Home » Adivishnu » ఆనందం పరమానందం

"అవి కూడా అఖ్ఖర్లేదు. నేను అడిగే ప్రశ్నలకి బాగా ఆలోచించి సమాధానాలు చెప్పాలి."
"అలాగే సర్!"
"అన్నమాచార్య గురించి విన్నావా?"
"విన్నానండి. ఆయన  కీర్తనలంటే నాకు చాలా ఇష్టం!"
"నాకూ ఇష్టమే! ఇష్టముంటే సరిపోదు. పాడాలి!"
"పాడగలనండి! శాస్త్రీయ సంగీతంలో డిప్లోమా తీసుకున్నాను. రాష్ట్రస్థాయి అన్నమయ్య కీర్తనల పోటీల్లో మొదటి బహుమతి కూడా వచ్చింది. ఆ సర్టిఫికెట్లు కూడా తెచ్చేను, చూస్తారా?"
"చూడను, సర్టిఫికెట్టు చూసే అలవాటు నాకు లేదు. నిన్ను అన్నమయ్యే ఇక్కడికి పంపించాడు, అది చాలు!"
"నన్ను పంపించింది రామారావుగారండి!"
"రామారావు నాకు అన్నమయ్యతో సమానం. ఇహ ప్రమోషను తప్పదు!"
"ప్రమోషనా? అప్పుడే ఎందుకులెండి!" అన్నాడు సత్యమూర్తి మొహమాటంగా.
"నేను  అన్నది నా ప్రమోషన్ గురించి."
"మరి నా ఉద్యోగం?"
"మా చైర్మన్ అన్నమాచార్య పేరు వింటే చాలు- అన్నం  మానేసి ఆనందిస్తాడు. అన్నమయ్య కీర్తనలు పాడేవారిని అమాంతం కౌగిలించుకుని  ముద్దెట్టుకుంటాడు. ఆయన  గనక ఒకే ఒక్కసారి నన్ను కౌగిలించుకుని ముద్దెట్టుకుంటే నాకు ప్రమోషను తప్పకుండా వస్తుంది!"
"మరి నా ఉద్యోగం?"
"వస్తున్నా! అన్నమయ్య కీర్తన ఒక్కటంటే ఒక్కటి నాకు నేర్పు. ప్రమోషను ఇప్పించు, ఇవి చేతులు కావు. నా మాట  కాదపనకు!"
"దందేముంది సార్! తప్పకుండా నేర్పుతా!"
"శక్తివంచన లేకుండా నేర్పు."
"మరి నా ఉద్యోగం?"
మీసాల మేనేజరు కుర్చీలోంచి బరువుగా లేచేడు. మెల్లిగా నడుచుకుంటూ కిటికీ చేరుకున్నాడు. అతని మూమెంట్సు చూస్తుంటే  చాలా  బరువైన సంగతి చెప్పేలా వున్నాడని సత్యమూర్తి అనుకున్నాడు. అతను అనుకున్నట్టే మేనేజరు చెప్పేడు-
"పిచ్చివాడా! ఈ ప్రకటనలు, ఇంటర్వ్యూలు, ఏజెంట్లు అంతా  నాటకం!"
"అంటే? తమ  కంపెనీలో వేకెన్సీ లేదా?"
"ఎందుకు లేదు. వుంది. ఒకే ఒక్క వెకేన్నీ."
"రామారావుగారు చెప్పేరండి."
"కానీ, ఆ చాన్సు ఎవ్వరికివ్వాలో అర్థగంట క్రితమే తేలిపోయింది."
"ఎవరికిస్తారు సర్?"
"బంధుకోటి తాలూకు జనాభాలో ఒకడికి, నీకు మాత్రం కాదు."
సత్యమూర్తి నీరసంగా అడిగేడు-
"అన్నమయ్య కీర్తన నేర్పమని అడిగేరు కదా?"
"అవును. అడిగేను. అది నా కోసం. నా ప్రమోషన్ కోసం. మా ఇంటికొచ్చి నాకు కీర్తన నేర్పినందుకు ఫీజు ఎంతైనా సరే! సంతోషంగా ఇచ్చుకుంటాను. సరేనా?"
సత్యమూర్తి ఆలోచనలో పడ్డాడు. ఉద్యోగం కోసం కొండంత ఆశతో వస్తే, కీర్తనతో సరిపెట్టుకోమని సలహా ఇస్తున్న మేనేజర్ని ఏం చేయాలి?
"వద్దు! నన్నేం చేస్తే న్యాయంగా వుంటుందోనని ఆలోచించకు" అన్నాడు మేనేజరు.
అతని మాటకి సత్యమూర్తి ఆశ్చర్యపోయేడు. ఆశ్చర్యపోతూనే అడిగేడు-
"నా మనసులోని మాట మీకెట్లా తెలిసింది. సార్?"
"ఆ క్వాలిపికేషన్ తోనే మేనేజర్నయ్యేను. అదే క్వాలిఫికేషన్తో మా చైర్మన్ ని బుట్టలో వేసుకుని జనరల్ మేనేజర్నవుతా! ముందు నాకు అన్నమయ్య కీర్తన నేర్పే  పనిలో వుండు. ఇది నా విజిటింగ్ కార్డు. ఇందులో ఇంటి అద్రస్సుంది. సాయంత్రం సరిగ్గా ఆరింటికి ఇంటికి వచ్చేయ్! మిగతా  విషయాలు మనింటో మాటాడుకుందాం!"
అని తన విజిటింగ్ కార్డు సత్యమూర్తికిచ్చేడు.
సత్యమూర్తి కార్డుని తీసుకున్నాడు. కళ్లకద్దుకొబోయి, మనసు మార్చుకుని, ఆ కార్డుని జేబులో పెట్టుకున్నాడు.
"గుడ్ లక్!" అన్నాడు మేనేజరు.
గుడ్ లక్ ఎవరికో తెలీకపోయినా, థేంక్స్!" అన్నాడు సత్యమూర్తి.
   
                                         24
గోవిందం మేడ మీద-
శారద ముస్తాబావుతోంది. ఏవైనా సరే - ఇవాళ తప్పనిసరిగా సత్యమూర్తిని చూచి తీరాలని నిర్ణయించుకుంది. అతన్తో తనివితీరా మాటాడి, అతన్ని కూడా మాటాడించి, ఆ మాటల్లో అతనికి తన పట్ల ఎంత ప్రేమ వుందో స్వయంగా తెలుసుకోవాలని కూడా  నిర్ణయించుకుంది.
గత పదిహేను రోజులుగా ఈ తలంపుని వాయిదా వేస్తూ వచ్చింది. ఇక వాయిదా వేసే  ఓపిక  లేదని తెలుస్తుంది.
అందుచేత  ఆమె  ఎప్పుడూ లేనంత శ్రద్ధగా ముస్తాబవుతోంది!
అంతలో ఫోన్ మోగింది తీసుకుంది-
"హల్లో అవున్నేనే! హాయ్ రేవతీ! ఎట్లావున్నావ్? ఐసీ - హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే! ...వస్తాను .... సాయంత్రం ఆరింటికి మీ ఇంట్లో వుంటాను. ఒ.కే? .. వస్తున్నాని చెప్పే గదా? తప్పకుండా వస్తాను!" అని  ఫోన్ పెట్టేసింది.
అప్పటికే అయిదయ్యింది. ఇంకో గంట టైముంది. రేవతికి మంచి ప్రెజంటు తీసుకువెళ్లాలి. ఏం తీసుకుంటే బావుంటుంది?
ఎల్లాగూ తను సత్యమూర్తిని కలుసుకోడానికి చింతామణి శారీ సెంటర్ కి వెళ్లాలి. అక్కడే రేవతికి మంచి అందమైన చీర కొంటే ఆ ఆలోచన శారదకి బాగా నచ్చింది. అందుచేత ముస్తాబు తాలూకు ఫినిషింగ్ టచెస్ గబగబా చేసుకుంటోంది.
ఆమె గది బయట-
గోడ వారగా కైలాసం దాక్కుని వున్నాడు. ఇవాళ అమ్మాయిగార్ని జాగ్రత్తగా వెంబడించాలి. ఎక్కడికి వెడుతుందో, ఎవర్తో మాటాడుతుందో శ్రద్దగా నోట్ చేసుకుని గోవిందానికి చెబితేనే గాని తన ఉద్యోగానికి భద్రత వుండదు.
శారదని వెంబడించడంలో ఫెయిలైనా తప్పుడు సమాచారమిచ్చినా ఉద్యోగం వూడిపోతుంది. నాలుగు వేళ రూపాయిల జీతం ఈ ఉద్యోగం పోతే మరొక ఉద్యోగం దొరకడమే కష్టం. దొరికినా అంత జీతం ఏ అమాయకుడూ ఇవ్వడు గాక ఇవ్వడు. అందువల్ల చాలీ చాలని ఆ జీతం రాళ్లతో తాను బతకడమే బరువుగా వుంటుంది. తండ్రి చేసిన అప్పులు తీర్చడం తన  సాధ్యమావుతుందా? తీర్చకపోతే పైలోకంలో వున్న తండ్రి ప్రశాంతంగా కాలక్షేపం చేయగలడా?
తన తండ్రి యొక్క ఆత్మ శాంతి కోసమైనా తన డ్యూటి సక్రమంగా చేయాలి! తప్పదు!
దిక్కుమాలిన కుక్కలు తన ప్రతిచర్యనూ గమనిస్తున్నాయి. గమనించి ఊరుకోకుండా గోవిందానికి  చెబుతున్నాయి. కుక్కలు మాటాడుతాయో లేదో దేవుడెరుగు! గోవిందానికి కుక్కల భాష తెలీడం తనకి ప్రాణసంకటంగా వుంటోంది!
తన  పేంటుని ఎవరో గుంజుతున్నట్టనిపించగా - ఆలోచనం నుండి బయట పడి - ఉలిక్కిపడి చూచేడు.
సరిగ్గా అప్పుడే శారద గది బయటకు వచ్చింది!
ఇంకా అక్కడే ఆ గోడ వారగా నిలబడి వుంటే శారద తనని తప్పకుండా చూచి వుండేది. ఎందుకు నించున్నావని నిగ్గదీసి అడిగేది. అప్పుడు తనకి చచ్చినంత పనయ్యేది.
డ్యూటిలో వున్నప్పుడు ఆలోచనలు రాకూడదనీ, కేవలం డ్యూటీ మీదే  ద్యాస పెట్టాలని కైలాసం కుక్కలా ద్వారా తెలుసుకున్నాడు.
కుక్కలకి థేంక్స్ చెప్పి శారదను వెంబడించే డ్యూటీలో పడ్డాడు. శారద రోడ్డు మీదికి వచ్చింది.
ఆటో ఎక్కుతుందేమో అనుకున్నాడు కానీ ఎక్కలేదు. నడిచే వెడుతోంది. శారద గోవిందం లాంటి మనిషి కాదు. ఎంత ఆస్తీ, ఐశ్వర్యాలున్నా  ఆమె సాదాసిదాగా బతకాలనే కోరుకుంటుంది.  రెండు కార్లున్నా -ఆమె ఎప్పుడూ ఏ కార్లోనూ వెళ్లలేదు. నడకే నా కిష్ట మంటుంది.
ఒక విధంగా ఆమె పాలసీ కైలాసానికీ అనుకూలంగా  వుంది. ఆమె ఏ కారో తీసుకుని తుర్రుమంటే - ఆమెను వెంబడించే అవకాశం దూరమయ్యేది.
శారదకి వంద అడుగుల దూరంలో ఆమెక్కనిపించకుండా అతి జాగ్రత్తగా వెంబడిస్తున్నాడు కైలాసం. తనని కుక్కలు వెంబడించక పోవడంతో అతను సంతోషంగా కూడా వున్నాడు.  

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra