Home » Vasireddy seeta devi novels » Sandhi Yugamlo Sthree

    ప్రగతికి మూలకారణం అసంతృప్తి. అసంతృప్తిలేని వ్యక్తి జీవితంలో దేన్ని సాధించలేడు అసంతృప్తి నుంచే స్పర్థ బయలుదేరుతుంది స్పర్థ ఈర్ష్యగా మారకూడదు: స్పర్థలో ముందుకు పోయే ప్రయత్నము ఉంటుంది. తన తోటివారితో సమానతగా ఉండాలనే ప్రయత్నం ఉంటుంది.  
    కాని ఈర్శ్యలో తాను ముందుకుపోవాలనే ప్రయత్నం కంటే, తనకంటే ముందున్న వాళ్ళను వెనక్కు ఎలా లాగాలా అనే ఆలోచనా ఎక్కువగా వుంటుంది. ఈర్ష్యవల్లవ్యక్తి తను ముందుకుపోలేడు. ముందుకు వెళ్ళే వాళ్ళను అసలే ఆపలేడు తనలో తనే కుళ్ళి కృశించి పోతాడు.

    అసంతృప్తికి, నిరాశకు మధ్యనున్న సున్నితమైన భేదాన్ని కూడా చాలామంది గ్రహించలేరు నిరాశ మనిషిని కృంగదీస్తుంది ఉన్న స్థానం నుంచి క్రిందకు లాగుతుంది కాని అసంతృప్తి అలాకాదు. మనిషిని క్రియాశీలిగా మారుస్తుంది ఎప్పుడూ ఏదో చెయ్యాలనీ, ఏదో సాధించాలనీ మనిషి తపిస్తాడు.   
    సంతృప్తిగా ఉండాలనే వ్యక్తి తన కష్టసుఖాలను భగవంతుడుకీ, అదృష్టానికీ వదిలేస్తాడు అసంతృప్తి వ్యక్తి వోటమికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే "సంతోషి సదా సుఖీ" అనే భావాన్ని మస్తిష్కంలోకి దూరకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ విషయంలో స్త్రీలనే చెప్పుకోవాలి ప్రతిదానికీ 'కర్మ' 'అదృష్టం' అంటూ నిట్టూర్పులు విడుస్తారు.   
    ఆ మధ్య ఒక యువతి సర్వీసు హోంలో చేరింది కారణం ఆమె భర్త సోమరి. పని చెయ్యడు బావమర్దులు ఏ దుకాణంలోనయినా సేల్స్ మన్ ఉద్యోగం యిప్పిస్తారు ఆ రెండు నెలల్లో పదిహేను రోజులు నాగా పెట్టి ఇంట్లోనే పడుకుంటాడు మూడో నెలవచ్చేసరికి ఆ ఉద్యోగం కాస్త వూడుతుంది.   
    అంత ఊడకపోయినా అతనే మానేస్తాడు. ఇద్దరు పిల్లలు నెలలో సగం రోజులు పస్తులుంటారు. చివరకు ఆమెకు విసుగు పుట్టింది పిల్లల్ని సోషల్ వెల్ ఫేర్ హాస్టల్లో చేర్చింది తను హోంలో టైలరింగు నేర్చుకుంటున్నది అతను వచ్చి యింటికి రమ్మన్నాడట ఈ మధ్య "ఉద్యోగం చూసుకొని ఆరునెలలు కుదురుగా ఆ ఉద్యోగం చేసినా దగ్గిరకు రాను!" అని ఆమె ఖచ్చితంగా చెప్పి పంపించింది. ఆమె ధైర్యాన్ని అభినందించాలి.
                                     మనం ఎటు వెడుతున్నాం?
    'నగరంలో ఒక గృహిణి మానభంగం' -- ఒకవార్త తాలూకు శీర్షిక.
    ఆ పక్కనే మరో శీర్షిక 'మైనర్ పిల్లను మానభంగం చేసిన వాడి అరెస్టు."
    ఒకే పేపర్లో ఒకేరోజు రెండువార్తలు రెండు రోజులకొకసారైనా పేపర్లలో ఈ మానభంగాలకు సంబంధించిన ఒక్కవార్తే అయినా ఉంటూ ఉన్నది ఏమిటిది? మనం ఎటు పయనిస్తున్నాం? క్రీస్తు తరవాతి ఇరవయ్యొకటవ శతాబ్దం వైపు వెడుతున్నామా? లేక క్రీస్తు పూర్వపు రాతియుగం కేసి వెడుతున్నామా? ఒకవైపు మానవుడు అణువు బద్దలు కొడుతున్నాడు. అంతరిక్షంలోకి దూసుకు వెడుతున్నాడు.
    మానవ మనుగడ గ్రహాంతరాల్లో సాధ్యమవుతుందేమోననే అన్వేషణ సాగిస్తున్నాడు మరో వైపు ఎనిమిది సంవత్సరాల పసికందు నుంచి నలుగురు బిడ్డల్ని కన్నతల్లి వరకు ఈ మానభంగాలు తప్పడం లేదు మన దేశంలో స్త్రీకి ఉన్న గౌరవం మరే దేశంలోనూ లేదని మనసంస్కృతిని వేదికెక్కి పొగిడే పెద్దలు ఏం సమాధానం ఇస్తారు? ఎందుకు నోరు మెదపరు? మనిషిలోని మానవత్వం సిగ్గుపడడం లేదా?  
    కాస్త చీకటిపడితే ఆడపిల్ల ఆ మహానగరాల్లో బయటికి వెళ్ళడానికి భయపడుతూంది కాలేజి నుంచి ఇంటికి రావడం ఆలస్యం అయితే తల్లిదండ్రులకు మతులుపోతున్నాయి ఆటో ఎక్కాలంటే భయం బస్ స్టాండ్ లో నిలుచోవాలంటే భయం చివరకు ఇంటిలో జొరబడి, భర్త కళ్ళముందే, నలుగురి బిడ్డలతల్లిని మానభంగం చెయ్యడమా? ఆ తరవాత ఏం జరిగింది? అపరాధులు దొరికారా? తెలియదు.    
    దాదాపు ఆ వార్త చదివి గుండె బాదుకున్న వాళ్ళు కూడా దాన్ని గురించి మరిచిపోయి వుంటారు. ఇది జరిగింది ఏ మారుమూల గ్రామంలోనో కాదు. అరణ్యంలో అంతకంటే కాదు. ఒక మహానగరంలో ఇవి నాగరికతకు అలవాలమైన మహానగరాలా లేక కారడవులా? కారడవిలో నివసించే ఒక యువజన యువతి స్త్రీత్వానికి ఉన్న గౌరవం, క్షణం కూడా ఈ మహానగరాల్లో కనిపించడం లేదు. ఈ అరణ్యాల్లో క్రూరమృగాలు ఉంటాయి.   
    ఆ విషయం వారికి తెలుసు.... ఏ మృగం స్వభావం ఎలాంటిదో కూడా వారికి తెలుసు. వాటి నుంచి తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో కూడా వారికి తెలుసు. కాని ఈ మహానగరాల్లో సభ్యత అనే ముసుగులు తగిలించుకుని, అందంగా సింగారించుకుని తిరిగే ఏ మనిషిలో ఏ జంతువు ఉన్నదో మనకు తెలియదు.    
    కాని ఏ మనిషిలో ఆడపిల్లను చూడగానే నాలుకతో పెదవుల్ని తడుముకునే తోడేలు ఉందో, ఏ మనిషిలో కొండముచ్చు పళ్ళికిలిస్తూ ఉంటుందో ఏ వ్యక్తి మనసులో చిత్ర విచిత్రమైన పురుగులు లుకలుకలాడుతుంటాయో తెలియదు.     
    ఈ మానభంగాలు కథలు వింటూంటే -- మనం పెంచుకున్న నాగరికతలో -- చీకటిని చూసి వెలుగు పారిపోతుందా? అజ్ఞానాన్ని చూసి విజ్ఞానం పారిపోతున్నదా? పశుత్వం ముందు మానవత్వం నిలబడలేకపోతుందా? అని అనిపించడం లేదూ? స్త్రీ తాను అబలను అనే అభిప్రాయాన్ని మరిచిపోనంతవరకూ ఇలాంటివి తప్పవు తనను ఎవరో రక్షిస్తారనే భావాన్ని వదిలేసి, స్త్రీ సబలగా మారాలి.
    చైతన్యవంతురాలై స్త్రీలు ఉద్యమం లేవదీయాలి తనలోని సౌకుమార్యాన్ని చూసి మురిసిపోవడం మానేసి సబలగా తయారవాలి స్త్రీలకు వ్యాయామ శాలలు ఏర్పాటు చెయ్యాలి కర్రసాములు మొదలైనవి నేర్పించాలి కరాటే ట్రైయినింగ్ ఈ దేశంలో కొంతకాలంపాటు స్త్రీలవరకే పరిమితం చెయ్యాలి.    
    ఇది చదివి చాలామంది నవ్వుకోవచ్చును కాని ఆ నవ్వుకునే వారిని వేరే మార్గం ఉంటే చెప్పమని కోరుతున్నాను ఈ మానభంగాల వార్తలు చదువుతూంటే వారిలోని మానవత్వం సిగ్గుతో, అవమానంతో తలవంచడం లేదా?  
    ఇటువంటి హీనమైన పనిచేసినవాణ్ణి సమాజం బహిష్కరించాలి. గజ్జి కుక్క కంటే హీనంగా చూడాలి. కేవలం ఇటువంటి అపరాధుల్ని పోలీసులు పట్టుకోలేకపోయారని నిందించి లాభంలేదు. మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తీ ఇలాంటి చీడ పురుగుల్ని గుర్తించినప్పుడు పోలీసులకు అప్పగించడం తమ బాధ్యతగా భావించాలి.   
    రేపుల్ని చిత్రించే చిత్రాలను నిషేధించాలి ఒక ఆడపిల్ల శీలాన్ని దోచుకున్నట్టు ఒక మాటలో, ఒక సింబల్ లో చూపిస్తే సరిపోదా? నగ్నంగా కళ్ళకు కట్టినట్టు చూపించి, ప్రేక్షకుల్లో పాశవిక ప్రవృత్తిని రెచ్చగొడితే కాని ప్రొడ్యూసర్ల గల్లాలు నిండవా?  
    ఏది ఏమయినా స్త్రీకి ఈ దేశంలో బొత్తిగా రక్షణ కరువైంది అనే విషయం స్పష్టంగా తెలుస్తూంది అందుకే ఒక హిందీకవి అన్నాడు --" ఆంచల్ మే దూధ్  ఆంఖోంమే పానీ - నారీ జీవన్ కీయహీ కరుణకహానీ" అని. అంటే "కొంగులో పాలు, కంటిలో నీరు - నారీ జీవితపు కరుణ కథ యిదే" (ఈ దేశంలో).
    ఈ విషయం గురించి స్త్రీ సంఘ సంస్కర్తలు ఆలోచించాలి మహిళా సమాజాలు ఆలోచించాలి తమను తామే రక్షించుకునే స్థితిని పొందాలి. స్త్రీలో ఆత్మవిశ్వాసంతోపాటు, శారీరకంగా కూడా సబల కావాలి. ( ఇప్పుడు కూడా స్త్రీ తాను అనుకున్నంత అబల కాదు. ఆత్మవిశ్వాసం లేదు. అంతే) గిరిజనుల్లో ఈ మానభంగాలు మచ్చుకు కూడా కనిపించవు. గిరిజన స్త్రీ అబల కాదు.
    శ్రీకాకుళంలో సవరులను చూడండి. పురుషులకంటే స్త్రీలే బలంగా కనిపిస్తారు కారణం - పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ కాయ కష్టం చేస్తారు ఒక్క స్త్రీ అమాంతంగా ఇద్దరు పురుషుల్ని చెరొక చేత్తో కదలకుండా పట్టుకోగలదు అనిపిస్తుంది.
    జబ్బులనూ, ప్రకృతిలోని మార్పులనూ పురుషుల కంటే స్త్రీలే తట్టుకోగలరనేది వైద్యులు కూడా ఒప్పుకుంటున్న విషయమే స్త్రీకి తన ఆత్మరక్షణ కొరకు ( అవసరం అయితే) రక్షణ ఆయుధాల్ని ధరించడానికి లైసెన్సులు ఇవ్వాలి. మన సంస్కృతిని గురించి ఒక్కమాట అన్నా సహించలేని పెద్దలు కలాల సిరా ఆరిపోయిందేం? ఈ విషయాల గురించి ఎందుకు రాయరు? సోదరీమణులు ఆలోచించాలి.    
                         గిరిజన స్త్రీలు మనకంటే స్వతంత్రులు
    ఆ రోజు శ్రీకాకుళం గిరిజన ప్రాంతాలను చూడాలని వెళ్ళాను. సీతంపేట దగ్గిర సంత జరుగుతోంది జీపులో పక్క గ్రామానికి వెళ్ళాను జనం గుమిగూడి ఉన్నారు ఏమిటి అని అడిగాను. ఒక పదిహేను పదహారు సంవత్సరాల ఆడపిల్ల చుట్టూ జనం ఉన్నారు ఆ అమ్మాయి రొప్పుతున్నది ఏమేమో చెబుతున్నది తెలుసుకున్న విషయం ఇది----     
    ఆ అమ్మాయి సంతకు వెళ్ళింది సీతంపేట దగ్గిరలోనే ఉన్న మరో గ్రామానికి చెందిన యువకుడికి ఆ పిల్ల మీద కన్నుపడింది ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను గులాబి అనుకుందాం గులాబికి అతనంటే ఇష్టం లేదు.
    సంతలో ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఆ అమ్మాయి పరుగు లంకించుకుంది చెంగు చెంగున లేడి పిల్లలా గంతులు వేస్తూ పరుగులు తీసిన ఆ అమ్మాయిని పట్టుకోలేకపోయాడు ఆ యువకుడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra