Home » Dr. dasaradhi rangacharya » Sukla Yajurveda Samhitha


    ఆలోచనామృతము

    ఇది ఆవును సాగనంపుట! ఎంత ఆర్ద్రముగ ఉన్నది! మనసును కరిగించుచున్నది!!! ఎంతటి కరుణారసభరితము! ఎంతటి వాత్సల్యము!! ఎంతటి అనుబంధము!!!

    పశువును సహితము తోటిప్రాణిగా భావించుట వేదసంస్కృతి! భారతసంప్రదాయము!! మన కరుణార్ధ్రత!!!

    ఈకరుణార్ధ్ర దృశ్యము కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము నందలి శంకుతలను సాగనంపుటను తలపించుచున్నది. అచట ప్రకృతిసాంతము అశ్రుపూర్ణమగును.

    యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా
    కంఠః స్తమ్భిత బాష్పవృత్తి కలుషశ్చింతాజడం దర్శనమ్ |
    వైక్లవ్యం మమ తావదీదృశమపి స్నేహాదరణ్యౌకసః
    పీడ్యంతే గృహిణః కథంను తనయా విశ్లేషదుఃఖైర్నవైః ||

    ఇవ్వాళ శకుంతల వెళ్లిపోతున్నది. ఈమాటయే నాగుండెలో బాధగూడు కట్టినది. గొంతు పూడుకున్నది. కన్నీరునిండి చూపుమందగించినది. నేను అడవిలోని వానిని. మునిని. ఈ స్నేహము అబ్బో! నన్నే ఇంత బాధించుచున్నదే! పాపంబిడ్డను కన్నవారు కూతురును కొత్తగా అప్పగింతలు పెట్టునపుడు ఎంత బాధపడుదురో కదా!

    అంటాడు కణ్వుడు శకుంతలను సాగనంపుతూ.

    ఇంతటి మానవత, ప్రేమ, అభిమానము, వాత్పల్యము, కరుణ భారతజాతికి ఎన్ని  యుగుముల పున్నెపుపంట!

    వేదములు, ఉపనిషత్తులు, రామాయణాది మహాకావ్యములు, బుషులు, మునులు, తాత్వికులు వారి తత్త్వబోధలు భారతీయులలో ఇంతటి అనుబంధమును, అనురాగము నింపి భారత జనజీవనమును అమృతతుల్యము చేసినది.

    ఇంతటి మహాతపస్సును మరల పొగగొట్టపు పొగ బూడిదచేసినది. అది మనిషి మనసును పొగతో నింపినది. ఆత్మీయతలు, అనుబంధములు, అనురాగములు అన్నింటిని ఆవిరిచేసినది!

    "అదిత్యాః అఖండనీయా పృథివ్యాః" అని మహీధరుడు. ఈపృథ్వి సాంతము ఒక్కటియే. అది ఖండించరానిది. ముక్కలు చేయరానిది అని అర్థము.

    భగవంతుడు ఈ సమస్త భూమండలమును ఏకఖండముగా-అఖండనీయముగా సృష్టించినాడు. రాజులు, రాజకీయులు వారి అధికార దాహమునకు ఈనేలను ముక్కలు చెక్కలుగా చేసి పాలించుచున్నారు. గత అర్థశతాబ్దమును అప్పటి భారతదేశము -రాజకీయుల అధికారదాహమునకు బలియై - భారత, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూడు ముక్కలైనది.

    "మృత్పిణ్డోజలరేఖయా వలయితస్సర్వోప్యయం నన్వణుః
    స్వాంశీకృత్య సపన సంయుగశతై రాజ్ఞాంగణైర్భుజ్యతే" అన్నాడు భర్తృహరి.

    ఈభూమి ఎంత? సముద్రము చుట్టిన మట్టి ముద్ద! ఇది ఈస్పష్టిలో ఎంత? అణువంత! ఈ అణువంత కోసం రాజుల యుద్ధాలు! పంచుకోవటాలు! పాలించుటలు!!!

    24. యజమాని అనవలసినది:-

    అధ్వర్యులారా! సొమము వద్దకు వెళ్లండి. ఇది నీ గాయత్రీ ఛందోభాగము, అని నాసందేశముగా చెప్పండి. అధ్వర్యులారా! ఇది నీ  త్రిష్టుప్ ఛందోభాగము, అని నాసందేశముగా చెప్పండి. అధ్వర్యులారా! ఇది నీ జగతీ ఛందోభాగమని నా సందేశముగా చెప్పండి. అధ్వర్యులారా! 'సోమమా! నీవు అశేష ఛందో సామ్రాజ్యమును అలంకరించుము' అని నాసందేశముగా చెప్పండి.

    సోమమా! నీవు మావాడవు. ఇంద్రుడు మున్నగు దేవతల పానపాత్రములందు నిండిన నీవు సర్వసమర్థుడవు. ఋత్విక్కులు బుద్ధిమంతులు. వారు మిమ్ము వేరువేరుగా ఉంచగలరు.

    25. సవిత ద్యావాపృథ్వులందున్నవాడు కొంత ప్రజ్ఞుడు. సత్యమూర్తి. రత్నదాత. ప్రియతముడు. కవి. బుద్ధికుశలుడు. అట్టి ద్యోత మానుడగు సవితను నేను పూజింతును. సూర్యుని కాంతి బ్రాహ్మణక్షత్రియాదులను వారి పనులకు నియోగించును. సవిత అట్టివాడు. స్పృహణీయుడు. సుప్రజ్ఞుడు, అతడు తన సంకల్పమున స్వర్గమును నిర్మించినాడు.

    (సోమపు ముక్కలను తలగుడ్డలో చుట్టుకొని)

    సోమమా! నాకు సంతానము కలుగుటకు నిన్ను కట్టుచున్నాను. నా సంతానము నీకు ప్రాణప్రదానము చేయగలదు. నీవు మా సంతానమునకు ప్రాణప్రదానము చేయుము.

    26. సోమమా! నీవు దీప్యమానవు. నిన్ను దీప్యమాన స్వర్ణమున ఖరీదు చేయుదును. ఆహ్లాదకరమును, ఆహ్లాదకరముతోను, అమృతస్వరూపమును అమృతస్వరూపమునను ఖరీదు చేయుదును.

    సోమము విక్రయించుదానా! మా గోవులు, బంగారము నీకు చెందవలెను. ఆహ్లాదకర సోమము మాకు చెందవలెను.

    (మేకను సోమపు మూల్యముగా ముందుకుజరిపి) నీవు తపోదేహమవు> ప్రజాపతి వర్ణమవు> సోమమా! నీరాక వలన మాపుత్ర, పశ్వాదులు వేయింతలు పెరుగవలెను.

    27. మంచిమిత్రులను కూర్చగల సోమమా! నీవు మమ్ము మిత్రుని ద్వారా చేరుకొనుము. నీవు కోరదగిన సుఖకరుడవు. యుజమాని యొక్క సుఖకరమగు కుడితొడమీద కూర్చుండుము. స్వాన. భ్రాజ, అంధారే- వింభారే - హస్త, సుహస్త, కుషానులారా! మీరందరు 'సోమమును' రక్షించువారు. ఇవి సోమము ఖరీదుచేయు గోవులు, మేకలు, స్వర్ణాదులు. మీరు వానిని రక్షించండి.

    సోమరక్షకులారా! సోమమును-గోవులు మేకలను రక్షించునపుడు మిమ్ము రాక్షసాదులు పీడించకుండనై నేను నా ఆయుర్దాయము నుండి అమృతత్వమును అందుకొందును.

    29. మేము శుభంకరము- పాపరహితమగు మార్గమున ప్రవర్తిల్లుచున్నాము. ఈ మార్గమున మానవుడు దుష్టత్వమును విడుచును. దానితో పాటు తప్పక ధనమును అందుకొనును.

    30. కృష్ణమృగచర్మమా! నీవు నేలతోలువంటిదానవు. నేలమీద చాచుకొనుము.

    (పరచిన మృగాజినమున సోమమును ఉంచవలెను. అట్లుంచిన సోమము వరుణ స్వరూపమగును)

    వరుణుడు వరప్రదుడు. ద్యులోకమున స్తంభింపచేసిననాడు. పృథ్వివ్యంతరిక్షములను విస్తారము చేసినవాడు. శ్రేష్ఠత్వమును కొలిచినవాడు. వరుణ సామ్రాట్టు సమస్త భువనములందు వ్యాపించును స్థిరపడును.

    ఇవన్నియు వరుణుని ప్రశంసనీయ కార్యములు.

    31. వరుణుడు వృక్షాగ్రములందు అంతరిక్షమును విస్తరించినాడు. అతడు అశ్వములందు వేగమును గోవులందు క్షీరములను-యజమానుల హృదయములందు యజ్ఞమును- ప్రజలందు అగ్నిని - ద్యులోకమునందు సూర్యుని -పర్వతములందు సోమమును స్థాపించినాడు. అట్టి వరుణుని మేము స్తుతింతుము.

    32. కృష్ణాజినమా! నీవు సూర్యుని చక్షువు- అగ్ని యొక్క కంటిపాప అంతటి ఎత్తుకుచేరుము. అచట నీకు రాక్షసాది బాధలుండవు. అచటినుండి అధ్వర్యులు నిన్ను అశ్వముల మీద  తీసికోని వెళ్లుదురు.

    33. ఎద్దులారా! మీరు అశ్రురహితముగ సంతోషముగ బండిలాగుదురు. మీరు కొమ్ములతో మా శిశువులను క్రుమ్మరు. బ్రహ్మణులను యజ్ఞమునకు ప్రోత్సహింతురు. మీరు శకటమునకు సంయోజితులు కండి. మీకు శుభములు కలుగును గాత. మీరు యజమాని గృహమునకు చేరండి.

    34. సోమమా! నీవు నాకొరకు బృహత్ శుభంకరుడవు. నీవు ఋత్విజాదుల స్వామివి. నీవు వెళ్ళు మార్గములన్నింటికి నన్ను చేర్చుము. మార్గమును నిన్ను దొంగలు దొంగిలించరాదు. రాక్షసాదులు హింసించరాదు. బందిపోట్లు, పాపిష్టితోడేళ్లు నిన్ను పట్టరాదు. యజమాని గృహమే అధ్వర్యుడనగు నాకు- నీకు అనుకూలస్థానము.

    36. కొలలారా! మీరు సోమమును వహించు బండిన నియంత్రించువారలు. సోమమును వహించు బండికి కట్టిన ఎద్దులను విడిపోకుండ నిలుపువారలు. పీఠమా! నీవు యజ్ఞమున కూర్చుండ స్థానమవు. (పీట మీద మృగ చర్మమును పరచి) మృగచర్మమా! నీవు సోమమును ఉంచుటకు తగిన స్థానమవు. నీవు పీఠము మీద ఆసీనుడవగుము.

    37. సోమమా! ఋత్విజులు ఏ ఏ స్థానములందు నిన్ను హవి అర్చించి- పూజింతురో అట్టి అన్ని స్థలములకు యజ్ఞము విస్తరిల్లవలెను. నీవు యజమాని గృహమును వర్థిల్లచేయుదువు. తరింపచేయుదువు. సుపుత్రులను ప్రసాదింతువు. పుత్రపౌత్రులను హింసించవు.

    సోమమా! నీవు యజమాని గృహములందు స్వేచ్ఛగా సంచరించుము.


       
                              దాశరథి రంగాచార్య విరచిత
             శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
            శాలాప్రవేశాస్త మంత్రముల నాలుగవఅధ్యాయము సమాప్తము.
                                    సర్వేపి సుఖినస్సంతు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra