Home » Saradha ashok vardhan » నా కథవింటావా

    దాదాపు పదిహేనురోజులు  పెళ్ళి సందడితో ఇట్టే  గడిచిపోయాయి రోజులు. ఇంటికి రాగానే, ఇల్లు సర్దుకోవడం, స్కూలూ  ప్రారంభమయ్యాయి. మరో రెండు రోజులకే దిగారు క్రాంతీ, శోభన. మళ్ళీ అదో హడావుడి. చుట్టుపక్కల  వాళ్ళంతా  ఒచ్చారు  కొత్త పెళ్ళికూతుర్ని చూడ్డానికి! బెంగుళూరు నుంచి తెచ్చిన లాడ్దూలూ, బూందీ, మినపసున్నీ పొట్లాలుకట్టి  ఇచ్చింది  వొచ్చిన  వాళ్ళందరికీ  సీతాదేవి. మనోహర్  వెళ్ళిపోయాడు  కాలేజీలున్నాయని.
    క్యాలెండర్లో  రెండు పేజీలు మారిపోయాయి! ఈమధ్యకాలంలో చెప్పుకోదగ్గ  మార్చేమీలేదు! కానీ కావ్య  పెళ్లి  గురించిన దిగులు మాత్రం సీతాదేవి మనసులో ఇమిడిపోయింది. ఒకటి రెండు ఉత్తరాలు  రాసింది అన్నయ్యకి! "మంచి సంబందాలేమీ దొరకలేదనీ, ఏదైనా  వుంటే తక్షణం చేబుతాననీ  సమాధానం రాశాడాయన!"
    క్రాంతి పేపర్లో  చూసి అప్లై  చేసిన  వివాహ  ప్రకటనలకు, సమాధానాలొచ్చాయి ఫోటోలతో సహా!
    ఆ ఫోటోలలో  ఒక్కటీ నచ్చలేదు  కావ్యకి!
    సీతాదేవి దిగులు మరీ ఎక్కువైంది.
    మెల్ల మెల్లగా  అందరితో  మంచిగా  మాట్లాడుతూనే, పెత్తనం చెలాయిస్తోంది, తననుకున్నవి  సాధిస్తోంది  శోభన!
    "సినిమా కెళదామని  చెప్పు మీ అన్నయ్యతో" అనేది శోభన!
    "ఎందుకులే వొదినా! నాకు  సినిమాలమీద  మోజుతక్కువ" అనేది కావ్య!
    "నాకోసం రాలేవూ ? బాగో ఓగో  కాస్సేపు  చూసొచ్చేద్దాం" అనేది శోభన!
    "అయితే  అడుగు అన్నయ్యని" అనేది కావ్య!
    "అమ్మో! నేనడగను  బాబూ! నాకు  భయం! నువ్వడుగు అనేది.
    "పోనీలే" అని కావ్యే అడిగేది, తను అడుగుతూన్నట్టుగా.
    ఎన్నడూ ఏమీ అడగని  కావ్య, ఇన్నిసార్లు  సినిమాలకనీ, షాపింగులకనీ అడుగుతూంటే ఆశ్చర్యపోయాడు క్రాంతి.
    "ఏదో సరదా  పడుతుందేమోలే!" అనుకుని  పంపించేవాడు. కానీ, స్వతహాగా ఇవ్వేవీ ఇష్టంలేని కావ్యకి ప్రతీసారీ శోభన కోర్కెని మన్నించడం కష్టంగా వుండేది .పైగా  వాళ్లిద్దరూ  అలా సినిమాలకి వెళ్లిపోతే సీతాదేవి ఒక్కర్తే ఇంట్లో వుండేది. అది కావ్యకి ఇష్టం  వుండేదికాదు. అందుకని ఆమధ్య సినిమాకి వెళదామని అడిగినప్పుడల్లా రాననేది కావ్య! దాంతో మూతి ముడుచుకుని  మూడేసిరోజులు  మాట్లాడేది కాదు శోభన! ఇదంతా  సీతాదేవి గమనిస్తున్నా ఏమీ అనలేక, చూసీ చూడనట్టు  ఊరుకునేది. రాను రాను విసుక్కోవడం, చీదరించుకోవడం  చేసేది. క్రాంతి  ఉన్నంత సేపూ  కావ్యతో ఎంతో ప్రేమ ఒలకబోస్తూ  మాట్లాడేది. అతను  వెళ్లిపోయాక, కన్నెత్తి  చూసేదికాదు. శోభనలో ఈ మార్పుకి  ఏం చెయ్యాలో తెలీలేదు సీతమ్మకి! ఒక్కోసారి శోభన కావ్యతో వాదన కూడా పెట్టుకునేది. కావ్యది  తప్పులేదని  తెలిసికూడా  శోభనని ఏమీ అనలేక  కావ్యనే  కోప్పడేది.
    ఇవన్నీ  చూస్తూ వుంటే  కావ్య భవిష్యత్తు శోభన చేతిలో  భద్రంగా వుండదనే  భావన సీతాదేవిలో రెట్టింపవుతూ  వచ్చింది. మరికొన్ని ప్రకటనలకి  సమాధానాలొచ్చాయి. అవి కూడా మరీ  అందవికారులో, వయస్సు మళ్ళినవారో అయివుండడం, ఇంట్లో ఎవ్వరికీ  నచ్చకపోవడం, జరిగింది.
    "అన్నింటికీ ఏదో  ఒక వంకపెట్టి  పంపించేస్తూ వుంటే ఎలా? ఏదో ఒకదానితో రాజీపడాలి. ఇంతకీ మనకే వంకలూ  లేకపోతే అనుకోవచ్చు. ఏ వంకలూ  లేనివాడొచ్చి, మనకి వంకలు  పెడితే  ఏంచేస్తాం ? గురిగింజ కిందున్న  మచ్చ గురిగింజకి తెలీదుట" అంది శోభన.
    సీతాదేవికి  ఒళ్ళు   మండిపోయింది  శోభన మాటలకి.
    "నీకేం తెలుసని  వాగుతున్నావే ? పోనీకదా  చిన్న  పిల్లని అని ఊరుకుంటూ  వుంటే  నానాటికీ  పెట్రేగిపోతుననావ్! పోనీకదా  అయిన సంబంధం  అని ఈ పెళ్ళికి మేమొప్పుకున్నాం గానీ, లేకపోతే, నువ్వు ఈ ఇంటి కోడలయి వుండేదానివా ?"
    "ఈ ఇంటికి కాకపోతే మరో  ఇంటి కోడలయివుండేదాన్ని! కానీ మీ అమ్మాయిలాగా  ఇంట్లో తిష్ఠవేసి కూర్చునేదాన్నికాను పెళ్ళికాకుండా." అంది.
    సీతాదేవికి పిచ్చెక్కినట్టయింది శోభన మాటలకి! అయిన సంబంధం కాబట్టి తన బిడ్డని కడుపులో పెట్టుకుని చూసుకుంటుందనుకుంది కానీ, ఇంత ధైర్యంగా తన కళ్ళెదుటే, ఇలా మాట్లాడుతుందని  అనుకోలేదు. గట్టిగా శోభననేమైనా  అంటే అటు అన్నయ్యకి  కోపం వొస్తుంది. ఇంతకంటే పరాయి సంబంధం చేసుకున్నా బాగుండేదేమో! ఏడ్చింది.
    కావ్య కూడా కంటతడి  పెట్టుకోవడం  కన్నా ఏంచేస్తుంది ?
    క్రాంతికీ విషయాలు పూర్తిగా  తెలియకపోయినా, కొంచెం కొంచెం పరిస్థితి అర్ధం చేసుకుని, శోభనని కోప్పడ్డాడు. ఆ రోజంతా  పచ్చిమంచినీళ్ళయినా తాగకుండా  పడుకుంది శోభన!
    అది చూడలేక సాధ్యమైనంత వరకూ, ఈ విషయాలేవీ  క్రాంతికి తెలీకుండా  జాగ్రత్త పడుతోంది సీతాదేవి! కానీ ఆమెలోని మనోవేదన ఆమెని మంచమెక్కించింది.
    మళ్ళీ ఆ యింట్లో  ఆవేదనా, ఆందోళనా  చోటుచేసుకున్నాయి.
    మిసెస్ శాంత ఇంటికొచ్చినా  సరిగ్గా  మాట్లాడదు శోభన. రెండిళ్ళ తరవాత ఉన్న తెలుగువారితో స్నేహాన్ని పెంచుకుంది  శోభన. వాళ్లమ్మాయి, రజనీతో కలిసి సినిమాలకి  వెళ్లడం బజారుకి వెళ్లడం, అస్తమానం వాళ్లింటికెళ్ళి కూర్చోడం చేస్తోంది. రజనీ వాళ్ళూ ఇక్కడికొచ్చినా, కావ్యతో మాట్లాడరు. శోభనతో మాట్లాడి వెళ్ళిపోతారు, ఇంకెవ్వరి లెక్కా లేనట్టుగా! రోజురోజూ శోభన ప్రవర్తన  బాధ కలిగిస్తోందే తప్ప, మనశ్శాంతి నివ్వడం లేదు.
    ఒకరోజు సాయంత్రం  తలుపు తట్టిన చప్పుడయితే  వెళ్ళి తలుపు తీసింది శోభన. అతని పేరు రామం అని, వివాహ ప్రకటనకి తనకొచ్చిన సమాధానాన్ని చూసి, అడ్రసు  వెతుక్కుంటూ  వొచ్చానని చెప్పాడు. 'ఒక కన్ను మెల్ల! కొంచెం వంగివుంటాడు' అంది సీతాదేవి, అతనే పెళ్ళి కొడుకని తెలీగానే!
    ఆమె మెల్లగా శోభనతో అన్నా ఈ మాటలు శోభన మాత్రం, గట్టిగా అరుస్తూ సమాధానం చెప్పింది. మీ తల్లీ కూతుళ్ళకి  ఏ సంబంధం వచ్చినా  వంకలు పెట్టడం  ఒక్కటే తెలుసు. ఒక చెడిపోయిన దానికి, ఇంతకంటే గొప్ప సంబంధాలొస్తాయా ? ఆశకైనా  అంతుండాలి. అసలు అర్హత తెలుసుకుని ఆశపడాలి!" అంది.
    ఆ మాటలు  అతను విన్నట్టున్నాడు, మెల్లగా  లేచి వెళ్ళిపోయాడు. అంతవరకూ  శోభన ఎన్నిమాటలన్నా  ఓర్చుకున్న కావ్య, సహనం కోల్పోయింది.
    "వొదినా! ముందు నీ అర్హత తెలుసుకుని  మాట్లాడు. అన్నయ్య నిన్ను చేసుకుని మీతో సంబంధం పెట్టుకోనూ అని చెప్పిన  రోజున, అయిన సంబంధం ఒద్దనకని, అమ్మే బతిమాలి ఒప్పించింది. ఈ పెళ్ళి చేయించింది. లేకపోతే నువ్వూ ఎక్కడుండేదానివో ?"
    నీలాగా  పెళ్ళికాకుండా  మాత్రం  వుండేదాన్ని కాను.
    "అదొక్కటే  నీ జీవితంలో గొప్ప  విశేషం! చదువు థర్డ్ క్లాసులో ప్యాసయినా  అదృష్టం బాగుండి ఫస్టుక్లాసయినా  మా ఇంట్లో  పడ్డావ్ ?
    "మీ యిల్లు....ఏది మీ ఇల్లు ? నేను కాలు పెట్టనంతవరకే ఇది నీ ఇల్లు, నీ అన్న ఇల్లు! నేనొచ్చాక ఇది నా ఇల్లు! డిగ్రీ ఫస్టుక్లాసులో ప్యాసయ్యానన్నావు ఆమాత్రం  తెలీదూ ?"
    "శోభనా!....పిచ్చిదానిలా  అరిచింది కావ్య కోపంతో!
    "ఎందుకలా  అరుస్తావ్ ? మనిషి వెలాగా  చెడ్డావ్, మతికూడా చెడుతుంది జాగ్రత్త!"
    ఇక వినలేక పోయింది సీతాదేవి. ఆవేశంతో  మంచం దిగొచ్చి, పట్టలేని కోపంతో చెయ్యెత్తింది శోభనపైన  సీతాదేవి.
    దెబ్బపడకుండా  అడ్డువెళ్ళిన  కావ్యకి తగిలింది ఆ దెబ్బ.
    శోభన మాత్రం  గావుకేకలు  పెట్టి "బాబోయ్! కొడుతోంది....అమ్మా! నాన్నా!...." అంటూ శోకాలు మొదలెట్టింది.
    ఛీ....ఛీ....వెధవ కొంప! వెధవ మేళం! ఎక్కడో మా నాన్న పడుండే వాళ్ళం ఇన్నాళ్ళూ. మళ్ళీ అనవసరంగా, నేనే నాచేతులారా తెచ్చి పెట్టుకున్నాను. ఈ గొడవంతా. రెండు కళ్ళలావున్న నా కొడుకూ కూతుర్నీ చూసుకుంటూ హాయిగా వున్న నేను నా వేలుతో నేనే ఒక కన్నుని పొడుచుకున్నాను. ఇప్పుడేడ్చి ఏం లాభం ?" ఆయాసంతో మరి మాట్లాడలేకపోయింది సీతాదేవి. దగ్గు తెరలు తెరలుగా వొచ్చి ఉక్కిరిబిక్కిరయింది. ఆయాసంతో రొప్పతూన్న, తల్లిని తీసికెళ్ళి  మంచం మీద పడుకోబెట్టింది కావ్య! మంచినీళ్ళు తాగించింది. గుండెదడదడా  కొట్టుకుంటూ 'నొప్పి' అని అంటూ వుంటే, ఆమె చెప్పిన మందేదో సీసాలోంచి  తీసి  ఒకమాత్ర నోట్లో వేసింది, నెమ్మదిగా గుండెమీద చేత్తో రాస్తూ.  
    "తల్లీ! కావ్యా! నిన్ను దిక్కులేనిదాన్ని  చేసి  పోతానేమోనని భయంగా వుందమ్మా!"
    "అమ్మా! ఏమిటమ్మా  ఆ మాటలు ? ఇప్పుడేమయిందని ?నువ్వు అనవసరంగా మనసు పాడుచేసుకోక రెస్టు తీసుకో !"
    "గుడ్డివాడో, కుంటివాడో, నిన్నొక  అయ్య చేతిలో పెడితేనే గానీ, నాకు తృప్తిగా ప్రాణాలు పోవు."
    "అమ్మా! ఇపుడంత   అవసరం ఏమీ కలగలేదు. నువ్వు ఎక్కువగా  మాట్లాడక రెస్టు తీసుకో!" అంటూ ఆమెని మాట్లాడనివ్వకుండా, నోటికి చేతులను అడ్డు పెట్టింది, తలమీద  చిన్నగా జోకొడుతూ, ఆమెని నిద్రపుచ్చే ప్రయత్నాలు చేస్తూ.
    శోభన లోపలికెళ్ళి  పెద్దగా  వాంతి  చేసుకోవడం  చూసిన  సీతాదేవి కంగారుగా లేచొచ్చింది.
    బేసిన్ దగ్గరకెళ్ళి  వాంతి  చేసుకుని, మొహం  కడుక్కునొచ్చింది  శోభన.
    సీతాదేవి మెల్లగా   వెళ్ళి శోభన  చెవి   దగ్గర నోరుపెట్టి  ఏదో అడిగింది. అవునన్నట్టుగా  తలూపింది శోభన!
    ప్రేమగా  శోభన  తల నిమురుతూ, "వెళ్ళు రెస్టు తీసుకో! మనసులోకి ఎటువంటి ఆలోచనలూ రానివ్వకు. మనసు ఎంత  నిర్మలంగా ఉంటే, ఎంత ప్రశాంతంగా ఉంటే, అంత మంచి కొడుకు పుడతాడు. దబ్బపండు లాంటి మనవణ్ణి  నాకందించు" అంది నవ్వుతూ. శోభన  కూడా  నవ్వుతెచ్చి పెట్టుకుని  వెళ్ళి  మంచంమీద  పడుకుంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra