Home » Yerramsetti sai » Love Stories


    ఇల్లు చేరుకొన్నారు.

    "ఓకే! చాలా చాలా థాంక్సండీ! మీ దగ్గర ఎన్నో సహాయాలు అందుకొంటున్నాను! మరి మీ ఋణం ఎప్పటికి తీర్చుకుంటానో ఏమో!"

    "తీర్చకపోతే మిమ్మల్ని వదలనులెండి!" నవ్వుతూ అంది తను.

    రాజమండ్రి వెళ్ళేరోజు ఉదయమే వచ్చి మళ్ళీ గుర్తుచేసి వెళ్ళాడతను.

    ఆ రోజు మధ్యాహ్నం శెలవుపెట్టి ఇంటికొచ్చేసింది తను.

    "ఏవండోయ్! రడీయేనా?" నాలుగ్గంటలకు అరచాడతను.

    "ఆ రడీయే!"

    తను బయటకొచ్చింది. అతనూ అప్పుడే బయల్దేరి ఆమె కెదురుగా వచ్చాడు.

    "మీరు నాకెప్పుడూ ఇలాగే ఎదురొస్తుండాలని కోరుకొంటున్నాను - ఆ దేముడిని" అన్నాడతను వెళ్లేముందు.

    తను సిగ్గుపడిపోయింది.

    అతని మాటల కర్థం ఏమిటి? తామిద్దరూ వివాహం చేసుకోవాలనా? మనసులో తనూ అదే కోరుకొంటోంది.

    వారం రోజుల తరువాత పేపర్లో వినోద్ ఫోటో చూసింది తను.

    పోటీలలో ఉత్తమనటుడి బహుమతి గెల్చుకొన్నట్లు ప్రచురింపబడింది.

    ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోయింది తను.

    "మీరా, ఇదిగో, చూశావా! వినోద్ బెస్ట్ యాక్టర్ ఎవార్డ్ కొట్టేశాడు" అంది మీరాతో.

    మీరా నవ్వింది.

    "నువ్వే గెలిచినంత సంతోషంగా ఉందే నీకు!"

    తను సిగ్గుపడిపోయింది.

    మరో నాలుగయిదు రోజుల తరువాత వినోద్ వచ్చాడు.

    సరాసరి ఆఫీస్ కే వచ్చేశాడతను.

    "బెస్ట్ యాక్టర్ కొట్టుకొచ్చేశాను చూశారా" అన్నాడు పెద్ద కప్పు తీసి చూపుతూ.

    "నాకు ముందే తెలుసు. పేపర్లో చూశాను" అంది తను.

    "ఇంకా చాలా న్యూసుంది. ముందు మీకు చెప్పిగాని, మరొకరికి చెప్పకూడదనుకొన్నాను" నవ్వుతూ అన్నాడతను.

    "ఏమిటది?"

    "ఒక ప్రొడ్యూసర్ అప్పటికప్పుడు వాళ్ళ పిక్చర్ లో చిన్న విషం ఇచ్చాడు!"

    "నిజమేనా?" ఆశ్చర్యపోతూ అంది తను.

    "మీ దగ్గర అబద్దం చెప్తానా?" చిలిపిగా అన్నాడతను.

    తనకి ఆ వార్త సంతోషం , భయం రెండూ కలిగించింది.

    "అయితే తమరిక మద్రాసుకి మకాం మార్చేస్తారన్నమాట" అంది ఉత్సాహంగా.

    "ప్రస్తుతానికి తప్పదు మరి!..."

    "మరి అక్కడ మీ కెదురెవరొస్తారు?"

    అంతవరకూ ఉత్సాహంగా ఉన్న అతను చప్పున క్రుంగిపోయాడు.

    "అవునండీ! ఆ విషయం ఆలోచించనేలేదు!"

    "భలేవారే మీరు! ఈ రోజుల్లో కూడా ఇంకా పాత నమ్మకాలూ, మూఢాచారాలూ పట్టుక్కూర్చున్నారేమిటి?"

    "మీకో విషయం చెప్పనా?"

    "ఏమిటది?"

    "మీరేమీ కోప్పడనంటే చెప్తాను."

    తనకి గుండెలు వేగంగా కొట్టుకోసాగినయ్. "ఏం చెప్పబోతున్నాడతను?"

    "ఫరవాలేదు, చెప్పండి."

    "నిజానికి నా కసలు - ఇలా ఎదురు రావటం మీదా - శకునాల మీదా నమ్మకం లేదు. కేవలం మీతో పరిచయం కోసం - మీ మీద ఇష్టంతో - అవన్నీ కలిపించి చెప్పాను! ఇంకా చెప్పాలంటే... మీరు... మిమ్మల్ని చూసిన మరుక్షణం నుంచే ప్రేమిస్తున్నాను."

    తనకి కోపం - నవ్వూ రెండూ వచ్చినయ్!

    `"అయితే నా దగ్గర కూడా నటించారన్నమాట!"

    "సారీ! మీ కోసమే- మీ దగ్గర కూడా నటించాల్సి వచ్చింది!"

    తను పెన్నుతో తెల్లకాగితం మీద తన పేరు రాస్తూండిపోయింది.

    "నన్ను వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా?"

    చిరునవ్వు నవ్వింది తను.

    "ఆఫీస్ లోనా ఈ విషయాలు" అంది నవ్వాపుకుంటూ.

    "సరే, తరువాత కలుసుకొంటాను!" వెళ్ళిపోయాడతను.

    మరికొద్ది రోజుల తర్వాత అతను మద్రాసు వెళ్ళిపోయాడు. తను స్టేషన్ కెళ్ళింది. తన చేతిని అందుకొని పెదాలతో స్పృశించాడతను.

    "అక్కడ పరిస్థితెలా ఉంటుందో తెలీదు! సినిమాల్లో సెటిలయితే మీరూ వచ్చేద్దురు గాని!"

    కళ్ళల్లో నీళ్ళు నిండుతుండగా తలూపింది తను.

    రైలు వెళ్ళిపోయింది.

    అంతే! అతని దగ్గర్నుంచి ఒకటి రెండు ఉత్తరాలు వచ్చినయ్.

    "సౌదా! నేనిక్కడ నటిస్తున్నాను. సినిమాల్లో - సినిమా బయటా కూడా నటనే! ఈ జీవితం నాకు విసుగు కలిగిస్తోంది. కాని ఈ గ్లామరస్ ప్రపంచాన్ని వదలడం కూడా కష్టమే! నేను నటన వృత్తిగా తీసుకోకుండుంటే ఎంత బావుండేదో అనిపిస్తోంది! ఆఖరికి నీ ప్రేమను పొందటానికి కూడా నటించాల్సి వచ్చింది. మన ప్రేమ ఒక్కతే నిజం! మిగతా జీవితమంతా నటనే. అదొక్కటే నాకు దక్కనిస్తావ్ కదూ! త్వరలోనే కలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాను - నీ వినోద్."

    దానికి తను జవాబీయలేదు.

    ఆ ఉత్తరం మీరా చేతిలో పడింది.

    "నమ్మక నమ్మక సినిమా మనుషుల్నా నువ్ నమ్మేది? తర్వాత విచారిస్తావ్ జాగ్రత్త!" అంది. ఆ తరువాత ఉత్తరాలే లేవతనినుంచి.

    అప్పటికి తను పనిచేస్తోన్న ఉద్యోగ కాలం ముగిసిపోయింది. వెంటనే తన ఊరు చేరుకోవడం - అక్కడ వివాహం నిశ్చయమయిపోవడం- పిల్లలు -

    తల్లిదండ్రుల్ని ఎదిరించి - అతని దగ్గరకు వెళ్ళి- అతనినే వివాహమాడేంత ధైర్యం తనకు లేకపోయింది! పైగా అతనిమీద నమ్మకం తగ్గిపోయింది! బహుశ అది అతని సినిమా జీవితం కలుగజేసిన అభిప్రాయం!

    సినిమా హాలు ఎదుట జనం క్రిక్కిరిసిపోయున్నారు!

    పోలీసుల విజిల్స్ - తోపులాటలు-

    అయితే చివరకు వినోద్ సాధించాడన్నమాట!

    స్త్రీల వేపు నడిచి అక్కడ కొంచెం వెనుకగా ఉన్న అరుగుమీద నిలబడింది. సౌదామిని!

    మరికొద్దిసేపట్లో లాఠీలు గాలిలోకి లేచినయ్. పోలీస్ విజిల్స్ - సినిమా హాల్లో నుంచి బయటికొస్తున్న కారుమీద విరుచుకుపడ్డారు.

    వినోద్ బాక్ సీట్లో కూర్చుని కిటికీనుంచీ స్త్రీలవేపు చూసి చేయి ఊపుతున్నాడు నవ్వుతూ.

    హఠాత్తుగా అతని కళ్ళు తన కళ్ళని కలుసుకొన్నాయ్.

    అతని ముఖంలో ఆశ్చర్యం- ఆనందం- ప్రేమ- అన్నీ కలిసిపోయి ప్రతిబింబిస్తున్నాయ్! అతని పెదాలు వణుకుతూ కదిలినయ్!

    డోర్ తెరచుకొని దిగడానికి ప్రయత్నించాడతను.

    మరుక్షణంలో సౌదామినికి అర్థమయిపోయింది. అతను తనకోసం దిగుతున్నాడు. అతని కందితే తన జీవితమే అల్లకల్లోలమయిపోతుంది.

    అతని కళ్ళల్లో తనని చూడగానే ఉప్పొంగిన భావాలు తను తేలిగ్గా చదివింది. ఏమయినాసరే- అతనికి దొరక్కూడదు.

    వెనక్కు తిరిగి స్త్రీల మధ్యగా జొరబడి తోసుకొంటూ చివరకు వెళ్ళిపోయింది. సౌదామిని. అక్కడ ఖాళీగా ఉన్న రిక్షా ఎక్కి "త్వరగా మార్కెట్ కి పోనీ!" అంది కంగారుగా!

    పావుగంటలో మార్కెట్ చేరుకొని తమ ఊరుపోయే సిటీ బస్ స్టాప్ దగ్గర నిలబడి "అమ్మయ్య" అని తేలిగ్గా గాలి పీల్చుకొంది.

    తను అతనిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. అతనిది సాధారణమయిన ప్రేమకాదు! తనకోసం ఏమయినా చేయగల ప్రేమ!

    కాని ఇప్పుడది అర్థం చేసుకొని ఏం లాభం?

    చాలా ఆలస్యమయిపోయింది! టూ లేట్!

    సిటీబస్ వచ్చి ఆగింది స్టేజిదగ్గర. ఎక్కి సీట్లో కూర్చుంది సౌదామిని. వేగంగా పోతోంది బస్!

    ఆమెకి ఇంటిదగ్గర తనకోసం ఎదురుచూసే భర్తా - పిల్లలూ గుర్తు కొచ్చారు.

    ఊహ! త్వరగా వెళ్ళిపోవాలి!

    ఆలస్యం కాకుండా వాళ్ళని చేరుకోవాలి! తనకింకేమీ వద్దు! ఈ జీవితాని కింతేచాలు! కళ్ళవెంబడి జారిపోతోన్న కన్నీటిని కర్చీఫ్ తో తుడుచుకొందామె.

                                        * * * * *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra