధ్వనికి అపర్ణే కాదు, బంగళాలో వున్న వారంతా మ్రాన్పడిపోయారు. నిశ్చేష్టులయ్యారు. భయవిచలితులయ్యారు. అది ప్రధాని చక్రవర్తి గొంతు!

    చేత కొరడాతో అపర రుద్రునిలా అభిషేక్ వైపుకు కదిలారాయన...  

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra