"అప్పటికే చాలాసేపు అయింది. అతడు వస్తూ వుండవచ్చు" అంది.

    అతడు కిటికీలోంచి బయటకు చూడటానికి ప్రయత్నించాడు. కానీ అక్కణ్ణుంచి ఆ రోడ్డు సరిగ్గా కనపడటంలేదు. అతడు కన్ ప్యూజన్ లో వుండటం ఆమెకి సంతోషాన్నిచ్చింది. ఇలా కొంచెంసేపు ఆపగలిగితే చాలు. బయటున్న ఇన్ స్పెక్టర్ కి అనుమానం వస్తూంది - వచ్చేస్తాడు.

    "అయితే నిన్ను పంపింది పోలీసులన్నమాట" అన్నాడు.

    ఆమె సమాధానం చెప్పలేదు.

    "ఈ పోలీసులు నా .... తెలుసా" ఒక బూతు మాటతో చెప్పాడు. ఆమె దానికి కూడా సమాధానం చెప్పలేదు. అంత టెన్షన్ లోనూ ఆమెకి తండ్రి గుర్తొచ్చాడు. మామూలు సమయాల్లో ఎంతో సంస్కారవంతంగా కనిపించే ఇలాంటి మనుష్యులు.... తాగినప్పుడు, కష్టాల్లో చిక్కుకున్నప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారని - మొదటి దృష్టాంతం చూపింది ఆమె తండ్రే. దురదృష్టవశాత్తు అతడు ఎప్పుడూ రిలాక్స్ డ్ గా వుండేవాడు కాడు. పత్రిక అమ్మకాలు తగ్గిపోతున్నాయని, తన పత్రికకి రాసే రచయిత్రి మరో పత్రికతో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటూందని ... ఇలా రకరకాల భయాల్తోనూ అనుమానాల్తోనూ అనుక్షణం భయపడేవాడు. ఇంపోస్టర్ ఫీనామినా అన్న మానసికమైన జబ్బు ఇది. ఓటి పునాదుల మీద జీవితాన్ని నిర్మించుకున్న వాళ్ళలో నూరుశాతం ఇది కనబడుతుంది. మాటిమాటికీ "నేనే గ్రేట్, నా అంత కష్టపడే వాళ్ళు చాలా తక్కువ" అని తమలో తామే అనుకోవటమో, బయటకు చెప్పుకోవటమో చేస్తూ వుంటారు. బూతు చిత్రాలు తీసే నిర్మాతలు, మానసిక దౌర్భల్యాల మీద సొమ్ము చేసుకునే పత్రిక ఎడిటర్లు, తమ రచనలమీద తమకే నమ్మకంలేని రచయితలు, వరుసగా చిత్రాలు ఫెయిలవుతున్న దర్శకులు, ఓడిపోతామేమో అన్న భయంతో అవతలి పార్టీ గురించి సభ్యతారహితంగా తిట్లతో విమర్శించే నాయకులు- వీళ్ళని ఈ 'ఇంపోస్టర్ ఫీనామినా'కి లోనయిన వారుగా పరిగణించవచ్చు. బయటివాళ్ళు తమలోని లోటుపాట్లను చూస్తూ వున్నారేమో అని- ప్రతిక్షణం దానిగురించే ఆలోచించటమో, ప్రకటనలు ఇవ్వటమో చేస్తూ వుంటారు. సమాజంలో తమ పలుకుబడి, తమ రంగంలో తాము సాధించిన విజయం- ఇవన్నీ తాత్కాలికమనీ, తమకి అంత అర్హత లేదనీ వీళ్ళు అంతర్గతంగా మనసులో మధనపడుతూ, దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం అవసరమైనదానికన్నా ఎక్కువ 'షో' చేస్తూ వుంటారు. 'ఇంపోస్టర్ ఫీనామినా'కి లోనయిన వ్యక్తులు ఎప్పుడూ నిజమైన ఆనందం అనుభవించలేరు. అనుక్షణం అంతర్ సంఘర్షణలో మునిగి తేలుతూ, ఆ ఘర్షణే తమ విజయానికి కారణం అని సంతృప్తి చెందుతూ వుంటారు.

    విద్యాదరికి ఇంత అనాలిసిస్ తెలీదు. ఆమె అటువంటి సైకాలజి పుస్తకాలేమీ చదవలేదు కూడా. కానీ నిరంతరం పరిశీలన కన్నా గొప్ప పుస్తకం ఏముంది? అంత టెన్షన్ లో కూడా ఆమెకి అతడి ప్రవర్తన చూస్తూ వున్నప్పుడు తన తండ్రే గుర్తుకొచ్చాడంటే ఆమె మీద తండ్రి జీవితం ఎంత బాధామయమైన ప్రభావాన్ని వేసిందో ఊహించుకోవచ్చు.

    "ఈ కాగితాలు నువ్వు చూసిన సంగతి పోలీసులకి చెపుతావా?" అతడి ప్రశ్నలకి ఆమె తేరుకుని ఈ లోకంలోకి వచ్చింది. అతడు ఆమెవైపే క్రూరంగా, కసిగా చూస్తున్నాడు. అతడి చేతిలో చాకు అలాగే వుంది. ఆమె సమాధానం చెప్పలేదు.

    "ఈ కాగితాలు కాల్చేశాను. వారికేమీ సాక్ష్యాలు మిగల్లేదు" తనని తాను సమర్ధించుకున్నట్టు అన్నాడు దగ్గరకొస్తూ.

    ఆమె అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసింది. వెనుక గోడ తగిలింది. అతడు నవ్వాడు.

    అప్పటివరకూ ఉద్వేగంగా వున్నవాడు అలా నవ్వేసరికి సన్నటి వణుకు ఆమె వెన్నెముకని కదిలించింది. అతడు తన పరిస్థితిని సమీక్షించుకుని ధైర్యం పొందాడన్న విషయాన్ని ఆ నవ్వు సూచిస్తూంది. బయట ఎక్కడో వున్న ఇన్ స్పెక్టర్ లోపలికి వచ్చే ప్రయత్నం చేసే లోపులో ఏమైనా చెయ్యొచ్చు. సాక్ష్యం ఏమీ వుండదు. నిండా మునిగిన వాడికి చలేమిటి?.... ఆ భావమే అతడి కళ్ళలో కనపడుతూంది.

    అతడు మరో అడుగు ముందుకు వేశాడు.

    ఆమె గోడకి బల్లిలా అతక్కుపోయి అతడివైపే చూడసాగింది. కాళ్ళూ చేతులూ సహకరించటం మానేశాయి. తనెంత ధైర్యవంతురాలు అనుకుంది. కానీ నిజంగా ప్రమాదం ఎదురయ్యేసరికి ఏమీ చేయలేకపోతూంది. గదిలోంచి బయటకు పరుగెత్తటానికి కూడా వీలులేదు.

    అతడు దగ్గరకొచ్చి ఆమె రెండు బుగ్గల్నీ బొటనవేలు చూపుడువేలు మధ్య పట్టుకుని మొహాన్ని బలంగా పైకెత్తాడు. ఆమె విదిలించుకోబోయే లోపులో అతడి మొహం మరింత దగ్గరిగా వచ్చి వూపిరి వెచ్చగా తగిలింది. బలంగా తోసెయ్యబోయింది. కానీ చేతులు నిస్సత్తువగా వుండిపోయాయి. స్పృహ తప్పుతుందేమో అనిపించింది. ఏమిటి తను ఇలా అయిపోతూంది? ప్రతిఘటించే శక్తి కూడా లేకపోతుందేమిటి అనుకుంది. అతడు తన రెండో చేతిని ఆమె భుజాలచుట్టూ పోనిచ్చి తనవైపు లాక్కున్నాడు. మామూలుకన్నా ఎక్కువ ఆరోగ్యవంతమైన స్త్రీ అవటంతో పూర్తిగా దగ్గరవకుండానే ఆమె వక్షం అతడి ఛాతీ వత్తిడికి నలిగి పోసాగింది. ఆమె నెమ్మదిగా షాక్ నుంచి తేరుకుని శక్తిని కూడగట్టుకుంది. ఆమెని దగ్గిరకు తీసుకునే ప్రయత్నంలో అతడు వదిలిపెట్టిన చాకుమీద ఆమె దృష్టి పడింది. అతడి వెనుకనుంచి నెమ్మదిగా చెయ్యి బల్లమీదకు చేర్చి చాకు నందుకుంది. ఆమె నుంచి ఆశించినంత ప్రతిఘటన లేకపోవడంతో అతడు మరింత పురోగమించాడు. భుజాల వెనుకనున్న చేతిని అలాగే వుంచి మరొక చేతిని చీరె -జాకెట్టు మధ్య అనాచ్చాదితంగా వున్న శరీరం మీదనుంచి పైకి జరిపి బటన్ వూడదీసే ప్రయత్నం చేశాడు. అతడు ఆ ప్రయత్నంలో ఏమరుపాటుగా వుండగా ఆమె చాకు అందుకోవటం, అతడి భుజంమీద బలంగా గుచ్చటం మెరుపులా జరిగిపోయినయ్.   

    అతడు కీచుగా అరిచి ఆమెని వదిలేశాడు.

    ఆమె మెరుపులా అక్కణ్ణుంచి పరుగెత్తింది. తుఫానుకన్నా వేగంగా ఆ గదిలోంచి బయటపడి, జలపాతపు శిఖరంమీద నుంచి దూకే నీటిపాయలా వడిగా మెట్లు దిగింది. అదే వేగంతో హాల్లోంచి బయట ద్వారంవైపు పరుగెత్తింది. ఒక క్షణమై వుంటే ఆమె బయటపడేదే కానీ దురదృష్టం ఆమెను వెన్నాడుతూంది. కాళ్ళ మధ్య కుచ్చిళ్ళు అడ్డంపడి క్రిందికి జారిపోయింది. అంత వేగంతో పరుగెడుతున్నది, క్రిందపడేసరికి నడుము కలుక్కుమంది. ఆమె దాన్ని లెక్కచేయకుండా లేవబోయింది. కానీ ఆపాటికే వెనుక నుంచి వస్తున్న చక్రధర్ ఆమెను పట్టుకోబోయాడు. ఆమె అతన్ని తోసేసి నేరుగా బయటకు వెళ్ళలేక అదే వేగంతో పక్కగదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని గొళ్ళెం పెట్టేసింది. ఇదంతా కనురెప్పపాటు కాలంలో జరిగిపోయింది.

    పెద్ద శబ్దంతో ఓడ సముద్రం మధ్యలో పేలిపోతే, ఆ ముక్కలన్నీ సాగరగర్భంలోకి కలిసిపోయాక ఆ జలాలు తిరిగి ఎలా నిశ్శబ్దం వహిస్తాయో, అంత గొడవ జరిగాక ఏర్పడిన నిశ్శబ్దం అలా వుంది. బలంగా తీస్తున్న ఆమె శ్వాస చప్పుడు తప్ప ఇంకేమీ లేదు. తలుపులకి ఆనుకుని ఆమె అలా చాలాసేపు వుండిపోయింది.

    క్రమంగా తేరుకున్నాక అక్కడనుంచి కదిలింది.

    ఆ గదిలోకి రావటానికి ఎట్నుంచీ దారిలేదు.

    అతడు తలుపు బ్రద్దలుకొట్టే ప్రయత్నమేమీ చెయ్యటం లేదు. మత ధైర్యం వుండి వుండకపోవచ్చు. ఒక నిముషం .... రెండు నిముషాలు .... పది నిముషాలు... పావుగంట .... ఆమె అయోమయంలో పడింది. అతడు బయట ఏం చేస్తున్నాడన్న సందిగ్ధం ఎక్కువ కాసాగింది. ఎంతసేపు అలా లోపల వుండగలదు? అతడి ఉద్దేశ్యం ఆమెకి అర్థంకాలేదు. బయట ఇన్ స్పెక్టర్ వున్నాడో లేదో అని చూడటానికి వెళ్ళాడా? లేదా అటువంటివి నమ్మక- తనని ఈ గదిలోనే శాశ్వతంగా బంధించి చంపెయ్య దల్చుకున్నాడా? ఈ రెండూకాక భుజంమీద, గాయానికి డ్రెస్సింగ్ చేసుకుంటూ వున్నాడా?

    ఆమె దృష్టి కిటికీ రెక్కమీద పడింది. దగ్గరికి వెళ్ళి ఓరగా తెరిచి చూసింది.

    ముందు హాలు నిర్మానుష్యంగా వుంది. హాలుకీ తన గదికీ మధ్య మరో గది వుంది. అందులో ఏముందో సరిగ్గా కనపడటం లేదు.

    ఆమె బయటపడటానికి నిశ్శయించుకుంది.

    చక్రధర్ లాటి వాళ్ళు అవకాశమొచ్చినప్పుడు పులుల్లా రెచ్చిపోతారు. పరిస్థితులు ఎదురు తిరిగితే పిల్లిలా చప్పబడిపోతారు. అతడి స్థితి అలాంటిదని తెలిసే, ఎందుకైనా మంచిదని గదిలో ఏమైనా వస్తువులున్నాయేమో అని చుట్టూ చూసింది. ఫ్లవర్ వేజ్ కనపడింది. దాన్ని ఒక చేత్తో పట్టుకుని తలుపు నెమ్మదిగా తెరిచింది ముందు గది ఖాళీగా వుంది.

    ఆమె శబ్దం చేయకుండా ద్వారంవైపు నడిచింది.

    ఇంకొక అయిదారు అడుగులు వేస్తే బయటకు వచ్చేసేది.

    అప్పుడు పడింది ఆమె దృష్టి గదికి ఆనుకునివున్న ద్వారం మీద! దాని తలుపులు బార్లా తెరిచివున్నాయి. తలుపుదగ్గిరే కూర్చుని వున్నాడు చక్రధర్!!

    ఆమె గుండె క్షణం ఆగి కొట్టుకోసాగింది. ఫ్లవర్ వేజ్ చుట్టూ చెయ్యి అప్రయత్నంగా బిగిసింది.

    చక్రధర్ కళ్ళు నిస్తేజంగా వున్నాయి. చూపు ఆమెని దాటి శూన్యంలోకి వెళ్తున్నట్టు వుంది. పెదవులు కొద్దిగా విడివడి "నా నుంచి తప్పించుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు" అన్నట్టు సవాలు చేస్తున్నాయి. చాలా తేలిగ్గా ఆమె బయటకు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నట్టున్నాడు. బోనులోంచి బయటకు దూకబోయే పులిలా వున్నాడు. అలికిడి కోసం ఏకాగ్రతతో కళ్ళు మూసుకుని ఎదురు చూస్తున్న కొంగలా వున్నాడు. ఆమె అతడి వైపే చూస్తూ తలుపువైపు మరో అడుగు వేసింది.

    అతడు కదల్లేదు. అతడినే చూస్తూ తల తిప్పకుండా, మరి కాస్త కదిలింది.

    ఇంకొక్క మూడు అడుగులు వేస్తే బయట హాల్లోకి వెళ్ళిపోవచ్చుననుకుంటూ వుండగా- అప్పుడు వినిపించింది. చెవులు చిల్లులుపడేలా పిస్తోలు శబ్దం ..... వరుసగా రెండుసార్లు!

                                                                *    *    *

    సంపత్ తోనూ, పోలీసుల్తోనూ కలిసి విశ్వనాథం అ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. యస్సై తమని ఆ ఇంటిలోకి ఎందుకు రమ్మన్నాడో పోలీసులకి తెలీదు. బహుశా లోపల ఎవరైనా క్రిమినల్ వుండివుంటాడు. లేదా ఏదైనా వ్యతిరేక కార్యకలాపం జరుగుతూ వుండి వుంటుంది.

    విశ్వనాథం ఆలోచన కూడా అదే. ఒక్కడే వెళ్ళటంకన్నా ఇద్దరు ముగ్గురు ఖాకీ బట్టలవాళ్ళుంటే మంచిది.

    నలుగురూ మెట్లెక్కి ముఖద్వారం దగ్గిరకి వచ్చారు. విశాలమైన హాలు నిర్మానుష్యంగా వుంది. గది లోపలికి ప్రవేశించబోతూంటే.... ఆ నిశ్శబ్దంలోంచి గదిగోడలు కదిలిపోయేలా, చెవులు గింగిర్లెత్తేలా వరుసగా రెండుసార్లు శబ్దం వినిపించింది- ఆ గదిలోంచి.

    ఎడమవైపు గదిలోంచి, క్లోజ్ రేంజిలో పిస్తోలు శబ్దం వినిపించగానే అతడు అటు పరుగెత్తాడు. వెనకే పోలీసులు కూడా. ఆ వెనుక సంపత్.

    లోపల గదిలో చక్రధర్ కుర్చీలో వున్నాడు. నాలుగు అడుగుల దూరంలో విద్యాధరి వుంది.

    గదిలో ఇద్దరూ తప్ప మరెవరూ లేరు.

    బయటికి మరే ద్వారాలూ లేవు.

    ఇన్ స్పెక్టర్ చక్రధర్ దగ్గిరగా వెళ్ళి పరీక్షించి చూశాడు. మెడ వెనుక పిస్తోలు గుళ్ళు చేసిన రంధ్రం వుంది. అప్పటికే ప్రాణం పోయింది. రక్తం వెచ్చగా స్రవిస్తూంది ఇంకా. చక్రధర్ వీపువైపు అంతా రక్తంతో తడిసిపోయింది.

    "హి ఈజ్ డెడ్" అన్నాడు విశ్వనాథం.

    పోలీసులు బిత్తరపోయి చూస్తున్నారు. వాళ్ళు ఎన్నో హత్య కేసులు చూసి ఉండవచ్చు. కానీ కళ్ళముందే హత్య జరగడం చూడటం అదే మొదటిసారి. ఒక్క క్షణం.... కేవలం ఒక్క క్షణం ముందొచ్చి వుంటే ఈ హత్యని ఆపేవాళ్ళం గదా అనుకున్నారు. ఎదురుగా వున్న ఆమెవైపు ఏహ్యభావంతో చూశారు. విద్యాధరి మాత్రం డీప్ షాక్ లో వుంది.

                                        *    *    *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra